S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నృసింహ, మధుకేశ్వర కల్యాణ మహోత్సవాలు

జలుమూరు, జూన్ 16: ప్రముఖ పుణ్యక్షేత్రం మండలం శ్రీముఖలింగంలో కొలువైయున్న శ్రీలక్ష్మీనృసింహస్వామి, వారాహిమధుకేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం గురువారం ఘనంగా జరిగాయి. దుర్మిఖనామ సంవత్సరం ఉత్తరాయణం, జ్యేష్ఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ ఉత్సవాన్ని చేపట్టారు. ఉదయం లక్ష్మీనృసింహస్వామి కల్యాణ ఆలయ ప్రాంగణంలో జరిగింది. సాయంత్రం మధుకేశ్వరస్వామి కల్యాణం జరిగింది. అనంతరం నందివాహనంపై వారాహి మధుకేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. పల్లకిలో లక్ష్మీనృసింహస్వామిని ఊరేగించారు. పురోహితులు భూషణరావు, అర్చకులు దేవాదాయ శాఖ కార్యనిర్వాహణాధికారి సూర్యనారాయణ, చైర్మన్ బైరి బలరాం పాల్గొన్నారు.

న్యాయవిద్యను బలోపేతం చేస్తాం

ఎచ్చెర్ల, జూన్ 16: న్యాయవిద్యను బలోపేతం చేసేందుకు బార్ కౌనె్సల్ ఆఫ్ ఇండియా ప్రతినిధి బృందాన్ని అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి ఆహ్వానిస్తామని ఇంచార్జి వీసి ప్రొఫెసర్ ఎం.చంద్రయ్య స్పష్టంచేశారు. గురువారం ఆయన ఛాంబర్‌లో విలేఖర్లతో మాట్లాడారు. విశ్వవిద్యాలయం ఆవరణలో జ్యోతీరావుపూలే న్యాయకళాశాలకు తొలుత ప్రిన్సిపల్ నియామకాన్ని పూర్తిచేసి న్యాయశాస్త్రం అభ్యసించిన విద్యార్థులకు మరిన్ని ప్రమాణాలతో కూడిన విద్యను అందించనున్నట్టు వెల్లడించారు. ఇప్పటివరకు బిసిఐ అనుమతులు లేకపోవడం వల్ల న్యాయశాస్త్ర విద్యను అభ్యసించేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ముందుకు రావడం లేదన్నారు.

‘పొయ్యి’ వెలగలే!

శ్రీకాకుళం: విద్య జీవితంలో వెలుగులు నింపాలని కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యపై అవగాహన కల్పించేందుకు ‘విద్యాంజలి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో గురుకుల పాఠశాలకు వచ్చే పిల్లలను ఈ నెల 20వ తేదీ వరకూ రావద్దంటూ హుకుం చేయడం గమనార్హం! కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లలో విద్యాపరమైన పథకాలకు వందల కోట్ల రూ.లు కేటాయించినప్పటికీ, క్షేత్రస్థాయి స్థాయిలో ఫలితాలు అంతంతమాత్రంగానే కన్పిస్తున్నాయి. ఇటువంటి లోపాల వల్ల బాలికల విద్యాశాతం మెరుగుపడే అవకాశాలు లేకుండాపోతున్నాయి.

22న ఒంగోలుకు సిఎం రాక

ఒంగోలు, జూన్ 16 : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 22వ తేదీన జిల్లా కేంద్రమైన ఒంగోలుకు రానున్నారు. ఆ మేరకు జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం అందింది. రాష్ట్ర వ్యాప్తంగా రెండవ విడత రైతు రుణమాఫీ పత్రాలను రైతులకు ముఖ్యమంత్రి ఒంగోలులో జరిగే బహిరంగ సభలో అందచేయనున్నారు. ఈ నెల 8వ తేదీన ఒంగోలులో మహాసంకల్పసభకు ముఖ్యమంత్రి హాజరుకావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల ముఖ్యమంత్రి కడపలో జరిగిన సభకు హాజరయ్యారు. ఇదిలాఉండగా ముఖ్యమంత్రి సభను విజయవంతం చేసేందుకు ముందుగా జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం ఒంగోలులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఆవరణలో జరగనుంది.

ఆత్మగౌరవంపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

బుచ్చిరెడ్డిపాళెం, జూన్ 16: ఆత్మగౌరవం కార్యక్రమానికి అధికారులు రాత్రి బసకు ఎక్కువ సంఖ్యలో అధికారులు గైర్హాజరు కావడంపై కలెక్టర్ జానకి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని దామరమడుగు గ్రామ పంచాయతీ పరిధిలో గల ఆర్‌ఆర్‌నగర్‌లో బుధవారం రాత్రి ఆత్మగౌరవంపై జరిగే బసను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. రాత్రి 11 గంటల సమయంలో ఆమె అధికారులు బస చేసిన ప్రదేశానికి వెళ్లారు. కాని ఆ సమయంలో కేవలం బుచ్చిరెడ్డిపాళెం ఎంపిడిఒ నరసింహారావ్, హౌసింగ్ ఎఇ వెంకటేశ్వర్లు ఒక ఎఎన్‌ఎం తప్ప మరెవరూ లేకపోవడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోదీ నాయకత్వంతో భారత్ ప్రతిష్ట విశ్వ వ్యాప్తమైంది

