S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నగదు రహితంగా వంటగ్యాస్ పంపిణీ

కాకినాడ, నవంబర్ 27: వంట గ్యాస్ సిలెండర్లను ఇక నుండి నగదు రహిత బదిలీ ప్రక్రియ ద్వారానే సరఫరా చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు తూర్పు గోదావరి జిల్లాలో చకచగా జరుగుతున్నాయి. గ్యాస్ సిలెండర్లు సరఫరా చేసే ఎల్‌పిజి డీలర్లు విధిగా నగదు రహిత బదిలీని పాటించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలోని సుమారు 13 లక్షలమంది గ్యాస్ వినియోగదారులకు ఇకపై నగదు బదిలీ ద్వారానే వంట గ్యాస్‌ను అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో కచ్చితమైన ధరకే వినియోగదారుడి ఇంటికి గ్యాస్ సిలెండర్ చేరే అవకాశం కూడా ఉంది. అంటే గ్యాస్ డెలివరీ బాయ్‌ల చేతివాటానికి తెర పడనుంది.

సమన్వయంతో పని చేయండి

హైదరాబాద్, నవంబర్ 27: నాయకులు, కార్యకర్తల మధ్య సఖ్యత, సహకారం, సమన్వయం ఉన్నప్పుడే పార్టీ పటిష్టంగా ఉంటుందని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ నాయకత్వాన్ని పటిష్టం చేసుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు. ఆదివారం టిటిడిపి సర్వసభ్య సమావేశం టిడిపి కార్యాలయం (ఎన్టీఆర్ భవన్)లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ గతంలో ఏమి చేశామన్నది ముఖ్యం కాదని, ప్రస్తుతం ఏమి చేయాలన్నది ప్రధానమని ఆయన తెలిపారు. సమస్యల పట్ల బాగా పోరాటం చేస్తున్నారని, ఈ పోరాటాన్ని కొనసాగించాలని అన్నారు.

పెద్దశేష వాహనంపై పద్మావతిదేవి

తిరుపతి, నవంబర్ 27: లోక రక్షణి తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండోరోజైన ఆదివారం ఉదయం అమ్మవారు పెద్దశేష వాహనంపై వైకుంఠ నాథుడు శ్రీలక్ష్మీనారాయణుడి అవతారంలో భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ఠీవిగా ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క్భజనల నడుమ అమ్మవారు నాలుగు మాడవీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు వాహన సేవ సాగింది. అడుగడుగునా భక్తులు నారికేళం, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.

పెద్ద శేష వాహనంపై దర్శనమిస్తున్న పద్మావతి దేవి

ఉగ్రవాదం ఉనికి పోతోంది

హైదరాబాద్, నవంబర్ 27: పెద్దనోట్ల రద్దుతో తీవ్రవాదం, ఉగ్రవాదం ఉనికి కోల్పోతున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారామ్ ఆహిర్ అన్నారు. ప్రభుత్వ నిర్ణయం నల్లకుబేరులకు శరాఘాతంగా మారిందని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమీలో జరిగిన అన్ని రాష్ట్రాల డిజిపిల సమావేశాల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి హన్సరాజ్ ఆదివారం నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నోట్ల రద్దు వల్ల నగదు లావాదేవీలు, చలామణి నిలిచిపోయి తీవ్రవాదులకు, ఉగ్రవాదులకు ఆటంకం ఏర్పడిందన్నారు. ఈ అక్రమ, నల్లధనంతోనే వారు కార్యకలాపాలను తీవ్రతరం చేశారని ఆయన తెలిపారు.

అద్దెకు జన్‌ధన్ ఖాతా

హైదరాబాద్, నవంబర్ 27: పెద్దనోట్ల రద్దుతో నల్లకుబేరులు తమ వద్ద ఉన్న రద్దయిన కరెన్సీని జన్‌ధన్ ఖాతాల్లో భారీ ఎత్తున డిపాజిట్ చేస్తున్నట్లు ఆదాయం పన్ను శాఖకు సమాచారం లభించింది. దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్, కర్నాటక, గుజరాత్, యుపి, కేరళ, ఢిల్లీ, బీహార్ రాష్ట్రాల్లో జన్‌ధన్ ఖాతాల్లో భారీ ఎత్తున రద్దయిన కరెన్సీ డిపాజిటయింది. ఆంధ్రాలో కోస్తా జిల్లాల్లో, కర్నాటక తదితర రాష్ట్రాల్లో నల్లకుబేరులు ఒక్కో జన్‌ధన్ అకౌంట్‌దారుడికి నెలకు రూ.10వేల వరకు సొమ్ము చెల్లించి, అకౌంట్‌ను తమ ఆధీనంలో ఉంచుకున్నట్లు అభియోగాలు వస్తున్నాయని ఆదాయం పన్ను శాఖ వర్గాలు తెలిపాయి.

పడిపోయిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్, నవంబర్ 27: తెలంగాణ రాష్ట్రాన్ని చలిపులి వణికిస్తోంది. సాధారణ కనీస ఉష్ణోగ్రతతో పోలిస్తే తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లోని చాలా ప్రాంతాల్లో మూడు డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా నమోదవుతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో 12.9 నుండి 12 డిగ్రీలుగా నమోదైంది. గ్రామీణ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో రాత్రివేళ కనీస ఉష్ణోగ్రతలు మరింత గణనీయంగా తగ్గాయి.

నేడు ఆక్రోశ్ దివస్

హైదరాబాద్, నవంబర్ 27:నోట్ల రద్దుపై దేశ వ్యాప్తంగా సోమవారం ఆక్రోష్ దివస్ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపడతారు. తొలుత బంద్ జరపుతున్నట్టు ప్రకటించినా, తరువాత దాన్ని నిరసనలకే పరిమితం చేయాలని నిర్ణయించుకున్నారు. ఉభయరాష్ట్రాల్లో అధికార పక్షాలు నేరుగా నిరసనను వ్యతిరేకించడం లేదు, అదే సమయంలో మద్దతు ఇవ్వడం లేదు. నోట్లరద్దు వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ఉభయ రాష్ట్రాల సిఎంలు కెసిఆర్, చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసినా, నిరసనలో పాల్గొని విపక్షాలతో గొంతు కలిపేందుకు సిద్ధంగా లేరు. కాంగ్రెస్, వామపక్షాలు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు పూర్తిమద్దతు ప్రకటించాయి.

మోదీని కాల్చి పారేసినా పాపం లేదు!

రాజమహేంద్రవరం, నవంబర్ 27: ప్రధాని మోదీ సర్కార్ కార్పొరేట్ల లబ్ధి కోసమే పని చేస్తోందని, ప్రత్యామ్నాయం చూపించకుండా నోట్లను రద్దు చేయడం అత్యంత క్రూరమైన చర్యని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. రాజమహేంద్రవరంలోని సిపిఐ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీని నూటొక్కసారి కాల్చిపారేసినా పాపం లేదని నారాయణ అన్నారు. వెంకయ్య నాయుడు మోదీ భజన మానుకుని కళ్లు తెరవాలన్నారు. రైతులు, జన్‌ధన్ ఖాతాల్లో రూ.లక్ష చొప్పున వేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నోట్ల రద్దుపై ప్రజలు ఇచ్చిన ఆక్రోశ దినంగా బంద్ పాటిస్తున్నామని, ఈ బంద్‌లో బ్యాంకులకు మినహాయింపు ఉందని నారాయణ స్పష్టం చేశారు.

వేదసారం పంచిన శ్రద్ధానంద

మాటలు కాదు చేతలతోనే మార్పు సాధ్యం
అంటరానితనం పురాణాల్లో లేదు
ఆర్‌ఎస్‌ఎస్ సహ కార్యవాహ్ కృష్ణగోపాల్ ఉద్ఘాటన
వేద విద్య వ్యాప్తికి శ్రద్ధానంద నిరుపమాన కృషి
‘అసలీ మహాత్మా’ పుస్తక ఆవిష్కర్త రాజేంద్ర జిజ్ఞాసు
నిజమైన మహాత్ములకు దర్పణమే ఈ పుస్తకం
పుస్తకావిష్కరణ సభలో ఎంవిఆర్ శాస్ర్తీ

ఆర్థిక గణాంకాలపై ఆధారం

న్యూఢిల్లీ, నవంబర్ 27: స్థూల ఆర్థిక గణాంకాలు, త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాలూ మదుపరుల పెట్టుబడులను శాసించనున్నాయని మార్కెట్ వర్గాలు విశే్లషిస్తున్నాయ. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికానికి (జూలై-సెప్టెంబర్)గాను వివిధ ప్రభుత్వరంగ, ప్రైవేట్‌రంగ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాలు చివరి దశకు చేరుకోవడంతో మదుపరులపై నోట్ల రద్దు అధికంగా ప్రభావం చూపే వీలుందని పలువురు నిపుణులు చెబుతున్నారు.

Pages