S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి-2 కోసం ఎదురుచూస్తున్నా

మిస్టర్ కూల్ అని అందరిచేత ముద్దుగా పిలిపించేకునే టీమ్ ఇండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని హైదరాబాద్‌లో హంగామా చేశారు. ఆయన జీవిత కథ ఆధారంగా వస్తున్న ‘ఎంఎస్ ధోని’ (ద అన్‌టోల్డ్ స్టోరీ). చిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్ ఆడియో విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ధోని రావడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఇక్కడి బిర్యానీ గుర్తుకు వస్తుందని, తొలిసారిగా ఇక్కడ క్రికెట్ ఆడడానికి వచ్చినప్పుడు బిర్యానీ రుచి చూశానని తెలిపారు.

రామ్‌కు సరిపోయే హైపర్

14రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ కథానాయకుడిగా రామ్ ఆచంట, గో పీచంద్ ఆచంట, అనీల్ సుంకర రూ పొందించిన ‘హైపర్’ (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). ఈ చిత్రానికి సంగీతాన్ని జీబ్రాన్ అందించారు. సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న సుకుమార్, హరీష్ శంకర్, నాని థియేటర్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, ఈ కథ రామ్‌కు సూటయ్యేలా దర్శకుడు రాశారని, ఇందులో పాటలన్నీ తనకు నచ్చాయని, ముఖ్యంగా ‘బేబీ డాల్’ అందరికీ నచ్చుతుందని ఆయ న అన్నారు.

ఉర్రూతలూగించే ఒక్కడు

విశాల్, తమన్నా జంటగా హరివెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై సురాజ్ దర్శకత్వంలో జి.హరి రూపొందిస్తున్న చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. రష్యాలో చిత్రీకరించిన పాటలతో ఈ సినిమా పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. కోటిన్నర రూపాయల వ్యయంతో రూపొందించిన ఓ భారీ ఛేజ్ ఈ చిత్రానికి హైలెట్‌గా ఉంటుందని, రష్యాలో చిత్రీకరించిన పాటలు సినిమాకు అద్భుతంగా కుదిరాయని, హిప్ హాప్ తమిళ అందించిన బాణీలు ప్రేక్షకులను డాన్స్‌లు చేయిస్తారని అన్నారు.

వర్మ వర్సెస్ శర్మ

బాబ్త్రన్, బిందుబార్బీ జంటగా గిరిబాబు, జూ.రేలంగి ప్రధాన పాత్రల్లో పాలిన్‌డ్రోమ్ పిక్చర్స్ పతాకంపై బి.్భవనవిజయ్ దర్శకత్వంలో నార్ని ఫణిదుర్గాప్రసాద్ రూపొందిస్తున్న చిత్రం వర్మ వర్సెస్ శర్మ. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. ఓ లఘు చిత్రం చూసి దర్శకుడికి ఈ అవకాశం ఇచ్చామని, ఫిల్‌గుడ్ మూవీగా హ్యూమర్‌తో కూడిన చక్కని కథను అందించారని తెలిపారు. ట్రెండ్‌కు తగిన విధంగా హాస్యభరిత చిత్రంగా రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను త్వరలో విడుదల చేస్తామని తెలిపారు.

రాజకీయాల్లోకి వస్తా

అలనాటి విజయవంతమైన చిత్రం బాపు దర్శకత్వంలో వచ్చిన ముత్యాలముగ్గులో కథానాయికగా అందరికీ పరిచయమైన అచ్చమైన పదహారణాల తెలుగు నటి సంగీత దాదాపు 200 తెలుగు చిత్రాల్లో నటించిన ఆమె ఇన్నాళ్లు చెన్నయ్‌లోనే ఉండిపోయారు. ఇప్పుడు హైదరాబాద్‌కు మకాం మార్చా. ఈ సందర్భంగా ఆమె తన మనసులోని మాటలను తెలిపారు. ‘ఇన్నాళ్లుగా అనేక తమిళ, మలయాళ సీరియల్స్‌లో నటించడంవల్ల చెన్నయ్‌లోనే ఉండిపోయాను. ప్రస్తుతం అమీర్‌పేటలో ఇల్లు తీసుకున్నాను. ఇకపై టాలీవుడ్‌కు దగ్గరగా వుంటూ దర్శక, నిర్మాతలకు అందుబాటులో ఉండడానికి నిర్ణయించుకున్నాను. నా వయసుకు తగ్గ పాత్రలు చేయడానికి సిద్ధవౌతున్నాను.

వైవిధ్యమైన ఘటన

నిత్యామీనన్, క్రిష్ జె సత్తార్ జంటగా నటి శ్రీప్రియ దర్శకత్వంలో సన్ మూన్ క్రియేషన్స్ పతాకంపై వి.ఆర్.కృష్ణ.ఎం అందిస్తున్న చిత్రం ‘ఘటన’. మలయాళంలో విజయవంతమైన ‘22 ఫిమేల్ కొట్టాయం’ చిత్రాన్ని తెలుగులో అనువదించారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ పాటను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకురాలు శ్రీప్రియ మాట్లాడుతూ- దృశ్యం చిత్రం తరువాత తెలుగులో ఈ చిత్రానికి తాను నిర్దేశకత్వం వహించానని, ఆడదంటే ఆటబొమ్మ కాదని, తాను తలచుకుంటే ఆదిశక్తిలా విజృంభించి ఏదైనా చేయగల సత్తా వున్న సబల అని ఈ చిత్రం నిరూపిస్తుందని తెలిపారు.

