S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దొరల్లా కాదు... ప్రజాసేవ ముఖ్యం

మహబూబ్‌నగర్, నవంబర్ 21: ప్రజలు తమ సమస్యలను నేరుగా జిల్లా అధికారులకు విన్నవించుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమం అధికారుల తీరుతో అబాసు పాలవుతుంది. అందుకు నిదర్శనం సోమవారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లోని రెవెన్యూ మీటింగ్ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణికి పలువురు జిల్లా అధికారులు రాకపోవడం ఈ విషయాన్ని కలెక్టర్ స్వయంగా అధికారులకు ఫోన్ చేసి చివాట్లు పెట్టిన పరిస్థితి నెలకొంది. ప్రజావాణికి వివిధ శాఖల జిల్లా అధికారులు డుమ్మా కొట్టడం వారు ప్రజావాణికి రాకుండా కిందిస్థాయి అధికారులను పంపించడంతో పద్దతి కాదంటూ కలెక్టర్ రోనాల్డ్ రోస్ అలాంటి అధికారులను బయటకు పంపించేశారు.

పంటరుణాల పంపిణీలో నిర్లిప్తత

నిజామాబాద్, నవంబర్ 21: రైతాంగ సంక్షేమమే ప్రధాన ధ్యేయమంటూ పాలకులు గొప్పలు చెబుతున్నప్పటికీ, పంటల సాగు కోసం అన్నదాత అనేక అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి, జలాశయాల్లో నీటి నిల్వలు చేరుకుని ప్రకృతి అనుకూలించడంతో ఖరీఫ్ సీజన్‌లో రైతులు పెద్దఎత్తున పంటలు సాగు చేశారు. అయితే వారికి పెట్టుబడుల రూపంలో రుణాలు సమకూర్చాల్సిన బ్యాంకర్లు ఉదాసీన వైఖరిని అవలంభించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసినప్పటికీ స్పందించకపోవడం, మరోవైపు వడ్డీ వ్యాపారుల వద్ద కూడా అప్పు పుట్టకపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడారు.

త్వరలో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో.. 100 పెట్రోల్ బంకులు

సూర్యాపేట, నవంబర్ 21: తెలంగాణలోని జైళ్లల్లో మెరుగైన సదుపాయాలు కల్పించడంతో పాటు ఖైదీలతో వివిధ పరిశ్రమలను నిర్వహిస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామని రాష్ట్ర జైళ్లశాఖ డిజి వికె.సింగ్ తెలిపారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఎస్పి కార్యాలయాన్ని, సబ్‌జైల్‌ను సందర్శించారు. అదేవిధంగా స్థానిక డిఎస్పి కార్యాలయంలో స్వచ్చంద సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ క్షణికావేశంలో నేరాలకు పాల్పడి జైళ్లకు వచ్చే ఖైదీలల్లో పరివర్తన తీసుకొచ్చే దిశగా అనేక కార్యక్రమాలను అమలుచేస్తున్నామన్నారు.

మాజీ వార్డు సభ్యుడిపై హత్యాయత్నం

మేడ్చల్, నవంబర్ 21: మేడ్చల్‌కు చెందిన ఓ మాజీ వార్డు సభ్యుడిపై గుర్తుతెలియని వ్యక్తులు హత్య యత్నం చేయడంతో తీవ్రంగా గాయపడిన అతను చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇన్‌స్పెపెక్టర్ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ గ్రామ పంచాయతీకి మూడు సార్లు రికార్డు స్థాయిలో వార్డు సభ్యుడిగా ఎన్నికై గ్రామానికి సేవలందించిన మహ్మద్‌అలీ అలియాస్ అన్వర్(50) పట్టణంలోని స్టేషన్ రోడ్డులో గల తన ఇంటిలోని ఓ గదిలో ఈనెల 13న నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు తలపై బలమైన వస్తువుతో గట్టిగా మోదడంతో రెండు చోట్ల తల భాగం చిట్లిపోవడంతో తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు.

ప్రజా సంక్షేమమే టిఆర్‌ఎస్ ధ్యేయం

మేడ్చల్, నవంబర్ 21: ప్రజా సంక్షేమమే టిఆర్‌ఎస్ సర్కార్ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి పెర్కోన్నారు. సోమవారం మేడ్చల్ పట్టణంలోని రైతుబజార్‌లో ప్రభుత్వం తరఫున రాయితీపై అందిస్తున్న ఉల్లి విక్రయ కేంద్రాన్ని ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఉల్లి దెబ్బకు జనతా ప్రభుత్వం పడిపోయిందని గుర్తుచేశారు. పెరిగిన ధరలను నియంత్రణలో పెట్టేందుకు ప్రభుత్వం రాయితీపై ఉల్లి విక్రయ కేంద్రాలను ప్రారంభిస్తున్నదని దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రిజర్వాయర్ల నిర్మాణ పనుల వేగవంతం

