S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోతట్టు ప్రాంతాల్లో నివాసాలు ఎప్పటికైనా ప్రమాదమే

తిరుమల, సెప్టెంబర్ 25: భారీ వర్షాలు పడిన సందర్భంలో వరదనీరు ప్రవహించే లోతట్టు ప్రాంతాల్లో నివాసాలు ఉండటం ప్రజలకు ఎప్పటికైనా ప్రమాదమేనని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం ఆయన తిరుమలకు విచ్చేశారు. ఆయన రాక సందర్భంగా టిటిడి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఇఓ సాంబశివరావు, జెఇఓ శ్రీనివాసరాజు, జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్‌లు గవర్నర్‌కు సాదర స్వాగతం పలికారు. తిరుమల సంప్రదాయాన్ని పాటిస్తూ ఆయన ముందుగా వరాహస్వామి ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. అంతకుమునుపు గవర్నర్ శ్రీవారి పుష్కరిణికి వెళ్లి పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేసుకున్నారు.

జిల్లాకు చేరిన మంజునాథ్ కమిటీ..

కడప,సెప్టెంబర్ 25: కాపులు (బలిజలు)ను బిసి జాబితాలో చేర్చేందుకు రాష్ట్రప్రభుత్వం ఏర్పాటుచేసిన మంజునాథ్ కమిటీ ఆదివారం జిల్లాలోని స్టేట్‌గెస్ట్ హౌస్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా మంజునాథ్ కమిటీకి అధికారులు, బిసి సంఘం నేతలు స్వాగతం పలికారు. కాపు నేతలు కూడా లోలోపల కలిసినట్లు తెలిసింది. సోమవారం మంజునాథ్ కమిటీ ఎదుట బిసి సంఘాలు, కాపు సంఘం తమ తమ వాదనలు విన్పించాలని పల్స్‌సర్వేను చేస్తున్నామని కమిషన్ సర్వే అనంతరం రాజ్యాంగ పరంగా ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని కమిటీ అధికారులు పేర్కొన్నారు.

కడప గడపకు కంఠాభరణం గండికోట..

కడప,(కల్చరల్)సెప్టెంబర్ 25: రాయలసీమకు నడిబొడ్డున ఉన్న కడప జిల్లా పలు అందమైన పర్యాటక ప్రదేశాల సమహారంగా బాసిల్లుతోంది. చరిత్రలో నిలిచిపోయిన సాక్ష్యానికి చెక్కు చెదరని కట్టడాలను చూస్తే మనస్సు కదిలిస్తుంది. కథలు వింటే వళ్లు పులకరిస్తుంది. కడప అంటే కక్షల కడప అని పిలువడం బాధాకరం. కాని జిల్లాలో ప్రతి ప్రాం తానికి, ప్రతి కట్టడానికి ఓ కథ ఉంది. కళలకు, కవులకు, కళాకారులకు, చిత్రకారులకు కొదవ లేని జిల్లాలో వారు సృష్టించిన అద్భుతాలను చూస్తే ఈ జిల్లాపై ఉన్న అపవాదు ఎక్కడా కనపడదు అనేది నగ్న సత్యం. కొండ కోనల నడుమ రమణీయ దృశ్యాలతో పచ్చని అడవులతో చారిత్రాత్మక కోటలతో ఆకట్టుకునే అందాలు కడప సొంతం.

ఎమ్మెల్యే రాచమల్లుకు అరెస్టు వారెంట్..

ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 25: ప్రొద్దుటూరు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్‌రెడ్డికి ఆదివారం స్థానిక వన్‌టౌన్ పోలీసులు అరెస్టు వారెంట్ జారీ చేశారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మదర్‌థెరిస్సా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ అధికారుల నుంచి, ఆసుపత్రి అనివృద్ధి కమిటీ నుంచి కాని ఎటువంటి అనుమతులు లేకుండా ఎమ్మెల్యే రాచమల్లు విగ్రహాన్ని ఆవిష్కరించారని ఈ మేరకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీనివాసులరెడ్డి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రాచమల్లుకు అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

డిసిహెచ్‌ఎస్‌పై దాడి ఉన్మాద చర్య

అనంతపురం, సెప్టెంబర్ 25 : కదిరి ప్రభుత్వాస్పత్రిలో డిసిహెచ్‌ఎస్ రమేష్‌నాథ్‌పై సిపిఐ నాయకులు, కార్యకర్తలు దాడి చేయడం ఉన్మాద చర్య అని ఎస్పీ రాజశేఖరబాబు అన్నారు. ఈకేసుపై ఎస్పీ సీరియస్ అయ్యారు. ఇందులో భాగంగా నిందితులపై 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ప్రధాన నిందితుల్లో ఒకరైన వేమయ్యయాదవ్‌తో పాటు ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నిందితులపై హత్యాయత్నం, ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కల్పించడం, దాడి చేయడం, ఎస్సీ, ఎస్టీ చట్టం తదితర అభియోగాలకు సంబంధించిన అండర్ సెక్షన్ 147, 148, 341, 323, 353, 332, 307, 506 ఆర్‌బైడబ్లు, 149 ఐపిసి సెక్షన్లు విధించి కేసులు నమోదు చేశారు.

