S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాబోయే కాలం మనదే...

వేంపల్లె, నవంబర్ 29: తెలుగుదేశం పాలనలో ప్రజలు విసిగి వేసారిపోయారని రాబోయే కాలం మనదే అని వైసీపీ ప్రతిపక్ష నేత, పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం వేంపల్లె మండలం నందిపల్లె గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన ఓబులేసురెడ్డి, పుల్లారెడ్డి చిత్రపటాలకు ఆయన పూలమాలలు వేసి నివాళి అర్పించి వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ను కలిసేందుకు వచ్చిన ప్రజలతో ఆయన కాసేపు సమావేశమయ్యారు. పక్కా గృహాలు కేటాయించలేదని, వృద్ధాప్య పింఛన్లు కూడా సరిగా రావడం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

రిజిస్ట్రేషన్లకు నోట్లదెబ్బ!

అనంతపురం, నవంబర్ 29 : పెద్ద నోట్ల రద్దుతో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భారీగా ఆదాయం తగ్గిపోయింది. నోట్లు రద్దు చేయడం వల్ల భూముల రిజిస్ట్రేషన్, ఇతరత్రా ఆదాయాలపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లు నష్టం వాటిల్లడంతో ‘పెద్ద’దెబ్బ పడింది. చేతిలో ‘చిల్లర’ నోట్లు ఆడక, కొత్త నోట్లు అవసరమైనన్ని అందని పరిస్థితుల్లో వివిధ రకాల రిజిస్ట్రేషన్లు గణనీయంగా పడిపోయాయి. ఒకనెలలో ఆర్జించే ఆదాయంలో సుమారు సగం వరకూ నష్టపోక తప్పని పరిస్థితి ఏర్పడింది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో అనంతపురం, హిందూపురం జిల్లాల రిజిస్ట్రార్ కార్యాలయాల్లో లావాదేవీలు మందగించాయి.

శరవేగంగా గ్రామాల అభివృద్ధి

జి.కొండూరు, నవంబర్ 29: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గ్రామాలు శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మండల పరిధిలోని చెవుటూరు, వెంకటాపురం, కుంటముక్కల, గుర్రాజుపాలెం గ్రామాల్లో మంగళవారం జనచైతన్య యాత్రల్లో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయా గ్రామాల నాయకులు మంత్రి ఉమకు ఘనస్వాగతం పలికారు. పలుచోట్ల మంత్రి ఉమ మాట్లాడుతూ పదేళ్ళ కాంగ్రెస్ హయాంలో వేల కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని ఆరోపించారు. వేంపాడు, జక్కంపూడి, నూజివీడు, కొండపల్లి, చెవుటూరు మేజర్ల ద్వారా గోదావరి జలాలను చింతలపూడి ఎత్తిపోతల పథకంతో మెట్టప్రాంతానికి పంపిణీ చేస్తామన్నారు.

ప్రధాని ఏకపక్ష నిర్ణయంతో దేశంలో ఆర్థిక సంక్షోభం

జగ్గయ్యపేట రూరల్/ నందిగామ, నవంబర్ 29: నల్ల ధనం అరికట్టే నెపంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఏకపక్ష నిర్ణయంతో రూ.500, రూ.1000ల నోట్లు రద్దు చేయడం వల్ల నేడు సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడుతున్నారని, అన్ని రంగాలు, వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిని దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొందని మాజీ కేంద్ర మంత్రి పళ్ళంరాజు విమర్శించారు. మంగళవారం నందిగామ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తదుపరి జగ్గయ్యపేట మండలం గరుడాచల క్షేత్రం కొండ కింద జరిగిన నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు.

పెన్షన్.. టెన్షన్..!

మచిలీపట్నం, నవంబర్ 29: పెద్దనోట్ల రద్దుతో పెన్షన్‌దారులకు దడ పట్టుకుంది. ప్రతినెలా 1వ తేదీన అందాల్సిన పెన్షన్ సొమ్ము అందుతుందా, లేదా?.. అనే అనుమానం వారిని ఆందోళన పరుస్తోంది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో చిన్ననోట్ల కొరత ఏర్పడింది. ఈ సమస్యను అధిగమించే విషయంలో అధికారులు సైతం పడరాని పాట్లు పడుతున్నారు. చిన్ననోట్ల సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం నగదు రహిత చెల్లింపులకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా ప్రతి లబ్ధిదారునితో బ్యాంక్ ఎకౌంట్లు తెరిపించి ఎన్‌పిసిఐతో అనుసంధానం చేస్తున్నారు.

