S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డ్రగ్స్ మాఫియాపై మండే సూర్యుడు

తమిళ, తెలుగు భాషల్లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్య, హన్సిక జంటగా మగిల్ తిరుమేని దర్శకత్వంలో తమిళంలో రూపొందిన మీగమాన్ చిత్రాన్ని సర్వల ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ సూర్య సాకేత్ పిక్చర్స్ పతాకాలపై మండే సూర్యుడు పేరుతో విడుదల చేస్తున్నారు. బెల్లంకొండ వెంకటేశ్వర్లు, కొలన ఎల్లారెడ్డి, సర్వల గణేష్ యాదవ్ నిర్మాతలు. ఈ చిత్రం తెలుగు అనువాద కార్యక్రమాలు జరుపుకుంటున్న సందర్భంగా చిత్ర వివరాలను గురించి నిర్మాతలు తెలియజేస్తూ-‘డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఆర్య అండర్ కవర్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. గ్లామర్‌తో ఆకట్టుకోవడమే కాదు, హన్సిక కెరీర్‌లో ఇదో భిన్నమైన పాత్ర.

సంక్రాంతికి ఖైదీ

ప్రముఖ నటుడు చిరంజీవి, కాజల్ జంటగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఖైదీ నెం.150. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే యూరప్‌లో రెండు పాటల చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ- ‘ఇటీవలే పాటల చిత్రీకరణ కోసం యూరప్ వెళ్లాం. అక్కడ క్రొయేషియా, స్లోవేనియా వంటి అద్భుతమైన లొకేషన్లలో పాటలను చిత్రీకరించాం. శేఖర్, జానీ మాస్టర్‌ల నేతృత్వంలో రూపొందిన ఈ పాటల్లో చిరంజీవి స్టెప్పులు అదిరేలా వుంటాయి. మిగిలిన షూటింగ్ పార్ట్ త్వరలోనే పూర్తిచేస్తాం.

చంద్రముఖి తరహాలో శివలింగా

రాఘవేంద్ర లారెన్స్, రితికా సింగ్ జంటగా ప్రముఖ దర్శకుడు పి.వాసు దర్శకత్వంలో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి.పిళ్లై నిర్మిస్తున్న చిత్రం ‘శివలింగా’. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన పాత్రికేయుల సమావేశం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు పి.వాసు మాట్లాడుతూ- ‘పదేళ్ల క్రితం కన్నడంలో ఆప్తమిత్ర సినిమా తీశాను. అది పెద్ద హిట్ కావడంతో దానే్న చంద్రముఖి పేరుతో రీమేక్ చేశాను. రజనీకాంత్ నటించిన ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ఇటీవలే కన్నడంలో నేను చేసిన శివలింగా చిత్రం ఘనవిజయం సాధించడంతో దాన్ని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేస్తున్నా.

డేటింగ్ చేశా!

పెళ్లికి ముందు డేటింగ్ చేయడం తప్పని అందరూ అనుకుంటారు. కానీ అలా గమనిస్తేనే కాబోయే భర్తకు సంబంధించిన విషయాలను గుర్తించవచ్చు. నచ్చితేనే పెళ్లి, లేదంటే నచ్చినవాణ్ని వెతుక్కోవటమే అని చెబుతోంది అందాల నటి విద్యాబాలన్! పెళ్లై సంసార జీవితం గడుపుతున్న ఈ అమ్మడు ఇప్పుడు డేటింగ్ గురించి చెప్పటం ఏమిటా? అని అనుకోకండి. ఎప్పుడైనా సరే ఉన్నది ఉన్నట్లుగా చెప్పడంలో విద్యాబాలన్‌కు సాటి ఎవరూ లేరు. పెళ్లయ్యాక ఒకవేళ డేటింగ్ చేసినా ఆ విషయాన్ని చెప్పకుండా మిగతా విషయాలను మాట్లాడే కొంతమంది హీరోయిన్లకు మినహాయింపుగా విద్యాబాలన్ కనిపిస్తోంది. పెళ్లయ్యాక ఇనే్నళ్లయ్యాక తన డేటింగ్ ముచ్చట్లను చెప్పుకొచ్చింది.

