S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్యం అమ్మకాల్లో అవినీతి కిక్కు!

అమరావతి, నవంబర్ 23: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మద్యం అమ్మకాల్లో జరుగుతున్న భారీ దోపిడీ, అవినీతిపై బిజెపి దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న అవినీతిపై గత కొంతకాలంగా అధ్యయనం చేస్తున్న బిజెపి శాసనమండలి సభ్యుడు, ఆ పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడయిన సోము వీర్రాజు మద్యం అమ్మకాల్లో వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు.

26న తాడేపల్లిగూడెంలో అమిత్ షా సభ

హైదరాబాద్, నవంబర్ 23: దేశంలో పెద్ద నోట్ల రద్దు, తెలుగు రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం చేస్తున్న సాయంపై ప్రజలకు వివరించేందుకు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా 26వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తారని ఆ పార్టీ ఏపి నేత ఎస్ విష్ణువర్ధన్‌రెడ్డి చెప్పారు. బుధవారం ఇక్కడి బిజెపి కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 26న తాడేపల్లిగూడెంలో అమిత్‌షా కార్యక్రమం ఖరారైందని, లక్ష మంది రైతులతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నామని చెప్పారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, పలువురు పార్టీ జాతీయ రాష్ట్ర నాయకులు పాల్గొంటారని ఆయన వివరించారు.

నోట్ల రద్దు ‘పెద్ద’ దెబ్బ

హైదరాబాద్, నవంబర్ 23: పెద్ద నోట్ల రద్దువల్ల రాష్ట్ర ఖజానాకు వచ్చే నాలుగు నెలల్లో (డిసెంబర్ నుంచి మార్చి వరకు) దాదాపు రూ.3000 కోట్ల నష్టం వాటిల్లుతుందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. నెలకు దాదాపు రూ.750 కోట్ల చొప్పున వచ్చే నాలుగు నెలల్లో సంభవించే నష్టాలపై ప్రాథమిక అంచనా రూపొందించినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కేంద్రానికి అందించిన నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయానికి కలిగిన నష్టానికి ప్రత్యేక సాయం అందించడంతోపాటు సిఎస్టీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని కోరింది.

సైన్యం ప్రతీకారం

న్యూఢిల్లీ, నవంబర్ 23: పాకిస్తాన్ ముష్కర మూకలు జరిపిన పైశాచిక దాడికి ప్రతీకారంగా భారత సైన్యం బుధవారం తీవ్రస్థాయిలో దాడులు జరిపింది. దాడుల్లో ఓ అధికారి సహా ముగ్గురు పాక్ సైనికులు మరణించారు. మంగళవారం అధీన రేఖ ప్రాంతంలో గస్తీ తిరుగుతున్న భారత సైనికులపై పాక్ దళాలు దాడి జరిపి ముగ్గుర్ని హతమార్చాయి. వీరిలో ఓ సైనికుడి తలను నరికి పట్టుకుపోవడంతో భారత సైన్యం తీవ్రస్థాయిలో హెచ్చరిక స్వరాన్ని వినిపించింది.

మీకు పాలించే అర్హతే లేదు

న్యూఢిల్లీ, నవంబర్ 23: ప్రధాని నరేంద్ర మోదీకి దేశాన్ని పాలించే అర్హతే లేదని విపక్షాలు నిప్పులు చెరిగాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలో బుధవారం జంతర్‌మంతర్‌లో జరిగిన భారీ ర్యాలీలో నాలుగు పార్టీల నేతలు కేంద్ర ధోరణిని ఎండగట్టారు. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ వ్యాప్తంగా కోటానుకోట్ల మంది ప్రజలు పడుతున్న ఇబ్బందులు, అవస్థలు ప్రధాని మోదీకి పట్టడం లేదని.. ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మమత ధ్వజమెత్తారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం వైదొలగాల్సిందేనని..మోదీ చేతుల్లో దేశానికి రక్షణే లేదని అన్నారు.

జీతాలు.. పెన్షన్లు ఎలా?

విజయవాడ, నవంబర్ 23: ‘ఒకటో తేదీ వస్తోంది.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వాలి. పింఛన్లు చెల్లించాలి.. ఇందుకు అవసరమైన కరెన్సీని అందుబాటులోకి తీసుకువచ్చేలా తక్షణమే చర్యలు చేపట్టండి’ అంటూ బ్యాంకర్లను సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. డిసెంబర్ 1 నాటికి రాష్ట్రంలో 70 శాతం పైగా డిజిటల్ లావాదేవీలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులకు స్పష్టం చేశారు. 25 శాతం సబ్సిడీపై ఇ-పాస్ యంత్రాలను సరఫరా చేయనున్నట్లు తెలిపారు. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో బుధవారం సాయంత్రం పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను బ్యాంకర్లు, అధికారులతో సిఎం సమీక్షించారు.

