S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సవాలుకు సై

కోజికోడ్, సెప్టెంబర్ 24: ‘మీ సవాలును నేను స్వీకరిస్తున్నా. పాకిస్తాన్‌తో యుద్ధం చేయటానికి మేం సిద్ధంగా ఉన్నాం. మీకు నిజంగా ధైర్యం ఉంటే, పోరాట పటిమే ఉంటే పేదరికంపైనా, నిరుద్యోగంపైనా, నిరక్షరాస్యతపైనా ఎందుకు పోరాటం చేయరు? ఆ పోరాటంలో భారత్, పాకిస్తాన్‌లలో ఎవరు గెలుస్తారో చూద్దాం’... భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాకిస్తాన్‌కు సూటిగా చెప్పిన మాటలివి. ఉరీ సైనిక శిబిరంపై ఉగ్రవాదులు దొంగదాడి చేసి 18మంది సైనికులను బలి తీసుకున్న తరువాత ప్రధాని మోదీ మొట్టమొదటిసారి పాకిస్తాన్‌కు తీవ్రస్థాయిలో హెచ్చరిక చేశారు.

పిఎస్‌ఎల్‌వికి కౌంట్‌డౌన్

సూళ్లూరుపేట, సెప్టెంబరు 24: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) నుండి ప్రయోగించే పిఎస్‌ఎల్‌వి-సి 35 రాకెట్ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రక్రియ శనివారం ఉదయం 8:42 గంటలకు ప్రారంభమైంది. ఈ రాకెట్ ద్వారా మన దేశానికి చెందిన ప్రధాన ఉపగ్రహం స్కాట్‌శాట్-1, విదేశాలకు చెందిన 5 ఉపగ్రహాలుసహా విశ్వ విద్యాయాల విద్యార్థులు రూపొందించిన మరో రెండు ఉపగ్రహాలను ఇస్రో కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. కౌంట్‌డౌన్ జరిగే సమయంలో

ఆదుకుంటాం

గుంటూరు, సెప్టెంబర్ 24: భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన బాధితులను ప్రభుత్వం అన్నిరకాల ఆదుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. గుంటూరు జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను సందర్శించిన అనంతరం కలెక్టరేట్‌లో శనివారం రాత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 36,497 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని 667 ఇళ్లు పూర్తిగా, 822 పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారులు వివరించారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు సిఎం ప్రకటించారు. వరద ప్రభావిత 40 మండలాలకు 40 మంది ఆర్డీవోలు 12 మంది సీనియర్ ఐఏఎస్‌లను నియమిస్తున్నట్లు చెప్పారు.

నష్టం అపారం

గుంటూరు, సెప్టెంబర్ 24: గుంటూరు జిల్లాలో వరద ముంపు ప్రాంతాలైన క్రోసూరు, పెదనందిపాడు, పమిడివారిపాలెం, కాకుమాను, బాపట్ల, తదితర ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద రహదారిపై హెలీకాప్టర్ దిగి, రోడ్డుమార్గాన బయల్దేరి అనుపాలెం వద్ద దెబ్బతిన్న రైల్వేట్రాక్‌ను పరిశీలించారు. రెడ్డిగూడెం, మాచాయపాలెం, కొండమోడు గ్రామాల నిర్వాసితులు ముఖ్యమంత్రి కాన్వాయి వద్దకు చేరుకుని సర్వస్వం కోల్పోయామంటూ తమ బాధలు ఏకరవుపెట్టారు. తక్షణ సాయంగా కిరోసిన్, బియ్యం పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు.

కొనసాగుతున్న అల్పపీడనం

విశాఖపట్నం, సెప్టెంబర్ 24: అల్పపీడనానికితోడు అల్పపీడన ద్రోణి ఏర్పడటంతో కోస్తాంధ్రలో పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి విధర్భ మీదుగా దక్షిణ చత్తీస్‌గడ్ మధ్య తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ దక్షిణ కోస్తా మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో చాలాచోట్ల వర్షం కురుస్తుంది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షం కురియవచ్చు. ఇదే సమయంలో నైరుతి దిశగా తీరం వెంబడి గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.

