S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైద్యశాఖ అప్రమత్తం

హైదరాబాద్, సెప్టెంబర్ 25: రాష్ట్ర వ్యాప్తంగా ఆసాధారణంగా వర్షాలు కురుస్తున్నందున వైద్య శాఖను అప్రమత్తం చేసినట్టు, వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి లక్ష్మారెడ్డి తెలిపారు. జిల్లాల వారిగా డిఎంహెచ్‌ఓలు సమీక్షలు చేస్తున్నారు. వర్ష తీవ్రతను బట్టి ఆయా ప్రాంతాలవారీగా దానికి తగ్గట్టు సిద్ధమవుతున్నారు. మెదక్ జిల్లా గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, రామాయంపేట, నర్సాపూర్ తదితర ప్రాంతాల్లో వైద్య సహాయంపై అధికారులు చర్చించారు. మందులు, డాక్టర్లు, 104 వాహనాలు సిద్ధంగా ఉంచినట్టు, అవసరమైనచోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.

అష్టదిగ్బంధంలో గద్వాల

గద్వాల, సెప్టెంబర్ 25: నడిగడ్డ అష్టదిగ్బంధం... పోలీసుల పహారాలో దిగ్బంధమైంది. పట్టణమంతా ఆగ్రహ జ్వాలలతో ఉద్యమకారులు టైర్లకు నిప్పంటించి ప్రభుత్వంపై దండయాత్ర చేపట్టారు. జెఎసి ఆధ్వర్యంలో మూడు రోజుల బంద్ విజయవంతమైంది. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ దిగ్బంధమయ్యాయి. జనజీవనం పూర్తిగా స్తంభించి రోడ్లపై ఉద్యమకారులు జిల్లా ఆకాంక్షను ఎలుగెత్తి చాటారు. పట్టణంలోని అయిజ, రాయచూరు, కర్నూలు ప్రధాన రహదారులలో రోడ్లకు ఇరువైపులా భారీ మొద్దులు, ఇనుపకంచె, ముళ్లపొదలను అడ్డంగా వేసి ధర్నా చేపట్టారు. జెఎసి పిలుపు మేరకు అన్ని పార్టీల నేతలు రహదారులపై బైఠాయించి నిరసన తెలిపారు.

పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు అంకురార్పణ

విజయనగరం(టౌన్), సెప్టెంబర్ 25: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు శ్రీపైడితల్లి అమ్మవారి వార్షిక సిరిమాను ఉత్సవాల వేడుకలకు సంప్రదాయ బద్ధంగా పందిరి రాటతో అంకురార్పణ చేసి దేవస్థానం అధికారులు, పూజారు శ్రీకారం చుట్టారు. దశమి ఘడియల్లో అమ్మవారి ప్రధాన దేవాలయం చదురుగుడి, లమ్మవారు బెస్తలకు లభించిన వనంగుడి వద్ద ఆదివారం ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పందిరిరాటకు పసుపు, కుంకుమలు, పూలు అలంకరించి వార్షిక సిరిమాను ఉత్సవాలకు తొలిఘట్టం క్రతువును భక్తుల నడుమ నిర్వహించారు.

దుర్గమ్మకు స్వర్ణమయి కానుకలు

విజయవాడ (ఇంద్రకీలాద్రి), సెప్టెంబర్ 25: ఇంద్రకీలాద్రి అధిష్టాన దేవతగా ఉన్న శ్రీకనకదుర్గమ్మ అనుగ్రహం కోసం విశాఖపట్నానికి చెందిన ఒక భక్తుడు స్వర్ణమయి ఆభరణాలు సమర్పించారు. అమ్మవారి అంతరాలయం, ప్రధాన ద్వారానికి ఉన్న తలుపులకు ఇరువైపుల, గోడలు తదితర వాటిని పూర్తిగా స్వర్ణమయం చేశారు. లోపల గోడలకు ఇరువైపుల సరస్వతీ, లక్ష్మీ చిత్రాలు, అంతరాలయం ద్వారం పైభాగంలో ఉన్న గజలక్ష్మీదేవి తదితర దేవతమూర్తుల చిత్రాలకు స్వర్ణమయి తాపడం చేయించారు. ఇదేవిధంగా ప్రధాన ద్వారం తలుపులకు కూడా బంగారు తాపడం పనులు పూర్తి చేశారు.

గరిష్ఠస్థాయకి శ్రీశైలం జలాశయం

కర్నూలు, సెప్టెంబర్ 25: కృష్ణమ్మ పరవళ్లతో శ్రీశైలం జలాశయం నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టు గేట్లు ఎత్తడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా ఆదివారం రాత్రి 8 గంటల సమయానికి 879.7 అడుగులకు చేరుకుంది. గరిష్ట నీటి నిల్వ 215.8 టిఎంసిలకు గానూ 185.85 టిఎంసిలకు చేరుకుంది.

