S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నియంతలా వ్యవహరిస్తున్న కెసిఆర్

మిర్యాలగూడ, అక్టోబర్ 25: నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో నియంతలా వ్యవహరిస్తు ఉద్యమాలు, పార్టీలను అణచివేసేందుకు యత్నిస్తున్నారని అదే విధంగా తాము తెలంగాణా ఉద్యమాన్ని అణచివేస్తే సిఎం అయ్యేవాడా అని రాష్ట్ర సిఎల్‌పి నాయకులు కుందూరు జానారెడ్డి సూటిగా ప్రశ్నించారు. మంగళవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రైతుల రుణమాఫీ ఒకేసారి చేయాలని, ఫీజు రీఇంబర్స్‌మెంట్ చేయాలని కోరుతూ నిర్వహిస్తున్న సంతకాల సేకరణను ఆయన ప్రారంభించారు.

2018 మార్చి నాటికి ఇంటింటికీ కృష్ణా జలాలు

పెద్ద అడిశర్లపల్లి, అక్టోబర్ 25: మార్చి నాటికి తెలంగాణలోని ప్రతి ఇంటింటికి కృష్ణా జలాలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ఏర్పాటు చేసిందని దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని కోదండాపురం ప్లాంట్‌లో జరుగుతున్న మిషన్ భగీరథ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో బోర్లు, బావులను ఆశ్రయించి త్రాగునీరు తెచ్చుకునేవారిమని, కానీ నేడు వాతావరణ పరిస్థితుల వల్ల బోర్లు, బావులు ఎండిపోయి త్రాగునీరు కరువవుతుందన్నారు.

కుదరని ఏకాభిప్రాయం

సూర్యాపేట, అక్టోబర్ 25: నూతన జిల్లాగా ఆవిర్భావించిన సూర్యాపేట జిల్లా టిడిపి అధ్యక్ష పదవీకి తీవ్ర పోటీ నెలకొంది. కొత్త జిల్లా సారధి ఎంపిక కోసం పార్టీ రాష్ట్ర నాయకత్వం మంగళవారం జిలా లకేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పార్టీ అధినేత చంద్రబాబుకు ఎంపిక నిర్ణయాన్ని వదిలేశారు. జిల్లా కమిటీ సమావేశానికి పరిశీలకునిగా పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి హజరయ్యారు. ఆయనతో పాటు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి బొల్లం మల్లయ్యయాదవ్, రాష్ట్ర నాయకులు పాల్వాయి రజినికుమారి, చావా కిరణ్మయి, జిల్లా అధ్యక్షుడు బిల్యానాయక్‌లు హజరయ్యారు.

‘దయా’ మృతదేహాం గుర్తింపునకు వెళ్లిన దయ సోదరుడు, బంధువులు

వలిగొండ, అక్టోబర్ 25: మావోయిస్టు పార్టీ ఆంధ్ర-ఒరిస్సా బోర్డర్ జోనల్ సెక్రటరీ, శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి చామల కృష్టయ్య అలియాస్ దయా సోమవారం మల్కన్‌గిరి ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు పోలీసులు పోస్టుమార్టమ్ అనంతరం తెలియజేయడం జరిగింది. కాగా పోలీసులు తెలిపిన సమాచారం మేరకు దయా సోదరుడు చామల పాపయ్య, మరో సోదరుడు చామల నర్సింహ్మా కుమారుడు శ్రీనివాస్‌తో పాటు మరో ముగ్గురు బంధువులు మృతదేహాం గుర్తించేందుకు మంగళవారం సాయంత్రం మల్కన్‌గిరికి వెళ్లడం జరిగింది.

మోటకొండూరులో ఛాడను కలపడం పట్ల నిరసిస్తూ మహిళ శ్రీమంతం

ఆత్మకూర్(ఎం), అక్టోబర్ 25: ఆత్మకూర్(ఎం) మండలంలో ఉన్న ఛాడ, ముత్తిరెడ్డిగూడెం గ్రామాలను మోటకొండూరులో కలపడం పట్ల నిరసిస్తూ మంగళవారం ఓ మహిళకు తెలంగాణ సాంప్రదాయబద్దంగా శ్రీమంతం నిర్వహించారు. మండలంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆత్మకూర్‌కు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాన్ని వదిలి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోటకొండూరు మండలంలో కలపడం విడ్డూరంగా ఉందన్నారు. మహిళ ఎం.గంగమ్మకు తెలంగాణ సాంప్రదాయం ప్రకారం పూలు, పండ్లు పెట్టి ఘనంగా శ్రీమంతం నిర్వహించారు. ప్రభుత్వం చొరవ తీసుకొని రోజుకో రకంగా ఛాడ గ్రామంలో చేస్తున్న నిరసనలను జోక్యం చేసుకొని తమ గ్రామాలను ఆత్మకూర్( ఎం)లోనే ఉంచాలని కోరారు.

