S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూరగాయల సాగుపై అవగాహన అవసరం

ఆసిఫాబాద్, అక్టోబర్ 25: వచ్చే కరీఫ్ సీజన్‌లో పత్తి పంట సాగు తగ్గించి అంతర్ పంటలను పండించే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటి నుండే ప్రణాళిలకలను రూపొందించుకోవాలని కుమ్రం భీం జిల్లా కలెక్టర్ చంపాలాల్ సూచించారు. కూరగాయల సాగుపైనా రైతులకు అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు. జిల్లాకలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం మధ్యాహ్నం వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మార్కెటింగ్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ పాల్గొని సూచనలు, సలహాలు అందించారు. జిల్లా వ్యాప్తంగా ఈసీజన్‌లో 1.30లక్షల ఎకరాల్లో పంట సాగవుతోందని కలెక్టర్ తెలిపారు.

ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలి

నిర్మల్, అక్టోబర్ 25: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులదేనని జిల్లా కలెక్టర్ ఇలంబరితి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ మండలాల ఎం ఈవొలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలను ఎం ఈవొలు తరచుగా పర్యవేక్షన చేయాలన్నారు. పాఠశాలల్లోని సమస్యలను సమీక్షించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు క్రమశిక్షణతో ఉంటూ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలన్నారు. పాఠశాలల్లో సమయపాలన తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతీ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం తప్పనిసరిగా అందేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు.

పత్తి కొనుగోళ్లు చేపట్టండి

ఆసిఫాబాద్, అక్టోబర్ 25: అన్ని మార్కెట్ యార్డుల్లో కాటన్‌కార్పొరేషన్ ఇండియా ద్వారా పత్తి కొనుగోళ్లు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ పార్థసారథి అన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పత్తి, సోయా కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. పంట ఉత్పత్తులు మార్కెట్‌లోకి వస్తున్నందున జిల్లా కలెక్టర్లు అన్ని కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి వసతుల కల్పనకు కృషి చేయాలని సూచించారు.

వచ్చే వర్షాకాలానికి మొక్కలు సిద్ధం చేయాలి

మంచిర్యాల, అక్టోబర్ 25: వచ్చే వర్షాకాలంలో నాటడానికి మొక్కలు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కరుణన్ సంబంధిత శాఖాధికారులకు ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని కలెక్టర్ చాంబర్‌లో తన అధ్యక్షతన చీఫ్ కంజర్వేటర్ సంజయ్‌కుమార్ గుప్తాతో కలసి జిల్లా స్థాయి సమన్వయ కమిటీ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2017 వర్షాకాలంలో చేపట్టనున్న తెలంగాణ హరితహారం కార్యక్రమంపై అటవీ శాఖ, గ్రామీణాభివృద్ది శాఖ, సింగరేణి, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటడానికి నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలు పెంచాలని సూచించారు.

పోలీసులు ప్రజా సేవకులు

బెజ్జూరు, అక్టోబర్ 25: పోలీసులు ప్రజా సేవకులని కుంరంభీం జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. మంగళవారం పోలీసులు మీ కోసం జనమైత్రి కార్యక్రమంలో భాగంగా కమ్మర్‌గాం ఆశ్రమ పాఠశాలలో బెజ్జూరు పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిభిరాన్ని ఆయన ప్రారంభించిన సందర్బంగా మాట్లాడారు. పోలీసులు జనం కోసం 24గంటలు పనిచేస్తారని, పోలీసులు, ప్రజల మద్య సత్సంబంధాలు పెంచడానికే జనమైత్రి కార్యక్రమం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. పోలీసులు మిత్రులేనని, పోలీసులు ప్రజల కోసం పనిచేస్తారని తెలిపారు.

ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేయాలి

ఆదిలాబాద్,అక్టోబర్ 25: ఆదిలాబాద్ జిల్లాలో చేపడుతున్న చిన్న, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నిర్దేశిత గడవులోగా పనులు పూర్తిచేసి రైతులకు సాగునీరందించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బుద్ద ప్రకాష్ జ్యోతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, నీటిపారుదల, వ్యవసాయ శాఖ అధికారులతో జిల్లాలో చేపడుతున్న ప్రాజెక్టు నిర్మాణ పనుల ప్రగతిపై సమీంచి, పలు సూచనలు జారీ చేశారు. ముందుగా లోయర్ పెన్‌గంగా ప్రాజెక్టు నిర్మాణ పనుల ప్రగతిపై ఇ ఇ అమ్జద్ హుస్సేన్‌ని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనుమతి తప్పనిసరి

ఆదిలాబాద్ రూరల్,అక్టోబర్ 25: జిల్లాలో టపాసుల దుకాణాలను ఏర్పాటు చేసే వ్యాపారస్తులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, లేనట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మిట్ట శ్రీనివాస్ అన్నారు. మంగళవారం స్థానిక పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో జిల్లాలో టపాసుల దుకాణాలను ఏర్పాటు చేసే వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేశారు. దీపావళి పండగ సంధర్భంగా పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా భారీగా టపాసుల దుకాణాలు వెలుస్తుండడం, సరైన జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో భారీ అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండడంతో ముందస్తుగా ఎస్పీ పలు సూచనలు చేశారు.

పంటనష్ట పరిహారం సత్వరమే అందించాలి

న్యాల్‌కల్, అక్టోబర్ 25: అతివృష్టితో పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. మంగళవారం జహీరాబాద్ ప్రాంతంలోని రాయికోడ్, న్యాల్‌కల్ మండలాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. న్యాల్‌కల్ మండలం అత్నూర్ గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలతో ఖరీఫ్ పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లిందన్నారు. పంటనష్టం వాటిల్లిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ ప్రాంతంలో బోరు బావులకు అంతగా అనుకూలం లేనందున ప్రత్యామ్నయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు.

ఆయుష్ వైద్య సేవలు బలోపేతం

సిద్దిపేట, అక్టోబర్ 25 : ఆయూష్ వైద్య విభాగాన్ని మరింత బలోపేతం చేసి ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు ఉండేలా తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటుందని మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ధన్వంతరి జయంతి జాతీయ ఆయుర్వేద దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని టిఎన్జీఓ భవన్‌లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డితో కలసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా అల్లోపతి వైద్యానికి ధీటుగా ఆయుష్ వైద్యాన్ని తీర్చిదిద్దేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

సిద్దిపేటలో వీలైనంత త్వరగా వైద్య కళాశాల

సిద్దిపేట, అక్టోబర్ 25: సిద్దిపేట జిల్లాలో సాధ్యమైనంత త్వరగా మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు కృషి చేస్తామని రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ డా.రమణి అన్నారు. మంగళవారం మెడికల్ కళాశాల ఏర్పాటులో భాగంగా టిఎస్‌ంఎస్‌ఐడిసి చీఫ్ ఇంజనీర్ లక్ష్మారెడ్డి, డిప్యూటి ఇఇ విష్ణుప్రసాద్, శారద, హితేష్, ప్రేరణ, సత్య, డిఎంఅండ్‌హెచ్‌ఓ రామకృష్ణతో కలిసి సిద్దిపేట ఎంసిహెచ్, ఏరియా ఆస్పత్రులను పరిశీలించారు. ఆనంతరం ఆమె మాట్లాడుతూ మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు ఎంసిఐ నిబంధనల ప్రకారం 300బెడ్ల ఆస్పత్రి, కళాశాల సమీపంలో ఉండాలని, సిద్దిపేటలో ప్రస్తుతం 100బెడ్ల దవాఖాన ఉందని, దీన్ని 300బెడ్లుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

Pages