S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎమ్మెల్యే భూమాపై రౌడీషీట్ ఎత్తివేతకు రంగం సిద్ధం!

కర్నూలు, సెప్టెంబర్ 25: కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై పోలీసులు నమోదు చేసిన రౌడీషీట్ ఎత్తివేతకు రంగం సిద్ధమైంది. ఆయనపై సుమారు రెండేళ్ల క్రితం పోలీసులు రౌడీషీట్ నమోదు చేశారు. ఆ కేసులో భూమా నాగిరెడ్డి రిమాండుకు కూడా వెళ్లి వచ్చారు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. కాగా ఈ ఏడాది ప్రారంభంలో ఆయన వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తరువాత ఆయనను మంత్రివర్గంలో చేర్చుకుంటారని ప్రచారం జరిగింది.

ఉపాధ్యాయ, పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కసరత్తు

అనంతపురం, సెప్టెంబర్ 25 : ద్వై వార్షిక ఎన్నికల నిర్వహణలో భాగంగా పదవీ కాలం పూర్తవుతున్న ఉపాధ్యాయ(టీచర్), పట్ట్భద్రులు(గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల ప్రక్రియ రాష్ట్రంలో ప్రారంభం కానుంది. 2017 మార్చి 29వ తేదీ నాటికి ఆయా స్థానాల్లో ఎమ్మెల్సీల పదవీ కాలం ముగుస్తుంది. ఆ లోగా ఈ నియోజకవర్గాల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్టోబర్ 1వ తేదీ గ్రాడ్యుయేట్, టీచర్స్ ఓటర్ల నమోదుకు నోటిఫికేషన్ విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది.

అంతా అమ్మవారి దయ

పెదవేగి/ద్వారకాతిరుమల, సెప్టెంబర్ 25 : ఒలింపిక్ క్రీడల్లో భారత్ కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచానికి ఇనుమడింపచేసిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు ఆదివారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం రాట్నాలకుంటలో వేంచేసియున్న శ్రీ రాట్నాలమ్మ అమ్మవారికి, ద్వారకాతిరుమలలో చినవెంకన్నకు విశేష పూజలు నిర్వహించారు. రాట్నాలకుంట చేరుకున్న సింధూకు రాష్ట్ర ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సింధూ భక్తిశ్రద్ధలతో రాట్నాలమ్మ అమ్మవారికి మొక్కు తీర్చుకున్నారు.

రాజమహేంద్రి ఖ్యాతిని ఇనుమడింపజేసిన జిత్‌మోహన్‌మిత్ర

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 25: విభిన్న రంగాల్లో తన ప్రజ్ఞాపాటవాలను చూపిన శ్రీపాద జిత్‌మోహన్ మిత్ర రాజమహేంద్రవరం ఖ్యాతిని ఇనుమడింపజేశారని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చియ్య చౌదరి అన్నారు. రాజమహేంద్రవరంలో నవరస నట సమాఖ్య ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం పౌరులు, గాయకుడు, నటుడు శ్రీపాద జిత్‌మోహన్ మిత్రాకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ఆదివారం రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రంలో ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ఆంధ్రా కిశోర్‌కుమార్‌గా పేరుతెచ్చుకున్న జిత్ మోహన్ మిత్రా ఎంతోమంది కళాకారులను తయారు చేశారన్నారు.

గోదావరి పరవళ్లు

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 25: గోదావరి నది వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది.మరో మూడు రోజుల్లో గోదావరి ఉద్ధృతి పెరగనుందని జల వనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈలోగా అవసరమైన అప్రమత్త చర్యలు చేపట్టేందుకు యంత్రాంగం సిద్ధమైంది. ప్రస్తుతం కాళేశ్వరం వద్ద రెండు మీటర్ల వరకు నీటి మట్టం పెరిగింది. ఇక్కడ పెరిగిన నీటిమట్టం ధవళేశ్వరం వద్దకు చేరాలంటే మరో రెండు రోజులు పడుతుందని అధికారులు అంచనా వేశారు. ఎట్టకేలకు శ్రీరాంసాగర్ రెండు మీటర్లకు పెరిగింది. ఈ నీరంతా గోదావరి నదికి రావాల్సి వుంది.

