S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వసుధైక కుటుంబం మేలు

వసుధైక కుటుంబంతోనే మానసిక ఆరోగ్యం లభిస్తుంది. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కుటుంబ యజమానిని గౌరవించేవారు. ఆయనను భగవంతుడని తలచేవారు. ఆయన ఏది చెబితే ఆ ఇంటివారికి అది వేదం. ఆనాటి కుటుంబాల్లో కలహాలు కనిపించేవి కావు. రోజులు మారా యి. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమయ్యా యి. స్వేచ్ఛ పేరిట కుటుంబాలు విచ్ఛన్నమైనట్లే వ్యక్తిగత ‘స్వచ్ఛ’తను నేటి ప్రజలు విస్మరిస్తున్నారు. భగవంతుని సేవ చేయడం ప్రతి ఒక్కరి ధర్మం కావాలి. అపుడే జగతి మంగళకరంగా ఉంటుంది.
- డాక్టర్ నిష్కించిన భక్తదాస, హరేకృష్ణ మూవ్‌మెంట్ అధ్యక్షుడు,
అక్షయపాత్ర ఫౌండేషన్, విశాఖపట్నం

- డాక్టర్ నిష్కించిన భక్తదాస

పరిశుభ్రత, పౌష్టికాహారం..

కుటుంబంలోని పిల్లలు, పెద్దలు ఇంటి శుభ్రత, వ్యక్తిగత శుభ్రత పాటించాలి. అదేవిధంగా ఇంటిల్లిపాది పౌష్టికాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆకుకూరలు, పప్పు్ధన్యాలు, తాజాపండ్లు తినాలి. గర్భిణులు, బాలింతలు కూడా పోషకాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇంటితోపాటు పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. భోజనం తయారుచేసే పద్ధతిలో శుచి, శుభ్రత అవసరం.కుటుంబమంతా ఆరోగ్యంగా వుండాలంటే ఆడపిల్లలను చదివించడం ముఖ్యం.
- డాక్టర్ బి.సరిత, ప్రభుత్వ 30 పడకల ఆస్పత్రి,
కె.కోటపాడు

- డాక్టర్ బి.సరిత

యోగాతో దేహం, దేశం సుభిక్షం

యోగాను ఆచరించటంవల్ల దేహం, దేశం సుభిక్షంగా ఉంటుంది. ఆసనాలు వేయడం ద్వారా రజోగుణం, శారీరక రుగ్మతలు తొలగిపోతాయి. ‘ప్రాణాయామేన పాతకం హంతి’.. ప్రాణాయామం సాధనతో సప్త ధాతువుల్లోని దోషాలు పోతాయి. యోగా చేసిన ప్రతి వ్యక్తి సైనికుడిలా అన్నింట్లో ముందుంటాడు.
- పి.ఎం.వి.కేశవరావు, నాగార్జున యూనివర్సిటీ
గౌరవ యోగాధ్యక్షుడు, విశాఖపట్నం

- పి.ఎం.వి.కేశవరావు

దీపావళి తీపి వంటలు

దీపావళి పేరు చెప్పగానే పటాసులతో పాటు స్వీట్సు గుర్తుకు వస్తాయ. లక్ష్మీ పూజ చేసి బంధువులకి, అధికారులకి, స్నేహితులకి స్వీట్సు పంపుకోవటం ఆనవాయతీ. ఎప్పుడూ చేసే పాయసం, తీపి గారెలకు బదులు కొత్త రకాల స్వీట్లు తయారుచేయటానికి ప్రయత్నించండి.