నగదు రహిత లావాదేవీలే మేలు

మచిలీపట్నం, నవంబర్ 29: చిన్ననోట్ల సమస్యను అధిగమించేందుకు గాను ప్రభుత్వం నగదు రహిత ఆర్థిక లావాదేవీలను తెరపైకి తీసుకొచ్చింది. నగదు రహిత సేవలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు కలెక్టర్ బాబు.ఎ నేతృత్వంలోని టీమ్ కృష్ణా విశేష కృషి చేస్తోంది. ప్రతిరోజూ దీనిపై సిఎం చంద్రబాబు నాయుడు స్థాయి నుండి వీడియో, టెలీ కాన్ఫరెన్స్‌లు జరుగుతున్నాయి. మండల స్థాయి అధికారులు సైతం నగదు రహిత సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. టీమ్-కృష్ణాకు పోలీసు శాఖ కూడా తోడైంది.

నగదు రహిత లావాదేవీతో చౌకడిపోల ద్వారా విప్లవాత్మక మార్పులు

విజయవాడ, నవంబర్ 29: చౌకధరల దుకాణాల డీలర్లు నగదు రహిత లావాదేవీలతో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని, బ్యాంకింగ్ కరస్పాండెంట్లుగా వ్యవహరిస్తూ అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చునని జిల్లా కలెక్టర్ బాబు ఎ అన్నారు. మంగళవారం స్థానిక గాంధీనగర్‌లోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులో నగదు రహితంగా పిడిఎస్ ద్వారా సరుకులు పంపిణీ విధానంపై విజయవాడ, నూజివీడు డివిజన్ల పరిధిలోని డీలర్లకు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఇ-పోస్) విధానాన్ని విజయవంతంగా అమలుచేస్తూ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నామన్నారు.

నగరంలో ‘తేజ’లకు నో ఎంట్రీ

విజయవాడ (క్రైం), నవంబర్ 29: నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో ఆటోల వేగానికి బ్రేక్ పడనుంది. ఆటోడ్రైవర్ల తప్పిదాలతో నిత్యం చోటు చేసుకుంటున్న ప్రమాదాలను నివారించేందుకు నగర పోలీసు శాఖ ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని పక్కా ప్రణాళిక రచించింది. ఎంతోమంది ప్రయాణికులు ఆటోడ్రైవర్ల నిర్లక్ష్య వైఖరితో ప్రాణాలు కోల్పోవడం లేదా తీవ్ర గాయాలతో జీవితాంతం వికలాంగులవుతున్నారు. దీని దృష్ట్యా ఆటో ప్రమాదాలను నివారించేందుకు నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ నడుం బిగించారు. ఈయన ఆదేశాల మేరకు ఇప్పటికే ట్రాఫిక్ శాఖ ఆర్టీసి, ఆర్టీఓ, విజిలెన్స్ శాఖలతో ఓ సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఆటో ప్రమాదాలపై చర్చించారు.

నవ్యాంధ్ర అభివృద్ధిలో ఓడరేవుల పాత్ర కీలకం

పటమట, నవంబర్ 29: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పోర్టుల పాత్ర కీలంగా మారనున్నాయని ఎ.పి.కస్టమ్స్ కమిషనర్ ఎస్.ఖాదర్ రెహమాన్ తెలిపారు. మంగళవారం విజయవాడలో భారత పరిశ్రమ సమాఖ్య (సిఐఐ) ఆధ్వర్యంలో ‘ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఓడరేవుల పాత్ర’ అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఓడరేవుల అభివృద్ధితోనే రాష్ట్రం బ్రహ్మాండమైన లాజిస్టిక్ హబ్‌గా అభివృద్ధి చెందుతుందన్నారు. కొత్త ఓడరేవుల నిర్మాణం, తీర ప్రాంతాల్లో వౌలిక సదుపాయాల కల్పన, హార్బర్ల ఏర్పాటు, బీచ్ కారిడార్ అభివృద్ధి వంటివి సాగరమాల ప్రాజెక్ట్‌లో జరగాలన్నారు.

బాచుపల్లి మండల రెవెన్యూ యంత్రాంగంపై జెసి ధ్వజం

జీడిమెట్ల, నవంబర్ 29: బాచుపల్లి మండల రెవెన్యూ యంత్రాంగంపై మేడ్చల్ జిల్లా జాయింట్ కలెక్టర్ ధర్మారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సర్ట్ఫికెట్‌ల జారీలో జాప్యం జరగడంతో పాటు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయని మండిపడ్డారు. మంగళవారం బాచుపల్లి మండల రెవెన్యూ కార్యాలయాన్ని జెసి ధర్మారెడ్డి తనిఖీ చేశారు. కార్యాలయంలో జీవో 92, 58, 59ల దరఖాస్తుల స్టేటస్‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. కార్యాలయంలో సిస్టమ్‌లు, ఫర్నీచర్, సిబ్బంది కొరతపై తహశీల్దార్ సరళను అడిగి తెలుసుకున్నారు.

Pages