బాలమురళి వాయులీనం

చెన్నై, నవంబర్ 23:దశాబ్దాల పాటు భారతీయ సంగీతానికి ప్రతిరూపంగా, కొత్త సంగీత ప్రక్రియల ప్రయోక్తగా రాణించి కోటానుకోట్ల మందిని అలరించిన గాన గంధర్వుడు బాల మురళీ కృష్ణకు అనంతవాయువుల్లో కలిసిపోయారు. ఆయన భౌతిక కాయానికి వందలాది మంది అభిమానుల అశ్రునయనాల మధ్య బుధవారం ఇక్కడి బీసెంట్‌నగర్ ఎలక్ట్రిక్ శ్మశానవాటికలో అంత్య క్రియలు జరిగాయి. వందలాదిగా సంగీత విద్వాంసులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు, అభిమానులు బాలమురళి భౌతిక కాయాన్ని సందర్శించి తుది నివాళులర్పించారు. పద్మ విభూషణ్ సహా ఎన్నో సమున్నత పురస్కారాలు అందుకున్న 86ఏళ్ల బాలమురళి మంగళవారం చెన్నైలోని తన ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు.

గ్రామాలపై మోదీ గురి!

అమరావతి, నవంబర్ 23: రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా నేరుగా పంచాయతీలకే నిధులిస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం బిజెపియేతర ముఖ్యమంత్రుల్లో దడ పుట్టిస్తోంది. ఈ విధానంతో సర్పంచులు బిజెపి వైపు వెళతారన్న ఆందోళన బిజెపియేతర ముఖ్యమంత్రుల్లో వ్యక్తమవుతోంది. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నందున తక్షణం రద్దు చేయాలన్న డిమాండ్ మొదలైంది. అయితే సొంత పార్టీలో మాత్రం ‘స్థానిక సంస్థలకు నేరుగా నిధుల’పై కనీస ప్రచారం చేసుకోలేని వైచిత్రి కనిపిస్తోంది. దీంతో బిజెపి నాయకత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. గ్రామగ్రామానికి వెళ్లి కేంద్రం అమలు చేస్తున్న పథకాలపై ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించింది.

జన్.. ధనాధన్!

న్యూఢిల్లీ, నవంబర్ 23:పెద్ద నోట్ల రద్దుతో జన్‌ధన్ ఖాతాల్లో నిధుల పంట పండింది. కేవలం 13రోజుల వ్యవధిలో ఈ ఖాతాల్లోకి అనూహ్య రీతిలో 21వేల కోట్ల రూపాయల మేర డిపాజిట్లు వచ్చాయని అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. గత రెండు వారాలుగా ఈ ఖాతాల్లోకి డిపాజిట్లు పోటెత్తాయని..వీటిలో మమతా బెనర్జీ సారధ్యంలోని పశ్చిమ బెంగాల్ మొదటిస్థానంలో కాంగ్రెస్ సారథ్యంలోని కర్నాటక రెండోస్థానంలో ఉందని వెల్లడించాయి. ఈ నెల 8న 500,1000 నోట్లను కేంద్రం రద్దు సమయానికి 25.5కోట్ల జన్‌ధన్ ఖాతాల్లో ఉన్న మొత్తం 45,635.61కోట్ల రూపాయలు.

అసెంబ్లీ సీట్లు పెంచలేం

న్యూఢిల్లీ, నవంబర్ 23: రాష్ట్రాల్లో శాసన సభా స్థానాలు ఇప్పట్లో పెంచలేమని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. 2026 జనాభా లెక్కలు ప్రకటించనంత వరకు స్థానాల పెంపు అసాధ్యమని పేర్కొంది. ఆర్టికల్ 170ని సవరించకుండా తెలంగాణలోని అసెంబ్లీ స్థానాలను 119 నుంచి 153కి పెంచటం సాధ్యంకాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ స్పష్టం చేశారు. తెలుగుదేశం ఎంపీ టిజి వెంకటేశ్ అడిగిన ప్రశ్నకు గంగారాం అహిర్ లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు తమ శాసన సభ స్థానాలను 119 నుంచి 153కు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం ఏదైనా ప్రతిపాదన చేసిందా?

Pages