S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెండ్యాలకు సంఘీభావం తెలిపిన తపస్, టియుటిఎఫ్

వికారాబాద్, సెప్టెంబర్ 19: వికారాబాద్ జిల్లా కేంద్రంగా 19 మండలాలతో కూడిన జిల్లా ఏర్పాటు చేయాలని చేపడుతున్న ఉద్యమానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) పూర్తి మద్దతు తెలిపింది. సోమవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన పెండ్యాల అనంతయ్యను అఖిలపక్ష దీక్షా శిబిరంలో కలిసి సంఘీభావం ప్రకటించారు.

ఎయిర్‌‘పోర్టుల’తో అభివృద్ధికి బాటలు

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 19: రాష్ట్రంలోని ఎయిర్‌పోర్టులు, ఓడరేవులను అభివృద్ధిచేయడంతోపాటు కొత్తగా మరిన్ని ఏర్పాటుచేయడం ద్వారా అభివృద్ధికి బాటలు వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. త్వరలో రాజమహేంద్రవరం, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి విమానాశ్రయంలో రూ.181 కోట్లతో చేపట్టే విస్తరణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు సోమవారం శంకుస్థాపన, భూమి పూజచేశారు.

మోదీ హయాంలో ప్రత్యేక హోదా రాదు

చిలకలూరిపేట, సెప్టెంబర్ 19: దేశంలో ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే కమ్యూనిస్టు పార్టీలు దిశా దిక్సూచీలని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. పట్టణంలో సోమవారం సిపిఐ కార్యాలయ నూతన భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయన అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. గతంలో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు బిజెపి పెద్ద ఎత్తున విమర్శలకు పాల్పడేదని, నేడు కాశ్మీర్‌లో సుదీర్ఘకాలంగా కర్ఫ్యూ మధ్య ప్రజలు జీవించాల్సిన పరిస్థితి బిజెపి ప్రభుత్వం వల్లే ఏర్పడిందన్నారు. దేశ సైనిక దళాలను రక్షించలేని బలహీన ప్రభుత్వం ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్రంలో కొనసాగుతోందన్నారు.

ఎరువుల పంపిణీలో అవినీతి అవాస్తవం

గుంటూరు, సెప్టెంబర్ 19: సహకార సంఘాలకు, ఇతర వాణిజ్య దుకాణాలకు సంబంధించి ఎరువుల పంపిణీలో అవినీతి జరిగిందంటూ ప్రతిపక్షాలు పదే పదే విమర్శలు చేస్తున్నాయని, ఈ విషయంలో ఎటువంటి అవినీతి జరగలేదని, దీనిని పూర్తిగా ఖండిస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ రైతులకు తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఎరువుల పంపిణీలో అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేయడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని విమర్శించారు.

పాలకులను వెక్కిరిస్తున్న అసంపూర్తి పనులు

గుంటూరు, సెప్టెంబర్ 19: తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్న నేపథ్యంలో గుంటూరు నగర అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని వైసిపి రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం వైన్ డీలర్స్ కళ్యాణ మండపంలో అప్పిరెడ్డి అధ్యక్షతన నగరంలోని ఆయా డివిజన్ల అధ్యక్షుడు, నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 460 కోట్ల రూపాయలతో 2013 సంవత్సరంలో పైపులైను నిర్మాణ పనులు చేపట్టి ఏళ్లు గడుస్తున్నా నేటికీ కొలిక్కిరాని పరిస్థితులు దాపురించాయన్నారు.

నష్టాలతో కునారిల్లుతున్న ఆర్టీసీని రక్షించుకోవాలి

పొన్నూరు, సెప్టెంబర్ 19: రవాణాశాఖ అధికారుల అలక్ష్యంతో ఆటోలు, ప్రైవేటు వాహనాల జోరుపెరిగి ఆర్టీసీ సంస్థ కోలుకోలేని స్థితిలో అప్పుల ఊబిలో కూరుకుపోతోంది... అప్పుచేసి సిబ్బందికి నెలజీతాలు ఇవ్వగలుగుతున్నాం.. పరిస్థితి ఇలానే కొనసాగితే సంస్థ ఉనికి కూడా కోల్పోయే ప్రమాదం పొంచివుందని ఆర్టీసీ ఆర్‌ఎం జ్ఞానంగారి శ్రీహరి ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం స్థానిక ఆర్టీసీ డిపోను సందర్శించిన శ్రీహరి విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. 3500 కోట్ల అప్పుల ఊబిలో సంస్థ గతంలో ఉండగా తాజాగా మరో 4,500 కోట్ల అప్పుల భారం ఏర్పడి మొత్తం 8 వేల కోట్ల అప్పుల భారంతో కునారిల్లుతోందన్నారు.

