S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్‌బిఐ వద్ద సిపిఐ ధర్నా

హైదరాబాద్, నవంబర్ 21:పాతనోట్ల రద్దును నిరసిస్తూ సిపిఐ కార్యకర్తలు అసెంబ్లీ నుంచి ఆర్‌బిఐ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్‌బిఐ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె నారాయణతోపాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ పెద్ద నోట్లపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయం లేకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ప్రధాని మోదీ నిర్ణయం సమంజసం కాదన్నారు.

చేతులెత్తేసిన సహకార బ్యాంకులు

నాగర్‌కర్నూల్, నవంబర్ 21: పెద్దనోట్ల రద్దు అనంతరం ఎక్కడో ఉత్తరాది రాష్ట్రంలో ఓ సహకార సంఘంలో డబ్బుల వినియోగంలో దుర్వినియోగం జరిగిందనే ఉద్దేశ్యంతో ఆర్‌బిఐ... సహకార బ్యాంకుల విషయంలో జారీ చేసిన ఆదేశాలు రైతుల పాలిట శాపంగా మారాయి. సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్వహంచే బ్యాంకులలో రైతులు తీసుకున్న అప్పులను తీర్చేందుకు పాతనోట్ల చెల్లింపులను పూర్తిగా నిలిపియడంతో సహకార సంఘాల బ్యాంకులలో గత వారం రోజుల నుంచి ఎలాంటి లావాదేవీలు జరగడంలేదు. ఖరీఫ్ పంటలను అమ్ముకున్న రైతులు సహకార సంఘాలలో తీసుకున్న పంట రుణాలను తీర్చుకొంటున్నారు. కానీ..

మొసళ్లను పట్టుకునేందుకు చేపలను చంపకండి

న్యూఢిల్లీ,నవంబరు 21: పెద్దనోట్ల రద్దు వల్ల సామాన్యులు ఏదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని రాష్ట్ర ఐటి, పురపాలకశాఖ మంత్రి కె టి రామారావు అన్నారు. సోమవారం నాడు కెటిఆర్ బిజీబిజీగా గడిపారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో, ఆస్ట్రేలియా రాయబారితో విడివిడిగా సమావేశమయ్యారు. అనంతరం సీఐఐ అధ్వర్యంలో బిల్డింగ్ ఇండియాన్ ఎనర్జీ స్టోరేజి మార్కెట్ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. అనంతరం 36వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌లో జరిగిన ‘‘తెలంగాణ స్టేట్ డే’’ కార్యక్రమంలో కెటిఆర్ పాల్గొన్నారు.

పెళ్ళికి నిరాకరించిన యువతిపై కత్తితో దాడి

ఆదిలాబాద్,నవంబర్ 21: నిశ్చితార్థం జరిగాక పెళ్ళికి నిరాకరించిందనే ఆవేశంతో నందు అనే యువకుడు డిగ్రీ విద్యార్థినిపై కత్తితో దాడిచేసి గాయపర్చిన సంఘటన సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జైనథ్ మండలం మాండగడ గ్రామానికి చెందిన సిడాం నందిని ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో బి ఎస్సీ చదువుతోంది. అయితే నందినికి బేల మండలం బెల్గాం గ్రామానికి చెందిన గెడం నందు అనే యువకుడితో తొమ్మిది నెలల క్రితం నిశ్చితార్థం జరిగింది. తనకు ఇష్టం లేని పెళ్ళి జరపవద్దని కుటుంబ సభ్యులతో గొడవ పడిన యువతి నందిని ఎట్టకేలకు పెళ్ళిని రద్దు చేసుకుంది.

విలేఖరిని ఫోన్‌లో బెదిరించిన వ్యక్తిపై ఫిర్యాదు

హైదరాబాద్, నవంబర్ 21: ఓ విలేకరిని ఫోన్‌లో బెదిరించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బోడుప్పల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక విలేకరులు సోమవారం మేడిపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇటీవల ఓ దిన పత్రికలో (ఆంధ్రభూమి కాదు) కబ్జా కేసులో దుండగుల అరెస్టు అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ పత్రికలో పని చేసే విలేకరి జె.శ్రీనివాస్ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు యాదాద్రి జిల్లా పడమటి సోమారం శివాలయంలో పూజలో పాల్గొన్నారు. ఆ సమయంలో తన వద్ద ఉన్న సెల్‌ఫోన్ మోగ గా పూజలో ఉన్నందున స్పందించలేదు. పూజ అనంతరం మరోసారి 8106694074 అనే ఫోన్ నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేశారు.