హైదరాబాద్, నవంబర్ 21: నగర శివారు గ్రామాల్లో మంచినీటి వ్యవస్తను మెరుగు పర్చేందుకు జలమండలి ఆధ్వర్యంలో రూ.1900 కోట్ల హడ్కో రుణంతో తాగునీటి ప్రాజెక్ట్ పనులు చేపడుతోంది. ఇందులో భాగంగా పలు ప్రాంతాల్లో రిజర్వాయర్లతో పాటు నీటి పైప్‌లైన్ నిర్మాణాలను చేపడుతున్నారు. జలమండలి ప్రాజెక్టు విభాగం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రిజర్వాయర్‌లను బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిషోర్ సోమవారం సందర్శించి పరిశీలించారు. కూకట్‌పల్లి, ఆల్వాల్ మున్సిపల్ సర్కిళ్లలో నిర్మిస్తున్న రిజర్వాయర్ల నిర్మాణపనులను పరిశీలించి పనులను వేగవంతం చేయాలని అధికారులను అదేశించారు.

బ్యాంకు వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్, నవంబర్ 21: పెద్ద నోట్ల రద్దు తర్వాత చిల్లర సమస్యతో సామాన్యుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది. గంటల తరబడి క్యూలో నిలబడినా చివరకు డబ్బు లేకపోవడంతో ప్రజలు సహనం కోల్పోయి ఆగ్రహావేశాలకు లోనవుతున్నారు. ఇలాంటి ఘటన బోరబండలోని సిండికేట్ బ్యాంకు వద్ద చోటుచేసుకుంది. గత నాలుగు రోజులుగా డబ్బు ఇవ్వడం లేదంటూ ఖాతాదారులు బ్యాంకు వద్ద ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బ్యాంక్ ఎదుట ఆందోళనకు దిగిన ఖాతాదారులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంఘటనతో భయాందోళనకు గురైన సిండికేట్ బ్యాంకు మేనేజర్ బ్యాంకును మూసివేసి అక్కడ నుంచి జారుకున్నారు.

జోరుగా మార్పిడి?

హైదరాబాద్, నవంబర్ 21: కేంద్ర ప్రభుత్వం వెయ్యి, 500 రూపాయల నోట్లను రద్దు చేయడంతో వాటిని మార్చేందుకు హవాలా, కమీషన్ ఏజెంట్లు రంగంలోకి దిగారు. నగరంలో 35 శాతం కోతతో పెద్ద నోట్ల దందా జోరుగా సాగుతోంది. పెద్ద మొత్తంలో నగదు నిల్వ చేసుకున్న వారితో పాటు జీరో దందా నిర్వహించే వ్యాపారులతో బేరసారాలు సాగిస్తున్నారు. పాత నోట్లను కొత్తవాటిగా మార్చి ఇచ్చేందుకు వారితో డీల్ కుదుర్చుకుంటున్నారు. ఈ విషయంలో అప్రమత్తమైన పోలీసులు నకిలీ కరెన్సీ చలామణీ, హవాలా మార్గంలో నగదు తరలింపు వ్యవహారాలను పలు సందర్భాల్లో అడ్డుకున్నారు. ప్రస్తుతం బ్యాంకుల పోలీసుల నిఘా నామమాత్రంగానే ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి.

రథం ధ్వంసం ఘటనపై భగ్గుమన్న అఖిలపక్షం

రాజేంద్రనగర్, నవంబర్ 21: గుర్తు తెలియని దుండగులు రాజేంద్రనగర్ సర్కిల్ ప్రేమావతిపేట్ పాండురంగ శివాంజనేయ దేవాలయంలోని రథంపై పెట్రోల్ పోసి తగులబెట్టిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. సోమవారం అఖిలపక్షం నాయకులు పాండురంగ శివాంజనేయ స్వామి దేవాలయంలోని రథాన్ని సందర్శించి జరిగిన ఘటనపై ఆరా తీశారు. అఖిలపక్షం సమావేశంలో రంగారెడ్డి జిల్లా భాజపా అధ్యక్షుడు బొక్క నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ హిందువుల మనోభావాలను దెబ్బ తీయడానికి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు.

గజగజ

ముషీరాబాద్, నవంబర్ 21: చలి పులి పంజా విసురుతోంది.. నగరంలో సగటు ఉష్ణోగ్రత కనిష్ట స్థాయికి పడిపోయింది. తెల్లవారుజాము నుండి దాదాపు ఉదయం ఏడు గంటలవరకు నగరం చలి గుప్పిట్లో బిగుసుకుపోతోంది. పెరిగిన చలి కారణంగా అస్తమా, ఉబ్బసం వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఉదయం ఎనిమిది తర్వాతే వాకర్లు జాగింగ్‌కు వెళ్తున్నారు. రాత్రి పదిగంటలకే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మఫ్లర్లు, స్వెట్టర్లు, జాకెట్స్ లేనిదే ప్రజలు బయటకు రాలేకపోతున్నారు.

Pages