S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాగణపతి విగ్రహప్రతిష్ఠకు భూమిపూజ

హైదరాబాద్: ఖైరతాబాద్‌లో మహాగణపతి విగ్రహ ప్రతిష్ఠాపనకు శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా భూమిపూజ జరిగింది. బిజెపి ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కొబ్బరికాయ కొట్టి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కాగా, ఖైరతాబాద్‌లో విగ్రహం ఎత్తును తగ్గించాలని పోలీసులు ఒత్తిడి తేవడాన్ని తాము సహించేది లేదని భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ హెచ్చరించింది. భక్తుల మనోభావాలను గౌరవించేలా ప్రభుత్వం పోలీసులకు, మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కమిటీ సభ్యులు కోరారు.

తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణ టెట్- 2016 పరీక్షా ఫలితాలను శుక్రవారం ఉదయం విడుదల చేశారు. టెట్ పేపర్ 1లో 54.45 శాతం మంది, పేపర్ 2లో 24.04 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు.

స్కూల్‌బస్ కిందపడి ఎల్‌కెజి విద్యార్థి మృతి

హైదరాబాద్: స్కూల్ ఆవరణలో బస్సును రివర్స్ చేస్తుండగా దాని కింద ప్రమాదవశాత్తూ పడి నాలుగేళ్ల విద్యార్థి మరణించాడు. ఈ విషాదం చింతల్ వద్ద వివేకానందనగర్‌లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు స్కూల్ బస్‌ను రివర్స్ చేస్తుండగా ఎల్‌కెజి విద్యార్థి జశ్వంత్ రెడ్డి దాని కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

పదేళ్ల కొడుకును చంపిన కన్నతండ్రి!

మెదక్: పది రూపాయలను దొంగిలించాడని ఆగ్రహం చెందిన ఓ కన్నతండ్రి తన పదేళ్ల కుమారుడిని గొంతు నులిమి చంపేసిన దారుణ ఘటన మెదక్ జిల్లా సదాశివపేట మండలం గొల్లగూడెంలో శుక్రవారం వెలుగు చూసింది. ఆవేశానికి లోనై కొడుకును చంపిన సత్తెయ్యను పోలీసులు అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కమిషన్ వద్దకు పూర్తి సమాచారంతో రావాలి

శ్రీకాకుళం, జూన్ 16: సమాచార హక్కు చట్టం కమిషనర్ ముందు హాజరయినప్పుడు పౌర సమాచార అధికారులు పూర్తి సమాచారంతో హాజరవ్వాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టంకమిషనర్ తాంతియాకుమారి పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆర్టిఐ కోర్టు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాచారం అడిగిన ప్రతీ ఒక్కరికీ పిఐవోలు శతశాతం సమాచారం అందించాలన్నారు. దరఖాస్తుదారులు అధికారులు పనిచేసే సమయాన్నివృధా చేయకుండా ప్రజా ప్రయోజనం కోసం సమాచారం అడగాలన్నారు. గురువారం నిర్వహించిన ఆర్‌టిఐ కోర్టులో 25 కేసులు పరిష్కరించినట్టు తెలిపారు.

ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత

శ్రీకాకుళం(కల్చరల్), జూన్ 16: భక్తితత్వం పెంపొందించుకుంటే మానసిక ప్రశాంతత పొందడం సులభతరమని ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. జ్యేష్ఠశుద్ధ ఏకాదశి సందర్భంగా స్థానిక బ్యాంకర్స్ కాలనీలోని శివబాలాజీ దేవాలయంలో సప్తమవార్షికోత్సవం పురస్కరించుకొని గురువారం నిర్వహించిన వార్షిక కల్యాణోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధ్యాత్మిక జీవన విధానం మానవునిలో మార్పునకు, మంచి నడవడికి దోహదపడుతుందన్నారు. నేతేటి మారుతిశర్మ, గోపీ నంబాళ్ల సీతారామాచార్యుల ఆధ్వర్యంలో తొలుత అమరనాథేశ్వర, ఉమాదేవి అమ్మవార్ల కల్యాణం అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని కల్యాణం వైభవంగా నిర్వహించారు.

‘వెంకటేశ్వర ఇంజినీరింగ్’ను పరిశీలించిన ‘నాక్’

ఎచ్చెర్ల, జూన్ 16: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలను ఈనెల 13,14,15వ తేదీల్లో న్యాక్ బృందం పరిశీలించినట్టు ప్రిన్సిపల్ ఎం.గోవిందరాజులు, వికాస్ ఎడ్యుకేషన్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ బుడుమూరు శ్రీరామమూర్తి స్పష్టంచేశారు. గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వీరు మాట్లాడుతూ న్యాక్ బృందం చైర్మన్‌గా డాక్టర్ ఆదినారాయణ కళానిధి(పూర్వపు వీసి అన్నావర్శిటీ), కో ఆర్డినేటర్ డాక్టర్ అమల్‌కుమార్ (్భవనగర్ యూనివర్శిటీ ఎంబిఏ ప్రొపెసర్)లు సభ్యులుగా డాక్టర్ విలాస్ కర్జినీలు కలసి ఇంజినీరింగ్ కళాశాలలో వివిధ అంశాలపై పరిశీలన జరిపినట్లు పేర్కొన్నారు.

20న ఏరువాక పౌర్ణమి

శ్రీకాకుళం, జూన్ 16: జిల్లాలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ఈనెల 20న నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం తెలిపారు. ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్సవంగా నిర్వహించేందుకు నిర్ణయించిందన్నారు. ఏరువాక పౌర్ణమి కార్యక్రమ నిర్వహణపై గురువారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్నారు.

రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుకు చర్యలు: విప్

ఆమదాలవలస, జూన్ 16: మండలంలోగల తాళ్లవలస గ్రామం వద్ద బీసీ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విప్ రవికుమార్ తెలిపారు. గురువారం సాయంత్రం ఇక్కడ రూ.1.25కోట్ల వ్యయంతో నిర్మించిన కస్తూరిబా పాఠశాలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గానికి ప్రధాన రెసిడెన్షియల్ పాఠశాలకు సుమారు 1500 మంది విద్యార్థులకు చదువుకునేందుకు వీలు కల్పిస్తూ నియోజకవర్గానికి ప్రధాన రెసిడెన్షి యల్ పాఠశాలగా నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

మలకాంలో చమురు పొరలు!

పొందూరు, జూన్ 16: మండలంలోని మలకాం గ్రామాల్లో గురువారం తవ్విన తవ్వకాల్లో చమురు పొరలు బయటపడ్డాయి. కిరోసిన్, పెట్రోల్ వాసనలను వెదజల్లుతూ ఉన్న మట్టి బయటపడటంతో గ్రామస్థులు ఆందోళన చెందారు. దివంగత కాంగ్రెస్ నాయకుడు జాడ శ్రీరాములు ఇంటిలో మరుగుదొడ్డి నిర్మాణానికి ఏడు అడుగుల గొయ్యిని తవ్వగా ఈ వాసనలు బయట పడ్డాయి. దీంతో కుటుంబ సభ్యులు ఈవిషయాన్ని గ్రామస్థులకు తెలిపారు. గ్రామస్థులు మండల వ్యవసాయశాఖాధికారి రేణుకకు చెప్పారు. మట్టి నమూనాలను సేకరించి పరిశీలనకు శ్రీకాకుళం పంపారు. గ్రామంలో ఏ పరిమాణంలో ఈ చమురు పొరలు ఉన్నాయో బహిర్గతం కావాల్సి ఉంది.
75 మందికి కంటి పరీక్షలు

Pages