S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం పట్టణాభివృద్ధికి ‘మాస్టర్ ప్లాన్’

విజయనగరం, నవంబర్ 29: విజయనగరం పట్టణాభివృద్ధికి వుడా మాస్టర్ ప్లాన్ రూపొందించింది. విఎంఆర్‌డిఎ(విశాఖపట్నం మెట్రోపాలిటిన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) మాస్టర్ ప్లాన్ ద్వారా భవిష్యత్‌లో విజయనగరం రూపురేఖలు మారిపోనున్నాయి. మంగళవారం విఎంఆర్‌డిఎ వైస్ చైర్మన్ టి.బాబురావునాయుడు ఆధ్వర్యంలో మాస్టర్‌ప్లాన్‌కు సంబంధించి అధికారులకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం విఎంఆర్‌డిఎ పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలు ఉన్నాయన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 52,93,369 మంది జనాభా ఉందన్నారు.

ఉత్సవ శోభ

విశాఖపట్నం (కల్చరల్), నవంబర్ 29: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేలుపు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 30 నుంచి డిసెంబర్ 29 వరకూ మార్గశిర మాసోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మంగళవారం ఆలయంలో నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలనిన్నారు. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు పోలీసులు తగిన విధంగా సహకరించాలన్నారు. అమ్మవారి దర్శనం కల్పించే సమయాలు, క్యూలైన్ల సమాచారంతో భక్తులకు అర్ధమయ్యే రీతిలో హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.

నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలి: కలెక్టర్

ఎల్‌ఎన్ పేట, నవంబర్ 29: నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం అన్నారు. మంగళవారం మండలంలోని తురకపేట, దబ్బపాడు గ్రామాల్లో పథకాల అమలు తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా చేపట్టి తద్వారా ఆరోగ్యవంతమైన వాతావరణం కల్పించడానికి ప్రాధాన్యతనిస్తుందన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, వర్మీకంపోస్టులు, ఇంకుడుగుంతలు వంటి పథకాలు పూర్తి చేయడంలో లక్ష్యాలను సాధించిన పంచాయతీలకు

ఇంకా తప్పని చిల్లర కష్టాలు

ఒంగోలు,నవంబర్ 29: కేంద్రప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను చూపించకుండా పెద్దనోట్లను రద్దుచేయటంతో ఇంకా జిల్లావ్యాప్తంగా చిల్లర కష్టాలు తప్పటం లేదు.ప్రధానంగా బ్యాంకులు, ఎటిఎంల వద్ద ఖాతాదారులు ఉదయం నుండే క్యూలో నిలబడుతున్నప్పటికీ వారికి నగదు అందటం లేదు. జిల్లాలోని అన్ని ఎటిఎంలు, బ్యాంకుల వద్ద ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో అన్నివర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొంతమంది తమ పనులను మానుకుని సైతం ఎటిఎంలు, బ్యాంకుల వద్ద క్యూలో నిలబడి ఉంటున్నారు. జిల్లాకు సరిపడనంతా నగదు నిల్వలు రాకపోవటంతోనే ఈ సమస్య ఉత్పన్నవౌతుందని బ్యాంకర్లు చెబుతున్నప్పటికీ ఖాతాదారులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పాలకుల నిర్లక్ష్యం-విద్యార్థులకు శాపం

నెల్లూరుసిటీ, నవంబర్ 29: పాలకుల నిర్లక్ష్యంతో జిల్లావాసుల ఆశలు ఆవిరైపోతున్నాయి. తాజాగా నెల్లూరులోని ఏసి సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో 2017-18 విద్యా సంవత్సరానికి గాను ఉన్న 150 మెడికల్ అడ్మిషన్లను రద్దు చేస్తూ భారత వైద్యమండలి (ఎంసిఐ) ఉత్తర్వులు జారీ చేసింది. 2014వ సంవత్సరంలో 150 సీట్లతో వైద్య కళాశాల ప్రారంభమైంది. అప్పటి నుంచి సదుపాయాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. 150 మంది వైద్య విద్యార్థులకు సంబంధించి కళాశాలలో సరైన సదుపాయాలు లేవని ఎంసిఐ తనిఖీల్లో తేలింది. బోధనా సిబ్బంది కొరత, వౌలిక వసతుల లేమి, అనుబంధ ఆసుపత్రుల్లో తీసికట్టుగా ప్రమాణాలు తనిఖీల్లో బట్టబయలయ్యాయి.

జీరో వ్యాపారాలకు కాలం చెల్లినట్లే!

