S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నేడు పరీక్ష

హైదరాబాద్, సెప్టెంబర్ 24: తెలంగాణ రాష్ట్రంలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల రిక్రూట్‌మెంట్‌కు ఎంపిక పరీక్షను ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్నట్టు పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ చెప్పారు. 251 పోస్టులకు 563 దరఖాస్తులు వచ్చాయని, వారికోసం హైదరాబాద్‌లో మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జి నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్, అదే కాలేజీలో సిఎస్‌ఇ బ్లాక్, కూకట్‌పల్లిలోని విజయసాయి టవర్స్‌లో గల ఎడ్యుసర్జ్ యూనిట్ నెంబర్ 604లోనూ ఈ ఎంపిక పరీక్ష నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.

చివరి ప్రయత్నం కావాలి

పనాజి, సెప్టెంబర్ 24: రెండు దేశాలూ అణ్వస్త్రాలను కలిగి ఉన్నందున భారత్‌కు పాకిస్తాన్‌తో యుద్ధం అనేది చివరి ప్రత్యామ్నాయం కావాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సూచించారు. కాశ్మీర్ వివాదం విషయంలో పాకిస్తాన్‌పై ఒత్తిడి తేవడానికి భారత్ అన్ని రకాలుగా కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. శనివారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న దిగ్విజయ్ సింగ్ విడిగా విలేఖరులతో మాట్లాడుతూ బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని ప్రశ్నించారు.

పాక్ ఏకాకి అయింది

ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 24: ఐక్యరాజ్య సమితిలో కాశ్మీర్‌ను అంతర్జాతీయ సమస్య చేయడానికి పాకిస్తాన్ నెలలుగా చేసిన ప్రయత్నాలకు ఐరాసలో ప్రపంచ దేశాలనుంచి ఎలాంటి ప్రతిస్పందనా లభించలేదని, పెరిగిపోతున్న ఉగ్రవాదంపైనే ప్రపంచ దేశాలన్నీ దృష్టిపెట్టాయని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ అన్నారు. భారత దేశం ఎదుర్కొంటున్న ఉగ్రవాదానికే ప్రపంచ దేశాలు ప్రతిధ్వనించాయే తప్ప పాక్ ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించిన అంశంపై కాదని ఆయన అన్నారు.

కాశ్మీర్‌కు ప్రతిచర్యే ‘ఉరీ’

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 24: జమ్మూ, కాశ్మీర్‌లోని ఉరీలో ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్‌పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌లో పరిస్థితులకు ప్రతి చర్యగానే ఉరీ ఘటన జరిగి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం న్యూయార్క్‌నుంచి స్వదేశానికి తిరిగివెళ్తూ షరీఫ్ శుక్రవారం లండన్‌లో ఆగారు. అక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, భారత్‌పై ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్‌లో ప్రభుత్వాలు పాల్పడుతున్న దమనకాండకు ప్రతి చర్యగా బాధిత ప్రజలు, మృతుల బంధువులు ఉరీ దాడి జరిపి ఉండవచ్చని ఆయన అన్నారు.

త్రివిధ దళాధిపతులతో ప్రధాని భేటీ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: త్రివిధ దళాధిపతులు శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్, వైమానిక దళ ప్రధానాదికారి అరుప్ రాహా, నౌకాదళ ఉప ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ కెపి సింగ్‌లు 7, లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా నగరంలో లేక పోవడంతో ఆయన ఈ సమావేశానికి రాలేదు. జమ్మూ, కాశ్మీర్‌లోని ఉరీలో సైనిక స్థావరంపై ఇటీవలి ఉగ్రవాద దాడుల నేపథ్యంలో త్రివిధ దళాల అధిపతులు ప్రధానిని కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే రక్షణ శాఖ వర్గాలు మాత్రం ఇది రొటీన్ సమావేశమేనని అంటున్నాయి.

పిఓకెలో దుర్ఘటన..

