S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బడి చదువుకు జవాబుదారి

ప్రతి మీటింగ్‌లో మీరు ఎప్పుడూ ఫిన్లాండ్, సింగపూర్ విద్యనే ప్రస్తావిస్తారు. మనం వాళ్లకు సమానం కాలేమా? మన లోపాలు చెప్పకుండా విదేశాల విద్యాప్రగతిని పొగిడి ఇక్కడి మన విద్యా విధానాన్ని మీరు నీరుగార్చుతున్నారా?- అని ఓ విద్యార్థి నన్ను ప్రశ్నించాడు. ఆ దేశాల్లో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి?

- చుక్కా రామయ్య

‘ప్రపంచీకరణ’ బంధంలో కుక్కపిల్ల!

పనె్నండు దేశాలు
ఎండుచున్నాగాని
పట్టడన్నమె
లోపమండి, ఉప్పు
ముట్టుకుంటె దోషమండి!
నోట మట్టికొట్టి
పోతాడండి, అయ్యో..
కుక్కలతో పోరాడి
కూడు తింటామండి
మాకొద్దీ తెల్ల దొరతనము..

-హెబ్బార్ నాగేశ్వరరావు 99510 38352

చౌకగా భూసేకరణ!

ప్రపంచీకరణ వల్ల ఏర్పడిన ప్రధాన వైపరీత్యం భూ మిని వాణిజ్య ‘హిరణ్యాక్షులు’ కాజేస్తుండడం. ఇలా కాజేయడం తెలుగు రాష్ట్రాల్లో గత రెండేళ్లుగా మరీ మితిమీరిపోయింది. ఉన్నత న్యాయస్థానం వారు భూమి సేకరణను నియంత్రించడానికి, అక్రమంగా సేకరించే ప్రక్రియను నిరోధించడానికి పదే పదే జోక్యం చేసుకోవలసి వస్తుండడం ఇందుకు నిదర్శనం. న్యాయ నియంత్రణ పెరుగుతున్న కొద్దీ అతిక్రమిస్తున్న ‘హిరణ్యాక్ష స్ఫూర్తి’ కూడా విస్తరించిపోతోంది. ‘సేకరణ’ ప్రహసనంలో భాగంగా భూమిని కోల్పోతున్న వ్యవసాయ జీవనులకు ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు ఇస్తున్న పరిహారం ఎంత?

టిఆర్‌ఎస్ పాలనపై మహిళల మహోద్యమం

హైదరాబాద్, నవంబర్ 23: ప్రధాని మోదీ ఉదాత్త ఆశయాలతో పనిచేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్లలో సాధించలేనిది, బిజెపి సాధిస్తోందని, తాజాగా వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. ఓట్ల రద్దు తర్వాత జరిగిన ఎన్నికల్లో బిజెపి గెలిచిందంటే ప్రజల మద్దతు ఏ తీరున ఉందో అర్థం అవుతోందని పేర్కొన్నారు. తెలంగాణ బిజెపి మహిళా మోర్చ అధ్యక్షురాలిగా ఆకుల విజయ బాధ్యతల స్వీకారం సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో లక్ష్మణ్ మాట్లాడుతూ మహిళల ఆశలను తెలంగాణ ప్రభుత్వం వంచించిందని ఈ విషయంలో మహిళలంతా సంఘటితం కావాలన్నారు.

మనసంతా ఇటువైపే..!

దమ్మపేట, నవంబర్ 23: రాష్ట్రం విడిపోయి ఇరు రాష్ట్రాల్లో ప్రజలు ఒక విధంగా ఉంటే ముంపుమండలాల ప్రజల పరిస్థితి మరో విధంగా ఉంది. రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు తాము ఏ ప్రాంతంలో ఉన్నామో గర్వంగా చెప్పగలుగుతుంటే ఏడు ముంపు మండలాల్లో కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజల పరిస్థితి విభిన్నంగా ఉంది. వారు ఏపిలోని పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వెళ్ళడం, గోదావరి ముంపు పేరుతో వారికి నష్టపరిహారం చెల్లించడం, వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి వారు ఈ ప్రాంతంలో పంటలు వేయకూడదని చెప్పడం చకచక జరిగిపోతూనే ఉన్నాయి.

పడిగాపులు పడుతున్నాం

నిజామాబాద్, నవంబర్ 23: పెద్ద నోట్ల రద్దుతో తెరపైకి వచ్చిన కరెన్సీ కష్టాల గురించి వాస్తవాలను తెలుసుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు బుధవారం క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలన జరిపాయి. ఈ బృందంలో సభ్యురాలిగా వ్యవహరిస్తున్న కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఉప కార్యదర్శి అనామికాసింగ్ బుధవారం సాయంత్రం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుని ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. బ్యాంకులు, ఎటిఎంల వద్దకు వెళ్లి వినియోగదారులు, ప్రజలు నగదు డ్రా చేసుకునేందుకు, డిపాజిట్లు, కరెన్సీ మార్పిడికి ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించారు.

మోదీతో భేటీ తర్వాత కెసిఆర్ వౌనమేల?

హైదరాబాద్, నవంబర్ 23: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత నోట్ల రద్దుపై ఎందుకు మాట్లాడడం లేదని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం గాంధీభవన్‌లో పార్టీ ఆఫీసు బేరర్లు, జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్యులతో సమావేశమై చర్చించారు. సమావేశానంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ పెద్ద నోట్లను రద్దు చేసి 15 రోజులైనా పేద ప్రజల కష్టాలు తీరలేదని అన్నారు. ప్రధాని అనాలోచిత, లోపభూయిష్టమైన నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని విమర్శించారు.

జిల్లాకో కృషి విజ్ఞాన కేంద్రం

న్యూఢిల్లీ, నవంబర్ 23: తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన 31 జిల్లాలలో కృషి విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దేశా వ్యాప్తంగా ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాల నీటి పారుదలశాఖ మంత్రుల సమావేశానికి తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి రాధామోహన్ సింగ్‌తో సమావేశమయ్యారు. మంత్రి హరీశ్‌రావు విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణలోని 31 జిల్లాల్లో కృషి విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలిపారు.

బకాయిల భారంతో ట్రాన్స్‌కో విలవిల

ఆదిలాబాద్, నవంబర్ 23: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పేరుకుపోతున్న విద్యుత్ బకాయిలు ట్రాన్స్‌కోకు గుదిబండగా మారాయి. వివిధ కేటగిరిల కింద విద్యుత్ చార్జీలను వసూలు చేసేందుకు ట్రాన్స్‌కో సిబ్బంది పల్లెలు, పట్టణాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినా వినియోగదారుల నుండి స్పందన కరువైంది. రద్దయిన నోట్లను బిల్లుల రూపంలో చెల్లించేందుకు వినియోగదారులకు అవకాశం కల్పించినా ఫలితం కనిపించలేదు. పెద్దనోట్ల చలామణి తగ్గిపోవడంతో తమ బకాయిలు వసూలు అవుతాయని ఆశపడ్డ ట్రాన్స్‌కో అధికారులకు నిరాశే ఎదురైంది.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ములుగు, నవంబర్ 23: రాష్ట్రప్రభుత్వం ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలంలోని పడిగాపూర్, ఊరట్టం సమీపంలోని జంపన్నవాగుపై ఆయన బుధవారం నాలుగు చెక్‌డ్యాంలు, కాటాపూర్‌లో రైతుల సౌకర్యార్థం 1.20 కోట్ల రూపాయలతో నిర్మించే 33 కెవి విద్యుత్ సబ్‌స్టేషన్, 30 డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు, రైతుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు.

Pages