S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓటర్లు నా దేవుళ్లు : రసమయ

మానకొండూర్, నవంబరు 21: ఎన్నికల్లో నాపై నమ్మకంతో ఓట్లువేసి నన్ను గెలిపించినా ఓటర్లు నాదేవుళ్లు అని వారి అభివృద్దికోసం ప్రతి క్షణం పాటుపడుతన్నాని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. సోమవారం మండల ఎంపిడివో కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఎంపిపి మాతంగి లింగయ్య అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా రసమయి బాలకిషన్ పాల్గొన్నారు.

ఘరానా మోసగాడు అరెస్ట్

సూర్యాపేట, నవంబర్ 21: సూర్యాపేట జిల్లా కేంద్రంగా ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న ఈదులూరి సంతోష్‌ను సోమవారం అరెస్ట్ చేసినట్లు సూర్యాపేట ఇన్‌స్పెక్టర్ వై.మొగిలయ్య తెలిపారు. తెరాస అండదండలతో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుండి డబ్బులు వసూళ్లు చేస్తూ మోసాలకు పాల్పడుతూ బాధితులపై దాడులు చేసినట్లు కొన్ని చానళ్లల్లో కథనాలు రావడంతో ఈ విషయం రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించింది. అర్వపల్లి మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన ఈదులూరి సంతోష్ పట్టణంలో ధనలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్ పేరిట సంస్థను నెలకొల్పి నిరుద్యోగుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తూ వారి వద్ద నుండి రూ.

చిల్లరనోట్లు సర్దుబాటు చేయలేని ప్రధాని మోదీ గద్దె దిగాలి

విజయవాడ, నవంబర్ 21: పెద్దనోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మోదీ ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన రూ.2000ల నోట్లను రద్దు చేసి ప్రజలకు రూ.100, రూ.50ల నోట్లను అందుబాటులో ఉంచాలని ఎపిసిసి చీఫ్ రఘువీరారెడ్డి సోమవారం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నల్లధనం అరికడతామని ప్రగల్బాలు పలుకుతూ పెద్దనోట్లను రద్దు చేయడంతో సామాన్య ప్రజలు బ్యాంకుల ముందు, ఎటిఎంల ముందు పడిగాపులు కాస్తున్నారన్నారు.

శివోహం..

ఇంద్రకీలాద్రి, నవంబర్ 21: కార్తీక మాసం 4వ సోమవారం నగరంలోని అన్ని శైవ పీఠాల్లో కొలువైన పరమేశ్వరునికి భక్తులు వేకువ జామునే ఆలయాలకు వచ్చి పంచామృతాభిషేకాలతో గరళకంఠుడిని పూజలు చేశారు. ఇంద్రకీలాద్రిపైనున్న మల్లేశ్వరస్వామి ఆలయం నుండి చిన్న చిన్న ఆలయాల్లో కొలువైన ఈ దేవాదేవునికి అభిషేకాలు,సహస్రనామార్చనలు, విభూది అర్చనలు భక్తులు శ్రద్ధతో అర్చకుల పర్యవేక్షణలో నిర్వహించుకున్నారు. రూరల్ ప్రాంతాలకు చెందిన శైవ పీఠాలకూ భక్తులు అధికంగా వచ్చి శంభోశంకర అంటూ నినాదాలు చేశారు. వేకువ జామునే శివాలయాల్లో భక్తులు చేసిన శివనామస్మరణతో ఆలయాలు మారుమోగిపోయాయి. భక్తులతో కిక్కిరిసిపోయాయి.

రాష్ట్రంలో గిరిజన సంక్షేమానికి పెద్దపీట

విజయవాడ, నవంబర్ 21: రాష్ట్రంలో గిరిజన సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని, అందుకోసం 3వేల 99కోట్ల రూపాయలు 43 ప్రభుత్వ శాఖలకు కేటాయించినట్లు సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు. సోమవారం ఇక్కడ జరిగిన ఐటిడిఏ పివోలు, డిడిలు, డిటిబ్ల్యూవోల సమీక్షలో సమావేశంలో ఆయన మాట్లాడారు. తరువాత మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ గిరిజనుల ఆదాయం పెంచడానికి, వారిలో నిరక్షరాస్యత, వెనుకబాటుతనాన్ని పారదోలడానికి గిరిజన సంక్షేమ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందని చెప్పారు. గిరిజనులకు చేయూతనివ్వడానికి రాష్ట్రంలోని ఐటిడిఏలలో ఐఎఎస్ అధికారులను నియమిస్తున్నామని చెప్పారు.

