S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాకు నచ్చిన చిత్రం-- సత్య

రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో 1997- 98లో వచ్చిన ‘సత్య’ మాఫియా సినిమాలకే ఓ ‘పాఠ్యగ్రంథం’. అంతర్లీనంగా ‘ప్రేమకథ’. ఓపక్క రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు. రాజకీయాలు మరోపక్క. అద్భుతమైన స్క్రీన్ ప్లే.. సన్నివేశాలకు తగిన పాటలు.. అత్యంత సహజమైన నటన.. వాస్తవికతకు దగ్గరగా తీసిన సినిమా ఇది. తెలుగు చిత్ర పరిశ్రమలో మాఫియా మూవీలకు వర్మ అథారిటీ అన్న విషయం అందరికీ తెల్సిందే. అది ఈ చిత్రంలో పతాక స్థాయిని చూపించాడు. జెడి చక్రవర్తి, ఊర్మిళ, పరేష్ రావల్ తదితర నటులు ఒక ఎత్తయితే, మనోజ్ బాజ్‌పాయ్ ‘బిక్కూమాత్రే’ పాత్రలో చిత్రాన్ని ఒక రేంజ్‌కు తీసుకెళ్లాడు. తరువాత సత్య ఫేమ్ అనిపించుకున్నాడు.

-కాళిదాసు, కావలి

కాజల్‌ని అలా చూపించాలని..

ఖైదీ నెం.150 సినిమాతో మెగాస్టార్ రీ ఎంట్రీ తెలిసిందే. సినిమా షూటింగ్ దాదాపు పూరె్తైందని, మొన్ననే స్లోవేనియా, క్రొయేషియాలో పాటల
చిత్రీకరణా పూర్తిచేశారంటూ కథనాలు వినిపించాయి. ఇక సినిమాకు ప్రాణం లాంటి కోర్టు సీన్లు మాత్రమే పెండింగ్ అనుకుంటున్న టైంలో -కొత్త న్యూస్
వినిపిస్తోంది. అదేంటంటే -ఇంకో పాట పెండింగ్ ఉందట. ఇప్పటికే చిరుపై ఎయిర్ పోర్టులో ఒక సోలో సాంగ్.. లక్ష్మీరాయ్‌తో ఐటెం సాంగ్, చిరు

‘సైజ్ జీరో’

‘సైజ్ జీరో’ ప్రయోగంతో ఎంత తప్పు చేసిందో -స్వీటీకి ఇప్పుడు అర్థమవుతోందట. పెంచేసిన బాడీ సైజ్‌ను స్లిమ్ చేయడానికి ఎన్ని కసరత్తులు చేస్తున్నా -ఇంచ్ కాదుకదా మిల్లీమీటర్ అంతా ఫలితం కూడా లేదని వాపోతోంది. స్వీటీ ఏం తగ్గలేదన్న విషయం -రీసెంట్‌గా సింగం టీం రిలీజ్ చేసిన ప్రోమో చెప్పకనే చెబుతోంది. లాంగ్ షాట్స్‌తోను, హీరో పక్కన చూపించాల్సి వస్తే సైడ్ యాంగిల్‌తోను అనుష్కను కవర్ చేసినట్టు అర్థమైపోతోంది. మోడ్రన్ డ్రెస్సులతో కవర్ చేద్దామన్నా ప్రయాసే తప్ప ఫలితం ఉండదన్న సంగతి -సింగం 3లో స్వీటీని చూసిన ఫ్యాన్స్‌కు అర్థమైపోయే ఉంటుంది.

సగం చూసి అభ్యాసం ( డైరెక్టర్స్ చాయిస్..)

-విఐ ఆనంద్

‘హృదయం ఎక్కడున్నది?’ ‘టైగర్’లాంటి చిత్రాలు తెలుగులోనూ, ‘అప్పుచి గ్రామం’ తమిళంలో రూపొందించి దర్శకుడిగా తనకంటూ ఓ మార్కును ప్రూవ్ చేసుకున్నాడు విఐ ఆనంద్. ప్రస్తుతం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో టాలీవుడ్‌ను ఆకట్టుకుని దర్శకుడిగా దూసుకుపోతున్న ఆనంద్‌తో ఈవారం చిట్‌చాట్..

