S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శభాష్... మోదీ!

న్యూఢిల్లీ, నవంబర్ 23: దేశవ్యాప్తంగా పెద్దనోట్ల చలామణీని రద్దుచేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంపై భారీగా సానుకూల స్పందన వ్యక్తమైంది. ఈ నిర్ణయం వల్ల కొంత ఇబ్బంది కలుగుతున్నప్పటికీ దానివల్ల ఒనగూడే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే దీన్ని భరించాల్సిందేనన్న అభిప్రాయాన్ని ఈ సర్వేలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. ఓపక్క మోదీ నిర్ణయం వల్ల పేదలు తీవ్ర స్థాయిలో యాతనలు పడుతున్నారని, సమయానికి డబ్బులు అందక మరణాలూ సంభవిస్తున్నాయంటూ విపక్షాలు ముక్తకంఠంతో ధ్వజమెత్తుతున్న నేపథ్యంలో ‘మీరే చెప్పండి’ అంటూ మోదీ ఇచ్చిన పిలుపునకు ప్రజలు భారీగానే స్పందించారు.

పెద్దనోట్ల రద్దు ఓ కుంభకోణం

న్యూఢిల్లీ, నవంబర్ 23: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెద్దనోట్లను రద్దు చేయటం వలన సామాన్య జనం పడుతున్న కష్టాలను ఎన్‌డిఏ ప్రభుత్వం పరిష్కరించటం లేదంటూ ప్రతిపక్ష పార్టీలు బుధవారం పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద మహా ధర్నా చేశాయి. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో జరిగిన మహా ధర్నాకు కాంగ్రెస్‌తోపాటు తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, డిఎంకె, శివసేన, జెడియు, ఆర్‌జెడి, సమాజ్‌వాదీ, బిఎస్‌పి, ఎంఐఎం తదితర పార్టీల ఎంపీలు, నాయకులు హాజరయ్యారు.

వెనక్కి తగ్గే ప్రశే్నలేదు

న్యూఢిల్లీ, నవంబర్ 23: ఓసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గటం అన్నది ప్రధాని నరేంద్రమోదీ రక్తంలోనే లేదని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు బుధవారం ఉద్ఘాటించారు. కొన్ని విపక్ష రాజకీయ పార్టీలు డిమాండ్ చేసినంత మాత్రాన పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని రద్దు చేసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెయ్యి, 500 రూపాయల నోట్ల రద్దు నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గనే తగ్గదంటూ విస్పష్టంగా తెలియజేశారు. ఈ నిర్ణయం వల్ల దేశ ప్రజలందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా పరిస్థితులు మెరుగు పరచేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఐరాసలో అమెరికా రాయబారిగా నిక్కీహేలీ

వాషింగ్టన్, నవంబర్ 23: అమెరికా కొత్త విదేశాంగ మంత్రిగా నియమితమవుతాననుకున్న ఇండో అమెరికన్ నిక్కీహేలీకి ఐరాసలో అమెరికా రాయబారి పదవి దక్కింది.
ఇందుకు సంబంధించి దేశాధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లుగా కథనాలు వెలువడ్డాయి. దక్షిణ కరోలినా గవర్నర్‌గా ఉన్న 44 ఏళ్ల నిక్కీహేలీ ఇటీవలే ట్రంప్‌ను కలుసుకున్నారు. ముఖ్యంగా ప్రతిష్ఠాత్మక మైన విదేశాంగ మంత్రి పదవి ఆమెకే దక్కుతుందని చాలా బలంగానే ఆ సమయంలో అంచనాలు వెలువడ్డాయి.

పెద్ద నోట్ల రద్దుపై గందరగోళం

న్యూఢిల్లీ, నవంబర్ 23: పెద్దనోటు రద్దుపై పార్లమెంట్ బుధవారం కూడా దద్దరిల్లింది. విపక్షాల నిరసనలు, అరుపులు, నినాదాలు, వ్యంగ్య కూత లు, హాహాకారాలు ఉభయ సభల్లో వినిపించాయి. లోక్‌సభలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు పోడియంను చుట్టుముట్టి ‘ఓ ఓ’ అంటూ సభ దద్దరిల్లేలా భయంకరంగా అరుస్తూ కార్యక్రమాలకు అడ్డుతగిలారు. పెద్ద నోట్ల రద్దు, సామాన్యుల ఇబ్బందులపై తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని చర్చకు చేపట్టేంతవరకూ సభను సాగనిచ్చేది లేదని ప్రతిపక్షాలు లోక్‌సభలో ప్రకటించాయి. ప్రధాని మోదీ సభకు హాజరై చర్చకు సమాధానం ఇచ్చే వరకూ సభను సాగనిచ్చేది లేదని రాజ్యసభలో విపక్షాలు ప్రకటించాయి.

కాశ్మీర్‌పై పాక్ కొత్త పాచిక!

