S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆన్‌లైన్‌లో పట్టాదార్ పాస్‌పుస్తకాలు

వలిగొండ, మే 15: ఏండ్లకొద్ది రెవెన్యూశాఖలో పేరుకుపోయిన అవినీతి ప్రక్షాళనకై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొవడం ప్రారంభించింది. అందులో భాగంగా ఆన్‌లైన్‌లో పట్టాదార్ పాస్‌పుస్తకం విధానం ప్రవేశపెట్టనుంది. దీనితో రైతులు పాస్‌పుస్తకాలు, పహాణీలకై రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోయే అవకాశం ఉంది. భూమిని కొనుగొలు చేసిన, వారసులకు పట్టామార్పిడి చేసిన తిరిగి కొత్త పాస్‌పుస్తకం పొందాలంటే రైతులు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. గ్రామస్థాయిలో రెవెన్యూ అధికారులకు ముడుపులు చెల్లించి నెలల తరబడి తిరగాల్సిన పరిస్థితి రైతులు ఎదుర్కోనేవారు.

యాదాద్రిలో భక్తుల రద్దీ

యాదగిరిగుట్ట,మే 15:యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినర్సింహ్మస్వామి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్త జనసందోహంతో తిరువీధులు కిట కిట లాడాయి.వారాంతపు సెలవు రోజు కావడంతో జంటనగరాలకు చెందిన భక్తులు క్షేత్రాన్ని సందర్శించి దైవదర్శనం చేసుకున్నారు.వేకువ జామున 3 గంటలకు ఆలయాన్ని తెరిచి నిత్యపూజల అనంతరం ఉదయం 6 నుంచి భక్తులకు దర్శనాలకు అనుమతించారు.లక్షపుష్పార్చన,నిత్యకళ్యానోత్సవ పర్వాలను ఆచార్యులు విశేషంగా నిర్వహించారు.తిరువీధి సేవోత్సవాన్ని చేపట్టారు.ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ శివాలయాన్ని భక్తులు సందర్శించి పూజలు నిర్వహించారు.

కొత్త జిల్లాల చుట్టూ రియల్ దందా!

నల్లగొండ, మే 15: కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం జూన్ 2న ముసాయిదా ప్రకటనకు ముహూర్తం నిర్ణయించడంతో జిల్లాల్లో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం రెక్కలు విప్పుకుంటుంది. జిల్లా ఏర్పాటుతో పాటే కలెక్టరేట్ సహా ఇతర పరిపాలన పరమైన వౌలిక వసతుల కల్పనకు 100కోట్లు ఖర్చు చేయనున్నారంటు సాగుతున్న ప్రచారం రియల్ వ్యాపారానికి ఊతంగా మారింది. గద్ధల్లా పట్టణాలు, గ్రామాల్లో వాలుతున్న రియల్టర్లు రైతుల నుండి పెద్ద ఎత్తున భూముల కొనుగోలుకు తెరలేపారు.

జిల్లాలో ఎంసెట్ ప్రశాంతం

నల్లగొండ, మే 15: ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సుల ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన ఎంసెట్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. నల్లగొండలోని 24, కోదాడలో 11 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు 14734మందికి 14086మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 648మంది గైర్హాజరయ్యారు. ఉదయం నిర్వహించిన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు 9,122మందికి 8813మంది హాజరుకాగా 309మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన మెడిసిన్ ప్రవేశ పరీక్షకు 5,612మంది విద్యార్ధులకుగాను 5,273మంది హాజరవ్వగా 339మంది గైర్హాజరయ్యారు.

సుస్థిర పాలనే కెసిఆర్ సంకల్పం

నార్కట్‌పల్లి, మే 15: పల్లెల నుండి పట్టణాల వరకు సుస్థిర పాలన అందించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుకు సాగుతున్నారని, ఆదిశగానే జిల్లాల ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నార్కట్‌పల్లి మండల కేంద్రంకు చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ పుల్లెంల అచ్చాలుగౌడ్ మంత్రి సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రారంభమైన తెలంగాణ ఉధ్యమం 14ఏళ్ళ పోరాటంలో రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఇప్పుడు మన ముందున్న లక్ష్యం బంగారు తెలంగాణ సాధనయే అన్నారు.

