S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రఘువీరారెడ్డిని గిన్సీస్‌బుక్‌లో ఎక్కించాలి

విజయవాడ, నవంబర్ 21: సాధారణంగా గణాంకాల్లో ప్రథమ స్థానం, అథమ స్థానం ఉంటాయని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో చంద్రబాబు నాయుడు గిన్నిస్ బుక్‌లో ఎక్కితే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు సమాధి కట్టిన పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేరును కూడా గిన్నిస్ బుక్‌లో చేర్చాలని తెలుగుదేశం నగర అధ్యక్షులు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. సిఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడుతో కలిసి మీడియాతో మాట్లాడారు. భారతదేశంలో ఇందిరాగాంధీ హయం నుంచి 2014 వరకు ఆంధ్ర రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉందన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభంజనంలో కూడా గట్టి ప్రతిపక్షంగా నిలిచిందన్నారు.

పత్రికా సమాచార కార్యాలయం డైరెక్టర్‌గా విజయ్‌కుమార్ రెడ్డి

పటమట, నవంబర్ 21: ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (1990) బ్యాచ్‌కు చెందిన తుమ్మ విజయ్‌కుమార్ రెడ్డి (టివీకె రెడ్డి) సోమవారం ప్రతికా సమాచార కార్యాలయం విజయవాడ మొదటి డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. టివీకె రెడ్డి సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలోని పలు విభాగాలలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తన 25ఏళ్ల సర్వీసు కాలంలో అసిస్టెంట్ రిజిస్టార్ ఆఫ్ న్యూస్ పేపర్స్, భారత ప్రభుత్వం, సెన్సార్ బోర్డ్ సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్ట్ఫికేషన్ ప్రాంతీయ అధికారిగా, ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల క్షేత్ర ప్రచారం విభాగం డైరెక్టర్‌గా, పత్రికా సమాచార కార్యాలయం హైదరాబాద్ డైరెక్టర్‌గా ఆయన పనిచేశారు.

భూదానోద్యమ భూములను పేదలకు పంచాలి

మచిలీపట్నం, నవంబర్ 21: సంపన్నుల చేతుల్లో ఉన్న ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామంలోని 125 ఎకరాల భూదానోద్యమ భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేస్తూ సిపిఐ (ఎంఎల్) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి డి హరినాధ్ మాట్లాడుతూ చెక్కపల్లి గ్రామంలో అంకుశరావు, సుబ్బరాజు, కొండలరావు, వీర వెంకట రాఘవరావు, కృష్ణవేణి, సావిత్రమ్మ తదితరులు 1964 సంవత్సరంలో విన్‌భాహే స్ఫూర్తితో 125 ఎకరాలు భూదాన బోర్డుకు దానంగా ఇచ్చారన్నారు. ఆ తర్వాత సేవింగ్ డిక్లరేషన్‌లో సీలింగ్ పరిధి నుండి తప్పకున్నారన్నారు.

పవన్ కళ్యాణ్‌కు రాజకీయ పరిణితి లేదు

అవనిగడ్డ, నవంబర్ 21: సినీ నటుడు పవన్ కళ్యాణ్ రాజకీయంగా పరిణితి పొందలేదని ఆ కారణం గానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై అనవసరపు వ్యాఖ్యలు చేస్తున్నారని బిజెపి జాతీయ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు, మాజీ మంత్రి ఎర్నేని సీతాదేవి విమర్శించారు. సోమవారం ఇక్కడకు వచ్చిన ఆమె ఆర్ అండ్ బి అతిథి గృహంలో విలేఖర్లతో మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే రైతులు అనేక ఇక్కట్లకు గురయ్యారన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ చర్యలతో రైతులకు సకాలంలో ఎరువులు సరఫరా అయ్యాయన్నారు.

అర్హులందరికీ అందుతున్న సంక్షేమ పథకాలు

వీరులపాడు, నవంబర్ 21: ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. జన చైతన్య యాత్రలో భాగంగా మండలంలోని దొడ్డదేవరపాడు, వి అన్నవరం గ్రామాల్లో సోమవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను వివరించి చంద్రబాబు ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్నారు. ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ గ్రామాల్లో కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాల్లో ఎంపిపి పాటిబండ్ల జైపాల్, మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారావు, ఆయా గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

