S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగన్నాథ రథచక్రాల్ వస్తున్నాయ్..

వస్తున్నాయ్...వస్తున్నాయ్
జగన్నాథ రథ చక్రాల్...వస్తున్నాయ్!
పూరీతీరంలో కొలువుదీరిన పురుషోత్తముడు అధిరోహించగా...
అన్నాచెల్లితో కలసి వస్తున్న జగన్నాథుని రథచక్రాల్....వస్తున్నాయ్..
జీవనయాత్రలో ఒక్కసారైనా ఆ రథచక్రాలను తాకి పరవశించిపోవాలని తపించే భక్తకోటి తరలివస్తోంది..ఆ చక్రదర్శనంకోసం...ఆ జగన్నాథ రథయాత్రకోసం...

-రామానుజం

ఈ పిల్లులకు బొచ్చు ప్రత్యేకం

దట్టమైన బొచ్చుతో, పొట్టవద్ద సంచీల్లా వేళ్లాడేలా ఉండటం వీటి ప్రత్యేకత. సముద్రమట్టానికి 9500 అడుగుల ఎత్తున మంచు ప్రాంతాల్లో ఇవి జీవించడానికి ఇష్టపడతాయి. పొడవైన కోరపళ్లు వీటికి అదనపు బలం. చదునైన ముఖం, పొట్టి చెవులు, తీక్షణమైన చూపువల్ల ఇవి మిగతా పిల్లులకన్నా భిన్నంగా కన్పిస్తాయి. అన్నట్లు వీటి పేరు...‘పల్లాస్ క్యాట్స్’. మధ్య ఆసియాలో ఎక్కువగా కన్పిస్తాయి. మిగతా పిల్లులకు కనుపాపలు నిలువగా ఉంటే వీటికి వృత్తాకారంలో ఉంటాయి. మిగతా ఏ జాతి పిల్లులకూ లేనంత ఒత్తుగా, వీటి శరీరం, తోకలపై బొచ్చు ఉంటుంది. హఠాత్తుగా శత్రువులపై దాడి చేసి వేటాడటం వీటికి అలవాటు.

భారతి

ఇవి ఎలుకలు కావు!

ఈ ఫొటోలో కన్పిస్తున్న జీవి అచ్చం ఎలుకలా కన్పిస్తోంది కదూ!. కానీ వాటితో దీనికి ఏమాత్రం సంబంధం లేదు. అమెరికా, కొన్ని ఆసియా, ఐరోపా దేశాల్లో కన్పించే ఈ క్షీరదాల పేరు ‘పికా’. చాలా చిన్నగా ఉండే ఇవి నిజానికి కుందేళ్లకు దగ్గరి బంధువుగా చెప్పుకోవచ్చు. వీటిని ‘విజిలింగ్ హేర్స్’ అని పిలుస్తారు. ప్రమాదం పొంచి ఉన్నప్పుడ్డు అవి ఓ విధమైన శబ్దం చేస్తూ వాటి బొరియలు, అవి ఏర్పాటు చేసుకున్న కంతల్లోకి దూకుతాయి. అందువల్లే వాటికి ఈ పేరు వచ్చింది. శీతాకాలం, వర్షాకాలంలో ఆహారం కొరత లేకుండా ఉండేందుకు ఇవి జాగ్రత్తగా ఆహారాన్ని దాచుకుంటాయి.

ఎస్.కె.కె.రవళి

ఇవి టమాటాలే!

