S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా షాపింగ్ మాల్‌లో కాల్పులు

లాస్ ఏంజెలిస్, సెప్టెంబర్ 24: వాషింగ్టన్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఓ పురుషుడు ఉన్నారు. మహిళలకు సంఘటనా స్థలంలోనే చనిపోగా, చికిత్స పొందుతూ మరొక వ్యక్తి మృతి చెందాడు. కాస్కాడే మాల్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. కాల్పుల ఘటన జరిగిన వెంటనే పోలీసులు హుటాహుటిన మాల్‌కు చేరుకుని దుండగుడి కోసం గాలింపుచేపట్టారు. నార్త్ సీట్లేకు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న బుర్లింగ్టన్‌లో కాల్పులు చోటుచేసుకున్నాయని పోలీసు అధికారి మార్క్ ఫ్రాన్సిస్ వెల్లడించారు. షాపింగ్ మాల్‌లోని మేకప్ రూంలో జరిగిన కాల్పుల్లో నలుగురు మహిళలు మృతి చెందారు.

ఉత్తర కరోలినాలో మళ్లీ ఉద్రిక్తత

షార్లొటే, సెప్టెంబర్ 24: ఉత్తర కరోలినా పట్టణం షార్లోట్‌లో పోలీసుల కాల్పుల్లో మరణించిన నల్లజాతీయుడు ఖైత్ లామోంట్ స్కాట్ కేసు కొత్త మలుపు తిరిగింది. పోలీసులు కాల్పులకు సంబంధించి సెల్‌ఫోన్ కెమెరా వీడియోను అతడి కుటుంబ సభ్యులు విడుదల చేయడంతో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తన భర్తది ముమ్మాటికీ ఎన్‌కౌంటరేనని, పోలీసులే దారుణంగా కాల్చిచంపారని మృతుడి భార్య రాకియా ఆరోపించారు. ఎంఎస్‌ఎన్‌బిసి చానల్‌లో ప్రచారం చేసిన వీడియోలో పోలీసుల దాష్టీకరం కళ్లకు కట్టినట్టు ఉంది. స్కాట్‌వద్ద ఎలాంటి ఆయధం లేకపోయినా పోలీసు అధికారి తుపాకీ కింద పడేయాలంటూ పదేపదే హెచ్చరించాడు.

ఆఫ్రికా-అమెరికా మ్యూజియం ప్రారంభించిన ఒబామా

వాషింగ్టన్, సెప్టెంబర్ 24: ఆఫ్రికన్ అమెరిన్ చరిత్ర, సంస్కృతి ప్రపంచానికి తెలియాల్సి ఉందని అధ్యక్షుడు బరాక్ ఒబామా పిలుపునిచ్చారు. వాషింగ్టన్‌లోని నేషనల్ మాల్‌లో ఏర్పాటు చేసిన స్మిత్‌సోనియా ఆఫ్రికన్ అమెరికన్ మ్యూజియంను శనివారం ఆయన ప్రారంభించారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ఈ మ్యూజియం ప్రారంభించిన ఒబామా ఇది మనందరి జీవితాల గురించి తెలుపుతుంది అన్నారు. ప్రముఖుల గురించే కాకుండా అందరికీ సంబంధించి విషయాలు మ్యూజియంలో చోటుచేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. హారియరెడ్ టూమేన్, మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్, మహ్మద్ అలీ వంటి మహనీయులకు సంబంధించి చరిత్ర అందుబాటులో ఉంచారు.

కరాచీ షోకు వెళ్లను

టీవీ షోలు, బాలీవుడ్ సినిమాల్లో నటించి కమెడియన్‌గా గుర్తింపు పొందిన రాజు శ్రీవాత్సవ్ ఉరీ దాడులకు నిరసనగా తన కరాచీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. పాకిస్తాన్‌లో అతడి షోలకు మంచి ఆదరణ ఉంది. త్వరలో అక్కడ కొన్ని వినోద కార్యక్రమాల్లో రాజు పాల్గొనాల్సి ఉంది. ఇటీవల కాశ్మీర్‌లో ఉరీ సెక్టార్‌లో భారత సైనిక శిబిరంపై తీవ్రవాదులు చేసి 18మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో పర్యటిస్తూ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న పాకిస్తాన్ నటీనటులు, కళాకారులను దేశం విడిచివెళ్లాలని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన, శివసేన ఆల్టిమేటం జారీ చేశాయి.

