S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్టస్థ్రాయి తైక్వాండో పోటీలకు రత్నశ్రీ విద్యార్థులు

తెనాలి, సెప్టెంబర్ 19: రాష్ట్ర స్థాయి తైక్వాండో గేమ్స్ పోటీలకు స్థానిక చెంచుపేటలోని రత్నశ్రీ పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు పిఇడి బట్టు నాగరాజు తెలిపారు. ఈనెల 17న ఎస్‌జిఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రేపల్లె జూనియర్ కళాశాల ప్రాంగణంలో జిల్లా స్కూల్ తైక్వాండో గేమ్స్ నిర్వహించిన జిల్లా స్థాయి తైక్వాండో గేమ్స్ పోటీలలో తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు అండర్ -14 విభాగంలో పి గోకుల్, టి నితిన్‌సాయిలు రజితం, అండర్ -17 విభాగంలో వి హేమంత్‌కుమార్ ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణ పథకం సాధించినట్లు త్వరలో జరగనున్న రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలలో విజేతలు పోటీపడనున్నట్లు వివరించారు.

భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన అర్బన్ ఎస్పీ

తాడేపల్లి, సెప్టెంబర్ 19: జిల్లా అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్టి త్రిపాఠి మండల పరిధిలోని వడ్డేశ్వరంలో సోమవారం భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈనెల 24, 25, 26 తేదీల్లో తెలుగుదేశంపార్టీ శిక్షణా తరగతులు కెఎల్ వర్శిటీలో జరగనున్న నేపథ్యంలో ఆపార్టీ ఎంపిలు, ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సిలు ఈ శిక్షణా తరగతులకు హాజరుకానున్నందున సదరు ప్రజాప్రతినిదుల భద్రత దృష్ట్యా పోలీసు అధికారులు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తున్నారు. తెలుగుదేశంపార్టీ నాయకుల సమావేశ మందిరం, భోజన వసతి, ప్రయాణ మార్గం వంటి ప్రతి అంశాన్ని ఎస్పీ సర్వశ్రేష్టి త్రిపాఠి పరిశీలించారు.

ఉపాధి హామీలో దారితప్పిన నిధులు తక్షణమే రికవరీ

అమరావతి, సెప్టెంబర్ 19: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకలకు బాధ్యులైన ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకోవడంతో పాటు నగదు మొత్తాలను తక్షణమే రికవరీ చేస్తామని డిఆర్‌డిఎ పిడి ప్రసాద్ తెలిపారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉపాధి పనులపై ప్రజావేదిక నిర్వహించారు. ప్రజావేదికకు ఎండిఒ వై రాజగోపాల్ అధ్యక్షత వహించారు. పిడి ప్రసాద్, సత్తెనపల్లి క్లష్టర్ ఎపిడి సురేఖ, ప్రిసైడింగ్ ఆఫీసర్ కె రామారావు, ఎస్‌ఆర్‌పి సత్యనారాయణరెడ్డిల పర్యవేక్షణలో గ్రామాల వారీగా చేపట్టిన పనులపై సమీక్ష నిర్వహించి రికవరీకి ఆదేశించారు.

పరస్పర దాడుల్లో వ్యక్తి మృతి

పొన్నూరు, సెప్టెంబర్ 19: పాతకక్షల నేపథ్యంలో మండల పరిధిలోని జూపూడిలో సోమవారం జరిగిన దాడిలో తాడిశెట్టి కృష్ణ (45) మృతిచెందగా మరో వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం... మండల పరిధిలోని జూపూడి గ్రామానికి చెందిన తాడిశెట్టి కృష్ణ, గండికోట శ్రీనివాసరావు కుటుంబాల మధ్య పాతకక్షలున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం తాడిశెట్టి కృష్ణ తన ప్రత్యర్థి గండికోట శ్రీనివాసరావుపై దాడిచేయగా తలకు తీవ్రగాయమైంది.

రాష్ట్రానికి కేంద్రం షాక్

అమరావతి, సెప్టెంబర్ 19: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మరోసారి షాక్ ఇచ్చింది. రాష్ట్భ్రావృద్ధికి అన్ని విధాలా సాయం చేస్తామంటూ పదే పదే చెప్తూనే, నిబంధనల పేరుతో నిర్దయగా వ్యవహరిస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి వందకోట్ల డాలర్ల రుణానికి గ్యారంటీ ఇచ్చేందుకు మొద ట్లో సూత్రప్రాయంగా అంగీకరించిన కేంద్రం ఇప్పుడు ఆ రుణ మొత్తాన్ని ఏకంగా సగానికి తగ్గించి కేవలం 50కోట్ల డాలర్లకే అంగీకరించింది. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో పనిచేసే ఆర్థిక వ్యవహారాల విభాగం ఈ నిర్ణయం తీసుకుంది. ఒకే విడతలో ఇంత మొత్తానికి గ్యారెంటీ ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించవని స్పష్టం చేసింది.