ప్రపంచంలో దాదాపు 9000 రకాల టమాటాలు ఉన్నాయట తెలుసా!. మనకు తెలిసిన టమాటాలు ఆకుపచ్చ, ఎరుపు రంగులో ఉంటాయి కదా...కానీ పసుపు, తెలుపు, నలుపు, ఊదా, గోధుమ, పర్పల్ రంగులో ఉండే టమాలుకూడా ఉన్నాయి తెలుసా. వీటిలో ఉండే లైసోపిన్ వల్ల ఇవి తింటే గుండెకు మంచిది. టమాటాల ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో ఉంది. భారత్ రెండోస్థానంలోను, అమెరికా మూడో స్థానంలోనూ ఉన్నాయి. కానీ వీటిని తినడంలో సగటు అమెరికన్ ముందుంటాడు. వారికి టమాటాలంటే తెగ ఇష్టం. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ టమాటాలు తినేది అమెరికనే్ల. నిజానికి ఓహియోవంటి రాష్ట్రాల అధికార ఫలం టమాటా. వృక్షశాస్త్రం ప్రకారం టమాటా ఓ పండు. కాయగూర కాదు.

ఎస్.కె.కె.రవళి

పిల్లల మధ్యన

ప్రకాశం ఇనిస్టిట్యూట్ అని ఒక సంస్థ ఉంది. వాళ్లు ఒక సందర్భంలో సైన్స్ రచనలను గురించి వారంపాటు ఒక వర్క్‌షాప్ నడిపించారు. నేను అప్పుడు ఉద్యోగంలో ఉన్నాను. కనుక ప్రతి నిత్యమూ వెళ్లి అక్కడ పాల్గొనే అవకాశం లేదు. ఆ కార్యక్రమాన్ని ప్రతిపాదించి నడిపించిన పెద్దమనిషికి నామీద మంచి అభిప్రాయమే ఉన్నట్టుంది. ఒకరోజు నా ఉపన్యాసం కూడా ఏర్పాటు చేశారు. అప్పుడు నేను మాట్లాడుతూ బాల సాహిత్యం గురించి ఒక గట్టి అభిప్రాయాన్ని బయటపెట్టాను. సీనియర్ పాత్రికేయులు వరదాచార్యులుగారు ఆ రోజు అక్కడ ఉన్నారు. నా తరువాత ఆయన మాట్లాడారు.

కె.బి. గోపాలం

కోర్టులో విప్లవ ప్రచారం (భగత్‌సింగ్-35)

తిరుగుబాట్లు, ధిక్కారాలు తెల్లదొరలకు కొత్తకావు. కుట్రలు, కుతంత్రాలతో మాయచేసి భారతదేశాన్ని ఆక్రమించినది మొదలుకుని ఎందరో దేశభక్తులు వారికి ఎదురు తిరుగుతూనే ఉన్నారు. దొరికిన వారిని దొరికినట్టు కారాగారాల్లో బంధించి, చిత్రహింసలు పెట్టి, తప్పుడు కేసులు మోపి ఉరికంబాలెక్కించి అవిధేయతను విదేశీ రాకాసులు యధేచ్ఛగా అణచివేస్తూనే ఉన్నారు. బలవంతుడిదే రాజ్యం కాబట్టి తిరగబడ్డవారిని ఎంతలా కాల్చుకుతిన్నా, ఎన్ని ఘాతుకాలకు పాల్పడ్డా అదంతా చట్టబద్ధమైన న్యాయ పరిపాలనలో భాగంగానే బ్రిటిషు సర్కారు చిత్రించగలిగింది.

ఎం.వి.ఆర్.శాస్ర్తీ

మహావిజేత 10

వీటిలో ప్రముఖమైనది - గిరిజనుల పాడిపంటల ఫలసాయాన్ని మెరుగుపరచడం. మొక్కలను నాటి, వృక్షాలను పెంచీ వాటి సంబంధమైన ఫల కుసుమాల ఉత్పత్తీ, పుట్టతేనె, ఔషధీయ వస్తు సంబారాల తయారీ వంటి రాబడినిచ్చే అంశాల పట్ల శ్రద్ధ తీసుకున్నాడు. ప్రజలంతా సంతోషించి నూతన ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని ప్రకటించారు. అభివృద్ధిలో వారి భాగస్వామ్యం స్వచ్ఛందంగా అందుతున్నది. దీనితో వారి ఆర్థిక పరిస్థితి మెరుగయింది. రాజ్యానికి రావలసిన షడ్భాగము, పన్నులు, అనుపులు - వలసినంతగా వచ్చినై. వీరశివుని పాలన నాటికన్నా మెరుగయిన బ్రతుకులను సుఖ సంతోషాలతో గడుపుతున్నారు ప్రజలు.

