S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరున్నర గంటలు సాగిన కౌన్సిల్

హైదరాబాద్, సెప్టెంబర్ 19: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు రెండో పాలక మండలి అందుబాటులోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సారిగా ఆరున్నర గంటల పాటు కౌన్సిల్ సమావేశం సాగింది. గత ఫిబ్రవరి మాసంలో పాలక మండలి అందుబాటులోకి వచ్చినా, ఎపుడు కౌన్సిల్ సమావేశానికి తేదీని ప్రకటించినా, అనూహ్యమైన అడ్డంకులొచ్చి నాలుగు సార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే! ఇక ఎపుడైనా సమావేశం జరిగినా, అది కేవలం రెండు నుంచి రెండున్నర గంటలకే పరిమితమయ్యేది. కానీ సోమవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో మేయర్ ఎంతో చాకచక్యంగా వ్యవహారించి భోజన విరామ సమయం మినహా ఆరున్నర గంటల పాటు సమావేశాన్ని నిర్వహించారు.

తాండూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం రోడ్డెక్కిన అఖిలపక్షం

తాండూరు, సెప్టెంబర్ 19: కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ ఉన్నతి ఆందోళనల సెగలు తాండూరులో సైతం ఊపందుకున్నాయి. నెల రోజులుగా తాండూరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలంటూ, శాంతియుత డిమాండ్లకు సోమవారం తాండూరులో అఖిలపక్షాల నేతలు, పార్టీలకు అతీతంగా ఆందోళన పథాన్ని ప్రారంభించటంతో పాటు, ఏకంగా రోడ్డెక్కారు. పట్టణంలో ఇందిరా చౌరాస్తాలో నలువైపుల రహాదారులను దాదాపు 3గంటలపాటు దిగ్బందించి రాస్తారోకో చేపట్టారు. టిఆర్‌ఎస్ పాలకులు శాంతియుత మార్గంలో డిమాండ్లు పరిష్కరించాలని,ని ఆలస్యంగా గ్రహించిన తాండూరు పట్టణ, డివిజన్‌కు చెందిన అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలిసి తమ ఆందోళనను చేపట్టారు.

మెయింటనెన్స్ పనులను పరిశీలించిన జలమండలి డైరెక్టర్ రామేశ్వరరావు

హైదరాబాద్, సెప్టెంబర్ 19: జలమండలి మెయింటనెన్స్ విభాగం ఆధ్వర్యంలో చేపడుతున్న పలు మరమ్మతుల పనులను డైరెక్టర్ జి.రామేశ్వరరావు సోమవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో వర్షం కారణంగా చెడిపోయిన వాటర్, డ్రైనేజీ మ్యాన్‌హోళ్ల నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. శ్రీనగర్ కాలనీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో చేపడుతున్న పనులను జలమండలి మెయింటనెన్స్ విభాగం డైరెక్టర్ రామేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పని పట్టాల్సిందే!

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: ఆక్రమిత కాశ్మీర్‌లోని మిలిటెంట్ స్థావరాలపై పరిమిత సైనిక దాడి జరపాలన్న డిమాండ్ల నేపథ్యంలో తదుపరి చర్యలపై భారత్ దృష్టి పెట్టింది. కాశ్మీర్‌లోని యూరీ సైనిక స్థావరంపై పాకిస్తాన్ మిలిటెంట్ సంస్థ జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 17మంది భారత సైనికులు మృతి చెందిన నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. హోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో పాటు ఆర్పీ చీఫ్ దల్బీర్ సింగ్, ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

రైతు సమస్యలపై అక్టోబర్ 2న వౌన దీక్ష

ఖైరతాబాద్, సెప్టెంబర్ 19: రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కరించాలని కోరుతూ రైతు జెఎసి ఆధ్వర్యంలో అక్టోబర్ 2న ఇందరాపార్క్ వద్ద వౌన దీక్ష చేయనున్నట్టు చైర్మన్ కోదండరామ్ తెలిపారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పోస్టర్‌ను తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఆవిష్కరించారు. ప్రత్యేక రాష్ట్రంలో రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని అనుకుంటే మరింత పెరగడం ఆవేదన కలిగించే అంశమని అన్నారు. ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదని, అదే సమయంలో ప్రజా ఉపయోగం లేని ప్రాజెక్టుల నిర్మాణాన్ని సమర్థించమని చెప్పారు.

చినుకు పడితే అన్నీ చిక్కులే!