నెల్లూరు కలెక్టరేట్, జూన్ 16: దేశానికి అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందించటంలో మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణమంత్రి మనోహర్ పారికర్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని పురమందిరం (టౌన్‌హాలు)లో గురువారం మోదీ సర్కార్ రెండేళ్ల పాలనపై (వికాస్‌పర్వ్) మేథావులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి, కుంభకోణాలతో గత 60 ఏళ్లలో కాంగ్రెస్, యుపిఎ ప్రభుత్వాలు దేశాన్ని అధోగతిపాలు చేయగా కేవలం రెండేళ్ల వ్యవధిలో భారత కీర్తి ప్రతిష్టలు విదేశాలకు సైతం గుర్తించే స్థాయికి ప్రధానమంత్రి మోదీ తీసుకెళ్లారని కితాబిచ్చారు.

వీధికుక్కల నియంత్రణకు చర్యలు

కర్నూలు సిటీ, జూన్ 16:పట్టణాల్లోని వీధుల్లో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించే గ్రామ సింహాలకు (వీధి కుక్కలు) హైకోర్టు ఆదేశాలతో చెక్ పడనుంది. కుక్కలను క్రూరంగా చంపకుండా వాటి సంతతిని నియంత్రించే ప్రక్రియను 150 రోజుల్లో పూర్తి చేయాలని తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ అదికారులు ప్రణాళికలు రూపొందిం చి, అందులో భాగంగా యానిమల్ బర్త్ కంట్రోల్‌ను ఏర్పాటు చేసి, కుక్కల సంతతి నియంత్రణకు చర్య లు చేపడుతున్నారు. కుక్కలు పట్టణాల్లోని వీధుల్లో విచ్చలవిడిగా తిరుగుతూ చిన్న పిల్లలను మొదలుకుని పెద్దలను సైతం వదలకుండా కొరుకుతున్నాయి.

ప్రత్యేక తెలంగాణ హైకోర్టు వెంటనే ఏర్పాటు చేయాలి

సత్తుపల్లి, జూన్ 16 : ఆంధ్రా న్యాయాధికారులు అప్షన్‌ను వెనక్కు తీసుకొని ప్రత్యేక తెలంగాణ హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సత్తుపల్లి మున్సిఫ్ కోర్టు వద్ద గురువారం న్యాయవాదులు వంటావార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయవాదులు సహపంక్తి బోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అధ్యక్షులు గొర్ల రామచంద్రారెడ్డి, మాజీ అధ్యక్షులు మంత్రి ప్రగడ వెంకటసత్యనారాయణ, సీనియర్ న్యాయవాదులు బుజ్జిసాహెబ్, కంచర్ల వెంకటేశ్వరరావు, కృష్ణప్రసాద్, మల్లెపూల వెంకటేశ్వరరావు, గండ్ర దీనదయాల్‌రెడ్డి తదితరులున్నారు.

తెరాసలో ముసలం ప్రారంభం

వైరా, జూన్ 16: తెలంగాణ రాష్ట్ర సమితిలో నాయకుల మధ్య విభేదాలతో ముసలం ప్రారంభమైందని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గురువారం స్థానిక నీటిపారుదల శాఖ విశ్రాంతి భవనంలో విలేఖరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పరిపాలనను కేవలం కెసిఆర్ కుటుంబానికి చెందిన ఆ నలుగురు మాత్రమే శాసిస్తున్నారని ఏద్దేవా చేశారు. ప్రతి విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ తన కుమారుడు కెటిఆర్, కూతురు కవిత, మేనల్లుడు హరీష్‌రావులతోనే పాలన సాగిస్తున్నారన్నారు. ఇది కుటుంబ పాలన మాత్రమేనని, ఇది ఎంతో కాలం కొనసాగదని జోస్యం చెప్పారు.

సింగరేణిని జెబిసిసిఐ నుండి మినహాయించడం లేదు

కొత్తగూడెం, జూన్ 16: సింగరేణి సంస్థను జెబిసిసిఐ నుండి మినహాయించడం లేదని హైద్రాబాద్‌లో గురువారం తనను కలిసిన జాతీయ కార్మికసంఘాల నాయకులకు సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్ హామీ ఇచ్చారు. సిఎండి శ్రీ్ధర్‌కు జాతీయ కార్మికసంఘాల ఆధ్వర్యంలో వివిధ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా సిఎండి మాట్లాడుతూ ఈనెల 14వతేదీన ఈ విషయంపై సెంట్రల్ కోల్ సెక్రటరీకి, కోలిండియా మేనేజ్‌మెంట్‌తో ఫోన్‌లో మాట్లాడి లెటర్ కూడా పెట్టినట్లు తెలిపారు. జెబిసిసిఐలోనే సింగరేణి కొనసాగుతుందని ప్రకటించారు.

Pages