S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేషన్ డీలర్లు నెలాఖరుకు బిఎఫ్‌డి పూర్తిచేయాలి:ఆర్డీవో

దేవరపల్లి, అక్టోబర్ 25: రేషన్ షాపు డీలర్లంతా విధిగా ఈ నెలాఖరునాటికి బిఎఫ్‌డి పూర్తిచేయాలని కొవ్వూరు ఆర్డీవో బి శ్రీనివాసరావు రేషన్ షాపు డీలర్లను ఆదేశించారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో మంగళవారం రేషన్ డీలర్లు, గ్యాస్ కంపెనీ డీలర్లతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆర్డీవో హాజరై ప్రసంగించారు. దేవరపల్లి మండలంలో బిఎఫ్‌డి 81.89 శాతం ఉందని, దీనిని 85 శాతానికి పూర్తిచేయాలన్నారు. ఈ మండలం జిల్లాలో వెనుకబడి ఉందని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇన్‌ఛార్జి డీలర్లు సమర్థవంతంగా పనిచేయకపోతే కొత్తవారికి అవకాశం ఇస్తామని ఆయన హెచ్చరించారు.

ఆన్‌లైన్‌లో ఐసిడిఎస్

వరంగల్, అక్టోబర్ 25: జిల్లాలో ఐసిడిఎస్ ద్వారా చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ఆన్‌లైన్ ద్వారా నిర్వహించాలని అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి ఆదేశించారు. స్ర్తి, శిశు సంక్షేమ శాఖ ద్వారా నిర్వహించే పనులను ఆన్‌లైన్ చేయాలని తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో స్ర్తి, శిశుసంక్షేమ శాఖ, ఐసిడిఎస్ అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐసిడిఎస్ ద్వారా నిర్వహించే పనులలో పారదర్శకత పాటించాలని, మహిళలకు, శిశువులకు ప్రయోజనం కలిగించేలా పథకాలు అమలు చేయాలని అన్నారు.

జనవరిలో కాకతీయ ఉత్సవాలు!

వరంగల్, అక్టోబర్ 25: నాలుగు సంవత్సరాల విరామం అనంతరం కాకతీయ ఉత్సవాలకు ముహూర్తం కుదిరింది. వచ్చే ఏడాది జనవరి నెలలో కాకతీయ ఉత్సవాలు నిర్వహించాలని సాంస్కృతిక, పర్యాటక శాఖలు నిర్ణయించాయి. నాలుగేళ్ల నుంచి కాకతీయ ఉత్సవాలు ఎప్పుడని స్థానికులు, ఇదిగో మరో రెండు, మూడునెలలో అంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతూ కాలం గడిపేయగా తాజాగా హైద్రాబాద్‌లో సోమవారం జరిగిన సాంస్కృతిక, పర్యాటక శాఖల సంయుక్త సమావేశంలో కాకతీయ ఉత్సవాల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న సమయంలో 2012 డిసెంబర్ 20న మొదటిసారి అట్టహాసంగా కాకతీయ ఉత్సవాలు నిర్వహించేందుకు నిర్ణయించారు.

భర్తే కాలయముడు!

స్టేషన్ ఘన్‌పూర్, అక్టోబర్ 25: జీవితాంతం కలిసి ఉండాలనే ఆలోచనతో మూడుముళ్లు వేసిన భర్తే కాలయముడైతే కట్టుకున్న భార్యకు రక్షణ ఎక్కడనేది ప్రశ్నార్థకంగా మిగులుతోంది. మండలంలోని శివునిపల్లిలో ముస్లిం కులానికి చెందిన రహీతాబేగం (35)ను కట్టుకున్న భర్త రఫీక్ గొంతునులిమి నిర్ధాక్షిణ్యంగా హత్య చేసిన సంఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాలు మృతురాలి కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. రాయపర్తి మండలానికి చెందిన రఫీక్ గత కొన్ని సంవత్సరాలుగా శివునిపల్లిలో భార్యతో సహా నివాసం ఉంటున్నట్లు వారు తెలిపారు.

రోడ్ల పక్కన మొక్కలు నాటాలి

వరంగల్, అక్టోబర్ 25: హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామీణ జిల్లా పరిధిలోని జాతీయ రహదారులు, రోడ్లు, భవనాల, పంచాయతీరాజ్ శాఖలకు చెందిన రోడ్లపక్కన భారీగా మొక్కలు నాటేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. గత ఏడాది చేపట్టిన హరితహారం కార్యక్రమంలో నాటిన టేకుమొక్కల ద్వారా మంచి ఫలితాలు లభిస్తున్న కారణంగా రైతులు ఈ మొక్కలు పెంచేందుకు ముందుకు వస్తున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది పెద్దఎత్తున టేకుమొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.

భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి

జనగామ టౌన్, అక్టోబర్ 25: జిల్లాలో దేవాదుల ప్రాజెక్టు ద్వారా చేపడుతున్న రిజర్వాయర్లు, కాలువలు, ట్యాంకుల నిర్మాణం కోసం కావాల్సిన భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని జనగామ జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన అధికారులను ఆదేశించారు. జనగామ కలెక్టరేట్‌లో సోమవారం రాత్రి జిల్లా పరిధిలోని రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో దేవాదుల ప్రాజెక్టు పనులు ఇప్పటి వరకు ఏ దశలో ఉన్నాయని వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. భూసేకరణ సందర్భంగా అధికారులకు రైతులతో ఎదురయ్యే ఇబ్బందులను వెంటనే తెలియచేయాలని కోరారు.

ప్రజలను మభ్యపెడుతున్న ప్రభుత్వాలు: సిపిఐ

వడ్డేపల్లి అక్టోబర్ 25: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద, మద్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, పెంచిన నిత్యావసర ధరలను నియంత్రించటంలో విఫలమయ్యాయని సిపిఐ రాష్టక్రార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. సిపిఐ నగర నిర్మాణ మహాసభలు కాశిబుగ్గలోని ఎస్‌ఎస్ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చాడ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రజాసంక్షేమాన్ని మరచి పాలనను కొనసాగిస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించారని ఆరోపించారు.

పర్యావరణ సమతుల్య లోపంతో ప్రపంచానికి ముప్పు

పాలకుర్తి, అక్టోబర్ 25: పర్యావరణ సమతుల్య లోపంతో భవిష్యత్తు సమాజం దెబ్బతినడంతో ప్రపంచానికి ముప్పు వాటిల్లనుందని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ అన్నారు. లండన్‌లో క్లైమేట్ ఛేంజ్ అండ్ ఎనర్జీ ఇష్యూస్‌పై జరుగుతున్న ప్రపంచ సదస్సుకు భారతదేశం నుంచి బ్రిటీష్ హైకమీషన్ పిలుపు మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన పార్లమెంటు బృందం సోమవారం లండన్ చేరుకున్నారు. మంగళవారం రోజున మహాత్మాగాంధీ విగ్రహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని క్లైమేట్ పార్లమెంటు ఆధ్వర్యంలో పర్యావరణ సమతుల్యంపై జరిగిన ప్రపంచ సదస్సులో భారత బృందం తరపున ఎంపి రాపోలు ఆనందభాస్కర్ ప్రసంగించారు.

బంగారు తెలంగాణ కల సాకారమైనట్లే..

మరిపెడ, అక్టోబర్ 25: సిఎం కేసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలవుతున్నాయని, వాటి ఫలాలు ప్రతి ఒక్కరికి చేరేలా తొడ్పాటునందిస్తే బంగారు తెలంగాణ సాకారమైనట్లే అని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నారు. మంగళవారం ఎల్లంపేట పెద్ద చెరువులో ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న 75వేల మేలు రకం చాపపిల్లలను టిఆర్‌ఎస్ నాయకులు మత్స్యకారులతో కలసి ఎమ్మెల్యే చెరువులో వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడుతూ.. సిఎం కేసిఆర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 45వేల చెరువుల్లో 48వేల కోట్లు ఖర్చు చేసి చెపపిల్లలను మత్స్యకారులకు అందజేయడం జరుగుతుందన్నారు.

కనీస మద్దతు ధర కల్పించాలి

ఆదిలాబాద్,అక్టోబర్ 25: రైతులు పండించిన పంట ఉత్పత్తులకు మద్యదళారుల బెడదలేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు చేపట్టి కనీస మద్దతు ధర కల్పించాలని వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి పార్థసారథి జిల్లాకలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర రాజధాని నుండి మంగళవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, మార్కెట్‌యార్డు అధికారులు, వ్యవసాయశాఖ అధికారులతో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లపై సమీక్షసమావేశం నిర్వహించి పలు మార్గదర్శకాలు జారీ చేశారు. మార్కెట్‌యార్డులలో రైతులకు అవసరమైన వౌళిక సదుపాయాలు కల్పించాలని, రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసి ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా పంట ఉత్పత్తులు కొనుగోళ్లు చేయాలని అన్నారు.

Pages