S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్పొరేట్‌కు దీటుగా గురుకుల పాఠశాలలు

తాడేపల్లిగూడెం, అక్టోబర్ 25: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. రూరల్ మండలం ఆరుగొలను సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల 3వ జోనల్ క్రీడా మహోత్సవాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల 13 పాఠశాలల, కళాశాలల 600 మంది క్రీడాకారులు ఈ క్రీడాపోటీల్లో పాల్గొని ప్రతిభను చాటుతారన్నారు. క్రీడల్లో విద్యార్థుల ప్రతిభను నిరూపించుకుని ప్రపంచ స్థాయిలో క్రీడాకారులుగా గుర్తింపు పొందాలన్నారు.

పోలవరం మట్టి డంపింగ్ భూములు పరిశీలించిన జెసి

పోలవరం, అక్టోబర్ 25: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తీస్తున్న మట్టిని డంపింగ్ చేసేందుకు భూములను జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు మంగళవారం పరిశీలించారు. సుజల అతిథిగృహం వద్దకు జెసి చేరుకోగా ప్రాజెక్టు ఇంజనీర్లు డంపింగ్ భూమిని చూపించేందుకు తీసుకెళ్లారు. ప్రాజెక్టు కుడికాల్వ ప్రారంభం కుడివైపున ప్రభుత్వానికి చెందిన యాభై ఎకరాలున్నాయని, ఆ భూములను ఆయన పరిశీలించినట్టు తెలిసింది. ఈ విషయం విలేకర్ల వద్ద గోప్యంగా ఉంచి వివరాలు చెప్పకుండా ప్రాజెక్టు ప్రాంతానికి వెడుతున్నట్టు జెసి చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో తీస్తున్న మట్టిని డంపింగ్ చేయడానికి సుమారు 400 ఎకరాలు అవసరమవుతాయి.

సరిహద్దుల్లో ఇసుకాసురులు!

కుకునూరు, అక్టోబర్ 25: మండల పరిధిలోని ఆంధ్రా సరిహద్దు గ్రామమైన బూరుగువాయి ఇసుక రేవు వద్ద ఇసుక అక్రమ రవాణా భారీగా జరుగుతుండటంతో ఒక్కసారిగా మంగళవారం ఎస్‌ఐ సాదిక్ ఆధ్వర్యంలో మెరుపుదాడి చేసి పది లారీలు, జెసిబి, ఆ ప్రాంతంలోనే వున్న ఒక కారును పట్టుకున్నారు. గత కొంతకాలంగా అక్కడ కొందరు వ్యక్తులు వందలాది లారీలు ఇసుక రవాణా చేస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు సరిహద్దు గ్రామంపై నిఘా పెట్టారు.

28న చంద్రన్న దళితబాట

ఏలూరు, అక్టోబర్ 25: ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు, ఉప ప్రణాళికల అమలు తీరు తెన్నులపై ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా చంద్రన్న దళిత బాట కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్-2 ఎంహెచ్ షరీఫ్ అధికారులకు సూచించారు. స్థానిక కలెక్టరేట్‌లో మంగళవారం సాయంత్రం చంద్రన్న దళిత బాట కార్యక్రమం నిర్వహణా ఏర్పాట్లను వివిధ శాఖాధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ ఉదయం 10 గంటలకు ఏలూరు ఇండోర్ స్టేడియంలో చంద్రన్న దళిత బాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

తగ్గిన సిజేరియన్ ప్రసవాలు

ఏలూరు, అక్టోబర్ 25: గర్భిణులకు అందిస్తున్న వైద్య సౌకర్యాలపై అవగాహన కల్పించడం ద్వారా జిల్లాలో సిజేరియన్ ప్రసవాలు గతేడాది 65 శాతం ఉండగా ఈ సంవత్సరం 60 శాతానికి తగ్గాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె కోటేశ్వరి చెప్పారు. ఏలూరులోని డిఎంహెచ్‌ఒ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం సిజేరియన్ ప్రసవాలు తగ్గించే అంశంపై జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల గైనకాలజిస్టులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కోటేశ్వరి మాట్లాడుతూ జిల్లాలో ప్రతీ ఆసుపత్రిలోనూ సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యతనివ్వాలని గర్భిణులకు సాధారణ ప్రసవాల వలన కలిగే లాభాలను సిజేరియన్ చేయించుకోవడం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలన్నారు.

