S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు తెలంగాణ మంత్రిమండలి భేటీ

హైదరాబాద్, ఆగస్టు 28: మంగళవారం నుంచి తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం సాయంత్రం మంత్రిమండలి సమావేశం కాబోతోంది. వస్తుసేవల పన్ను (జిఎస్‌టి) బిల్లుకు మద్దతుగా తీర్మానం చేయడానికి సమావేశం కాబోతున్న శాసనసభలో చర్చించే అంశాలపై మంత్రిమండలి చర్చించనుంది. అలాగే కొత్త జిల్లాల ముసాయిదా, గోదావరిపై నిర్మించే ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం తదితర అంశాలపై కూడా శాసనసభలో చర్చించనున్నట్టు సమాచారం. శాసనసభలో చర్చించబోయే అంశాలపై మంత్రిమండలి చర్చించనున్నట్టు తెలిసింది.

డిపిఆర్ లేకుండా టెండర్లా?

హైదరాబాద్, ఆగస్టు 28: కాళేశ్వరం ప్రాజెక్టుకు డిపిఆర్ లేకుండానే టెండర్లా? అని కాంగ్రెస్ నాయకుడు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ విస్మయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఒక రోడ్డు వేయాలనుకున్నా, ఒక చిన్న గది నిర్మించాలనుకున్నా డిపిఆర్ ఉంటుందని, అలాంటప్పుడు 83,000 కోట్ల రూపాయలతో చేపట్టే కాళేశ్వరం ప్రాజెక్టుకు డిపిఆర్ ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. నాడు బషీర్‌బాగ్ కాల్పుల్లో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని బషీర్‌బాగ్‌లోని స్మారక స్థూపం వద్ద ఆయన నివాళి అర్పించారు.

‘మహా’ ఒప్పందానికి నిరసనగా నేడు టిడిపి ర్యాలీ...్ధర్నా

హైదరాబాద్, ఆగస్టు 28: మహారాష్టత్రో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం కారణంగా తెలంగాణకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నిస్తూ తెలుగుదేశం పార్టీ సోమవారం ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనున్నది. ఇందులో భాగంగానే టిడిపి కేంద్ర కార్యాలయం నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఊరేగింపులో పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపి రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు పాల్గొంటారు. అనంతరం ఎర్రమంజిల్‌లోని జల సౌధ వద్ద ధర్నా నిర్వహిస్తారు.

నాణ్యమైన పరికరాలు అందుబాటులోకి రావాలి

హైదరాబాద్, ఆగస్టు 28: తక్కువ ఖర్చు, ఎక్కువ నాణ్యత కలిగిన మోకాలు మార్పిడి పరికరాలు అందుబాటులోకి రావాలని ఆర్థోపెడిక్ సర్జన్‌లు అభిప్రాయపడ్డారు. ఆదివారం అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన ఆర్థ్రోప్లాస్టీ, ఆర్థ్రోస్కోపి సమ్మిట్- 2016 సదస్సుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మోకాలు మార్పిడి శస్త్ర చికిత్సా నిపుణులు హాజరుకావడం జరిగింది.

అమరావతి రాజధానిపై అవాకులు చవాకులు పేలకండి

హైదరాబాద్, ఆగస్టు 28: అమరావతి రాజధానిలో అద్భుతమైన నిర్మాణాలు చేపట్టాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంకల్పాన్ని నీరుకార్చే ప్రయత్నం చేయవద్దని తెలుగుదేశం అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక వైకాపాకు హితవుచెప్పారు. అమరావతిని అడ్డుకునేందుకు అన్నిరకాలుగా వైకాపా దిగజారిందన్నారు. ఆదివారం ఆమె ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు అన్ని జిల్లాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అమరావతిని ఎంపిక చేశారన్నారు. ఎన్నికలకు ముందు వైకాపా నేతలు నల్లమల అడవుల వద్ద భూములు కొనుగోలు చేశారని, తామే అధికారంలోకి వస్తామని విర్రవీగారన్నారు.

