S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోజనం

‘త్రీ ఇడియట్స్’ అన్న సినిమాలో ఓ ప్రొఫెసర్ ఏ మాత్రం సమయం వృథా చేయకుండా ఒకేసారి ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు. చాలా పనులు చేసుకోవాలి. కానీ భోజనం చేసేటప్పుడు వేరే పనులు చేయకూడదు.

-జింబో 94404 83001

పల్లెకుపోదాం పాట రీమిక్స్

అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగా రూపొందిన దేవదాసు చిత్రంలో ‘పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో’ అనేది ఎవర్‌గ్రీన్ సాంగ్. ఈపాట ఇప్పుడు రీమిక్స్‌గా ‘ఆటాడుకుందాం రా’ చిత్రంలో వినిపించబోతోంది. సుశాంత్ కథానాయకుడిగా అన్నపూర్ణా స్టూడియోస్ సమర్పణలో శ్రీనాగ్ కార్పొరేషన్, శ్రీ జీ ఫిలింస్ పతాకాలపై జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న చిత్రం ‘ఆటాడుకుందాం రా’ (జస్ట్ చిల్). ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పాటలు మినహా పూర్తయింది. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘పల్లెకు పోదాం పారును చూద్దాం’ పాటను రీమిక్స్ చేశారు.

పెళ్లికళ వచ్చేసిందే బాలా!

దక్షిణాదిలో చాలాకాలం పాటు క్రేజీ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన గోవా బ్యూటీ ఇలియానాకు బాలీవుడ్‌పై హీరోయిన్‌గా వెలగాలనే ఆశ కలిగింది. దాంతో ఇక్కడ అవకాశాలను కాదనుకుని బాలీవుడ్‌కు చెక్కేసింది. బాలీవుడ్‌లో వచ్చిన రెండు మూడు సినిమాలు ఈమె కెరీర్‌కు పెద్దగా వర్కవుట్ కాలేదు. దాంతోపాటు చేతిలో పెద్దగా అవకాశాలు లేవు. మళ్లీ సౌత్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నాలు చేసిన ఇలియానా ప్రస్తుతం అక్షయ్‌కుమార్ సరసన ‘రుస్తుం’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాపైనే చాలా ఆశలు పెట్టుకుంది. మరోవైపు సౌత్ నుండి అవకాశాలు వస్తున్నా కూడా కాదని చెబుతోందట. దానికి కారణం ఆమె ప్రియుడు ఆండ్రూ అని తెలిసింది.

H2O

‘నది పొంటి (వెంట) మనిషి ఉండేవాడు
వాగు వెంట అతని మనసుండేది
నీటి ధార వెనక ఆ మనిషి రాజేసుకునే నిప్పుండేది
కానీ
ఇప్పుడు ఆ మనిషి నీటి వెనకా లేడు
కన్నీటి వెనకా లేడు
మనిషి రోడ్డు వెనక ఉన్నాడు
రోడ్డు పొంటి ఉన్నాడు’
అన్నాడు ఓ తెలుగు కవి కన్న ‘రోడ్డు’ అన్న కవితలో. మనిషి జీవితం నీటి దగ్గర మొదలయ్యేది. ఎక్కడ వాగు ఉంటే, ఎక్కడ నది ఉంటే అక్కడ నాగరికత పరిఢవిల్లేది. ఇప్పుడు అంతా రోడ్డుమయం. అవుటర్ రింగ్ రోడ్డూ, ఈ రోడ్డూ ఆ రోడ్డూ. వీటి చుట్టూ మనిషి జీవితం పరిభ్రమిస్తుంది.

బిగ్ జెయింట్‌కు జగపతిబాబు డబ్బింగ్

హాలీవుడ్‌లో అద్భుత చిత్రాల సృష్టికర్త స్టీవెన్స్ స్పీల్‌బర్గ్ దర్శకత్వంలో వస్తున్న మరో అద్భుత చిత్రం ‘ది బిగ్ ఫ్రెండ్లీ జెయింట్’ (ది బి ఎఫ్ జి). డిస్నీ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందించిన ఈ చిత్రాన్ని దేశ వ్యాప్తంగా ఈనెల 15న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రకు నటుడు జగపతిబాబు డబ్బింగ్ చెప్పడం విశేషం. ఓ పాత్రకు డబ్బింగ్ చెప్పడం జగపతిబాబుకు ఇదే తొలిసారి. ఓ ఫ్రెండ్లీ మహాకాయుడికి ఒక చిన్నపిల్లకు మధ్య జరిగే అద్భుతమైన కథతో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