కర్నూలు, నవంబర్ 29 : ఎలాంటి పన్ను చెల్లించకుండా జీరో వ్యాపారం చేస్తున్న వ్యాపారుల గుండెల్లో గుబులు ప్రారంభమైంది. దర్జాగా ఇంత కాలం వ్యాపారం చేసిన వారు ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలతో బెంబేలెత్తిపోతున్నారు. ఇక ముందు జీరో వ్యాపారం చేయలేమన్న భావనతో వాణిజ్య పన్నుల శాఖ అధికారుల నుంచి వ్యాపారానికి లైసెన్స్ కోసం కొందరు ప్రయత్నిస్తుండగా ఇప్పటికే లైసెన్స్ ఉన్న వారు బ్యాంకు ఖాతాలు తెరిచి తద్వారా వ్యాపారం చేసేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.

ప్రతి ఇంటికి మంచినీరందిస్తాం

కొణిజర్ల, నవంబర్ 29: రానున్న రెండేళ్ళలో ప్రతి ఇంటికి నల్లాల ద్వారా సురక్షితమైన మంచినీరు అందచేయనున్నట్లు రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మంత్రి మంగళవారం మండలంలోని వివిధ అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు. పల్లిపాడు నుంచి జన్నారం వరకు ప్రస్తుతం ఉన్న అర్‌అండ్‌బి బిటి రోడ్డును 18 కోట్లవ్యయంతో డబల్ రోడ్డు మార్చే పనులకు, తీగలబంజర నుంచి మల్లుపల్లి వెళ్ళే రోడ్డు మధ్యలో ఉన్న రాళ్ళవాగుపై 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న వంతేన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా తనికెళ్ళ సమీపంలో 575 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న తెలంగాణ తాగునీటి సరఫరా పథకం పనులకు శంఖుస్థాపన చేశారు.

కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం

గుంటూరు, నవంబర్ 29: నోట్ల రద్దుపై కేంద్రం వెసులుబాటు కల్పిస్తున్నా సామాన్య, మధ్యతరగతి ప్రజల కష్టాలు తీరటంలేదు.. బతుకుబండిని నడిపే పచ్చనోటు కోసం బ్యాంకుల వద్ద గంటల కొద్దీ బారులుతీరాల్సిన అగత్యం నెలకొంది.. పాత,కొత్త డినామినేషన్లతో బ్యాంకు సిబ్బంది విధుల్లో జాప్యంతో ఖాతాదారుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.. దీనికితోడు పలుకుబడి కలిగిన వారికి దొడ్డిదారిన నోట్లు అందిస్తుండడంతో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎటిఎంలు, బ్యాంకుల వద్ద గత 20రోజులుగా అవే పరిస్థితులు సాక్షాత్కరిస్తున్నాయి. గుంటూరు నగరంతో పాటు జిల్లాలో పలుచోట్ల మంగళవారం ఖాతాదారులు ఆందోళనకు దిగారు.

వైభవంగా ఆది కుంభేశ్వరుని మహా కుంభాభిషేకం

కాకినాడ రూరల్, నవంబర్ 29: కాకినాడ సాగర తీరం శివనామ స్మరణతో ప్రతిధ్వనించింది. కాకినాడ రూరల్ మండలంలో ఉన్న ఈ మంగళాంబికా ఆది కుంభేశ్వరస్వామి 41వ మహాకుంభాభిషేకాన్ని అంగరంగ వైభవంగా జరిగింది. వేకువ జాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని, సముద్ర స్నానాలు ఆచరించుకున్నారు. ప్రతీ ఏటా నిర్వహించే విధంగానే 108 కన్యలతో పండ్ల రసాల కలశాలతో ఆదికుంభేశ్వరుని అభిషేకం నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య కన్నుల పండువగా జరిగింది. పుండరీక్షుడు (బాబీ) దంపతులు, నారాయణ మురళీ, ఆలయ కమిటీ మెంబర్ నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా సాగింది.

కట్టలు తెగిన రైతుల ఆగ్రహం

శ్రీ కాళహస్తి, నవంబర్ 29: పంటలు పెట్టడానికి వర్షం లేదు. బావుల్లో, బోర్లల్లో నీళ్లు అడుగంటి పోయాయి. పక్కనే కాలువలో పరవళ్లు తొక్కుతున్న గంగమ్మను చూసి ఇంతకాలం వేచి చూసిన రైతులు ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నారు. తలుపులు పగులగొట్టి తెలుగుగంగ నీటిని తమ చెరువుకు మళ్లించుకున్నారు. ఈ సంఘటన మంగళవారం తొట్టంబేడుమండలం చిట్టత్తూరు గ్రామం వద్ద జరిగింది. చెన్నై నగరం సాగునీటికి తెలుగుగంగ నీరు సుమారు నెలరోజులుగా వెళ్తుంది.వర్షం లేకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నాటిన వరిపైరు, వేరుసెనగ ఎండిపోయే స్థితిలో ఉంది. దీంతో రైతులందరూ ఏకమై తెలుగుగంగ కాలువకు అమర్చిన తలుపులను ఎత్తడానికి ప్రయత్నించారు.

Pages