తప్పుడు ప్రచారంపై కేసులు ఎమ్మెల్సీ కర్నె హెచ్చరిక

హైదరాబాద్, నవంబర్ 21: టిఆర్‌ఎస్‌పై సామాజిక మాధ్యమాల్లో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై కేసులు పెడతామని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హెచ్చరించారు. సూర్యాపేటలో ఈదులూరి సంతోష్ అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేస్తే అతను టిఆర్‌ఎస్ నాయకుడు అని సామాజిక మాధ్యమాల్లో కొందరు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దాన్ని టివిల్లోనూ ప్రచారం చేస్తున్నారని ప్రభాకర్ తెలిపారు. సంతోష్ గతంలో కాంగ్రెస్‌లో ఉన్నాడని, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నాడని కర్నె వెల్లడించారు. సంతోష్ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్‌గా పోటీ చేశాడని ఆయన గుర్తుచేశారు.

ప్రశాంత్ రెడ్డిపై ఇసికి ఫిర్యాదు కాంగ్రెస్ మాజీ ఎంపి పొన్నం

హైదరాబాద్, నవంబర్ 21: తెలంగాణ ఉద్యమంలో, గత ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేశానని ప్రకటించిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘానికి (సిఇసి) ఫిర్యాదు చేయనున్నట్లు కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు చేశానని చెప్పడం ద్వారా ఓట్లను కొనుగోలు చేసినట్లే అవుతుందని సోమవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో విమర్శించారు. బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చేసిన ప్రసంగం సిడిని ఆయన మీడియా ముందు ప్రదర్శించారు.

తెలంగాణ సుభిక్షంగా ఉండాలి

హైదరాబాద్, నవంబర్ 21: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో రూపొందించిన 2017 సంవత్సరం క్యాలెండర్‌ను దేవాదాయ, గృహ నిర్మాణ, న్యాయ శాఖ మంత్రి ఎన్ ఇంద్రకరణ్‌రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. యాదాద్రి నర్సింహ స్వామి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా, క్షేమంగా ఉండాలని ఇంద్రకరణ్‌రెడ్డి ఆకాంక్షించారు. గచ్చిబౌలిలోని మంత్రి నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొంగిడి సునీత, యాదగిరిగుట్ట ఈవో గీత పాల్గొన్నారు. యాదాద్రి ఆలయ సిటీ నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారని ఈవో తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

మహేశ్వరం, నవంబర్ 21: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం కందుకూరు మండలం పోతుబండ తండాకు చెందిన ఇస్లావత్ శ్రీనివాస్ (30), సాయిరెడ్డి గూడకు చెందిన గుర్తుతెలియని వ్యక్తి, ముచ్చర్ల గ్రామానికి చెందిన కావలి రాములు (55) సోమవారం ఉదయం ద్విచక్ర వాహనంపై హైదరాబాద్ నగరానికి బయలుదేరారు. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై రాచులూర్ గేట్ వద్ద ప్రమాదవశాత్తు ఆమన్‌గల్ వైపు నుంచి వేగంగా వస్తున్న టాటా బొలేరా ఢీకొంది.

మందుపాతర పేల్చిన మావోలు

భద్రాచలం, నవంబర్ 21: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో సోమవారం మావోయిస్టులు మందుపాతర పేల్చిన ఘటనలో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సుక్మా ఎఎస్పీ జితేంద్ర శుక్లా కథనం ప్రకారం.. చింతలనార్ - నర్సాపురం గ్రామాల మధ్య రహదారి నిర్మాణానికి సిఆర్‌పిఎఫ్ 74వ బెటాలియన్‌కు చెందిన జవాన్లు పహరా కాస్తున్నారు. ఉదయం రోడ్డు నిర్మాణ పనుల వద్ద ఉండగా మావోయిస్టులు మందుపాతరను పేల్చారు. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ పర్వీందర్, మరో జవాను సాగర్ గాయపడ్డారు. వీరిని హెలికాప్టర్‌లో జగదల్‌పూర్‌కు తరలించారు.

Pages