ఇస్లామాబాద్, నవంబర్ 23: ప్రపం చ వ్యాప్తంగా కాశ్మీర్ వివాదాన్ని ప్రధానాంశం చేయడంతో పాటు భారత్‌లో ప్రధాని మోదీ అనుసరిస్తున్న ‘తీవ్రవాద విధానాల’ను వ్యతిరేకిస్తున్న ప్రజలను ఆకర్షించేలాగా కాశ్మీర్ వివాదంపై ఆచరణ సాధ్యమైన విధానాన్ని రూపొందించడానికి పాకిస్తాన్ ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ మంగళవారం సెనేట్‌లో ఈ విషయం ప్రకటించినట్లు డాన్ దినపత్రిక తెలిపింది.

అన్ని కోర్టుల్లోనూ విచారణ

న్యూఢిల్లీ, నవంబర్ 23: పెద్ద నోట్ల రద్దుపై వివిధ హైకోర్టుల్లో దాఖలవుతున్న పిటిషన్ల విచారణపై స్టే ఇవ్వలేమని అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి స్పష్టం చేసింది. నోట్ల రద్దుకు సంబంధించి వివిధ కోర్టులో దాఖలవుతున్న పిటిషన్లన్నింటినీ సుప్రీం కోర్టులోనో, ఏదైనా ఒక హైకోర్టులోనో ఒకేచోట విచారణ జరపాలని కేంద్రం సుప్రీం కోర్టును కోరిన సంగతి తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి. ఎస్ ఠాకూర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేంద్రం విజ్ఞప్తిని తిరస్కరించింది. ‘మేం స్టే ఇవ్వలేం. ఈ వ్యవహారంలో చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. ప్రజలకు హైకోర్టుల నుంచి త్వరగా ఉపశమనం కలిగే అవకాశం ఉంది.’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.

హైకమిషన్ సిబ్బంది పరస్పర ఉపసంహరణ

న్యూఢిల్లీ, నవంబర్ 23: పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగి మెహబూబా అక్తర్ గూఢచర్యం బయటపడడంతో ఎనిమిది మంది ఎంబసీ అధికారులను ఆ దేశం ఉపసంహరించుకుందని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే భారత్ కూడా ఎనిమిది మంది అధికారులను వెనక్కురప్పించినట్టు బుధవారం పార్లమెంటుకు తెలిపింది. కేంద్ర విదేశాంగ మం త్రి సుష్మా స్వరాజ్ సభకు ఓ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ నవంబర్ 2న ఆరుగురు హైకమిషన్ అధికారులను పాకిస్తాన్ వెనక్కిరప్పించిందని వెల్లడించారు. అక్తర్ ఇంటరాగేషన్‌లో ఆ అధికారుల పాత్రను వెల్లడించాడని మంత్రి తెలిపారు. ఢిల్లీ పోలీసులు అక్తర్ గూఢచర్యంపై దర్యాప్తు జరిపినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.

బాలమురళికి పార్లమెంటు నివాళి

న్యూఢిల్లీ, నవంబర్ 23: ప్రముఖ సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ మృతికి పార్లంమెంట్ ఉభయ సభలు సంతాపం తెలిపాయి. బుధవారం లోక్‌సభ ప్రారంభమైన వెంటనే బాల మురళి సంగీత ప్రపంచానికి చేసిన సెవలను సభ కొనియాడింది. ఆయన మృతికి సంతాప సూచకంగా సభ 2 నిముషాలు వౌనం పాటించింది. అలాగే రాజ్యసభ కూడా ఆయన భారతీయ శాస్ర్తియ సంగీత గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తిఅని చైర్మన్ అన్సారీ కొనియాడారు. బాలమరళీకృష్ణతో పాటు ఇటీవల మృతి చెందిన యూపీ మాజీ ముఖ్యమంత్రి రామ్‌నరేష్ యాదవ్, శాస్తవ్రేత్త ఎంజికె మినన్ కూడా సంతాప సూచకంగా సభ రెండు నిముషాలు వౌనం పాటించింది.
జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్

తెలంగాణ సిఎం అధికార నివాస భవనం నేడు ప్రారంభం

హైదరాబాద్, నవంబర్ 23: తెలంగాణ ముఖ్యమంత్రి అధికార నివాస భవన సముదాయం గురువారం ప్రారంభం కానుంది. తెల్లవారు జామున ఉదయం 5:22 గంటలకు శుభ ముహూర్తంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు దంపతులు గృహ ప్రవేశం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న క్యాంపు కార్యాలయంలోని రెండు భవనాలు, కొత్తగా నిర్మించిన సిఎం నివాసం, సిఎం కార్యాలయం, సమావేశ మందిర సముదాయానికి ‘ప్రగతి భవన్’గా ప్రభుత్వం నామకరణం చేసింది. వివిధ వర్గాలతో ముఖ్యమంత్రి సమాలోచనలు జరిపే సమావేశ మందిరానికి ‘జనహిత’గా నామకరణం చేసింది.

Pages