సబ్సిడీపై మినుములు, వేరుశనగ విత్తనాలు

చిట్యాల, అక్టోబర్ 25: సబ్సిడీపై మినుములు, వేరుశనక విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి ఎస్. శ్రీనివాస్ తెలిపారు. మినుములు 4 కిలోల సంచి ధర 524 ఉండగా సబ్సిడీ రూ. 305.20పై, రైతులు చెల్లించాల్సిన ధర రూ. 218.80లని, వేరుశనగలు 30కిలోల బస్తాకు రూ. 2280 ఉండగా సబ్సిడీ రూ. 759, రైతు చెల్లించాల్సిన ధర రూ. 1523లని తెలిపారు. సబ్సిడీలో విత్తనాలను పొందగోరు రైతులు ఎంపిడివో కార్యాలయంలోని మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలని పేర్కొన్నారు.

‘స్వచ్ఛ’మైన ఇల్లు ... ఆనందాల హరివిల్లు

ఇల్లు.. స్వర్గసీమ! అది లక్ష్మీదేవి నడయాడే ప్రదేశమని తెలుసుకున్నప్పుడే కదా ఆనందాల హరివిల్లు అవుతుంది.! లేదంటే అన్నీ కష్టాలే.. నిత్యం కన్నీళ్ళే! ఇంటి ‘స్వచ్ఛత’ కోసం వారంలో ఒక రోజు కేటాయించి ఇంటిని చక్కదిద్దుకుంటే కుటుంబం అంతా హాయిగా, ఆరోగ్యంగా గడిపేయొచ్చని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. లేదంటే ఆదాయానికి మించి వైద్య ఖర్చులు తలపై కూర్చొంటాయ. ఇంట్లో రోజువారీ చెత్త ఎప్పటికప్పుడు పారబోస్తే ఈగలు, దోమలు దరిచేరవు. స్నానపు గదులు, మరుగుదొడ్లు, స్టోర్ రూంలు, ఇంటి మూలలను నిత్యం ఓ అరగంట కేటాయించి పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

- కృష్ణమూర్తి

పసుపు సర్వరోగ నివారిణి

ఇంటికి నిత్యం ఓ అరగంట కేటాయించి పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రోజూ లేదా వారానికి ఒకసారి ఇంట్లోని ఫ్లోర్‌ను సర్ఫ్‌తో లేదా పసుపుతోనైనా లేదా తేలికైన క్రిమి సంహారక లిక్విడ్‌లను ఉపయోగించి శుభ్రం చేసుకుంటే ఆరోగ్యం. పసుపు సర్వరోగ నివారిణిని కాబట్టి ఈ పసుపునే ఎక్కువగా ఉపయోగిస్తే ఎంతో మేలు.

‘చిన్న‘పనైన ‘పరిశుభ్రత’పై నిర్లక్ష్యం

ఈ ఆధునిక యుగంలో మానవుడు అన్ని రంగాల్లో కొంగొత్త ఆవిష్కరణలు చేస్తున్నప్పటికీ ‘చిన్న‘పనైన ‘పరిశుభ్రత’పై నిర్లక్ష్యం వహిస్తున్నాడు. ఆ అశ్రద్ధ ఫలితమే వ్యాధుల విజృంభణ.. మరణాలు! డెంగ్యూ జ్వరానికి సం బంధించి నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం (మినిస్టరీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్) గణాంకాల ప్రకారం మన రాష్ట్రంలో 2010లో 776 కేసులు నమోదు కాగా, ముగ్గురు చనిపోయారు. 2011లో 1209 కేసులకు ఆరుగురు, 2012లో 2299 కేసులకు ఇద్దరు, 2013లో 910 కేసులకు ఒకరు, 2014లో 1262 కేసులకు ఐదుగురు, 2015లో 3159కి ఇద్దరు, 2016 అక్టోబర్ 2వ తేదీ వరకు 1712 కేసులు నమోదయ్యాయి.

‘స్వచ్ఛ భారత్’ స్ఫూర్తికావాలి

స్వచ్ఛ్భారత్ పేరుతో ప్రధాని మోదీ దేశ ప్రజల ను ఒక్కసారిగా తట్టిలేపారు. ఈ కార్యక్రమంవల్ల దేశమంతటా ఏ విధంగా చైతన్యం వెల్లివిరిసిందో వేరే చెప్పనక్కర్లేదు. కొంతమేర ఫలితాలనే ఇచ్చింది. గాఢంగా నిద్రపోతున్న వ్యక్తిని తట్టి లేపినట్టు.. ఎవరో వచ్చి వివరిస్తేగానీ తెలుసుకోలేని పరిస్థితిలో బతుకు సాగిస్తున్నాడు.

Pages