S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనకున్నది దౌర్భాగ్య ప్రతిపక్ష నేత

రాజమహేంద్రవరం, నవంబర్ 27: పట్టిసీమ ప్రాజెక్టును రికార్డు స్థాయిలో పూర్తి చేసి ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు, అటు కృష్ణా డెల్టాలకు గోదావరి జలాలను అందించడం వల్ల రూ.250 కోట్ల విలువైన పంట దక్కిందని, అటువంటి ప్రాజెక్టయిన వట్టిసీమను విమర్శించిన నాయకులు ఇపుడు ఏమంటారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని అన్నారు. ఉత్తమ కుమార ప్రగల్భాలు పలికిన వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇటువంటి నేత ప్రతిపక్ష నేతగా ఉండటం దౌర్భాగ్యమని విమర్శించారు.

ప్రజల మద్దతు లేక బంద్ విరమణ: దత్తాత్రేయ

హైదరాబాద్, నవంబర్ 27: నోట్ల రద్దుపై గగ్గోలు పెడుతున్న విపక్షాలకు ప్రజల మద్దతు లేకపోవడం వల్లనే బంద్‌ను విరమించుకున్నాయని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆర్థిక వ్యవస్థను సరైన దారిలో పెట్టేందుకే ప్రధాని మోదీ కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. దేశంలో ఆర్ధిక అసమానతలు తగ్గించి పేద, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్న లక్ష్యంతో ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయాన్ని యావత్ దేశం హర్షిస్తోందన్నారు.

రాష్ట్రాన్ని ముంచుతున్న ‘త్రిమూర్తులు’

విజయవాడ, నవంబర్ 27: అబద్దాల అమిత్‌షా.. మోసకారి మోదీ... మధ్య వారధిలా వెంకయ్య అంతా కలిసి ఆంధ్రప్రదేశ్‌ను ముంచుతున్నారని పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. పిసిసి రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాడేపల్లిగూడెం సభ గురించి ప్రస్తావిస్తూ అబద్ధాలు చెప్పిపోవడానికే అమిత్‌షా ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారని అన్నారు. గతంలో కూడా రాజమండ్రికి వచ్చి రాష్ట్రానికి లక్ష 40వేల కోట్ల రూపాయల సాయం చేసామని లిస్టు చదివి వెళ్లారని చెప్పారు. ఆయన లిస్టును ఆయన భాగస్వామి టిడిపి అధినేత చంద్రబాబే తప్పుబట్టారన్నారు.

కడగండ్లు తీరుద్దాం

హైదరాబాద్, నవంబర్ 27: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం వౌన ప్రేక్షక పాత్ర పోషించడం సరైంది కాదని, ఇబ్బందుల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులపై సోమవారం మధ్యాహ్నం 2.30కు జరుగనున్న కేబినెట్ భేటీలో చర్చంచాల్సిన అంశాలపై క్యాంపు కార్యాలయంలో (ప్రగతి భవన్) ఆదివారం మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. లక్షలాది ప్రజల ఇబ్బందులను తొలగించడానికి ఏం చర్యలు తీసుకోవాలో అధికారులు, మంత్రులు ప్రభుత్వానికి సూచనలు చేయాలని కోరారు.

పేదను బలిచేయొద్దు!

న్యూఢిల్లీ, నవంబర్ 27: పేదల బ్యాంకు ఖాతాలను ఆసరా చేసుకుని తమ అక్రమ సొత్తును డిపాజిట్ చేసే వారిని వదిలేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా తెరుచుకున్న జన్‌ధన్ ఖాతాల్లోకి కేవలం రెండు వారాల వ్యవధిలోనే వేలాది కోట్ల రూపాయలు జమ అయ్యాయంటూ వచ్చిన కధనాల నేపథ్యంలో మాట్లాడిన మోదీ ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై బినామీ లావాదేవీల నిరోధక చట్టాన్ని ప్రయోగిస్తామని తెలిపారు. నగదు రహిత లావాదేవీల వ్యవస్థ దిశగా అడుగులు వేయాలని, ఈ రకమైన ఆర్థిక జీవన విధానాన్ని అలవరచుకోవాలని ఆదివారం చేసిన మన్‌కి బాత్‌లో ప్రజలకు పిలుపునిచ్చారు.