-విహారి 98480 25600

డోప్‌ ఊబిలో రష్కా!

ప్రపంచ క్రీడా రంగాన్ని కుదిపేసిన సంఘటనల్లో రష్యా వ్యూహాత్మక డోపింగ్ అగ్రస్థానాన్ని ఆక్రమించింది. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (్ఫఫా) అధ్యక్షుడు సెప్ బ్లాటర్, ఉపాధ్యక్షుడు మైఖేల్ ప్లాటినీపై ఎనిమిదేళ్ల వేటు పడడం సంచలనాన్ని సృష్టిస్తే, రష్యా వ్యూహాత్మక డోపింగ్ అంశం ప్రకంపనలకు కారణమైంది. ఒలింపిక్స్ వంటి మేజర్ ఈవెంట్స్‌లో పతకాలను కొల్లగొట్టడానికి వీలుగా రష్యా ప్రభుత్వం అథ్లెట్లకు ఉత్ప్రేరకాలను ఉద్దేశపూర్వకంగానే ఇచ్చి, ప్రోత్సహించిందని ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) ఆధ్వర్యంలోని కమిటీ సాక్ష్యాధారాలతో బయటపెట్టింది.

-శ్రీహరి

ఫెదరర్ స్పెషల్

ప్రపంచ మాజీనంబర్ వన్ రోజర్ ఫెదరర్‌ది విలక్షణ శైలి. తనదైన ఆట తీరుతో అతను లక్షలాది మందిని ఆకట్టుకున్నాడు. ఫెదరర్ కొట్టిన ఒక ‘ట్రిక్ షాట్’ చాలా కాలంగా యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తున్నది. ఒక కంపెనీ వ్యాపార ప్రకటనలో పాల్గొన్న ఫెదరర్ అద్భుతమైన సర్వీస్ చేశాడు. అతను కొట్టిన బంతి వేగంగా వెళ్లి, స్టాండ్స్‌లో ఉన్న ఓ వ్యక్తి తలపై పెట్టుకున్న క్యాన్‌కు తగిలింది. ఒకసారి కాదు.. వరుసగా రెండు సార్లు ఫెదరర్ ఆ క్యాన్‌కు గురి చూసి సర్వ్ చేశాడు. ఆరెండు పర్యాయాలు అది కింద పడింది. ఇది ట్రిక్ షాటా? కాదా? అన్నది అప్రస్తుతం. ఈ విషయంపై ఫెదరర్‌ను విలేఖరులు స్వయంగా అడిగినా అతను నేరుగా సమాధానం చెప్పలేదు.

నీ పాటని నే మింగేశా!

పూలకి
రంగుల్ని పులుముతున్నాయ్
సీతాకోకలు!
మబ్బులకు
రెక్కల్ని తొడుగుతున్నాయ్
గాలి తెమ్మెరలు!
మనిషి పడిపోకుండా
వాని పాదాల్ని పట్టుకు
నడిపిస్తోంది
ధరిత్రి!
చెట్టుకొమ్మ
పచ్చని పతంగుల్ని
ఎగరేస్తోంది
సంక్రాంతి సంబురంగా!
తాను పారేసుకున్న పాటని
గూట్లో వెదకుతోంది పక్షి!
‘ఇంద! నా నోట్లో చూడు! నే మ్రింగేశా!’
నంటో తన నోరంతా తెరుస్తోంది
దాని పిల్ల పక్షి!
*

-గన్ను కృష్ణమూర్తి 9247227087

Pages