మత్స్య సంపద వృద్ధికి కొత్త పథకాలు

విజయవాడ, నవంబర్ 21: రాష్ట్రంలో మత్స్య సంపద వృద్ధితో పాటు మత్స్యకారుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరికొత్తగా అనేక పథకాలకు రూపకల్పన చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో మత్స్య సంపద పెరుగుదల 31 శాతంగా నమోదైందన్నారు. మత్స్యకారుల జీవితాల్లో మెరుగుదల కోసం రాష్టవ్య్రాప్తంగా రూ.12కోట్లతో 4,596 మందికి ఐస్ బాక్స్‌లు, వలలు, ఇతర పనిముట్లను పంపిణీ చేసినట్లు చెప్పారు.

ఈ-రిక్షా టెండర్ల ప్రక్రియలో మరో వివాదం

విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 21: నగర పారిశుద్ధ్య పనులకు అవసరమయ్యే ఈ-రిక్షాల కొనుగోలు టెండర్ ప్రక్రియలో అధికారులు తమ వైఖరి మార్చుకోకపోవడంతో టెండర్‌దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెండర్‌లో పాల్గొన్న శ్రీ టెక్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాఘవరావు అధికారుల తప్పిదాలపై కమిషనర్ వీరపాండియన్‌కు అధికారికంగా ఫిర్యాదు చేయడం గమనార్హం. కాగా ఆయా తప్పిదాలను అధికారులు సరిచేసి న్యాయబద్ధమైన ప్రక్రియ చేపట్టకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు.

నేడు మూడో టి-20 మ్యాచ్

విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 21: ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులోని దేవినేని వెంకటరమణ, ప్రణీత క్రికెట్ గ్రౌండ్‌లో మంగళవారం భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడో టి-20 మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే వరుసగా రెండు టి-20లను గెలిచి జోరుమీదున్న విండీస్ మూడో మ్యాచ్‌ను సైతం గెలుపొంది క్లీన్‌స్వీప్ చేసి భారత్‌పై ప్రతికారం తీసుకోవాలని భావిస్తోంది. వనే్డ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత జట్టు టి-20లో వరుసగా రెండు మ్యాచ్‌లలో పరాజయం పొంది సిరీస్‌ను చేజార్చుకుంది. ఈక్రమంలో భారత జట్టు మూడవ టి-20లో నైనా విజయం సాధించి విండీస్‌కు క్లీన్‌స్వీప్‌కు అవకాశం ఇవ్వకుండా అడ్డుకట్ట వేయాలని ప్రణాళికలు చేస్తుంది.

జిల్లాలో 420 ఎటిఎంల ద్వారా రూ.2వేల నోట్లు

విజయవాడ, నవంబర్ 21: జిల్లాలో 420 ఎటిఎంల ద్వారా 2వేల రూపాయల నోట్లు అందుబాటులో ఉంచినట్లు జిల్లా కలెక్టర్ బాబు.ఎ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు. సోమవారం ముఖ్యమంత్రి నిర్వహించిన రాష్టస్థ్రాయి బ్యాంకర్ల సమావేశంలో భాగంగా జిల్లా కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో బ్యాంకర్లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. జిల్లాలో 943 ఎటిఎంలకు గాను 420 ఎటిఎంల ద్వారా 2వేల రూపాయల నోట్లు అందుబాటులో ఉంచామన్నారు. ప్రధాన బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన 245, ఆంధ్రా బ్యాంక్‌కు చెందిన 100 ఎటిఎంలు, ఇతర బ్యాంక్‌లకు చెందిన ఎటిఎంల్లోనూ ఖాతాదారులకు అందుబాటులో నోట్లు ఉంచామని కలెక్టర్ వివరించారు.

ఐటి రంగంలో అభివృద్ధి దిశగా అడుగులు

విజయవాడ, నవంబర్ 21: ఆంధ్రప్రదేశ్ తొలి పరిపాలనా రాజధాని విజయవాడను సరికొత్త కంపెనీలు పలకరిస్తున్నాయి. నగరంలో పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్డులో ఏర్పాటైన ఎక్సాన్ మిషన్ లన్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోమవారం ప్రారంభించారు. అనేక స్ట్ఫావేర్ సొల్యూషన్స్ కోసం ఈ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా సేవలు అందిస్తోంది. ఈ-గవర్నెన్స్, రిటైల్, హెల్త్‌కేర్‌లకు సంబంధించి ఈ కంపెనీ సేవలు అందిస్తోంది. ఎపిఐఎంఎస్ సంస్థ సిఎండి యార్లగడ్డ రత్నకుమార్ ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేయటానికి విశేష కృషి అందించారు.

Pages