కదిరి ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

కదిరి, సెప్టెంబర్ 25: స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసేందుకు వచ్చిన జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా. రమేష్‌నాథ్‌పై సిపిఐ నాయకులు ఆదివారం ఆసుపత్రి ఎదుట నడి రోడ్డుపై దాడి చేసి చొక్కాను చింపివేశారు. దాడికి నిరసనగా ప్రభుత్వ వైద్యులు విధులు బహిష్కరించగా సిబ్బంది ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. జిల్లా అధికారిపై దాడికి నిరసనగా నేడు డివిజన్ వ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేసి ధర్నా నిర్వహిస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోషియేషన్ (ఐఎంఎ) నాయకులు పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా వున్నా యి...

వడాముదం కాయలు తిని 10 మంది విద్యార్థులకు అశ్వస్థత

కదిరి, సెప్టెంబర్ 25 : నంబులపూలకుంట మండలం మనె్నంవారిపల్లిలో వడాముదం(ఎర్రి ఆముదం) కాయలు తిని పది మంది విద్యార్థులు అశ్వస్థతకు గురైన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు తాము వ్యవసాయ పనుల నిమిత్తం పొలాల్లోకి వెళ్ళగా ఆదివారం సెలవు దినం కావడంతో తమ పిల్లలు నాగేంద్రకుమార్, గగన్ కుమార్, ఆంజనేయులు, సురేష్, వంశీకృష్ణ, రామయ్య, బాలాజి, భూమిక, మల్లీశ్వరి, కమలాకర్‌లు ఊరి మధ్యలో వున్న ఎర్రి ఆముదం కాయలు తిన్నారన్నారు. సాయంత్రం నుంచి పిల్లలకు విరోచనాలు, వాంతులు కావడంతో వారిని కదిరి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

పల్నాడులో 200 టిఎంసిల నీటి నిల్వకు ప్రణాళిక

గుంటూరు, సెప్టెంబర్ 25: పల్నాడు ప్రాంతంలో 200 టిఎంసిల నీటి నిల్వకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. గురజాల నియోజకవర్గంలో వరదలకు నష్టపోయిన పంటలను పరిశీలించిన అనంతరం సిఎం చంద్రబాబు ఈ ప్రాంతంలో రిజర్వాయర్ ఆవశ్యకతను వివరించారని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞం పేరిట పందికొక్కుల్లా దోచుకు తిన్నారని, ప్రభుత్వం అన్ని అంశాలలో పారదర్శకంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.

పండిట్ దీన్‌దయాళ్‌కు ఘన నివాళులు

ఖమ్మం(జమ్మిబండ), సెప్టెంబర్ 25: పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను ఆదివారం బిజెపి నగర శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షుడు దీన్‌దయాళ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మాజీ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీ్ధర్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తికే వనె్నతెచ్చిన దీన్‌దయాళ్‌ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, శ్రీనివాస్, సైదావళి, బాబు, నాగమణి, ప్రసాద్, వెంకటేశ్వర్లు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
జూలూరుపాడులో...

కొత్త జిల్లాకు నదీసోయగాలు

దమ్మపేట, సెప్టెంబర్ 25: నూతనంగా ఆవిర్భవించనున్న కొత్తగూడెం జిల్లా నదీ సోయగాలతో పర్యాటక శోభను సంతరించుకుంటుంది. దక్షిణ గంగగా పేరొందిన గోదావరి నది జిల్లాలో దాదాపు 140 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. కినె్నరసాని, తాలిపేరు, పెద్దవాగు, పాలెంవాగు తదితర గోదావరి ఉపనదులు జిల్లాలో ప్రవహిస్తున్నాయి. ఇవికాక 100కు పైగా సంఖ్యలో వాగులు, వంకలు ఏడాదిలో సగం రోజులు ప్రవహిస్తాయి. ప్రధానంగా గోదావరి వేలాది క్యూసెక్కుల నీటితో మూడు కాలాల్లోనూ ప్రవాహం సాగుతుంది. ప్రధాన ఉపనదులపై సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి ఉన్నాయి.

Pages