S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నినాదాలు, ప్రసంగాలతో దద్దరిల్లిన వికారాబాద్

వికారాబాద్ జిల్లా కేంద్రంగా 19 మండలాలతో కూడిన వికారాబాద్ జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం, కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆమరణ, రిలే నిరాహార దీక్షలు, రాస్తారోకోలు, వంటావార్పు, ప్రభుత్వానికి, సిఎం, మంత్రులకు వ్యతిరేకంగా ఇచ్చిన నినాదాలు, నాయకుల ప్రసంగాలతో సోమవారం వికారాబాద్ దద్దరిల్లిపోయింది. పట్టణ నలుదిక్కులా ఆందోళనలే కనిపించారు. పట్టణంలోని ఎన్టీఆర్ కూడలిలో ఆమరణ, రిలే నిరాహార దీక్షలు ఏర్పాటు చేయగా, రోడ్ ఓవర్‌బ్రిడ్జిపై యువజన కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సిపిల రాస్తారోకో, ధర్నా, కొత్తగడి వద్ద వంటవార్పు, పట్టణంలో బంద్‌తో జనజీవన స్తంభించిపోయింది.

అధికారుల అండతోనే అక్రమ నిర్మాణాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 19: నగరంలో ఎవరి భూమిలో ఎవరైనా అక్రమంగా నిర్మాణాలు చేపట్టేందుకు జిహెచ్‌ఎంసి టౌన్‌ప్లానింగ్ అధికారులు అండగా నిలుస్తున్నారని, అక్రమార్కులకు కోర్టు నుంచి స్టే తెచ్చుకోమని కూడా పురమాయిస్తున్నారని కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి కౌన్సిల్ సమావేశంలో మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. బంజారాహిల్స్ ప్రాంతంలో రోజుకో చోట ఒక్కో అంతస్తు అక్రమంగా నిర్మిస్తున్నా, అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నట్లు ఆమె ఆరోపించారు. స్వయంగా తాను ఫిర్యాదు చేసినా, అక్రమ నిర్మాణాలను అడ్డుకోలేదని, ఓ పేద కుటుంబం రేకుల ఇళ్లకు మరమ్మతులు చేసుకుంటే ఇదే ఏసిపిలు అనుమతులున్నాయా? లే అవుట్ ఆమోదం ఉందా?

చేవెళ్లను జిల్లాగా ఏర్పాటు చేయాలి

పరిగి, సెప్టెంబర్ 19: చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని, లేదంటే పరిగి నియోజకవర్గాన్ని శంషాబాద్‌లో కలుపాలని పరిగి నియోజకవర్గం అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో పరిగిలోని అమరవీరుల చౌరస్తాలో మానవహారం నిర్వహించి ధర్నా చేశారు. బస్టాండ్ ముందు అఖిలపక్షం నాయకులు రిలే నిరహరదీక్షలు చేపట్టారు.

నగరాన్ని చెత్తనగరంగా మార్చారు : రేవంత్‌రెడ్డి

ఖైరతాబాద్, సెప్టెంబర్ 19: హైదరాబాద్ మహానగరాన్ని చెత్తనగరంగా మార్చాని టిడిపి నాయుడు రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రోడ్లపై పోరుబాటలో భాగంగా సోమవారం రేవంత్‌రెడ్డి, పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో టిడిపి బృందం శ్రీనగర్‌కాలనీ, ఎల్లారెడ్డిగూడ తదితర ప్రాంతాల్లో పర్యటించింది. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెబుతున్న పాలకులు రోడ్ల దుస్తులను మార్చడంలో విఫలవౌతున్నారని విమర్శించారు. రోడ్డుపై గుంత చూపిస్తే రూ. వెయ్యి ఇస్తామని గత జిహెచ్‌ఎంసి కమిషనర్ సోమేష్‌కుమార్ అన్నారని, ప్రస్తుతం గుంతలు లేని రోడ్లు చూపితే తామే పదివేలు చెల్లిస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలను పరిశీలించిన కేంద్ర బృందం

ధారూర్, సెప్టెంబర్ 19: కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలయ్యే సంక్షేమ పథకాలను కేంద్ర బృందం పరిశీలించింది. సోమవారం మండల పరిధిలోని చేవెళ్ళ ఎంపీ విశే్వశ్వర్ రెడ్డి దత్తత గ్రామం నాగసమందర్‌లో అమలవుతున్న వివిధ పథకాలను కేంద్ర ప్రభుత్వ అధికారులు విజయ్ జోషి, శ్రీ్ధర్ మటోడ్కర్ పరిశీలించారు. గ్రామ సర్పంచ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ పథకాల అమలు తీరుపై అధికారులు, ప్రజలతో నేరుగా మాట్లాడారు. ఉపాధిహామీ పథకం ద్వారా ఎలాంటి పనులు చేపడుతన్నారని అడిగి తెలుసుకుని కొన్ని పనులను పరిశీలించారు. ఇందిరా అవాస్ యోజన పథకం ద్వారా ఇల్లు నిర్మించుకున్నవారి ఇళ్లను పరిశీలించారు.