జార్జియాలో శాతకర్ణి యుద్ధం

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రాత్మక 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి. ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వై.రాజీవ్‌రెడ్డి, జి.సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ జార్జియాలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వివరాలు తెలియజేస్తూ.. ‘ఈనెల 4నుండి ఈ చిత్రం మూడో షెడ్యూల్ జార్జియాలో ప్రారంభం కానుంది. ఇందులో క్లైమాక్స్ చిత్రీకరణ జరపనున్నాం. శాతవాహన సైనికులకు, గ్రీకు సైనికులకు మధ్య జరిగే భారీ పోరాట సన్నివేశాలు జార్జియాలోని వౌంట్ కజ్బెగ్ పర్వతంవద్ద చిత్రీకరిస్తాం.

గోపీచంద్‌తో సంపత్ నంది

‘రచ్చ’ సినిమాతో మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్న దర్శకుడు సంపత్‌నంది ఆ తర్వాత పవన్‌కళ్యాణ్ నటించిన ‘గబ్బర్‌సింగ్’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందే ‘గబ్బర్‌సింగ్-2’కోసం పవన్‌కళ్యాణ్‌తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. చాలాకాలం సినిమాకోసం వెయిట్ చేసిన సంపత్‌నంది ఆ సినిమా కాదనుకుని రవితేజతో ‘బెంగాల్ టైగర్’ చిత్రా న్ని తెరకెక్కించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఇప్పుడు మళ్లీ మెగా హీరోలతో సినిమా చేయడానికి ప్లాన్ చేశాడు. అది కుదరకపోవడంతో తాజాగా గోపీచంద్‌కు కథ చెప్పి ఒప్పించాడని తెలిసింది. ఇటీవల వీరిద్దరి మధ్య చర్చ లు జరిగాయని సమాచారం. ప్రస్తుతం గోపీచంద్ ‘ఆక్సిజన్’ చిత్రం లో నటిస్తున్నాడు.

ఫిలిమ్‌నగర్ సొసైటీ కోశాధికారిగా బాలరాజు

ఫిలిమ్‌నగర్ హౌసింగ్ సొసైటీకి కోశాధికారిగా నిర్మాత జె.బాలరాజు ఎంపికయ్యారు. అధ్యక్షులు జి.ఆదిశేషగిరిరావు, ఉప కార్యదర్శి కె.సూర్యనారాయణ, ఉపాధ్యక్షులు విజయ్‌చందర్‌లు బాలరాజును కోశాధికారిగా ఎంపిక చేశారు. తెలుగు, కన్నడ భాషల్లో పలు చిత్రాలు నిర్మించిన బాలరాజు ఎన్.టి.ఆర్, ముని మనవడుతో దాన వీర శూర కర్ణ చిత్రాన్ని నిర్మించారు. డి.రామానాయుడు ఆశీస్సులు తనకు ఎప్పుడూ ఉంటాయని కోశాధికారిగా తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని ఆయన తెలిపారు.

బిచ్చగాడు హిట్ నమ్మలేని నిజం

‘బిచ్చగాడు’ చిత్రం ఇంత గొప్ప విజయం సాధించడాన్ని నమ్మలేకపోతున్నానని, ఈ సినిమా ఇంత గొప్పగా విజయవంతం కావడానికి ఆరుగురు కారణమని హీరో, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని తెలిపారు. తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలింస్ పతాకంపై విజయ్ ఆంటోని, సత్తనా టైటస్ జంటగా ఫాతిమా ఆంటోని రూపొందించిన చిత్రం ‘బిచ్చగాడు’. ఈ చిత్రాన్ని తెలుగులో చదలవాడ తిరుపతిరావు తెలుగులో అందించారు. ఈ చిత్రం 50 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా హైదరాబాద్ అర్థశతదినోత్సవ వేడుకలు జరిపారు.

అత్తారింట్లో పాటలు

నూతన తారలతో అంజన్ కళ్యాణ్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘అత్తారిల్లు’. ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో అంజన్ కె.కళ్యాణ్ రూపొందించారు. సినిమాకు సంబంధించిన పాటల సీడీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత అంజన్ కె.కళ్యాణ్ మాట్లాడుతూ, తమ యూనిట్ సహకారంతో ఈ సినిమాను అందరికీ నచ్చేలా తీర్చిదిద్దామని, ప్రతిభ వుండి సరైన అవకాశాలు రాని ఎంతోమందిని తీసుకొని ఈ సినిమా చేశామని, ఈ సినిమా నచ్చి నేపథ్య సంగీతం మణిశర్మ అందించారని తెలిపారు.

Pages