మెంతి లడ్డు

మెంతులు - 1/2 కప్పు
నెయ్యి - 1 కప్పు
రాగిపిండి - 1 కప్పు
పుట్నాలపొడి - 1 కప్పు
బెల్లం తరుగు - 1 1/2 కప్పు, ఏలకులు - 12, జీడిపప్పులు - 24, పిస్తాపప్పు - 24,,బాదం పప్పులు - 12, కొబ్బరి కోరు - 4 చెంచాలు
ముందుగా నేతిలో మెంతులు వేయించి మిక్సీ పట్టాలి. చేదు పోవటానికి ఈ పిండిలో కొద్దిగా నెయ్యి, ఏలకుల పొడి కలుపుకుని గినె్నలో ఉంచుకోవాలి. రాగిపిండి, పుట్నాల పిండి దోరగా వేయించి చల్లార్చి బెల్లం కలిపి డ్రై ఫ్రూట్స్ తరిగి కలపాలి. తరువాత నెయ్యి మిగతావి వేసి కలిపి లడ్డూగా చేసుకోవాలి. పిల్లలకి పెద్దలకి మంచిది.

వెన్న ఉండలు

మైదా - 1 కప్పు
బియ్యపిండి - 1/2 కప్పు
వెనె్న - 1/2 కప్పు, పంచదార - 1 కప్పు, ఉప్పు - చిటికెడు, వంటసోడా - చిటికెడు, నూనె - 250 గ్రా.

తీపి వడలు

గోధుమ పిండి - 1 కప్పు, బియ్యంపిండి - 1 కప్పు, తురిమిన బెల్లం - 2 కప్పులు, వెన్న - 1/2 కప్పు, నెయ్యి - 4 చెంచాలు, నూనె - 250 గ్రా., కొబ్బరి - 1/2 కప్పు, ఏలకులు - 5
గోధుమపిండి, బియ్యంపిండిలో బెల్లం, కొబ్బరి, ఏలకుల పొడి, కరిగించిన వెనె్న కొంచెం వేసి బాగా కలిపాలి. నీళ్లతో చపాతీ పిండిలా కలుపుకోవాలి. చేతికి నెయ్యి తడి చేసుకుంటూ నిమ్మకాయంత ఉండ చేసి అరచేతితో వత్తి కాగిన నూనెలో వదలాలి. ఇలా నేతితో చెయ్యలేనివాళ్ళు పూరీ పీటపై కొంచెం మందంగా వత్తి నూనెలో వేయించి తియ్యాలి. ఇలా పిండి మొత్తం చెయ్యాలి.

యాపిల్ కోకోనట్ వడలు

ఆపిల్ తురుము- 2 కప్పులు, కొబ్బరి తురుము - 1 కప్పు, డ్రైఫ్రూట్స్ తరిగినవి - 1 కప్పు, నెయ్యి - 50 గ్రా., పంచదార - 1 కప్పు
పాలు - 1 కప్పు, యాలకుల పొడి - 1 చెంచా, జీలకఱ్ఱ పొడి - 1 చెంచా, జీడిపప్పులు విడిగా - 24, కార్న్‌ప్లోర్ - 4 చెంచాలు

పన్నీర్ చక్రాలు

పన్నీరు కోరు - 1 కప్పు, ఛాయ మినప్పప్పు - 2 కప్పులు, ఏలకులు - 5, బెల్లం - 2 కప్పులు, కేసరి రంగు - 1 చెంచా, పాలు -2 చెంచాలు, నూనె - 250 గ్రా. జీడిపప్పు పొడి - 2 చెంచాలు, మినప్పప్పు నానబెట్టి వెనె్నలా రుబ్బాలి. దీనికి పన్నీర్ చేర్చి మరలా రుబ్బాలి. ఏక రంధ్రం ఉన్న కంతి కల గొట్టంలో ఈ రుబ్బిన పిండి వేసి కాగి నూనెలో చక్రల్లా చట్రంపై చుట్టి చట్రం నూనెలో పెట్టాలి. ఇలా చేసిన చక్రాల్ని బెల్లం పాకం పట్టి- పాలల్లో రంగు కలిపి పోసి, ఏలకులు వేసి చక్రాలు వేసి పాకం వచ్చాక తీసి పళ్ళెంలో పెట్టండి.

- వాణీ ప్రభాకరి

Pages