హైదరాబాద్, సెప్టెంబర్ 19: మహానగరంలో సోమవారం సాయంత్రం మరో సారి ఓ మోస్తారు వర్షం పడింది. ఇప్పటికే పలు సార్లు కురిసిన భారీ వర్షాల షాక్ నుంచి నగరం తేరుకోకముందే సోమవారం సాయంత్రం సుమారు గంటన్నర సేపు ఓ మోస్తారు వర్షం పడింది. ఫలితంగా నిత్యం రద్ధీగా ఉండే జంక్షన్లలో ట్రాఫిక్ జాం అయింది. అంతేగాక, లోతట్టుప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరటంతో ఎపుడేం జరుగుతుందోననంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం సాయంత్రం కురిసిన ఆరున్నర గంటల సమయంలో ప్రారంభమైన వర్షం అరగంటలో అంటే ఏడు గంటల్లోపు ఒక సెంటీమీటర్ కురిసినట్లు సమాచారం.

రసవత్తరంగా ‘మహా’ కౌన్సిల్

హైదరాబాద్, సెప్టెంబర్ 19: నగరం గ్రేటర్‌గా రూపాంతరం చెందిన తర్వాత అందుబాటులోకి వచ్చిన రెండో పాలక మండలి సమావేశం సోమవారం రసవత్తరంగా జరిగింది. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన ఉదయం పదకొండు గంటల 15 నిమిషాలకు ప్రారంభమైన ఈ సమావేశంలో నగరంలో నెలకొన్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. నాలాల ఆధునీకరణ, రోడ్ల మరమ్మతులు, విపత్తుల నివారణ, చెరువుల పరిరక్షణ, వీది దీపాలతో పాటు అక్రమ నిర్మాణాలు, నగరంలో ప్రబలుతున్న ప్రాణాంతం డెంగీ వంటి వ్యాధులు, దోమల నివారణ వంటి అనేక అంశాలు, ఇతర సమస్యలపై అధికార, విపక్షాల సభ్యులంటూ తేడా లేకుండా సుదర్ఘీమైన చర్చ జరిగింది. ముఖ్యంగా శాసన మండలి సభ్యులు ఎం.ఎస్.

19 మండలాల జిల్లా కోసం ఆమరణ, దీక్షలు మేలు

వికారాబాద్, సెప్టెంబర్ 19: వికారాబాద్ జిల్లా కేంద్రంగా 19 మండలాల జిల్లా సాధన కోసం ఆమరణ, రిలే నిరాహార దీక్షలు చేపట్టడం శుభపరిణామమని బలహీన వర్గాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎస్.వెంకట్‌రాములు, ప్రధాన కార్యదర్శి ప్యాట శంకర్, ఉపాధ్యక్షుడు విద్యాసాగర్, జిల్లా అధ్యక్షుడు కాశయ్య, డివిజన్ కార్యదర్శి ఎం.రాజేందర్, నాయకుడు వి.అంజయ్య అన్నారు. సోమవారం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో చేవెళ్ల, వికారాబాద్, తాండూర్, పరిగి నియోజకవర్గాల్లోని 19 మండలాలతో వికారాబాద్ జిల్లా కేంద్రంగా జిల్లాను ప్రకటిస్తూ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారని చెప్పారు.

ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు పలికిన టిసిపి

వికారాబాద్ జిల్లా కేంద్రంగా 19 మండలాలతో కూడిన జిల్లా సాధన కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీయార్ కూడలి వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ప్రజాభిప్రాయవేదిక రాష్ట్ర సమన్వయకర్త పెండ్యాల అనంతయ్యకు తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదా ప్రకారమే జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ మండల కార్యదర్శి నెల్లి శ్రీనివాస్, చెర్కుపల్లి విజయభాస్కర్, రాము, మంగలి శ్రీకాంత్, కార్తీక్, శ్రావణ్‌కుమార్‌లు పాల్గొన్నారు.

దేశానికి ఏపి రక్షణ కవచం

మచిలీపట్నం, సెప్టెంబర్ 19: ఆంధ్రప్రదేశ్‌లో రూ.6,600 కోట్ల పెట్టుబడితో రక్షణ రంగ సంస్థలను నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అన్నివిధాలా నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంకణబద్ధులై పనిచేస్తున్నారన్నారు. కృష్ణా జిల్లా పామర్రు మండలం నెమ్మలూరు గ్రామంలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) రూ.300 కోట్లతో నిర్మించ తలపెట్టిన నైట్ విజన్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీకి సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఆయన భూమిపూజ చేశారు.

Pages