-శేఖర్

హీరో.. విలన్! ( శరత్కాలం)

స్వర్ణయుగం నిర్మాత, దర్శకులలో మాటకు కట్టుబడి క్రమశిక్షణతో చిత్ర నిర్మాణం గావించిన వారిలో రోహిణీ ఫిలింస్ హెచ్‌యం రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘నిర్దోషి’ చిత్రం నిర్మాణంలో ఉన్న సమయంలోనే -తర్వాతి చిత్రాన్ని అంతా కొత్త వాళ్లతో నిర్మించ తలపెట్టి కొత్త నటీనటులు కావాలని ప్రకటన ఇచ్చారు. అనేకమంది ఫొటోలు వివరాలతో పంపారు. వచ్చినవాటిలో ఇంటర్వ్యూలు కాకుండా కేవలం ఫొటోలనుబట్టి కొందరిని నిర్ణయించారు. అలా ఎంపికైన వారిలో నెల్లూరుకు చెందిన కల్లయ్య ప్రథముడు. కండలు తిరిగిన శరీరాకృతిగల కల్లయ్యను హీరో పాత్రకు ఎంపికచేసి కథా చర్చలు మొదలెట్టారు. ఇక్కడే చిన్న సమస్య వచ్చింది.

-పర్చా శరత్‌కుమార్ 9849601717

రంగు వెలిసింది!

* బాగోలేదు * రంగం-2

తారాగణం:
జీవా, తులసీనాయర్, నాజర్, జయప్రకాశ్, కరుణాకరన్, తంబి రామయ్య, బోస్ వెంకట్, తదితరులు.
సంగీతం: హేరిస్ జయరాజ్
కెమెరా: మనుష్ నాథన్
నిర్మాత: ఎఎన్ బాలాజీ
దర్శకత్వం: రవి కె చంద్రన్

-సరయు

కదిలించిన జిందగీ

ఫర్వాలేదు ** డియర్ జిందగీ

తారాగణం: అలియాభట్, షారుక్ ఖాన్, కునాల్ కపూర్, అలీ జఫర్, అంగద్ బేడీ, ఆదిత్య రాయ్ కపూర్ తదితరులు
సంగీతం: అమిత్ త్రివేదీ
నిర్మాణ సంస్థ: రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, ధర్మా ప్రొడక్షన్స్
దర్శకత్వం: గౌరీ షిండే

-బిఎన్

భయమ్ము లేదురా..!!

ఫర్వాలేదు **జయమ్ము నిశ్చయమ్మురా

తారాగణం:
శ్రీనివాస్‌రెడ్డి, పూర్ణ, పోసాని కృష్ణమురళి, పృథ్వి తదితరులు.
సంగీతం: రవిచంద్ర
నిర్మాత: శివరాజ్ కనుమూరి,
సతీష్ కనుమూరి
దర్శకత్వం: శివరాజ్ కనుమూరి
కమెడియన్‌గా టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకున్నాడు శ్రీనివాస్‌రెడ్డి. తరువాత ‘గీతాంజలి’ సినిమాతో హీరోగా టర్న్ తీసుకున్నాడు. మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న శ్రీనివాస్‌రెడ్డి హీరోగా, పూర్ణ హీరోయిన్‌గా చేసిన మరో ప్రయత్నమే ‘జయమ్ము నిశ్చయమ్మురా’.

-త్రివేది

సమాధానాలు- 1

సమాధానాలు- 1

1. సువర్ణ సుందరి 2. మహమ్మద్ రఫీ
3. ప్రభాస్ 4. రాధిక
5. రేలంగి- సూర్యకాంతం
6. గుళ్లపేరు
7) వౌనంగానే ఎదగమని 8. సుత్తి
9. దేవిశ్రీప్రసాద్ 10) ఈగ.

సరైన సమాధానాలు రాసిన వారు

Pages