S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదిక శాశ్వతం!

విశాఖపట్నం, నవంబర్ 21: విశాఖ నగరం శాశ్వత వేదికగా జాతీయ అంతర్ జిల్లా జూనియర్ అథ్లెటిక్స్‌ను ప్రతి ఏడాది నిర్వహిస్తామని రాష్ట్ర క్రీడలు, యువజన అభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎల్‌వి సుబ్రహ్మణ్యం తెలిపారు. రాష్ట్ర యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, రాష్ట్రంలో యువత ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో మంచి క్రీడాకారులుగా రాణించాలన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పలు కమిటీల అధ్యక్షులు, ప్రతినిధులతో ఆయన సమావేశమై అథ్లెటిక్స్ నిర్వహణకు నగరంలో చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు.

అక్రమార్కుల భరతం పడతాం!

సబ్బవరం, నవంబర్ 21: సబ్బవరంలోని సుమారు 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ బంజరు భూమి సుమారు 21 ఎకరాలు బినామీల పేరున ఆక్రమించుకుని కోర్టులను తప్పుదారి పట్టిస్తున్న వారి భరతం పడతానని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు.సోమవారం మండల పర్యటనకువచ్చిన ఆయన స్థానిక రోడ్లు ,్భవనాలశాఖ అతిధి గృహంలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో ఇక్కడ పనిచేసి రిటైరయిన ఇద్దరు ఎమ్మార్వోల సహకారంతో కొందరు వ్యక్తులు అప్పట్లో ప్రభుత్వ బంజరు భూముల ఆక్రమణల పై నిషేదం ఉన్నప్పటికీ ఓ మాజీ తహశీల్దార్ ఇచ్చిన లేఖ ఆధారంగా కోర్టును ఆశ్రయించారన్నారు.

గరళ కంఠుడికి ప్రత్యేక పూజలు

చోడవరం, నవంబర్ 21: కార్తీకమాస నాల్గవ సోమవారం సందర్భంగా మండలంలోని పలు దేవాలయాలు భక్తులతో పోటెత్తాయి.ప్రధానంగా ముద్దుర్తి సంగమేశ్వరాలయం, చోడవరం స్వయంభూ గౌరీశ్వర స్వామి దేవాలయం, జుత్తాడ, గవరవరం, వెంకన్నపాలెం, గోవాడ, భోగాపురం తదితర కాశీవిశే్వశ్వరాలయాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అభిషేక పూజలు నిర్వహించారు. దీంతో ఆయా గ్రామాల్లోని ఆలయాలకు కార్తీక శోభ సంతరించుకుంది. ఆలయా ల ప్రాంగణంలోని ధ్వజస్తంభాలు, ఉసిరి చెట్లు, నందీశ్వరుని వద్ద మహిళా భక్తులు దీపారాధనలు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. ముద్దుర్తి సంగమేశ్వరాలయంలో ఉదయం పది గంటలకు పార్వతీదేవి, సంగమేశ్వరుల కల్యాణ మహోత్సవం అత్యంత వేడుకగా జరిగింది.

ఆర్‌ఇసిఎస్ చైర్మన్‌గా అప్పారావు

సబ్బవరం/కశింకోట నవంబర్ 21: అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ (ఆర్‌ఇసిఎస్) చైర్మన్‌గా మండలంలోని ఆదిరెడ్డిపాలెంకు చెందిన వ్యాపార వేత్త,తెలుగుదేశం పార్టీ నేత కొటాన అప్పారావు నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం నాడు ఆయనకు రాష్ట్ర అగ్రికల్చర్ అండ్ కో-ఆపరేటివ్‌శాఖ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్ నుంచి వచ్చిన నియామకపు పత్రాన్ని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చేతుల మీదుగా వెనె్నల పాలెంలో అందజేశారు. ఈ సందర్భం గా కొటాన అప్పారావు మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ఈ పదవిని కట్టబెట్టిన ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

రూ.500 కోట్లతో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ

విశాఖపట్నం, నవంబర్ 21: స్టార్ట్‌సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో ఇదే స్థాయిలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేసే కార్యక్రమంలో రూ.500 కోట్లతో ఏపీ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ సహకారంతో మల్కాపురం, గాజువాక ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు డిపిఆర్‌ను సిద్ధం చేస్తున్నట్టు కమిషనర్ హరినారాయణన్ తెలిపారు.

ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ హైవే

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కలల ప్రాజెక్టు ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్ హైవే సోమవారం ప్రారంభమయింది. భారత వాయుసేన (ఐఎఎఫ్) యుద్ధ విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ అయ్యేందుకు అవసరమైన సౌకర్యాలతో కూడిన ఈ హైవేను సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) అధినేత ములాయం సింగ్ యాదవ్ జన్మదినమైన నవంబర్ 21న ప్రారంభించడం విశేషం.

పాల్వాయి గోవర్ధనరెడ్డి 80వ పుట్టినరోజు వేడుకలు

రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి 80వ పుట్టినరోజు వేడుకలు సోమవారం ఢిల్లీలోని ఆయన ఇంట్లో వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా పాల్వాయికి అభినందనలు తెలియజేస్తున్న
ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ, వైకాపా ఎంపిలు వై.వి సుబ్బారెడ్డి, మేకపాటి, కాంగ్రెస్ ఎంపిలు కెవిపి, సుబ్బిరామిరెడ్డి

పాల్వాయి గోవర్ధనరెడ్డి 80వ పుట్టినరోజు వేడుకలు

రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి 80వ పుట్టినరోజు వేడుకలు సోమవారం ఢిల్లీలోని ఆయన ఇంట్లో వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా పాల్వాయికి అభినందనలు తెలియజేస్తున్న డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరామిరెడ్డి

సఖ్యతగానే ఉందాం

హైదరాబాద్, నవంబర్ 21:విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాని ప్రస్తుత పరిస్థితిలో రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలే ముఖ్యంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ భావిస్తున్నారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని కెసిఆర్ సోమవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. ప్రధానమంత్రితో భేటీ అయిన తరువాత కెసిఆర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడకపోయినా తన వెంట వచ్చిన అధికారుల బృందంతో తరచూ సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు.

ప్రజావాణిలో ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం

కరీంనగర్, నవంబర్ 21: అధికారులు వేధిస్తున్నారంటూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన కలెక్టరేట్‌లో సోమవారం చోటుచేసుకుంది. కలెక్టరేట్‌లో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, కలెక్టర్‌కు తన బాధను చెప్పుకునేందుకు వచ్చిన స్ర్తి శిశు సంక్షేమ శాఖలో ఆయాగా పనిచేస్తున్న గంగాదేవి కలెక్టర్ వద్దకు రాకుండానే తన వెంట తెచ్చుకున్న హెయిర్ డై తాగి పడిపోయింది. దీనిని గమనించిన సిబ్బంది వెంటనే ఆమెను కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని, 24గంటలు దాటితే కాని చెప్పలేమంటూ వైద్యులు చెబుతున్నారు.

Pages