S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డ్రైవర్‌కు గుండెపోటు పల్టీకొట్టిన ఆర్టీసీ బస్సు

జగ్గయ్యపేట రూరల్, నవంబర్ 29: కోదాడ నుండి విజయవాడ వెళుతున్న ఆర్‌టిసి సిఎన్‌జి షటిల్ సర్వీస్ బస్సు మంగళవారం ఉదయం 9గంటల సమయంలో చిల్లకల్లు టోల్ ప్లాజా సమీపంలో పల్టీ కొట్టింది. చిల్లకల్లు దాటిన తరువాత టోల్ ప్లాజా సమీపంలోకి వచ్చేసరికి బస్సు డ్రైవర్ కొండయ్యకు ఛాతిలో నొప్పిరావడంతో స్టీరింగ్ అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకుపోయి టోల్ ప్లాజాకు చెందిన హోర్డింగ్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో 12మంది గాయపడ్డారు. హోర్డింగ్‌ను బస్సు ఢీకొట్టకపోతే పెద్ద ప్రమాదం జరిగేదని స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను, డ్రైవర్‌ను 108 ద్వారా జగ్గయ్యపేట ఫ్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందజేస్తున్నారు.

చీటీల సొమ్ము రూ. 3 కోట్లతో దంపతుల పరారీ

అనకాపల్లి, నవంబర్ 29: రోజువారీ పొదుపు, నెలవారీ చీటీల పేరుతో అమాయక మహిళలను మోసగించి సుమారు రూ. 3 కోట్లతో ఉడాయించిన దంపతుల ఉదంతమిది. ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద పొదుపు స్కీమ్‌లు, చీటీల పేరుతో నెలవారీగా పెద్దమొత్తాలను సేకరించి బకాయిలు చెల్లించాల్సిన సమయం వచ్చేసరికి దంపతులిద్దరూ ఉడాయించడంతో లబోదిబోమంటూ బాధిత మహిళలు పట్టణ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం రాత్రి ఫిర్యాదు చేశారు. టౌన్ సిఐ విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం స్థానిక లక్ష్మీదేవిపేటకు చెందిన కొణతాల ఉదయ శ్రీనివాసరావు, జయశ్రీ దంపతులు చాలాకాలంగా చిట్స్, వివిధ పొదుపుఖాతాలు నిర్వహిస్తూ వస్తున్నారు.

ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల

హైదరాబాద్, నవంబర్ 29: ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ పది, ఇంటర్ ఫలితాలను సోమవారం నాడు విడుదల చేశారు.
ఇంటర్మీడియట్‌కు 13,643 మంది హాజరుకాగా వారిలో 5962 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎస్సెస్సీలో 13,999 మంది హాజరుకాగా వారిలో 6982 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఐదు పరీక్ష ఫలితాలను పరిశీలిస్తే ఈసారి అక్టోబర్ ఫలితాలే గరిష్టమని ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ కె రామశేషు తెలిపారు. నెల్లూరు జిల్లా పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచిందని, టెన్త్ ఫలితాల్లో చివరి స్థానంలో చిత్తూరు నిలవగా, ఇంటర్ ఫలితాల్లో చివరి స్థానంలో విశాఖపట్టణం నిలిచిందని ఆయన వివరించారు.

బాబుకు సారథ్యం ఇస్తే దేశం సర్వనాశనమే

హైదరాబాద్, నవంబర్ 29: పెద్ద నోట్ల రద్దు వల్ల ఉత్పన్నమయ్యే పరిస్ధితులను సరిదిద్దేందుకు కేంద్రం నియమించిన కమిటీ బాధ్యతలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అప్పగించడం వల్ల దేశం సర్వనాశనమవుతుందని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రామకృష్ణారెడ్డి, ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను చర్చించేందుకు తక్షణమే శాసనసభను సమావేశపరచాలని వారు డిమాండ్ చేశారు. పెద్ద నోట్లు రద్దు అయిపోయి 21 రోజులు అవుతున్నా క్యూ లైన్లు ఇప్పటికీ తగ్గడం లేదన్నారు. బ్యాంకు సిబ్బంది రేయింబవళ్లు పనిచేస్తున్నారని, కాని నోట్ల ముద్రణ తగినంతగా లేదన్నారు.