అపార్ట్‌మెంట్‌లో అబల

నికిత ప్రధాన పాత్రలో శ్రీ క్రియేటివ్ ఫిలింస్ పతాకంపై శివగంగరాజు వుడిమూడి దర్శకత్వంలో ఎ.కె.శ్రీకాంత్ అంగళ్ళ రూపొందించిన చిత్రం ‘అపార్ట్‌మెంట్’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ముగింపు దశలో వున్నాయి. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన లభిస్తోందని నిర్మాత తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ఇటీవల ఈ సినిమా ఆడియోను విడుదల చేశామని, అన్ని పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని, దర్శకుడు తొలి చిత్రమే అయినా, అందరికీ నచ్చేలా తెరకెక్కించారని తెలిపారు.

విశారణైలో ఏముంది?

ఆస్కార్ అవార్డుల కోసం భారతదేశం నుంచి ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు జరిగినా ఫలితం లేకపోయింది. ఈ ఏడాది మరో ప్రయత్నం జరుగుతోంది. ఆస్కార్ విదేశీ భాషా విభాగంలో ఎప్పటికప్పుడు కథ, కథనాల్లో వైవిధ్యం, టేకింగ్‌లో నూతనత్వం వున్న చిత్రాలను ఎంపిక చేసి అధికారిక ఎంట్రీగా పంపిస్తున్నారు. కానీ అంతర్జాతీయంగా వున్న అనేక సమస్యల నేపథ్యంలో రూపొందించిన చిత్రాలకు అవార్డులు దక్కుతున్నాయి. ఈ సంవత్సరం ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.ఎఫ్.ఐ) ఆస్కార్ అవార్డుకోసం ఎంట్రీగా వెళ్ళేందుకు దాదాపు 29 చిత్రాలను పరిశీలించింది. ఈ చిత్రాలలో వెట్రిమారన్ దర్శకత్వంలో నటుడు ధనుష్ రూపొందించిన ‘విశారణై’ చిత్రం ఎంపికైంది.

-సరయు

తెలుగువాడిగా గర్విస్తున్నా!

జ్యోతిలక్ష్మి, సారాయి వీర్రాజు తదితర చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించిన అజయ్‌ఘోష్ అచ్చమైన తెలుగువాడు. విశారణై చిత్రంలో గుంటూరు పోలీసు సి.ఐ విశే్వశ్వరరావుగా నటించాడు అజయ్‌ఘోష్. ఈ చిత్రం ఆస్కార్ అవార్డుకు వెళుతున్న సందర్భంగా ఆయన్ను పలకరిస్తే పలు చిత్ర విశేషాలను తెలిపారు.
రన్ రాజా రన్ సినిమా షూటింగ్‌లో చలపతి అనే మేనేజర్ పరిచయమయ్యారు. ఆయన నన్ను చూసి తమిళ్‌లో నటిస్తావా అని అడిగారు. నటిస్తానన్నాను. దాదాపు మూడు నెలల తరువాత ఆయన ఫోన్ చేసి దర్శకుడు వెట్రిమారన్ ‘విశారణై’ చిత్రం రూపొందిస్తున్నారని, అందులో విలన్‌గా నటించడానికి తెలుగు వ్యక్తి కావాలని, కనుక చెన్నై రమ్మన్నారు.

కలకాలం ఇలా సాగనీ..

మాట్లాడుకుంటే దూరం తగ్గుతుంది. ఇది ఆ మధ్య బాగా ప్రాచుర్యం పొందిన ఎయిర్‌టెల్ వాణిజ్య ప్రకటన. నిజజీవితంలోనూ ఇది వర్తిస్తుంది. ఆరు దశాబ్దాలు కలసి మెలసి ఉన్న తెలుగువాళ్లు ప్రాంతాలుగా విడిపోయి, మనుషులుగా కొనసాగుతూ రెండున్నరేళ్లయినా, పాలకుల మధ్య సఖ్యత ఇంకా పూర్తి స్థాయిలో కనిపించడం లేదు. కొన్ని అంశాల్లో తప్ప మిగిలిన అనేక వ్యవహారాల్లో ఆంధ్ర-తెలంగాణ ప్రభువుల మధ్య అంతరం కొనసాగుతూనే ఉంది. నిజానికి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న గొడవలు కత్తులుదూసుకునేంత పెద్దవేమీ కావు. కర్నాటక-తమిళనాడు మాదిరిగా బస్సులు తగులబెట్టుకునేంత విద్వేషపూరితమైనవి కావు. ఇద్దరు చంద్రులూ పరిచయం లేనివారూ కాదు.

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 9705311144

Pages