S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచినీటి కోసం ఎదురుచూపులు!

తోట్లవల్లూరు, మే 15: అధికారుల నిర్లక్ష్యానికి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు మంచినీళ్ల కోసం నానాతంటాలు పడుతున్నారు. వేలాది రూపాయలు జీతాలు పొందుతూ, చేసిన పనులకు పర్సంటేజీలు తు.చ.తప్పకుండా తీసుకుంటూ నిరుపేదలకు అవసరమైన మంచినీటి సరఫరాలో నిర్లక్ష్యం వహించటం ఎంత దారుణమో అధికారులు ఆలోచించుకోవాలని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తీసుకునే జీతాలకు సరిపడా కాకపోయినా కనీసం కొంత భాగమైనా విధి నిర్వహణపై బాధ్యత చూపించేవారే కరవయ్యారని మండల ప్రజలు విమర్శిస్తున్నారు. మండలంలో ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ నిర్లక్ష్య వైఖరే ఇందుకు నిదర్శనమని అంటున్నారు.

31న తెలుగు భాష, సాంస్కృతిక సమ్మేళనం

అవనిగడ్డ, మే 15: విజయవాడ సాహితీ సంస్థలు, ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో తెలుగు భాష, సాంస్కృతిక సమ్మేళనం ఈ నెల 31న ఉదయం 10గంటల నుండి విజయవాడ శేషసాయి కల్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా రచయితల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పి సుబ్బారావు, జివి పూర్ణచంద్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధి, పరిరక్షణే ధ్యేయంగా సాంస్కృతిక పునరుజ్జీవనం ఉద్యమంలో భాగస్వాములు కావటం కోసం ఈ సమ్మేళనానికి రావాల్సిందిగా వారు భాషా ప్రియులను కోరారు.

మత్స్య పరిశ్రమతో ఆర్థిక ప్రగతి

నాగాయలంక, మే 15: నిత్యం విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూర్చి పెడుతున్న మత్స్య పరిశ్రమతోనే ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుందని శాసనసభ ఉప సభాపతి, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం స్థానిక కృష్ణా తీరాన యువ ఆక్వా రైతు తలశిల రఘుశేఖర్ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఆధునిక చేపల పెంపకం (కెజి సిస్టమ్)ను పరిశీలించిన అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ఆక్వా రంగంలో ఆటుపోట్లను ఎదుర్కొంటున్న మత్స్యకారులు కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఇలాంటి విధానంలో చేపల పెంపకాన్ని చేపట్టటం ద్వారా లబ్ధిపొందటమే కాకుం డా ప్రభుత్వ ఆర్థిక ప్రగతికి సైతం దోహదపడవచ్చని మండలి సూచించారు.

ఓటుకు కోట్లు కేసుకు రాష్ట్రాన్ని పణంగా పెట్టిన చంద్రబాబు

అవనిగడ్డ, మే 15: ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడటం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు ఆరోపించారు. ఈ కేసులో అరెస్టు కాకుండా తప్పించుకునేందుకే ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో లాలూచీ పడ్డారని, అందువల్లే తెలంగాణలో పెద్దఎత్తున ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నా నోరుమెదపటం లేదని విమర్శించారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు. మన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో పెద్దఎత్తున ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నారని మండిపడ్డారు.

వేట నిషేధ కాలంలోనే నష్టపరిహారం చెల్లించాలి

మచిలీపట్నం (కోనేరుసెంటర్), మే 15: సముద్రంలో వేటను నిషేధించిన ప్రభుత్వం మత్స్యకారులందరికీ వేట నిషేధ కాలంలోనే నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల సంఘం (ఎంకెఎంకెఎస్) ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కోనేరు సెంటరులో 36గంటల రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. రాష్ట్ర వృత్తిదారుల సమన్వయ కమిటీ కన్వీనర్ ఎం రామకృష్ణ దీక్షను ప్రారంభించి మాట్లాడుతూ గత ఏప్రిల్ 15 నుండి రెండు నెలల పాటు సముద్రంలో చేపల వేటను నిషేధించిన ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఐలయ్యను వెంటనే అరెస్టు చేయాలి