వికారాబాద్ జిల్లాపై వెనుకాడితే రాజీనామా

వికారాబాద్, సెప్టెంబర్ 19: వికారాబాద్ జిల్లా కేంద్రంగా 19 మండలాలతో జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం వెనుకాడితే రాజీనామాకు సిద్దమని టిఆర్‌ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ ఎం.సత్యమ్మ, జిల్లా వాల్టా సభ్యుడు ఎం.సురేష్ హెచ్చరించారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో వికారాబాద్ ప్రజల చిరకాల వాంఛ వికారాబాద్ జిల్లా అని సిఎం కేసిఆర్ ఇచ్చిన హామీ మేరకు 19 మండలాలతో కూడిన జిల్లా ఏర్పాటు చేయాలని కోరారు. 38 సంవత్సరాలుగా వికారాబాద్ జిల్లా కేంద్రంతో కూడిన జిల్లా కోసం అనేక ఉద్యమాలు చేశారని చెప్పారు. అన్ని సౌకర్యాలతో కూడిన వికారాబాద్ పట్టణంలో జిల్లాకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలు ఉన్నాయని స్పష్టం చేశారు.

అవమానం భరించలేక యువకుడి ఆత్మహత్య

జీడిమెట్ల, సెప్టెంబర్ 19: అక్రమ సంబంధం నెపంతో ఓ యువకున్ని కొట్టి చంపుతామని బెదిరింపులకు పాల్పడడం.. బెదిరించినవారి కాళ్లపై యువకుడి తండ్రి పడడంతో మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పద్మానగర్ ఫేజ్-2, నారాయణ క్షేత్రం ప్లాట్ నంబర్ 431లో నివాసముండే వడపల్లి శ్రీనివాస చారి పూజారిగా పనిచేస్తున్నాడు. ఇతని కుమారుడు వడపల్లి భాస్కర కృష్ణ స్వరూప్ (25) పూజారిగా పనిచేస్తున్నాడు.

బెజవాడకు రైళ్లు బంద్ ( నేటి నుంచి 9 రోజులు దారి మళ్లింపు)

విజయవాడ, సెప్టెంబర్ 19: దక్షిణ మధ్య రైల్వేలో అతిపెద్ద విజయవాడ జంక్షన్ రైల్వేస్టేషన్‌లో దాదాపు రూ.150 కోట్ల వ్యయంతో జరుగనున్న రూట్ రిలే ఇంటర్ లాకింగ్ సిగ్నలింగ్ వ్యవస్థ, ప్లాట్‌ఫారాల ఆధునీకరణ పనుల కోసం ఈ నెల 20 నుంచి 28 వరకు రైళ్ల రాకపోకలన్నీ పూర్తిగా నిలిచిపోనున్నాయి. దాదాపు రెండు వేలమంది కార్మికులు ఈ ఆధునీకరణ పనుల్లో పాల్గొంటున్నారు.

వ్యాపారంలో షేర్ల పేరిట మోసం

సైదాబాద్, సెప్టెంబర్ 19: వ్యాపారంలో షేర్లు కొంటే నెలనెల పెద్ద మెత్తంలో లాభాలనుపంచుతానని పలువురిని నమ్మించిన వ్యాపారి వారి నుండి కోట్ల రూపాయాలు దండుకొని పరారయ్యాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సైదాబాద్ క్రాంతినగర్‌లో నివసించే అబ్దుల్ రహమాన్(40)కు శంకేశ్వర బజార్‌లో ఎస్‌మార్ట్, సైదాబాద్‌లో ఎఆర్ ఫర్నీచర్స్ పేరిట వ్యాపారాలు ఉన్నాయి. నగరంలోను తనకు ఇతర బ్రాంచ్‌లు ఉన్నాయని, తన వ్యాపారంలో పెట్టుబడి పెట్టి షేర్లు కొంటే నెలకు ఒక లక్ష రూపాయాలకు 10వేల రూపాయాల రాబడి ఉంటుందని నమ్మించే వాడు. అతని మాటలు నమ్మిన అంబర్‌పేట్‌కు చెందిన నమీమూద్దీన్, అతని సోదరి రహమాన్ వద్ద లక్షల్లో పెట్టుబడి పెట్టారు.

రజకులను ఎస్సీ జాబితాలో చేర్పించేందుకు అసెంబ్లీలో చర్చించి తీర్మానించాలి

మేడ్చల్, సెప్టెంబర్ 19: రజకులను ఎస్సీ జాబితాలో చేర్చించుటకై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి తీర్మానం చేయాలని కోరుతూ తెలంగాణ రజక జెఎసి ఆధ్వర్యంలో శాసనసభపక్ష నేతలకు ఆయా పార్టీల అధ్యక్షులకు సోమవారం వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర రజక జెఎసి వ్యవస్థాపక అధ్యక్షులు పంజగారి ఆంజనేయులు ఆధ్వర్యంలో నాయకులు నగరంలోని ఆయా నేతల నివాసాలకు తరలివెళ్లి వినతిపత్రం అందజేశారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనసభ పక్ష నాయకుడు జానారెడ్డికి, టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు వినతిపత్రం అందజేశారు.

Pages