S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతిసార వ్యాధిబారిన పడిన విద్యార్థులకు జిల్లా వైద్యాధికారి పరామర్శ

జహీరాబాద్‌టౌన్, అక్టోబర్ 25: అతిసారతో బాధపడుతున్న విద్యార్థులకు అవసరమైన చికిత్సలు అందించాలని జిల్లా వైద్యారోగ్య అధికారి గాయత్రిదేవి స్థానిక వైద్యులను ఆదేశించారు. స్థానిక ఎస్సీ సాంఘీక సంక్షేమ హాస్టల్‌లోఅతిసార వ్యాధితో అస్వస్థతగు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను ఆమె పరామర్శించారు. వారికి మెరుగైన చికిత్సలు అందించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో వైద్యులు 24 గంటలు అందుబాటలో ఉండాలన్నారు. అనంతరం ఆమె స్థానిక హాస్టల్‌ను సందర్శించారు.

కార్యదర్శులు సంబంధిత గ్రామాల్లో ఉండాల్సిందే

మెదక్ రూరల్, అక్టోబర్ 25: పంచాయతీ కార్యదర్శులు పనిచేసేచోట ఉండకపోతే చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి హనోక్ హెచ్చరించారు. ఆస్థి పన్ను వసూళ్లు డిసెంబర్ ఆఖరు వరకు పూర్తిచేయాలని సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో 322 గ్రామ పంచాయతీలకు 137 మంది పంచాయతీ కార్యదర్శులున్నారన్నారు. ఏడున్నర కోట్ల ఆస్థి పన్ను వసూలు చేయాల్సి ఉందన్నారు. డిసెంబర్ 31 వరకు వసూళ్లు చేయాలని కార్యదర్శులకు సూచించారు. ఇందుకు సంబంధించిన డిసిబి నివేదికలు ఇవో పిఆర్‌ఆర్‌డి సంతకంతో కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.

ఆవంగడాలకు నాణ్యత లేదన్న ఏరువాక కేంద్రం శాస్తవ్రేత్త

మెదక్, అక్టోబర్ 25: న్యూజివీడు(సిరి) ఎన్‌యస్ 405 రకం వరి వంగడం నాణ్యత లేదని ఏరువాక కేంద్రం శాస్తవ్రేత్త డాక్టర్ ఎ.శ్రీనివాస్ వెల్లడించారు. ‘‘నకలి వంగడ గండం, ఎడిఎను ఆశ్రయించిన రైతులు’’ అనే శీర్షికతో ఈ నెల 18న కథనంపై స్పందించిన శాస్తవ్రేత్త డాక్టర్ శ్రీనివాస్ ఈ విత్తనాలు వాడిన రైతులను గుట్టకిందిపల్లి, తిమ్మానగర్ గ్రామాలను మంగళవారం నాడు సందర్శించి ఆ పంటలను పరిశీలించారు. శాస్తవ్రేత్త శ్రీనివాస్‌తో పాటు ఎడిఎ మనోహర, ఎఓ రెబల్‌సన్ ఉన్నారు. వర్షాలు వెలిసిన తరువాత వరిపంటలకు దోమ, సుడిదోమ ప్రమాదం కలిగే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు పట్ల హర్షం

మెదక్, అక్టోబర్ 25: బ్రాహ్మణులలో పేదవారిని ఆదుకొనే ఉద్దేశ్యంతో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు మెదక్ జిల్లా బ్రాహ్మణ సంఘం అభినందనలు తెలిపారు. మంగళవారం నాడు మెదక్ శ్రీ కోదండ రామాలయంలో సమావేశమైన బ్రాహ్మణ సంఘం ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేస్తూ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. సమైఖ్య పాలనలో ఏ ఒక్కరు కూడా బ్రాహ్మణులను పట్టించుకున్న పాపాన పోలేదని వారు వాపోయారు. ఓసిలుగా అనేక విధాలుగా బ్రాహ్మణులను కించపరిచారని వారు పేర్కొన్నారు.