దివిసీమలో అనంతపురం రైతుల పర్యటన

అవనిగడ్డ, నవంబర్ 21: జిల్లాలోని చిన్న తరహా సాగునీటి కాలువల వ్యవస్థను పరిశీలించేందుకు అనంతపురం జిల్లాకు చెందిన రైతుల బృందం సోమవారం దివిసీమలో పర్యటించింది. అనంతపురం జిల్లాకు హంద్రినివా ప్రాజెక్టు నుండి 20 టిఎంసిల సాగునీరు సరఫరా చేస్తున్న సందర్భంలో ఆ నీటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే అంశంపై పరిశీలనకు అక్కడి రైతాంగం ప్రత్యేక వ్యాన్‌లో వచ్చారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎర్నేని నాగేంద్రనాధ్, ఎంవిఎస్ నాగిరెడ్డి, పి చంద్రశేఖరరెడ్డి, కె పార్థసారథి, సింహాద్రి రమేష్, కె నరసింహారావుల ఆధ్వర్యంలో పులిగడ్డకు చేరుకున్న వారు ఆక్విడక్టును పరిశీలించారు.

పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ సిపిఐ ధర్నా

మచిలీపట్నం (కోనేరుసెంటర్), నవంబర్ 21: పెద్ద నోట్ల రద్దు నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఆంధ్రాబ్యాంక్ ఫౌండర్స్ బ్రాంచ్ ఎదుట ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సిపిఐ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుండా ఒక్కసారిగా పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడాన్ని వారు తీవ్రంగా తప్పు బట్టారు. పెద్ద నోట్ల రద్దు కారణంగా చిన్న నోట్ల సమస్య ప్రజలను పట్టిపీడిస్తోందన్నారు. కోట్లాది రూపాయలు ఉన్న బ్లాక్ మనీ దారులు దర్జాగా తమ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చేసుకుంటున్నారన్నారు.

సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో... జాతీయ సంఘాలకు గుణపాఠం చెప్పాలి

యైటింక్లయిన్ కాలనీ, నవంబర్ 21: ఎన్నో సింగరేణి కార్మిక హక్కులను పోగొట్టిన జాతీయ సంఘాలకు ఈ సారి జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో టిబిజికెఎస్‌ను గెలిపించి మరోసారి వారికి గుణపాఠం చెప్పాలని ఆర్టీ సీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ కార్మికులను కోరారు. సోమవారం ఆర్జీ-2 ఏరియా వర్క్‌షాప్ వద్ద టిబిజికెఎస్ గేట్‌మీటింగ్ జరిగింది. ముఖ్య అతిథిగా ఆర్టీసీ చైర్మన్ సోమారపు స త్యనారాయణ హాజరై మాట్లాడారు. జాతీయ సంఘాలు పోగొట్టిన ఎన్నో హక్కులను ప్రభుత్వంతో మాట్లాడి తిరిగి పునరుద్ధరించి ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చి మాట నిలబెట్టుకున్నామన్నారు. సింగరేణి కార్మిక హక్కు ల సాధన కేవలం టిబిజికెఎస్‌తోనే సాధ్యమవుతుందన్నారు.

పెండింగ్ వ్యవసాయ కనెక్షన్లు పూర్తిచేయాలి

నక్కలగుట్ట, నవంబర్ 21: వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ కావాలని దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు వెంటనే కనెక్షన్ ఇవ్వాలని రూరల్ జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ సమావేశం మందిరంలో వ్యవసాయ, విద్యుత్తు సమన్వయ సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యుత్తు కనెక్షన్లు రెండు సంవత్సరాలుగా ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులను ప్రశ్నించారు. అధికారులు వ్యవసాయ కనెక్షన్లపై తమశాఖ ఎపుడూ దృష్టి సారించలేదని కలెక్టర్‌కు తెలిపారు.

మీ ఊళ్లకు ఏమీ కాదు..

కౌటాల, నవంబర్ 21: తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించనున్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు బ్యారేజీ నిర్మాణంతో కేవలం రైతుల భూములు మాత్రమే కొన్ని ముంపుకు గురవుతాయని ఏ ఒక్క గ్రామానికి కూడా డోకా ఉండదని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భరోసా ఇచ్చారు. సోమవారం రాత్రి గుండాయిపేట రైతుల గ్రామస్తుల అభ్యర్థన మేరకు వారి సందేహాల నివృత్తి కోసం గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా రైతులు, మహిళలు, యువకులు వారి సందేహాలను, అపోహలను వివిద వర్గాలు వారితో మాట్లాడుతున్న విషయాలను ఎమ్మెల్యే కోనప్ప దృష్టికి తీసుకువచ్చారు.

Pages