S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిలిం క్విజ్ 3

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...

నిర్వహణ: జి రాజేశ్వరరావు

ఆకట్టుకోలేదు

గౌతమ్‌మీనన్, నాగచైతన్య కాంబినేషన్‌లో వచ్చిన సాహసం శ్వాసగా సాగిపో నిరాశ పర్చింది. ఎంతో ఆలస్యంగా విడుదలైన ఈ చిత్రం ఆకట్టుకోలేదు. రొమాన్స్, ప్రేమలతో మొదటి సగం పేలవంగా సాగింది. హీరోయిన్ పెద్ద నెగిటివ్ పాయింట్. రెండో భాగంలో యాక్షన్ సన్నివేశాలతో నింపి బోర్ కొట్టించారు. క్లైమాక్స్‌కు, కథకు ఏం సంబంధం లేదు. ఫొటోగ్రఫీ, సంగీతం బాగున్నాయి. బాగా నానిన కథతోనే యాక్షన్, రొమాన్స్ కలిపి కొత్తగా చెప్పాలన్న ప్రయత్నం బెడిసి కొట్టింది. స్క్రీన్‌ప్లే, కామెడీలాంటి కమర్షియల్ అంశాలపై దర్శకుడు దృష్టిపెడితే బాగుండేది.
-సి ప్రతాప్, శ్రీకాకుళం
అభినందన

చెంచులక్ష్మి -- ఫ్లాష్‌బ్యాక్@ 50

కథ, మాటలు: సదాశివ బ్రహ్మం
పాటలు: ఆరుద్ర
ఫొటోగ్రఫి: సి నాగేశ్వరరావు
ఎడిటింగ్: కెఎ మార్తాండ
కళ: వాలి
సంగీతం: ఎస్ రాజేశ్వరరావు
సహాయ దర్శకుడు: కెఎస్ ప్రకాశరావు.
నిర్మాత, దర్శకుడు: బిఏ సుబ్బారావు

-సివిఆర్ మాణికేశ్వరి

రెడీ అంటోంది..

‘ముకుంద’ మూవీతో టాలీవుడ్‌ని గోపికమ్మగా అలరించిన బ్యూటీ పూజా హెగ్డే. తర్వాత డైరెక్టుగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ పక్కన చాన్స్ కొట్టేసి -పది మెట్లు ఎక్కేసినట్టు ఫీలైంది. మొహెంజొదారో రిజల్ట్ రివర్స్ అవ్వడంతో -మళ్లీ నేల చూపులు చూస్తోందట. చూపించడానికి బోల్డంత్ గ్లామర్ ఉన్నా -అన్నీ హోలీ క్యారెక్టర్లే వస్తున్నాయని గోలపెడుతున్న గోపికమ్మ బెంగను -దువ్వాడ జగన్నాథం తీర్చేయబోతున్నాడట. డీజే -దువ్వాడ జగన్నాథంలో పూజ అల్ట్రా గ్లామర్ రోల్ చేస్తోందని అంటున్నారు.

హడలెత్తిస్తున్న సఫిల్‌గూడ రోడ్డు

మల్కాజిగిరి, నవంబర్ 27: మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని ప్రధాన రహదారైన ఆనంద్‌బాగ్ చౌరస్తా నుంచి వినాయకనగర్ చౌరస్తా వరకు గల రోడ్డు మార్గం ప్రయాణికులను, వాహనదారులను, పాదచారులను హడలెత్తిస్తోంది. మంచినీటి పైప్ లైన్ పనుల నిమిత్తం జరిపిన తవ్వకాల సమయంలో ఏర్పడ్డ గుంతలను కంకర పౌడర్, కంకర కలిపి గుంతలల్లో వేయటంతో వచ్చిపోయే వాహనాలతో దుమ్ము రేగుతోంది. ఈ దుమ్ము దాదాపు కిలోమీటర్ వరకు దుమ్ము కమ్ముకుంటుంది. ఈ మార్గంలో ప్రయాణించే వారికి రోడ్డు స్పష్టంగా కనబడటం లేదు.

విజయవంతంగా 10కెరన్

హైదరాబాద్, నవంబర్ 27: నగరంలోని నెక్లెస్‌రోడ్డులో ఆదివారం ఫ్రీడం 10కె రన్ ఉత్సాహంగా విజయవంతంగా కొనసాగింది. రన్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారాకరామరావు విచ్చేసి జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఔత్సాహికులు ఈరన్‌లో పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి ప్రారంభమైన రన్ ట్యాంక్‌బండ్ చుట్ట్టూ సాగింది. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ నగరంలో నిర్వహిస్తున్న ఇలాంటి ఈవెంట్లకు ప్రజల నుంచి స్పందన వస్తోందన్నారు.

బ్యాంకు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి

ఖైరతాబాద్, నవంబర్ 27: బ్యాంకుల్లో విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన పెన్షనర్స్ సమస్యల పరిష్కారానికి తన వంతు సాయం అందిస్తానని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం ఖైరతాబాద్ విశే్వశ్వరయ్య భవన్‌లో నిర్వహించిన సిండికేట్ బ్యాంక్ పెన్షనర్స్ అండ్ రిటైరీస్ అసోసియేషన్ జాతీయ స్థాయి సమావేశానికి ఆయన హాజరై ప్రసంగించారు. దేశ ఆర్ధికాభివృద్ధిలో బ్యాంకు ఉద్యోగుల పాత్ర ఎంతో కీలకమని, నోట్ల రద్దు అనంతరం ఏర్పడ్డ పరిణామాలను సరిచేసేందుకు బ్యాంకు ఉద్యోగులు ఎంతగానో శ్రమిస్తున్నారని అన్నారు. అదేవిధంగా 26 కోట్ల జన్‌ధన్ ఖాతాలు తెరవడంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది ఎంతో తోడ్పాటును అందించారని అన్నారు.

ఎమ్మార్పీస్ ‘ధర్మయుద్ధం’ మహాసభ విజయవంతం

సికిందరాబాద్, నవంబర్ 27: ఎమ్మార్మీస్ ఆధ్వర్యంలో ఆదివారం సికిందరాబాద్ పెరేడ్‌మైదానంలో నిర్వహించిన ధర్మయుద్ధ మహాసభకు భారీఎత్తున జనం తరలివచ్చారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళతోపాటు పంజాబ్ తదితర రాష్ట్రాల నుంచి కూడ ప్రతినిధులు తరలిరావడంతో ఆదివారం సాయంత్రానికి నగరంలోని అన్ని ప్రధాన రహదారులు కిక్కిరిసి పోయాయి. సభ మూడు గంటలకు ఆరంభమవుతుందని ప్రకటించినప్పటికీ రెండు గంటలు ఆలస్యంగా నేతలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఆరంభంలో మైదానం ఖాళీగా కనిపించినప్పటికీ సభా ఆరంభసమయానికి పూర్తిగా నిండిపోవడంతో నిర్వాహకులు సంతృప్తిని వ్యక్తం చేశారు.

Pages