సినీ ఫక్కీలో నగలు, నగదు అపహరణ

తెనాలి రూరల్, సెప్టెంబర్ 19: సినిమా ఫక్కీలో తెనాలిలో భారీగా బంగారు నగలు, నగదు దోచుకున్నారు. పట్టణంలోని పెద్దమార్కెట్ నుండి గంగానమ్మపేట ఆటోలో వెళుతున్న గాజుల నగరాజకుమారి నుం డి ఆటోలో ప్రయాణిస్తున్న గుర్తు తెలియని మహిళలు 11 సవర్ల బం గారం, 4వేలు నగదును ఆపహరించినట్లు టూటౌన్ సిఐ కళ్యాణ్‌రాజ్ తెలిపారు. సిఐ కథనం ప్రకారం బాధితురాలు గాజల నగరాజకుమారి హైదరాబాద్ నివాసి. ఈమెకు గంగానమ్మపేటలో సొంత భవనం ఉండగా బంధువుల గృహంలో శుభకార్యం నిమిత్తం తెనాలి వచ్చింది.

పర్యాటక సర్క్యూట్‌గా అమరావతి

అమరావతి, సెప్టెంబర్ 19: ప్రపంచ పర్యాటక కేంద్రంగానూ, వారసత్వ నగరంగా విరాజిల్లుతున్న అమరావతిని ప్రణాళికాబద్ధంగా పర్యాటక సర్క్యూట్‌గా అభివృద్ధి చేయనున్నట్లు ఎపి టూరిజం శాఖ ఎండి గిరిజాశంకర్ తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన ఇక్కడ విస్తృతంగా పర్యటించి పర్యాటక అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఇప్పటికే అమరావతిలో ప్రసాద్, హృదయ్ పథకాల ద్వారా 48 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని, అవసరాన్ని బట్టి మరికొంత నిధులను త్వరలో మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అమరావతిలోని అన్ని ముఖ్య స్థావరాలను కలుపుతూ హెరిటేజ్ వాక్ పేరుతో ఒక రూట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు గిరిజాశంకర్ వివరించారు.

22 నుంచి జాషువా పద్యానికి పట్ట్భాషేకోత్సవాలు

గుంటూరు (కల్చరల్), సెప్టెంబర్ 19: కులం కాదు, గుణం మిన్న, మతం కన్నా మానవత్వమే మిన్న అని ధర్మంతో పాటు దార్శనిక దృష్టికూడా కలిగి ఉండాలని తన కవిత్వం ద్వారా ప్రపంచానికి తెలియజెప్పిన కవికోకిల గుర్రం జాషువాకు కవితా నీరాజనాలర్పించడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు.

సైనికుల మృతికి వైసీపీ నివాళి

మంగళగిరి, సెప్టెంబర్ 19: కాశ్మీర్‌లోని యూరీ సెక్టార్‌లోని సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రవాద దాడిలో మృతిచెందిన 17 మంది భారత సైనికులకు సంతాప సూచికంగా సోమవారం రాత్రి స్థానిక అంబేద్కర్ విగ్రహం సెంటర్లో వైఎస్‌ఆర్ సీపీ నేతలు కొవ్వొత్తులు వెలిగించి ప్రదర్శన చేశారు. ఉగ్రవాద దాడిని వారు తీవ్రంగా ఖండించారు. సైనిక శిబిరంపై ఉగ్రవాదులు దాడిచేసి నిద్రలో ఉన్న జవాన్లను హత్యచేసిన ఉగ్రవాదులను గుర్తించి కఠినంగా శిక్షించాలని వైఎస్‌ఆర్ సీపీ డిమాండ్ చేసింది. దేశంకోసం ప్రాణత్యాగం చేసిన సైనికులకు ఘనంగా నివాళులర్పించారు.

Pages