హెచ్‌ఐవి రహిత సమాజానికి కృషి చేయాలి

నల్లగొండ టౌన్, మే 15: హెచ్‌ఐవి రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. ఆదివారం నల్లగొండ యూత్ పాజిటివ్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర ఆసుపత్రి నుండి కొవ్వత్తుల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్‌ఐవి వ్యాది భారిన పడి చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. అంతేకాకుండా హెచ్‌ఐవి బాధితులు మానసిక దైర్యాన్ని కలిగి ఉండి ఆత్మ స్థైర్యంతో ఉండి డాక్టర్ల సలహా, సూచనల మేరకు సంబంధిత మందులను క్రమం తప్పకుండా వాడాలని సూచించారు.

ప్రకృతి సేద్యమే రైతులకు మేలు

నల్లగొండ టౌన్, మే 15: పెట్టుబడి లేని ప్రకృతిని ఉపయోగించుకుని చేసే సేంద్రియ వ్యవసాయంతో రైతులకు మేలు కలుగుతుందని, తద్వారా దిగుబడి సైతం పెరుగుతుందని రిటైర్డ్ వ్యవసాయ సంచాలకులు సూదిని స్థంబాద్రిరెడ్డి రైతులకు సూచించారు. ఆదివారం స్థానిక ఎస్‌పిఆర్ పాఠశాలలో గ్రామ భారతి నల్లగొండ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు శిక్షణా శిబిరాన్ని నిర్వహించారు.

కాపురాజయ్య అడుగుజాడల్లో నడిచి కీర్తిప్రతిష్టలు పొందాలి

సిద్దిపేట అర్బన్, మే 15: చిత్రకళయందు చిన్నారులు మంచి నైపుణ్యం ప్రదర్శించి డా.కాపురాజయ్య అడుగుజాడల్లో నడిచి దేశ, విదేశాల్లో కీర్తి ప్రతిష్టలు సంపాదించేలా ముందుకు సాగాలని మున్సిపల్ చైర్మన్ రాజనర్సు అన్నారు. స్థానిక కళాభవన్‌లో లలిత కళాసమితి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన చిత్రలేఖన శిబిరంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరు చిన్ననాటి నుంచే తమలోని కళలను చిత్రకళల ద్వారా ప్రదర్శించే అవకాశం ఉంటుందన్నారు. దేశ కీర్తిప్రతిష్టలను ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన కాపురాజయ్యను ఆదర్శంగా తీసుకొని నైపుణ్యం సంపాదించుకోవాలన్నారు. త్వరలోనే సిద్దిపేటలో కాపురాజయ్య విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.

సజావుగా ఎంసెట్

సంగారెడ్డి, మే 15: నీట్ ద్వారానే మెడిసిన్ ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో వాయిదా పడిన ఎమ్సెట్ ప్రవేశ పరీక్షలు ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసాయి. ఖచ్చితమైన నిబంధనలను అమలు చేసిన పరీక్షల నిర్వాహకులు నిముషం ఆలస్యమైనా అనుమతించమని చెప్పినట్లుగానే అక్షరాల అమలు చేసారు. ఫలితంగా ఐదు నిముషాలు ఆలస్యంగా వచ్చిన ఇద్దరు ఇంజనీరింగ్ ప్రవేశం పరీక్షలకు హాజరైన విద్యార్థులకు నిరాశ మిగిల్చింది. మూడు రీజియన్లలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్షలను నిర్వహించారు.

భూసేకరణలో నియంతృత్వ ధోరణి తగదు

తొగుట, మే 15: రాష్ట్రంలో రాచరిక..జమిందారీ..దొరల పాలన నడుస్తుందని, ప్రజాభీష్టానికి అనుగుణంగా కాకుండా ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తుందని పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఆదివారం డిసిసి అధ్యక్షురాలు సునీతారెడ్డితో కలిసి మండలంలోని ఏటిగడ్డకిష్టాపూర్ భూనిర్వాసితులతో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో వేలకోట్లతో ప్రాజెక్టులు నిర్మించామని, ప్రజలను గోసపెట్టేలా భూసేకరణ చేయలేదన్నారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా ప్రజలను ఒప్పించి పరిహారం చెల్లించిన ఘనత తమదేనన్నారు. ప్రజాభీష్టానికి అనుగుణంగా పాలకులు నడుచుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

Pages