విమానాశ్రయాల్లో భద్రతకు ఢోకా లేదు

హైదరాబాద్, ఆగస్టు 28: భారత విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. బ్రెజిల్, ఇస్తాంబుల్‌లో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో సిఐఎస్‌ఎఫ్ (కేంద్ర పరిశ్రమల భద్రతా దళం) ప్రత్యేక శిక్షణతో దేశంలోని విమానాశ్రయాల్లో భద్రతను పెంచింది. క్విక్ రియాక్షన్ టీమ్స్ ఉగ్రదాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని, విమానాశ్రయాల్లో భద్రతకు ఢోకా లేదని సిఐఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు.

నియోజకవర్గం వెలుపల వ్యయం వ్యక్తిగతం కాదు

న్యూఢిల్లీ, ఆగస్టు 28: ఒక పార్టీకి చెందిన ‘స్టార్ క్యాంపెయినర్’ తాను పోటీ చేస్తున్న నియోజకవర్గం వెలుపల తన పార్టీ కోసం ప్రచారం చేయడానికి హెలికాప్టర్లలో ప్రయాణం చేస్తే అందుకు అయ్యే వ్యయం ఆయన వ్యక్తిగత ఎన్నికల ప్రచార వ్యయం పరిధిలోకి రాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేంద్ర మాజీ మంత్రి అర్జున్ సింగ్ తనయుడు, మధ్యప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్యే అజయ్ అర్జున్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు జె.చలమేశ్వర్, ఎ.ఎం.సప్రేతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది.

షూటర్ కూతురికి తండ్రి ఖరీదైన గిఫ్ట్

అహ్మదాబాద్, ఆగస్టు 28: అతనో ఆటో రిక్షా డ్రైవర్. రోజూ ఆటోనడుపుకుంటే తప్ప జీవితం గడవడం కష్టం. జాతీయ స్థాయిలో మంచి షూటర్‌గా ఎదిగిన కూతురు మరింత రాణించేందుకు తాను ఆమె వివాహం కోసం దాచిపెట్టిన అయి దు లక్షల రూపాయలను ఖర్చు చేసి జర్మన్ తయారీ రైఫిల్‌ను బహుమతిగా కొనిచ్చాడు. మనిలాల్ గోహిల్(50), అనే ఈ ఆటో డ్రైవర్ కూతురు మిట్టల్ (27) 2012నుంచి షూటింగ్ పోటీల్లో పాల్గొంటోంది. రైఫిల్ క్లబ్ నుంచి రైఫిల్‌ను అరువుగా తెచ్చుకుని పోటీల్లో పాల్గొంటూ వచ్చింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించాలంటే ప్రపంచ అత్యున్నత శ్రేణి రైఫిల్ ఆమెకు అవసరమని గోహిల్ గుర్తించాడు.

కాశ్మీర్‌లో కర్ఫ్యూ ఎందుకు తొలగించలేదు?

న్యూఢిల్లీ, ఆగస్టు 28: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మన్ కీబాత్ కార్యక్రమంలో భాగంగా కాశ్మీర్ సమస్యపై వ్యక్తం చేసిన అభిప్రాయాలను కాంగ్రెస్, జెడి(యు)లు తప్పుబట్టాయి. 5 శాతం మంది మాత్రమే కాశ్మీర్‌లో హింస ను ప్రేరేపిస్తున్నారని ప్రధాని మోదీ అనుకుంటున్నట్లయితే ఇంకా అక్కడ ఎందుకు కర్ఫ్యూను ఎత్తివేయడం లేదని ప్రశ్నించారు. ‘కేవలం 5 శాతం మందే అల్లర్లు సృష్టిస్తున్నారని ప్రధాని భావిస్తూ ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని ఎందుకు ఆపలేదు? 51 రోజులుగా కర్ఫ్యూను ఎందుకు కొనసాగిస్తున్నారు’ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మనీష్ తివారీ ట్విట్టర్‌లో ప్రశ్నించారు.

నరుూం అక్రమాలపై సిబిఐ విచారణ

బీబీనగర్, ఆగస్టు 28: గ్యాంగ్‌స్టర్ నరుూం అక్రమాలపై సిబిఐ చేత న్యాయ విచారణ జరిపించాలని నల్లగొండ ఎంఎల్‌సి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ కమిటీతో ఎలాంటి న్యాయం జరగదని, సిట్ అధికారులు చేస్తున్న విచారణ నిజానిజాలు బయటికి తేవాలని, 20 సంవత్సరాల నుండి నరుూం కూడబెట్టిన 20 వేల కోట్ల రూపాయల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని ఆయన డిమాండ్ చేశారు.

Pages