జిల్లాలో ‘దోమల దండయాత్ర’

కాకినాడ, సెప్టెంబర్ 25: ‘దోమలపై దండయాత్ర’ అనే ప్రభుత్వ నినాదం వినడానికి బాగానే ఉన్నా ఆచరణలో మాత్రం వెక్కిరిస్తున్నట్టు అనిపిస్తోంది. దోమలపై దండయాత్ర పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుమాటెలా ఉన్నా, వాటిపై పోరాడలేక, అలసి, సొలసి, విసిగివేశారిపోతున్న అధికారులను చూస్తే మాత్రం పాపం జాలేస్తోంది. ఒకవైపు దండయాత్రంటూ తిరుగుతున్న అధికారులకు మరోవైపు దోమల మోత చిర్రెత్తేలా చేస్తోంది. జిల్లా కేంద్రం కాకినాడలో పరిస్థితిని గమనిస్తే, తమపై దోమల దండయాత్ర ఎప్పటిలాగే కొనసాగుతోందని, దోమలపై దండయాత్ర అని చెబుతుంటే నవ్వాలో, ఏడ్వాలో అర్ధం కావడం లేదని పలువురు వాపోతున్నారు.

వేదవిద్యను అభ్యసించడం పూర్వజన్మ సుకృతం

తిరుపతి, సెప్టెంబర్ 25: వేద విద్యను అభ్యసించడం పూర్వజన్మ సుకృత ఫలమని, ప్రతి వేద విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ వేద విద్యార్థులకు హితవుపలికారు. ఆదివారం వేద విశ్వవిద్యాలయానికి విచ్చేసిన ఆయన విద్యార్థులతో ముఖాముఖి చర్చించారు. వేదాలను అభ్యసిస్తున్న విధానాన్ని ఆయన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గురువులను, తల్లిదండ్రులను ప్రతి విద్యార్థి గౌరవించాలన్నారు. వేదవిద్యను అభ్యసించడం పూర్వజన్మ సుకృతఫలమని, వెంకన్న పాదాల చెంత ఏర్పాటైన ఈ వేదవిశ్వవిద్యాలయంలో ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

రూ. 30 కోట్లతో పాల ఉత్పత్తుల తయారీకేంద్రం

శ్రీకాళహస్తి, సెప్టెంబర్ 25: శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్లులో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో రూ.30కోట్లతో పాల ఉత్పత్తుల తయారీకేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నట్లు రాష్ట్ర అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వెల్లడించారు. ఆదివారం పాలసహకార సొసైటీ సర్వసభ్య సమావేశం పట్టణంలోని శివమ్ కల్యాణమండపంలో జరిగింది. రైతులు ఎక్కువ మంది హాజరుకాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు సొసైటీ అధ్యక్షుడు మునిరాజా నాయుడు ప్రకటించారు. సమావేశానికి హాజరైన రైతులతో మంత్రి మాట్లాడారు. పాల ఉత్పత్తిలో రాష్ట్రంలో చిత్తూరుజిల్లా ప్రథమస్థానంలో ఉందన్నారు.

తిరుపతి కమాండ్ కంట్రోల్‌ను తనిఖీచేసిన డిజిపి

తిరుపతి, సెప్టెంబర్ 25: రాష్ట్ర డిజిపి సాంబశివరావు ఆదివారం తిరుపతి కమాండ్ కంట్రోల్‌ను తనిఖీచేశారు. కొద్దిరోజుల్లో తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఈ సందర్భంగా డిజిపి సూచించారు. వీలైనంత వరకు సిసి కెమెరాలను అవసరమైన ప్రదేశాలలో ఏర్పాటుచేయాలని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలను సిసి కెమెరాల ద్వారా చూసి పరిష్కరించి, ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే వారిని గుర్తించి వారికి జరిమానా విధించేవిధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ-చలానా, ఆన్‌లైన్ విధానాన్ని పరిశీలించాలని సూచించారు.

అంగరంగ వైభవంగా తెప్పోత్సవం

ఐరాల, సెప్టెంబర్ 25 : స్వయంభు కాణిపాకం వినాయకస్వామి వారి ప్రత్యేక ఉత్సవాల్లో చివరి రోజైన ఆదివారం రాత్రి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విద్యుద్దీపాల కాంతుల నడుమ సర్వాంగ సుందరంగా అలంకరించి తెప్పలపై సిద్ధి బుద్ధి సమేతంగా వినాయకస్వామి వారు విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని తరించారు. ఉదయం మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి చందన అలంకరణ చేశారు. దూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తుల దర్శనానికి అనుమతించారు. రాత్రి సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ అనే్వటి మండపంలో ఉంచి ప్రత్యేక అలంకరణ చేశారు.

Pages