S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నినాదాల జోరు

తిరుపతి, సెప్టెంబర్ 19: తాము అన్ని రంగాల్లో వెనుకబడి దుర్భర జీవితాన్ని గడుపుతున్నామని, తమను బిసిలో చేర్చాలంటూ బలిజ కాపునేతలు, అన్నివిధాలా ఎంతో అభివృద్ధిలో ఉన్న బలిజ కాపులను బిసి జాబితాలో చేర్చి తమ గొంతు కోయొద్దని బిసి సంఘ నేతలు జస్టిస్ మంజునాథ్ కమిషన్‌కు తమ వాదనలు వినిపిస్తూ వినతిపత్రం సమర్పించారు. కాపులను బిసి కులాల్లో చేర్చే అంశంపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ మంజునాథ కమిటీ రెండురోజలు పర్యటనలో భాగంగా సోమవారం నగర పాలకసంస్థలోని వైఎస్‌ఆర్ మందిరంలో బహిరంగంగా ప్రజాభిప్రాయాలు సేకరించి వారి వాదనలు ఓపికతో వింది.

పొందూరు ఖాదీకి జాతీయ అవార్డు

పొందూరు, సెప్టెంబర్ 19:ప్రపంచ ప్రఖ్యాతి చెందిన శ్రీకాకుళం జిల్లా పొందూరు ఖాదీకి తాజాగా రెండు జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. సోమవారం ఈ మేరకు ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ విశాఖ ప్రాంతీయ కార్యాలయం నుండి సమాచారం అందింది. ఈ నెల 22న ఈ అవార్డులు అందుకోవాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల తిరిగి ఈ అవార్డులు ఎప్పుడు అందించేది స్పష్టం చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పొందూరు ఆంధ్రాసన్న ఖాదీ కార్మికాభివృద్ధి పరిధిలో నేత పని కార్మికురాలు కోరుకొండ సరోజిని, చేనేత వడుకు ప్రక్రియ కార్మికుడు ముప్పాన శ్రీనివాసరావుకు ఈ జాతీయ అవార్డులు దక్కాయి.

దొందూ దొందే

విజయవాడ, సెప్టెంబర్ 19: టిడిపి, బిజెపి వేర్వేరు కావని, రెండూ ఒకటేనని, రెండింటి బాట, భాష ఒకటేనని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి విమర్శించారు. బిజెపి తల్లివంటిదైతే టిడిపి పిల్ల వంటిదని సోమవారం నాడిక్కడ పిసిసి భవన్‌లో 27 మాసాల తెలుగుదేశం పాలనపై ఒక వాస్తవ పత్రాన్ని విడుదల చేసిన సందర్భంగా విలేఖర్లతో మాట్లాడుతూ ఆయనన్నారు. ఈ ప్రభుత్వానికి ఇంకా 33 మాసాల కాలం మిగిలి వుందన్నారు. రాష్ట్రంలో టిడిపి ఏమికోరుతుందో కేంద్రంలో బిజెపి అదే ప్రకటిస్తుందని విమర్శించారు. వారికి సొంత ప్రయోజనాలే ముఖ్యమని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఏమాత్రం పట్టడం లేదన్నారు.

మరో 24గంటలు..

హైదరాబాద్, సెప్టెంబర్ 19: నైరుతీ బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒరిస్సా ప్రాంతంలో ఏర్పడ్డ ఉపరితల తుపాను ద్రోణి మూలంగా మంగళవారం ఏపీలోని కోస్తా జిల్లాలతోపాటు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. ఐఎండి శాస్తవ్రేత్త చరణ్‌సింగ్ పేరిట సోమవారం బులెటిన్ జారీ అయింది. నైరుతీ రుతపవనాలు ఉధ్రుతంగా ఉండటంతో తెలంగాణ, ఏపీల్లో గత నాలుగైదు రోజుల నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు, తెలంగాణలోని పది జిల్లాల్లో మంగళవారం భారీ వర్షం కురుస్తుందని వెల్లడించారు.

అయ్యా.. నాకు పెన్షన్ వద్దు

ఆదోనిటౌన్, సెప్టెంబర్ 19: ప్రభుత్వం నుంచి ఏ చిన్న ఆర్థికసాయం అందినా అదే పదివేలనుకుని, సాయం కోసం కళ్లు కాయలుకాచేలా ఎదురుచూసే ప్రస్తుత కాలంలో పెన్షన్ వాపసు తీసుకోండంటూ అధికారులకు అర్జీ పెట్టుకున్నాడు ఓ లబ్దిదారుడు. కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆదోని పట్టణంలోని 4వ వార్డుకు చెందిన మాజీ కౌన్సిలర్, టిడిపి సీనియర్ నాయకుడు, వృద్దాప్య పెన్షన్‌దారుడు పొంపన్న సోమవారం మున్సిపల్ కమిషనర్ గోవిందప్పను కలిసి తనకు ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ రద్దు చేయాలని అర్జీ అందజేశాడు.

ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణ రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన స్థానానికి ఎన్నిక నిర్వహించనున్నారు. ఈనెల 26న నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్టు ప్రకటించిన ఈసీ, అభ్యర్థుల నామినేషన్లకు చివరి తేది అక్టోబర్ 3గా పేర్కొంది. అలాగే నామినేషన్ల పరిశీలన ప్రక్రియ అక్టోబర్ 4న పూర్తి చేయనుంది. అదేవిధంగా అక్టోబర్ 17న పోలింగ్ నిర్వహించి సాయంత్రం 5 గంటలలోపు ఫలితాలు ప్రకటించనున్నారు.

26న నింగిలోకి పిఎస్‌ఎల్‌వి సి-35

సూళ్లూరుపేట, సెప్టెంబర్ 19: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్)కేంద్రం నుంచి ఈ నెల 26న సముద్ర స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు క్యాట్‌శ్యాట్ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపుతున్నారు. దీంతోపాటు మరో ఏడు ఉపగ్రహాలను కూడా ఒకేమారు కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఇస్రో శ్రీకారం చుట్టింది. పిఎస్‌ఎల్‌వి సి-35 రాకెట్ ద్వారా ఈ నెల 26న ఉదయం 9.20గంటలకు ఒకేమారు 8 ఉపగ్రహాలను రోదసీలోకి పంపుతున్నారు. ఈ నెల 23న ప్రయోగంపై షార్‌లో డాక్టర్ సురేష్ అధ్యక్షతన మిషన్ రెడీనెస్ రివ్యూ(ఎంఆర్‌ఆర్) సమావేశం జరగనుంది.

వైద్యం అందక విద్యార్థి బలి

హైదరాబాద్/ సికింద్రాబాద్, సెప్టెంబర్ 19: రాష్ట్ర రాజధానిలోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు బతకడనుకున్న వాళ్లను కూడా బతికించిన చరిత్ర ఉంది. అలాంటిది అత్యవసర వైద్యం అందిస్తే బతికే అవకాశాలున్న విద్యార్థి మాత్రం, నిర్లక్ష్యం కారణంగా కన్నుమూసిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా రాజాపేట మండలం బేగంపేటకు చెందిన ఐటీఐ విద్యార్థి ల్యాగాల ప్రకాశ్‌తో పాటు మరో ఐదుగురు జగదేవ్‌పూర్ మండలం పరిధిలోని మదనదుర్గమ్మ దేవాలయం వద్ద ఆదివారం రాత్రి పార్టీ చేసుకున్నారు. పార్టీ అనంతరం స్నేహితులంతా తిరుగు ప్రయాణమయ్యారు.

జిల్లా కోసం ఐదు గంటల పాటు ధర్నా రాస్తారోకో

వికారాబాద్, సెప్టెంబర్ 19: వికారాబాద్ జిల్లా కేంద్రంగా 19 మండలాలతో కూడిన జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ యువజన కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సిపి నాయకులు పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో చేపట్టారు. సోమవారం ఉదయం ఎన్టీఆర్ చౌరస్తా నుండి బయలుదేరిన నాయకులు బస్‌డిపోకు చేరుకుని బస్‌డిపో గేటుకు తాళం వేయించి, డిపో ఎదుట టైర్లు తగలబెట్టారు.

సైనికులపై ఉగ్రవాదుల దాడి అమానుషం

ఉప్పల్, సెప్టెంబర్ 19: ఉగ్రవాదుల చర్యలకు నిరసనగా బిజెవైఎం జిల్లా కార్యదర్శి రేవెల్లి రాజు ఆధ్వర్యంలో ఉప్పల్ కమాన్ వద్ద సోమవారం పాకిస్తాన్ జెండాను దగ్ధం చేశారు. కవ్వింపు చర్యలను పాకిస్తాన్ మానుకోకపోతే భారతదేశ సైన్యం గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉందని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్ దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని యావత్ భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. కాశ్మీర్ యురీలో జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన వీర జవాన్లకు జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబాలకు భారతదేశ ప్రజలు అండగా ఉంటారని తెలిపారు.

Pages