టీజర్‌లో మన్యం పులి

అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మలయాళంలో రూపొందిన పులి మురుగన్ చిత్రం కలెక్షన్లలో రికార్డు సృష్టించింది. ప్రముఖ నటుడు మోహన్‌లాల్ హీరోగా నటించిన ఈ చిత్రానికి వైశాఖ్ దర్శకత్వం వహించాడు. దీన్ని శ్రీ సరస్వతీ ఫిలింస్ పతాకంపై మన్యం పులి పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి. ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత కృష్ణారెడ్డి మాట్లాడుతూ- ‘చాలా గ్యాప్ తరువాత పులి మురుగన్ చిత్రాన్ని నిర్మాతగా మన్యం పులి పేరుతో విడుదల చేస్తున్నాం. సిందూరపువ్వు, సాహసఘట్టం సినిమాలకంటే ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది.

డబ్బు సమస్యతో కోటీశ్వరుడు

నవీన్‌చంద్ర, పృథ్వీ నటించగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ రూపొందించిన చిత్రం ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. శృతిసోధి, సలోని కథానాయికలుగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 23న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ- ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రాన్ని ఈనెలలోనే విడుదల చేయాల్సివుండగా అందరూ ఎదుర్కొంటున్న కరెన్సీ సమస్యను దృష్టిలో వుంచుకొని వచ్చే నెల 23న విడుదల చేయడానికి నిర్ణయించామని తెలిపారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయని, ఆడియో కూడా సూపర్‌హిట్ అయిందని ఆయన వివరించారు.

ఆకట్టుకునే అందం

చేసింది రెండు మూడు సినిమాలు అయినాగానీ ప్రస్తుతం టాలీవుడ్‌లో కీర్తిసురేష్ గురించే మాట్లాడుకుంటున్నారు. పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబు సరసన ఒకేసారి హీరోయిన్‌గా ఛాన్సులు కొట్టేయడంతో అందరి దృష్టీ కీర్తి సురేష్‌పై పడింది. పూర్తి బిజీలో వుంటూనే తన సినిమాలతో పరిశ్రమను ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా కీర్తి సురేష్ ‘నేను లోకల్’ అనే సినిమాకు సంబంధించిన షూటింగ్‌కు సంబంధించి హైదరాబాద్‌లో నటిస్తోంది. షూటింగ్ స్పాట్‌లో చూసిన ప్రతి ఒక్కరికీ కీర్తి సురేష్ ఆన్ స్క్రీన్‌కన్నా ఆఫ్ స్క్రీన్‌లోనే చాలా అందంగా కనిపించిందట. లొకేషన్‌లో ఆమె లుక్స్‌కు అందరూ ఫ్లాటైపోయారట.

1న బేతాళుడు

విజయ్ ఆంటోని కథానాయకుడిగా మానస్ రుషి ఎంటర్‌ప్రైజెస్, విన్ విన్ విన్ క్రియేషన్స్ పతాకాలపై ఎస్.వేణుగోపాల్, కె.రోహిత్ అందిస్తున్న చిత్రం ‘బేతాళుడు’. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన పది నిమిషాల టీజర్‌కు విశేష స్పందన లభించిందని నిర్మాతలు చెబుతూ, తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా సినిమా టీజర్‌కు వచ్చిన ఆదరణ చూసి తమకు నమ్మకం పెరిగిందని, ఆడియోకు కూడా విశేష ఆదరణ లభిస్తోందన్నారు. నటుడిగా వైవిధ్యమైన పాత్రల పోషణ లక్ష్యంగా వున్న తనకు బేతాళుడు చిత్రం కొనసాగింపుగా వుంటుందని నటుడు విజయ్ ఆంటోని తెలిపారు.

ఇక నగదు లేకుండానే...

విశాఖపట్నం, నవంబర్ 21: రోడ్డు రవాణా కార్యాలయంలో అందజేసే అన్ని రకాల సేవలకు ఇకపై నగదురహిత లావాదేవీలనే జరపాలని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు.సోమవారం మర్రిపాలెంలోని ఆర్‌టిఓ కార్యాలయంలో ఇ-పోస్ మిషన్‌ను ప్రారంభించి నగదు రహిత లావాదేవీలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దుతో ఉత్పన్నమైన చిల్లర సమస్యకు ముగింపు పలికేందుకు జిల్లావ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందన్నారు.

మత్స్యకారులు ఎస్టీ జాబితాలోకి...!

విశాఖపట్నం, నవంబర్ 21:మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు హామీ ఇచ్చారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. సంప్రదాయ మత్స్యకారులు చేపల వేట కొనసాగించేందుకు అవసరమైన వలలు, మోటారు బోట్లు,కిట్‌లు ప్రభుత్వం అందజేస్తోందన్నారు.

Pages