ఇంటికి చేరిన ప్రొఫెసర్లు

హైదరాబాద్/ అల్వాల్/ నాచారం, సెప్టెంబర్ 24: లిబియాలో ఐసిస్ ఉగ్రవాదుల చెరలో బందీలుగావున్న ఇటీవలే విడుదలైన తెలుగు ప్రొఫెర్లు గోపికృష్ణ, బలరాం కిషన్‌లు శనివారం హైదరాబాద్‌కు క్షేమంగా చేరుకున్నారు. మొదట లిబియా నుంచి ఢిల్లీకి చేరుకున్న ప్రొఫెసర్లు అక్కడి నుంచి నేటి తెల్లవారుజామున హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే వీరి రాక సమాచారం వారి కుటుంబ సభ్యులకు తెలియదు. ఢిల్లీ నుంచి ప్రొఫెసర్లకు తోడుగా విదేశాంగ శాఖకు చెందిన నలుగురు అధికారులు కూడా వచ్చారు. గత సంవత్సరం జూలై 29న ఇద్దరు తెలుగు ప్రొఫెసర్లతోపాటు కర్నాటకకు చెందిన మరో ఇద్దరిని ఐసిస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే.

ఆక్వా రైతులకు డిజిటల్ డేటాబేస్ సేవలు

విశాఖపట్నం, సెప్టెంబర్ 24: రాష్ట్రంలోని ఆక్వా రైతులకు మేలు చేకూర్చేలా అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల వివరాలు ఎప్పటి కప్పుడు తెలిజేసే సరికొత్త సాఫ్ట్‌వేర్ రూపొందించారు. నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ ఆక్వా కల్చర్ సంస్థ ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిందని మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంపెడా) చైర్మన్ జయతిలక్ తెలిపారు. ఎంపెడా వద్ద రిజిస్టరైన సొసైటీలు ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకుని తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు.

ముడి చమురు ధరలు భారీగా పతనం

న్యూయార్క్, సెప్టెంబర్ 24: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరోసారి భారీగా పతనమైనాయి. ఇటీవలి కాలంలో కాస్త పుంజుకుంటున్నట్లు కనిపించిన చమురు ధరలు మళ్లీ పతనమవడం కలకలం రేపుతోంది. ఈ నెల 28న అల్జీరియాలో రష్యా వంటి ఒపెక్‌లో సభ్య త్వం లేని చమురు ఉత్పత్తి దేశాలతో ఒపెక్ కీలక సమావేశం కానున్న నేపథ్యంలో చమురు ధరలు పతనం కావ డం ప్రాధాన్యతను సంతరించుకుంది. శుక్రవారం లండన్ మార్కెట్లో భారత్ ఎక్కువగా కొనుగోలు చేసే బ్రెంట్ చమురు బ్యారెల్ 1.76 డాలర్లు పడిపోయి 45.89 డాలర్లకు చేరుకుంది. న్యూయార్క్ మార్కెట్లో నైమెక్స్ చమురు సైతం బ్యారెల్‌కు 4 శాతం పడిపోయి 44.48 డాలర్లకు చేరుకుంది.

జిఎస్‌టి కౌన్సిల్ అదనపు కార్యదర్శిగా అరుణ్ గోయల్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: వస్తు సేవల పన్ను(జిఎస్‌టి) కౌన్సిల్‌లో అదనపు కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్‌ను నియమించారు. ఈ మేరకు కేబినెట్ నియామకాల కమిటీ గోయల్ నియామకాన్ని ఆమోదించింది. సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన గోయల్ ప్రస్తుతం కేబినెట్ సెక్రటేరియట్‌లో ప్రాజెక్ట మానిటరింగ్ గ్రూపు అదనపు కార్యదర్శిగా పని చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఏకరీతి పన్ను వ్యవస్థను తీసుకు వచ్చేందుకు జిఎస్‌టి కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

స్వల్ప లాభాలకే... పరిమితమైన మార్కెట్లు

ముంబయి, సెప్టెంబర్ 24: అమెరికా ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ కీలక సమావేశాల నేపథ్యంలో మదుపరులు అచితూచి పెట్టుబడులు పెట్టడంలాంటి కారణాలతో ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. బిఎస్‌ఇ ప్రధాన సూచీ సెనె్సక్స్ 69.19 పాయింట్లు లాభపడి 28,668.22 పాయింట్ల వద్ద ముగియగా, జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ 51.70 పాయింట్లు లాభపడి 8,831.55 పాయింట్ల వద్దకు చేరుకుంది. మదుపరుల మనసంతా కూడా రెండు ప్రధాన జాతీయ బ్యాంకులైన అమెరికా ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ కీలక సమావేశాలకే పరిమితం కావడంతో వారం ప్రారంభం ఆటుపోట్లతోనే మొదలైంది.

Pages