దాచేపల్లిపై వరాల జల్లు

దాచేపల్లి, సెప్టెంబర్ 25: దాచేపల్లిలో రోడ్లు, డ్రైనేజి వ్యవస్థ సక్రమంగా లేని కారణంగా వెంటవెంటనే వరద నష్టం సంభవిస్తోందని తమ దృష్టికి వచ్చిన నేపథ్యంలో పట్టణంలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి తక్షణం 10 కోట్లు విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. వరద ప్రాంతాల్లో బాధితులను పరామర్శించిన అనంతరం దాచేపల్లి మార్కెట్‌యార్డులో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డు కాంట్రాక్టర్ల మూలంగా దాచేపల్లి నష్టపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. వరద బాధితులకు తక్షణ సహాయం రేపు సాయంత్రంలోగా అందజేస్తామని చెప్పారు.

ప్రకాశం బ్యారేజీకి తగ్గుముఖం పట్టిన వరద

విజయవాడ, సెప్టెంబర్ 25: ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ప్రకాశం బ్యారేజీకి క్రమేణా వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. అయితే నాలుగోరోజైన ఆదివారం కూడా మొత్తం 70గేట్ల ఎత్తివేత కొనసాగుతోంది. రాత్రి 7గంటల సమయానికి మొత్తం గేట్లను రెండు అడుగులమేర పైకి ఎత్తి లక్ష క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం పులిచింతల, ఇతర వాగుల నుంచి కేవలం 80వేల క్యూసెక్కులు మాత్రమే బ్యారేజీకి చేరుతోంది. వరదను దృష్టిలో పెట్టుకుని తొలుత బ్యారేజీ నీటిమట్టాన్ని క్రమేణా తగిస్తూ వచ్చి ప్రస్తుతం వచ్చిన నీటిని నిల్వ చేయటం ప్రారంభించారు.

వైద్యాధికారిపై దాడిచేసి... చొక్కా చింపి...

కదిరి, సెప్టెంబర్ 25 : ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసేందుకు వెళ్లిన డిసిహెచ్‌ఎస్ (జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి) డాక్టర్ రమేశ్‌నాథ్‌పై సిపిఐ నాయకులు నడిరోడ్డుపైనే దాడి చేశారు. ఈ సంఘటన ఆదివారం అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో చోటుచేసుకుంది. రాష్ట్ర వైద్య విధాన పరిషత్ జాయింట్ కమిషనర్ జయచంద్రారెడ్డి పర్యటన నేపథ్యంలో డిసిహెచ్‌ఎస్ రమేశ్ ముందుగానే కదిరి ఆసుపత్రికి వెళ్లారు. జిల్లాలో అంటువ్యాధులు ప్రబలుతున్నా వైద్యాధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే ఆగ్రహంతో సిపిఐ నాయకులు, కార్యకర్తలు జాయింట్ కమిషనర్ పర్యటనను అడ్డుకునేందుకు ఆస్పత్రి వద్దకు వచ్చారు.

ముంపు పాపం ఎవరిది?

గుంటూరు, సెప్టెంబర్ 25: ఒకటి కాదు... రెండు కాదు... దశాబ్దాల కాలంగా గ్రామాలకు గ్రామాలు సెలయేళ్లవుతున్నా ఎవరికీ పట్టదు.. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆధునికీకరణ మంత్రం తెరపైకి వస్తుంది.. ఆనక అటకెక్కుతుంది.. ఎప్పటికప్పుడు వాగులకు వంకపెట్టి చేతులు దులుపుకోవటం రివాజుగా మారుతోంది.. భారీ వర్షాలు, వరదల కారణంగా జరుగుతున్న నష్టానికి శాశ్వత పరిష్కారం లభించటంలేదు. దశాబ్ద కాలం కిందట సంభవించిన ఓగ్ని తుపాను కారణంగా గుంటూరు జిల్లాలో సాగు, మురుగునీటి కాల్వలు ఏకమై వందలాది గ్రామాలను ముంచెత్తాయి.

కోస్తాకు వర్ష సూచన

విశాఖపట్నం, సెప్టెంబర్ 25: విదర్భ నుంచి దక్షిణ తమిళనాడుకు వరకూ ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ఆదివారం కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. సముద్ర ఉపరితలానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు ఆదివారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో చాలా చోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. ఇదే సమయంలో నైరుతి దిశగా గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. గడచిన 24 గంటల్లో చోడవరంలో అత్యధికంగా 11.2 సెంటీమీటర్లు, కొయ్యలగూడెంలో 7 సెం.మీ., వేపాడలో 5.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Pages