నాలాలు మింగేశారు

హైదరాబాద్, సెప్టెంబర్ 24: రాష్టవ్య్రాప్తంగా వర్షాలు కురవడం సంతోషకరమని, వీటితో రెండేళ్లపాటు తెలంగాణలో కరువనేది ఉండదని సిఎం కె చంద్రశేఖర్ రావు తెలిపారు. హైదరాబాద్‌లో అసాధారణ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయన్నారు. నాలాల ఆక్రమణలు, చెరువుల్లోని భూముల్లో నిర్మాణాల వల్ల ముంపు పాలయ్యాయని చెప్పారు. హైదరాబాద్‌లో నాలాలపై 28వేల అక్రమ కట్టడాలున్నట్టు గుర్తించామని, వర్షాలు తగ్గిన తరువాత నాలాలపై ఉన్న నిర్మాణాలను కూల్చివేయనున్నట్టు తెలిపారు. నాలాలపై ప్రభుత్వ భవనాలూ నిర్మించారన్నారు. నాలాలపై ఇళ్లు నిర్మించుకున్న వారిలో పేదలుంటే వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించనున్నట్టు చెప్పారు.

గోదావరికి భారీ వరద

హైదరాబాద్ : మరఠ్వాడాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, దీనివల్ల గోదావరికి వరదొచ్చే ప్రమాదముందని సిఎం కెసిఆర్ హెచ్చరించారు. గోదావరి పరీవాహక ప్రాంత జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అప్రమత్తం కావాలని ఆదేశాలిచ్చామన్నారు. అధికారుల సెలవులు రద్దు చేసి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అప్రమత్తం చేశామన్నారు. ప్రస్తుత వరద నష్టంపై రెండు మూడు రోజుల్లో కేంద్రానికి నివేదిక పంపి సాయం కోరతామన్నారు. మిషన్ కాకతీయ మంచి ఫలితాలు ఇస్తోందని, వర్షాల వల్ల విద్యుత్ సమస్య తలెత్తలేదన్నారు. మిషన్ కాకతీయ కింద చేపట్టిన చెరువులు నిండాయన్నారు.

వరద ముంపు.. వాన ముప్పు

తెలంగాణ చిగురుటాకులా వణుకుతోంది. భయపెట్టేంతగా కురుస్తున్న కుండపోత ‘కొంప’ కొల్లేరు చేస్తుంటే, మరో ఐదు రోజుల అతి భారీ వర్షాలు ఎలాంటి ఉపద్రవం తెస్తాయోనన్న ఆందోళన పెరుగుతోంది. శనివారంనాటి వర్షాలకు రాష్ట్రంలో నలుగురు మృతిచెందితే, ఏడుగురు గల్లంతయ్యారు. వానదెబ్బకు జనం అల్లాడుతుంటే, ఎగువన కురిసిన వానతో గోదావరి వరద పెరుగుతోంది. దీంతో పరీవాహక జిల్లాల్లో హై-అలర్ట్ ప్రకటించారు. శతాబ్దం క్రితంనాటి రికార్డును బద్దలుకొడుతూ ఆర్మూర్‌లో శనివారం 39 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం వర్షాల తీవ్రతను తేటతెల్లం చేస్తోంది. శనివారం జంట నగరాలకు కొంత తెరపి ఇవ్వడంతో, ముంపునకు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలు మొదలయ్యాయి.

కుంభవృష్టే!

హైదరాబాద్, సెప్టెంబర్ 24: ఉత్తర తెలంగాణ జిల్లాలను అతిభారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో గత 24 గంటల్లో కుంభవృష్టి కురిసింది. గతంలో లేని విధంగా ఆర్మూర్‌లో 39 సెంటీమీటర్లు, మద్నూర్, రెంజల్, బోధన్‌లలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వ దృష్టి నిజామాబాద్ జిల్లాపై కేంద్రీకృతమైంది. మరో మూడు రోజుల పాటు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించడంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.

రెంటికీ చెడ్డ రేవడి

హైదరాబాద్, సెప్టెంబర్ 24: తెలంగాణలో నిర్వహించిన ఎమ్సెట్-3లో అర్హత సాధించిన విద్యార్ధుల్లో 95 శాతం మందికి మెడికల్, డెంటల్ సీట్లు రాకపోగా, వేరే ఏ ఇతర కోర్సుల్లో చేరేందుకు కూడా వీలు లేకపోవడంతో వారి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి మాదిరి మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఎమ్సెట్-2 ద్వారా అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ , బయోటెక్నాలజీ , వెటర్నరీ సీట్లను భర్తీ చేస్తోంది. దానికి దరఖాస్తు గడువు ఎమ్సెట్-3 ఫలితాలు రాకముందే ముగిసింది.

తస్మాత్... జాగ్రత్త!

ఏలూరు, సెప్టెంబర్ 24: ‘ఇప్పుడు ఎక్కడ చూసినా పిల్లలంతా స్మార్ట్ఫోన్లతో దర్శనమిస్తున్నారు. అయితే ఒక్క దోమ కుడితే అందరూ అనారోగ్యంతో పడుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండకపోతే జీవితాలు ఇబ్బందికరంగా మారతాయి’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. పరిసరాల పరిశుభ్రతపై అందరికీ చైతన్యం రావాలని, పిల్లలు కూడా బాధ్యత తీసుకుని దోమలు పెరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

Pages