S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరవుతీరా వానలు

హైదరాబాద్, సెప్టెంబర్ 25: తెలంగాణలో పండుగ ముందే వచ్చింది. కరవుతీరా వానలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, బావులు, వంకలు, వాగులు నిండిపోయాయి. భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతోపాటు, తెలంగాణ పీఠభూమిపై కురుస్తున్న భారీ వర్షాలు కరవు తీర్చేసేలాగే కనిపిస్తోంది. 16ఏళ్ల తరువాత సింగూరు ప్రాజెక్టు పూర్తిగా నిండటాన్ని చూస్తే, ఏపాటి వర్షాలు కురుస్తున్నాయో అంచనా వేసుకోవచ్చు.

పే..ద్ద టెలిస్కోప్!

బీజింగ్, సెప్టెంబర్ 25: విశ్వంలో జీవుల అనే్వషణకు చైనా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రయత్నాన్ని ప్రారంభించింది. వందలాది వ్యోమగాములు, అంతరిక్ష పరిశోధక విద్యార్థులు, ఆసక్తిపరుల సాక్షిగా అతి పెద్ద టెలిస్కోప్ పరీక్షను ప్రారంభించింది. ఇది అలాంటిలాంటి టెలిస్కోప్ కాదు. 30 ఫుట్‌బాల్ మైదానాల విస్తీర్ణం ఎంత ఉందో.. ఈ టెలిస్కోప్ విస్తీర్ణం అంతది. మొత్తం 4450 పానెళ్లతో 500మీటర్ల వ్యాసంతో తయారు చేసిన రిఫ్లెక్టర్‌తో రోదసిలోని ఇతర గ్రహాల్లో జీవుల అనే్వషణకు శ్రీకారం చుట్టింది. ఆగ్నేయ చైనాలోని గిఝు ప్రావిన్స్‌లోని పింగ్‌టాంగ్ కౌంటీలోని కర్స్ట్ లోయలో ఈ టెలిస్కోప్‌ను ఏర్పాటు చేశారు.

అశ్విన్ ‘డబుల్ సెంచరీ’!

కాన్పూర్, సెప్టెంబర్ 25: భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్‌లో 200వ వికెట్ల మైలురాయిని చేరాడు. టీమిండియా ఆడుతున్న 500వ టెస్టులో అతను ఈ ఫీట్‌ను అందుకోవడం విశేషం. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ నాలుగో రోజు ఆటలో అశ్విన్ విజృంభణకు భారత్‌కు లాభించింది. మ్యాచ్‌పై పట్టు సంపాదించేందుకు ఉపయోగపడింది. మొదటి ఇన్నింగ్స్‌లో 318 పరుగులు చేసిన భారత్, ఆతర్వాత కివీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులకే ఆలౌట్ చేసి, 56 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన విషయం తెలిసిందే. ఈ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించి, మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టపోయి 159 పరుగులు చేసింది.

టైటిల్‌ను సాధించిన ప్రపంచ మాజీ నంబర్ వన్ కరోలిన్

టోక్యోలో జరిగిన పాన్ పసిఫిక్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్‌ను సాధించిన ప్రపంచ మాజీ నంబర్ వన్ కరోలిన్ వొజ్నియాకి. ఫైనల్‌లో ఆమె 7-5, 6-3 స్కోరుతో జపాన్ క్రీడాకారిణి నవోమీ ఒసాకాను ఓడించింది. 2015 ఫిబ్రవరి తర్వాత వొజ్నియాకి ఒక టైటిల్‌ను అందుకోవడం ఇదే మొదటిసారి

కొన్ని సిఫార్సులు కఠినంగా ఉన్నాయ్

కాన్పూర్, సెప్టెంబర్ 25: లోధా కమిటీ ఇచ్చిన నివేదికలో పేర్కొన్న కొన్ని సిఫార్సులు చాలా కఠినంగా ఉన్నాయని, వాటిని అమలు చేయడం వల్ల ఇబ్బందులే తప్ప మేలు జరగదని భారత లెజెండరీ క్రికెటర్లు, మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ స్పష్టం చేశారు. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ సందర్భంగా ఓ టీవీ చానెల్ నిర్వహించిన చర్చలో కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌తో మాట్లాడుతూ లోధా కమిటీ చేసిన సిఫార్సుల్లో కొన్ని ఉపయోగపడతాయని, అయితే, మరికొన్నింటిని అమలు చేయడం కష్టమని అన్నారు.