దళారులను ఆశ్రయించవద్దు

శివ్వంపేట, అక్టోబర్ 25: రైతులు శ్రమ ఓడ్చి పండిచిన వరి ధాన్యంతో దళారులను ఆశ్రయించి నష్టపోరాదని, ప్రభుత్వం మద్దతు ధర పొంది అభివృద్ది చెందాలని నర్సాపూర్ శాసనసభ్యుల చిలుముల మదన్‌రెడ్డి మంగళవారం అన్నారు. శివ్వంపేట మండల సహకార సంఘం కార్యాలయం ఆవరణలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, రైతుల సమస్యలను పరిష్కరించడం కోసం తాను నిరంతరంగా కృషి చేస్తున్నానన్నారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ వరికి మద్దతు ధర 1510 రుపాయలు, బి గ్రేడ్ ధాన్యంకు 1470 రుపాయలకు మద్దతు ధర పెంచిందన్నారు.

రైతు సమస్యలు పరిష్కరించాలి:బిజెపి

సంగారెడ్డి టౌన్, అక్టోబర్ 25: వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగానికి పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఆధ్వర్యంలో మంగళవారం మండల కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు మందుల నాగరాజు మాట్లాడుతూ రైతాంగానికి ఆదుకునేందుకు కేంద్రం నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడంలో జాప్యం చేస్తుందన్నారు. రైతాంగాన్ని మోసం చేస్తున్న నకిలి విత్తనాల కంపెనీలపై చర్యలు తీసుకోవాలన్నారు. సంగారెడ్డి మున్సిపల్ పరిధిలో చెత్త డంప్ యార్డును ఏర్పాటు చేయాలని కోరారు.

హేతుబద్దీకరణ కసరత్తు ఆరంభం

సూర్యాపేట, అక్టోబర్ 25: నూతన జిల్లాల ఏర్పాటు తర్వాత ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్టంచేసే చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ చర్యల్లో భాగంగా ఉపాధ్యాయుల హేతుబద్దీకరణ ప్రక్రియను ప్రారంభించింది. గత ఉమ్మడి రాష్ట్రంలో హేతుబద్దీకరణలో లోపాలు జరిగినట్లు గుర్తించి ఈవిడత అత్యంత పకడ్భందిగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం ఇటీవల హైదరాబాద్‌లో అన్ని జిల్లాల విద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి హేతుబద్దీకరణతో పాటు ఖాళీల భర్తీ అంశంపై చర్చించి ఆదేశాలు ఇవ్వడంతో విద్యాధికారులు ఇందుకు సంబంధించిన కసరత్తును చేపడుతున్నారు.

అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పదు

భువనగిరి, అక్టోబర్ 25: ఉపాధి హామీ, హరితహారం పనులలో అవకతవకలకు పాల్పడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ హెచ్చరించారు. ఉపాధి హామీ, హరితహారం, స్వచ్చ తెలంగాణపై మంగళవారం మండల పరిషత్ అభివృద్ది కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్యఅతిధిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధిహామీ పనులను కల్పించడంతో పాటు వాటి ఉపయోగాలను ఎప్పటికప్పుడు సమీక్షించి నివేదిక అందించాలని తెలిపారు. చిన్న చిన్న సమస్యలను కారణాలుగా చూపి హరితహారం, ఉపాధిహామీ, స్వచ్చ తెలంగాణ పనులు చేపట్టని వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

కెసిఆర్ పాలనలో భ్రష్టుపట్టిన రాష్ట్రం

సూర్యాపేటటౌన్, అక్టోబర్ 25: ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన రాష్ట్రంలో పరిస్థితులు భ్రష్టుపట్టాయని టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం పట్టణంలో టిడిపి జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ పరిపాలనను భ్రష్టుపట్టించారని తనకు, తనకుటుంబానికి లాభం చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. కమీషన్‌ల కోసం పెద్ద కాంట్రాక్టర్లకు, పారిశ్రామిక వేత్తలకు కొమ్ముకాస్తూ లక్ష కోట్ల రూపాయాల అవినీతికి పాల్పడుతున్నారన్నారు.

మైనార్ట్టీ విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలి

భువనగిరి, అక్టోబర్ 25: మైనార్టీ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యనందించి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలని పాఠశాల ఉపాద్యాయులకు సూచించారు. మంగళవారం మైనార్టి గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి తరగతి గదులను, భోజనశాలను, మరుగుదొడ్లను పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకు విద్యను అందించేందుకు మైనార్టి గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేసిందని అన్నారు. మైనార్టి కుటుంభాలు తమ పిల్లలను చదివించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కల్పించిన చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Pages