మచిలీపట్నం (కోనేరుసెంటర్), మే 15: బ్రాహ్మణులపై విమర్శలు చేసే స్థాయి జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ కంచె ఐలయ్యకు లేదని రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు పివి ఫణికుమార్ అన్నారు. కంచె ఐలయ్యను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం స్థానిక కోనేరు సెంటరులో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ఆధ్వర్యంలో రోడ్డుపై ధర్నా చేశారు. ఈసందర్భంగా ఫణికుమార్ మాట్లాడుతూ బ్రాహ్మణులు తిని కూర్చునే సోమరులు కాదని, దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రాహ్మణులది కీలకపాత్ర అని గుర్తుచేశారు.

విద్యార్థులు నైపుణ్యాల్ని పెంచుకోవాలి

మచిలీపట్నం (కల్చరల్), మే 15: విద్యతో పాటు నైపుణ్యాల్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ హాలులో ఆదివారం కృష్ణా విశ్వవిద్యాలయం, ఏపి స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్వహించిన చంద్రన్న జాబ్‌మేళాలో వివిధ కంపెనీల ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ఆయన ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ.. యువతను అత్యంత శక్తిమంతులుగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏపి స్టేట్ నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసిందన్నారు.

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ వైద్యం

తిరువూరు, మే 15: ప్రజల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని వైద్య విద్య, ఆరోగ్య శాఖ మంత్రి డా. కామినేని శ్రీనివాస్ చెప్పారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని, ఇందుకోసం ముఖ్యంగా పేద వర్గాల కోసం ఎన్టీఆర్ ఆరోగ్య సేవా పథకంతో పాటు పలు వినూత్న పథకాలు అమలు చేస్తోందన్నారు. మండలంలోని రాజుగూడెంలో 78 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని విజయవాడ ఎంపి కేశినేని శ్రీనివాస్‌తో కలిసి ఆదివారం ఆయన ప్రారంభించారు.

జక్కంపూడి కాలనీ సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నా

విజయవాడ, మే 15: జక్కంపూడిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆదివారం సాయంత్రం పౌర సంక్షేమ సంఘం, ఐద్వా కమిటీల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. జక్కంపూడిలోని హైస్కూల్ వద్ద గల గ్రౌండ్ వద్ద జరిగిన ఈ ధర్నాకి మద్దతు తెలుపుతూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు మాట్లాడారు. నగరంలోని పలు చోట్ల ఉన్న పేదల ఇళ్లను బలవంతంగా కూల్చి ఇక్కడ పడేశారన్నారు. ప్రభుత్వానికి, అధికారులకు ఇళ్ళు కూల్చడంపై శ్రద్ధ కాలనీలో సౌకర్యాలు కల్పించడంపై లేదని విమర్శించారు. పనులు కోల్పోయి నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

కృష్ణాలో అదనంగా మరో మూడు మండలాలు

విజయవాడ, మే 15: పరిపాలనా సౌలభ్యం కోసం కృష్ణా జిల్లాలో అదనంగా మరో మూడు రెవెన్యూ మండలాలు, ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం జిల్లా అధికారయుతంగా తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ఇందుకోసం మూడు లక్షల జనాభా మించిన మండలాలను విభజించేలా కొన్ని మార్గదర్శకాలను రూపొందించారు. ఆ ప్రకారం చూస్తే రూరల్‌లోని 49 మండలాలు మాత్రం యధావిధిగా ఉంటాయి. అయితే 12 లక్షల జనాభా కల్గిన విజయవాడ నగరం మొత్తంపై ప్రస్తుతం ఒకే ఒక రెవెన్యూ మండలం ఉండటంతో తహశీల్దార్‌పై పనిభారం పెరిగి సతమతమవుతున్నారు. ప్రోటోకాల్ డ్యూటీలకే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాల్సి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

Pages