కారెం శివాజీ కేసులో ముగిసిన వాదనలు

హైదరాబాద్, నవంబర్ 29: ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ నియామకం చెల్లదని హైకోర్టు సింగిల్ జడ్జికోర్టు ఇచ్చిన తీర్పుపై సవాలు చేస్తూ ధర్మాసనం ఎదుట దాఖలైన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వు చేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం మంగళవారం ప్రకటించింది. ఈ నెల 4వ తేదీన సింగిల్ జడ్జి కోర్టు కారెం శివాజీని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నియమించడం చెల్లదని తీర్పు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ కారెం శివాజీ ధర్మాసనం వద్ద పిటిషన్ దాఖలు చేశారు. ఈ నియామకం చెల్లుతుందని ఏపి అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ హైకోర్టు ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు.

ఎంపి గీత వివాదంపై కలెక్టర్‌కు హైకోర్టు నోటీసు

హైదరాబాద్, నవంబర్ 29: అరకు ఎంపి కొత్తపల్లి గీత వాల్మీకి ఎస్టీ తెగకు చెందిన మహిళ అని ధృవీకరిస్తూ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయంపై దాఖలై పిల్‌ను హైకోర్టు విచారించింది. ఈ కేసులో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు ధర్మాసనం మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ను జిల్లా కలెక్టర్ జూలై 27వ తేదీన జారీ చేశారు. దీనిని సవాలు చేస్తూ విశాఖపట్నం జిల్లా అనంతగిరి మాజీ ఎంపిపి శెట్టి గంగాధర స్వామి హైకోర్టులో పిల్ దాఖలు చేవారు.

తొట్లకొండలో నిర్మాణాలు వద్దు

హైదరాబాద్, నవంబర్ 29: విశాఖపట్నంకు సమీపంలోని తోట్లకొండ బౌద్ధ పురావస్తు స్థలం వద్ద ఎటువంటి నిర్మాణాలకు అనుమతి ఇవ్వవద్దంటూ హైకోర్టు ఏపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం జారీ చేసింది. ప్రొఫెసర్ తిమ్మారెడ్డి మరో ముగ్గురు దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు విచారించిన అనంతరం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జూలై 5న రాష్ట్రప్రభుత్వం జీవో 282ను జారీ చేసిందని, ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్‌కు ఇక్కడ స్థలం కేటాయించారని, కానీ ఇది పురావస్తు శాఖ పరిధిలో ఉందని పిల్‌లో పిటిషనర్లు పేర్కొన్నారు. తొట్లకొండ బౌద్ధ ప్రదేశానికి చరిత్ర ఉందని వారు పేర్కొన్నారు.

ఘరానా మోసం

మహబూబ్‌నగర్, నవంబర్ 29: కిడ్నీ దాతలను సైతం మోసం చేసే ఘరానా మోసగాడిని మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి వన్‌టౌన్ సిఐ సీతయ్య మంగళవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా గుంతకల్‌కు చెందిన హనిఫ్‌షాన్ అనే వ్యక్తి మూత్రపిండాల దానం పేరిట ఘరానా మోసానికి పాల్పడుతూ పట్టుపడ్డాడని తెలిపారు. కిడ్నీ దానం పేరిట ఓ ఫేస్‌బుక్ ఖాతా తెరిచి కిడ్నీలు అత్యవసరంగా కావాలంటూ ప్రకటనలు చేస్తుంటాడు.

ఉన్నత ప్రమాణాలతో ఉచిత విద్య

హైదరాబాద్, నవంబర్ 29: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఉచిత విద్యను అందించాలన్న లక్ష్యంతోనే తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. 1250 నుండి 1300 వరకూ గురుకులాలను ఏర్పాటు చేసి దాదాపు ఆరు లక్షల మంది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలన్న సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు పనిచేస్తున్నామన్నారు. ది హిందూ గ్రూప్ ఏర్పాటు చేసిన ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ -2016 కాన్ఫరెన్స్‌లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మున్సిపల్ మంత్రి కె తారకరామారావు పాల్గొన్నారు.

గంటలో మరుగుదొడ్డి నిర్మాణం

నవీపేట, నవంబర్ 29: సంపూర్ణ పారిశుద్ధ్య సాధనకు స్వచ్ఛ భారత్‌లో భాగంగా ప్రతి కుటుంబం తప్పనిసరిగా వ్యక్తిగత మరుగుదొడ్లు కలిగి ఉండాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొదలుకుని జిల్లా యంత్రాంగాలు పెద్దఎత్తున కసరత్తులు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొన్నిచోట్ల మినహా అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ ఐఎస్‌ఎల్ నిర్మాణాల లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరలేకపోతోంది. వీటికి ప్రభుత్వం ఆర్థికంగా తోడ్పాటును అందిస్తూ, లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు చేసినప్పటికీ అనేక ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణాల్లో ఎడతెగని జాప్యం జరుగుతోంది.

Pages