వర్గీకరణకు వెన్నుదన్ను

సికింద్రాబాద్, నవంబర్ 27: వర్గీకరణ కోసం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) చేపట్టిన ధర్మ యుద్ధానికి కాంగ్రెస్, తెదేపా, భాజపా, వామపక్ష నేతలు మద్దతు ప్రకటించారు. ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అధ్యక్షతన ఆదివారం పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన భారీ బహిరంగ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. సభలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మాదిగలు చేపట్టిన వర్గీకరణ చట్టబద్దత కోసం వెన్నుదన్నుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు అందినప్పుడే అసలు ప్రగతి సాధ్యమన్నారు.

నభా జైలుపై సాయుధ దాడి

పటియాలా, నవంబర్ 27: పంజాబ్‌లో ఆదివారం సాయుధ దుండగులు హై-సెక్యూరిటీ జైలుపై దాడికి పాల్పడి సంచలనం సృష్టించారు. పోలీసు దుస్తుల్లో వచ్చిన వీరు పటియాలా సమీపంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కలిగిన నభా జైలును బద్దలు కొట్టి పది కేసుల్లో నిందితుడిగా ఉన్న ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (కెఎల్‌ఎఫ్) అధినేత హర్మీందర్ మింటూ సహా ఐదుగురు ఖైదీలతో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులపై పంజాబ్ ప్రభుత్వం కొరడా ఝళిపించింది. జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ (డిజి)ని సస్పెండ్ చేయడంతో పాటు ఆ జైలులో పనిచేస్తున్న మరో ఇద్దరు సీనియర్ అధికారులను డిస్మిస్ చేసింది.

అందుబాటులోనే ఉంటా

హైదరాబాద్, నవంబర్ 27: మీ అందరి అభిమానం చూస్తుంటే నాకు ఇక్కడే (తెలంగాణలో) ఉండిపోవాలని ఉంది అని తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మనసు ఇక్కడేవున్నా, అక్కడ (ఏపీలో) బాధ్యతలు ఉన్నాయన్నారు. ఆదివారం తెలంగాణ తెదేపా సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు సుమారు 10 నెలల తర్వాత ఎన్టీఆర్ భవన్‌లో అడుగుపెట్టారు. టి.టిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ రేవంత్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం అమర్‌నాథ్ బాబు, ఇతర నేతలు సాయిబాబు, ప్రకాశ్‌రెడ్డి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.

గుల్లలమోద రేవులో నలుగురు గల్లంతు

మచిలీపట్నం, నవంబర్ 27: కృష్ణాజిల్లా నాగాయలంక మండలం గుల్లలమోద సమీపంలోని సముద్రంలో ఆదివారం సాయంత్రం నలుగురు యువకులు గల్లంతయ్యారు. ఖమ్మం జిల్లాకు చెందిన 15మంది యువకులు ఆదివారం విహారయాత్రగా నాగాయలంక లైట్‌హౌస్‌కు వచ్చారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ ప్రాంతంలో సరదాగా గడిపిన వారంతా మధ్యాహ్నం 4గంటల సమయంలో సముద్ర స్నానాలకు వెళ్ళారు. సుమారు గంట పాటు స్నానాలు చేసిన వీరిలో ఖమ్మం జిల్లా మధిర మండలం మెడుపల్లి గ్రామానికి చెందిన వేల్పుల లక్ష్మణరావు (25), ఎర్రుపాలెం మండలం సఖినేటిపల్లి గ్రామానికి చెందిన రామాల లక్ష్మణరావు (21), గాడపాటి అనిల్ కుమార్ (19), కొండాల రమేష్ (25) గల్లంతయ్యారు.

గమనిస్తున్నాం..

ముంబయి, నవంబర్ 27: పెద్ద నోట్ల రద్దుపై రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఎట్టకేలకు వౌనాన్ని వీడారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని రోజు వారీగా సమీక్షిస్తూ, ప్రజల వాస్తవిక సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని, సాధ్యమైనంత త్వరగా పరిస్థితులను మళ్లీ సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాత 1000, 500 రూపాయల నోట్లను మార్పిడి చేసుకోవడంతో బ్యాంకుల్లో డిపాజిట్లు భారీగా పెరిగాయని, దీంతో నగదు నిల్వ నిష్పత్తి (సిఆర్‌ఆర్) పూర్తిగా 100 శాతం అందుబాటులో ఉండేలా ఆర్‌బిఐ చర్యలు చేపట్టిందని చెప్పారు.

Pages