మంచినీటిలో పురుగుల మందు

ఉంగుటూరు, అక్టోబర్ 25: గ్రామస్థులందరికీ మంచినీటిని సరఫరాచేసే ఆ వాటర్ ట్యాంకులో కొందరు ఆకతాయిలు పురుగుమందు కలిపారు. అయితే ట్యాంకు వాచ్‌మెన్ అప్రమత్తత కారణంగా పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటన మండలంలోని ఉప్పాకపాడులో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. సోమవారం రాత్రి 10గంటల వరకూ పంచాయతీకి చెందిన ట్యాంకు వాచ్‌మెన్ వేము నాగేశ్వరరావు విధుల్లో ఉండి, ఇంటికి వెళ్లాడు. తెల్లవారుజామున 5గంటలకు విధుల్లో చేరిన వాచ్‌మెన్ ట్యాంకులోకి నీరు ఎక్కిద్దామనుకుంటుండగా ఎక్కడి నుండో పురుగు మందు వాసన రావడంతో అనుమానించి, నీరు ఎక్కించడం మాని వెంటనే సర్పంచ్, ఇతర పెద్దలకు విషయాన్ని తెలియజేశాడు.

అర్హులైన కాపు యువతకు రుణాలు

తాడేపల్లిగూడెం, అక్టోబర్ 25: కాపు కార్పొరేషన్ ద్వారా నైపుణ్యాభివృద్ధి పథకం కింద అర్హతగల కాపు యువతకు రుణ సహాయం సబ్సిడీతో అందజేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాలు, మున్సిపాల్టీ పరిధిలో కాపు యువతకు రుణాలను మంత్రి పంపిణీచేశారు. స్థానిక శ్రీ కృష్ణదేవరాయ కాపు కల్యాణ మండపంలో కాపు రుణమేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ మున్సిపాల్టీలో 144 మందికి, పెంటపాడు మండలంలో 1033 మందికి, తాడేపల్లిగూడెం మండలంలో 84 మందికి కాపు రుణాలు మంజూరయ్యాయన్నారు. సుమారు రూ.

వంట స్వాములకు నైపుణ్య పరీక్ష

ద్వారకాతిరుమల, అక్టోబర్ 25: రాష్ట్రంలోని రెండు ప్రధాన దేవాలయాల్లో సహాయ పళహ స్వాముల (వంటస్వాముల) నియామకానికి నైపుణ్య పరీక్షలను మంగళవారం ద్వారకాతిరుమలలో నిర్వహించారు. స్థానిక శేషాచలకొండపై ఉన్న మాధవ కల్యాణ మండపంలో జరిగిన ఈ పోటీల్లో శ్రీకాళహస్తి, శ్రీశైలంకు చెందిన 45 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారికి ఆయా దేవస్థానాల ఆగమ శాస్త్రానుసారం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ వైవి అనూరాధ నేతృత్వంలో నిపుణుల కమిటీ నైపుణ్య పరీక్ష నిర్వహించారు. అయితే తెలంగాణా రాష్ట్రం నుండి వచ్చిన అభ్యర్థులను కమిషనర్ అనూరాధ ఈ పరీక్షకు అనుమతించలేదు.
కనీస పరిజ్ఞానం కరవు

నిర్వాసితుల సమస్యలపై రాజకీయాలకు అతీతంగా ఉద్యమం

పోలవరం, అక్టోబర్ 25: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల సాధనకు రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేస్తామని ప్రాజెక్టు నిర్వాసితుల సంక్షేమ సమితి రాష్ట్ర కన్వీనర్ సుబ్బరాయశాస్ర్తీ అన్నారు. ఆయన మానవహక్కుల సంఘం సభ్యుడు యుగంధర్‌రెడ్డితో కలిసి పైడిపాక పునరావాస గ్రామంలో మంగళవారం నిర్వాసితులతో సమావేశమయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థగా నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేందుకు సమితి ఏర్పడినట్టు చెప్పారు. పునరావాస గ్రామాల్లో గత రెండు నెలలుగా సర్వే నిర్వహించి వారి సమస్యలు తెలుసుకున్నామన్నారు.

వేగేశ్వరపురం ఎత్తిపోతల అభివృద్ధికి రూ. 8.32 కోట్లు

తాళ్లపూడి, అక్టోబర్ 25: మండలంలోని వేగేశ్వరపురం ఎత్తిపోతల పథకం అభివృద్ధికి 8.32 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని సంఘం అధ్యక్షులు కైగాల రాంబాబు తెలిపారు. కొవ్వూరు ఎమ్మెల్యే కెఎస్ జవహర్ సహకారంతో నిధులు మంజూరయ్యాయన్నారు. 1998లో ఆరువేల ఎకరాలు సాగుచేసేలా నాలుగు మోటార్లతో ఎత్తిపోతల పథకం రూపొందించారని, దీనికి 25 కిమీ పొడవునా గ్రావిటీ కాలువలున్నాయన్నారు. మోటార్లు శిథిలావస్థకు చేరుకోవడంతో నిధుల కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. మంజూరైన నిధులతో నాలుగు కొత్త మోటార్లు, విద్యుత్ ఆధునికీకరణ పనులు, నాలుగు కిమీ పొడవునా కాలువ కాంక్రీట్ పనులు చేపడతామని ఆయన చెప్పారు.

Pages