ముజఫరాబాద్, సెప్టెంబర్ 24: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఒక మినీ బస్సు నదిలో పడిపోయిన సంఘటనలో 23 మంది మరణించారు. ముజఫరాబాద్‌కు 45 కి.మీ దూరంలో శుక్రవారంనాడు ఈ ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి 100 మీటర్ల కిందనున్న నదిలో పడిపోయిందని స్థానిక అధికారులు తెలిపారు. బస్సుల్లో ప్రయాణిస్తున్న వారిలో 23 మంది చనిపోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని వారు తెలిపారు. నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో మృతదేహాలు గాలింపు ఇబ్బందిగా తయారైందని, ప్రస్తుతానికి మూడు మృతదేహాలను వెలికి తీయగలిగామని తెలిపారు.
మినీ బస్సు నదిలో పడిపోయన ప్రాంతంలో సహాయక చర్యలు చేపడుతున్న పాక్ భద్రతా సిబ్బంది

ఉజ్జయినీలో రోడ్డు ప్రమాదం

ఉజ్జయినీ (ఎంపీ), సెప్టెంబర్ 24: ఉజ్జయినీ సమీపంలో శనివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతిచెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతులంతా కూలి పని చేసుకునేవారే. దేవాస్-ఉజ్జయినీ రోడ్డులో చందేసారా గ్రామానికి సమీపంలో ఎదురెదురుగా వస్తున్న జీపు-ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని ఎస్‌పి మనోహర్ వర్మ తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ 19 మందిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సోయా బీన్స్ లోడుతో ఉజ్జయినీ వెళుతున్న ట్రక్కు ఎదురుగా ప్రయాణికులతో వస్తున్న జీపును ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు.

సిటిబిటిని అమలు చేయాలి

పనాజి, సెప్టెంబర్ 24: రెండు దేశాలూ అణ్వస్త్రాలను కలిగి ఉన్నందున భారత్‌కు పాకిస్తాన్‌తో యుద్ధం అనేది చివరి ప్రత్యామ్నాయం కావాలని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సూచించారు. కాశ్మీర్ వివాదం విషయంలో పాకిస్తాన్‌పై ఒత్తిడి తేవడానికి భారత్ అన్ని రకాలుగా కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. శనివారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న దిగ్విజయ్ సింగ్ విడిగా విలేఖరులతో మాట్లాడుతూ బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని ప్రశ్నించారు.

పాక్‌కు చైనా అండ?

లాహోర్, సెప్టెంబర్ 24: పాకిస్తాన్‌పై ఒకవేళ ఎవరైనా బయటివారు దాడి చేసినట్లయితే తమ పూర్తి మద్దతు ఉంటుందని చైనా ఆ దేశానికి హామీ ఇచ్చింది. అంతేకాదు కాశ్మీర్ విషయంలో పాక్ వైఖరిని సైతం చైనా సమర్థించిందని పాక్ మీడియా కథనం పేర్కొంది. లాహోర్‌లో చైనా కాన్సుల్ జనరల్ యు బోరేన్ శుక్రవారం పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి షాబాజ్ షరీఫ్‌తో భేటీ అయిన సందర్భంగా ఈ హామీ ఇచ్చినట్లు పాక్ దినపత్రిక ‘డాన్’ తెలిపింది. ‘ఒక వేళ బయటివారెవరైనా దాడి చేసినట్లయితే మా దేశం పాక్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తుంది’ అని యు బోరేన్ అన్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటన పేర్కొంది.

భారతీయ సినిమాలను నిషేధించండి!

లాహోర్, సెప్టెంబర్ 24: కాశ్మీర్ సమస్య పరిష్కారమయ్యే దాకా పాకిస్తాన్‌లో భారతీయ సినిమాలపై నిషేధం విధించాలని కోరుతూ ఓ పిటిషన్ లాహోర్ హైకోర్టులో దాఖలయింది. అజర్ సాదిక్ అనే అడ్వకేట్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. భారత సైన్యం కాశ్మీర్‌లో అకృత్యాలకు పాల్పడుతోందని, స్థానిక థియేటర్లలో భారతీయ సినిమాలను ప్రదర్శించడానికి పాక్ ప్రభుత్వం అనుమతిస్తోందని, ఈ చర్య కాశ్మీరీల మనోభావాలనే కాకుండా పాక్ ప్రజల మనోభావాలను సైతం దెబ్బతీయడమేనని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

Pages