రేపు ఢిల్లీకి రండి!

హైదరాబాద్, సెప్టెంబర్ 19: రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం ఈనెల 21న ఢిల్లీలో అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను ఆహ్వానించింది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించే అంశాలతో కూడిన అజెండాను ఇరు రాష్ట్రాలకు పంపించారు. కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా ఒక్కో రాష్ట్రం నుంచి ఐదుగురు ప్రతినిధులను సమావేశానికి ఆహ్వానించారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీటిపారుదల శాఖ మంత్రులతోపాటు, ఇరువురు ప్రధాన కార్యదర్శులు, నీటిపారుదల శాఖ అధికారులు హాజరవుతారు.

బిసిల్లో చేర్చాలని బలిజకాపులు...వద్దని బిసి సంఘ నేతలు

తిరుపతి, సెప్టెంబర్ 19: తాము సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా పూర్తిగా వెనుకబడి దుర్భర జీవితాన్ని గడుపుతున్నామని, తమను బిసిలో చేర్చాలంటూ బలిజ కాపునేతలు, అన్నివిధాలా ఎంతో అభివృద్ధిలో ఉన్న బలిజ కాపులను బిసి జాబితాలో చేర్చి తమ గొంతు కోయొద్దని బిసి సంఘ నేతలు జస్టిస్ మంజునాథ్ కమిషన్‌కు తమ వాదనలు వినిపిస్తూ వినతిపత్రం సమర్పించారు. కాపులను బిసి కులాల్లో చేర్చే అంశంపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ మంజునాథ కమిటీ రెండురోజలు పర్యటనలో భాగంగా సోమవారం నగర పాలకసంస్థలోని వైఎస్‌ఆర్ మందిరంలో బహిరంగంగా ప్రజాభిప్రాయాలు సేకరించి వారి వాదనలు విన్నది.

కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా

చిత్తూరు, సెప్టెంబర్ 19 : జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండి వడ్డిస్తున్న కార్మికులు ధర్నా చేపట్టారు. మధ్యాహ్న భోజన తయారి పథకాన్ని ఇస్కాన్ థార్మిక సంస్థకు అప్పగించరాదంటూ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు పలుప్రాంతాల నుంచి పెద్దఎత్తున భోజన తయారీ కార్మికులు పాల్గొన్నారు. ఈ క్రమంలో కార్మికులు కలెక్టరేట్ ప్రధాన గేటు ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఫిర్యాదుల దినంలో పాల్గొనేందుకు వస్తున్న బాధితులు, కలెక్టరేట్‌లో పనిచేసే ఉద్యోగులను లోనికి పోకుండా అడ్డుకున్నారు.

పరిశ్రమల అభివృద్ధికి బ్యాంకర్ల కృషి

తిరుపతి, సెప్టెంబర్ 19: పరిశ్రమల స్థాపన, అభివృద్ధి, పారిశ్రామిక సంబంధిత కార్యక్రమాలు సజావుగా సాగేందుకు బ్యాంకర్లు ఎంతగానో కృషి చేస్తున్నారని రిజర్వ్‌బ్యాంకు రీజనల్ డైరెక్టర్ ఆర్‌ఎన్ దాష్ అన్నారు. బ్యాంకర్లు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రతినిధులతో సోమవారం సాయంత్రం స్థానిక కెనె్సస్ హోటల్‌లో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రకాల పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో బ్యాంకర్లు తమ వంతు పాత్ర పోషిస్తున్నారన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే సంబంధిత పరిశ్రమల నిర్వాహకులతో చర్చించి పరిష్కరించుకోవాలని బ్యాంకర్లకు సూచించారు.

బాల్య వివాహాలతో జీవితాలు నాశనం చేసుకోవద్దు

నాగలాపురం, సెప్టెంబర్ 19: బాల్య వివాహాలు చేసుకొని జీవితాలను నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య సూచించారు. సోమవారం నాగలాపురం మండల కేంద్రంలోని ఓ కల్యాణ మండపంలో నాగలాపురం, పిచ్చాటూరు మండలాలకు చెందిన ఐసిడిసిఎస్, ఎంపిడివో, తహశీల్దార్, విద్యార్థులతో ఆయన బాల్యవివాహాలపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే తలారి ఆదిత్య మాట్లాడుతూ చిన్న వయసులో బాల్య వివాహాలు చేసుకొని తమ జీవితాలు నాశనం చేసుకోవద్దని కోరారు. అదేవిధంగా కొంతమంది పేదరికం వల్ల చిన్న వయసులోనే తమ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారని చెప్పారు.

Pages