ఐఒఎ అధ్యక్షుడు రామచంద్రన్‌కు ఒసిఎ మెరిట్ అవార్డు

డా నాంగ్ (వియత్నాం), సెప్టెంబర్ 25: భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) అధ్యక్షుడు రామచందన్‌కు ఆసియా ఒలింపిక్ మండలి (ఒసిఎ) మెరిట్ అవార్డు లభించింది. ఆసియా ఖండంలో క్రీడాభివృద్ధికి చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ఇచ్చినట్టు ఒసిఎ అధ్యక్షుడు షేక్ అహ్మద్ అల్ ఫహాద్ అల్ అహ్మద్ అల్ సబా అన్నాడు. కాగా, ఇక్కడ జరుగుతున్న ఒసిఎ సాధారణ సమావేశంలో తనకు అరుదైన పురస్కారం లభించడం పట్ల రామచంద్రన్ హర్షం వ్యక్తం చేశాడు. ఈ అవార్డుతో తన బాధ్యత మరింత పెరిగిందని చెప్పాడు.

బిఎఫ్‌ఐ అధ్యక్షుడిగా అభయ్ ఎన్నిక

ముంబయి, సెప్టెంబర్ 25: భారత బాక్సింగ్ రంగంలో సుమారు నాలుగేళ్లుగా కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడింది. కొత్తగా ఏర్పాటు చేసిన భారత బాక్సింగ్ సమాఖ్య (బిఎఫ్‌ఐ)కి ఎన్నికలు జరగ్గా, అధ్యక్షుడిగా ప్రముఖ వ్యాపారవేత్త అభయ్ సింగ్ ఎన్నికయ్యాడు. అతనికి 49 ఓట్లురాగా, మరో అభ్యర్థి రోహిత్ జైనేంద్ర జైన్‌కు 15 ఓట్లు దక్కాయి. స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ చైర్మన్/ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న అభయ్ ఎన్నిక ఖాయమని ఓటింగ్‌కు ముందుగానే వార్తలు వచ్చాయి. అనుకున్న విధంగానే అతను విజయ ఢంకా మోయించాడు. ప్రధాన కార్యదర్శి జై కోహ్లీ మరోసారి ఎన్నికయ్యాడు.

తెల్ల ఏనుగు రూనీ!

లండన్, సెప్టెంబర్ 25: మాంచెస్టర్ యునైటెడ్ జట్టుకు ఇంగ్లాండ్ సాకర్ జట్టు కెప్టెన్ వేన్ రూనీ తెల్ల ఏనుగులా మారాడు. అతనిని తుది జట్టులో కొనసాగించాలో, వద్దో తెలియక జట్టు కోచ్ జోస్ మోరిన్హో తల పట్టుకుంటున్నాడు. ప్రీమియర్ లీగ్ చాంపియన్‌షిప్స్‌లో భాగంగా లీసెస్టర్‌తో జరిగిన మ్యాచ్‌లో ధైర్యం చేసి రోనీని తప్పించాడు. ఆ మ్యాచ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ 4-1 తేడాతో గెలిచింది కాబట్టి సరిపోయింది. లేకపోతే, రోనీ లేనందుకే మ్యాచ్‌ని పోగొట్టుకుందన్న విమర్శలు మోరిన్హోకు తప్పేవికావు. ఎంతో ధైర్యం చేస్తేగానీ రూనీపై వేటు వేయడం సాధ్యం కాదు.

పాకిస్తాన్‌కు శృంగభంగం

పాకిస్తాన్ ప్రజలు బీభత్సకాండను ప్రోత్సహిస్తున్న తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విప్లవించే రోజులు సమీపిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన మరో అంతర్జాతీయ ప్రకంపనం... కేరళ రాష్ట్రంలోని కోఝికోడ్‌లో భారతీయ జనతా పార్టీ ‘జాతీయ ప్రతినిధి మండలి’ సమావేశాల సందర్భంగా ఏర్పాటైన సార్వజనిక సభలో శనివారం సాయంత్రం నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ప్రభుత్వంపట్ల ఆవిష్కృతవౌతున్న నిరసన దృశ్యాలకు అద్దం... పాకిస్తాన్ ప్రభుత్వ వికృత బీభత్స జిహాదీ స్వరూపం ఈ అద్దంలో మరోసారి కన్పించింది.

విచిత్రంగా చిక్కుకుపోయిన బిజెపి

రాజకీయాలు ఒక్కోసారి అనూహ్యమైన రీతిలో చిత్రమైన మలుపులు తిరుగుతుంటాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా వివాదపు సుడిగుండంలో బిజెపి చిక్కుకోవడం అటువంటిదే. ఆ అంశంపై బిజెపి రాష్ట్ర నాయకులు, కేంద్ర నాయకులు ఎవరో ఒకరు ఇంచుమించు ప్రతిరోజు సంజాయిషీలు ఇవ్వవలసి వస్తున్నది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అయితే అక్షరాలా సతమతమవుతున్నారు. తనను చూసి ఒక్కోసారి అయ్యోపాపం అనిపిస్తున్నది. వాస్తవానికి ఆయన హోదాగురించి ఇస్తున్న వివరణలో సహేతుకత చాలా ఉంది. గత పార్లమెంటు సమావేశాలలో రాజ్యసభ చర్చలో పాల్గొం టూ అంతకుముందు చెప్పని విషయాలు కొన్ని వెల్లడించారాయన.

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)

Pages