S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హేమసముద్రం రిజర్వాయర్‌తో పంట పొలాలకు కృషా ణజలాలు

మహబూబ్‌నగర్, మే 15: పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా హేమ సముద్రం రిజర్వాయర్‌ను నిర్మించి రైతుల పంట పొలాల్లోకి కృష్ణాజలాలను పారిస్తామని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఆదివారం మహబూబ్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని హన్వాడ మండలంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మీషన్‌కాకతీయ రెండో దశ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా షేక్‌పల్లి గ్రామంలో రూ.15లక్షల వ్యయంతో మేడికుంట చెరువులో మీషన్‌కాకతీయ పనులను ప్రారంభించారు. అయోధ్యనగర్‌లో రూ.28లక్షల వ్యయంతో కాసుల చెరువు వేపూర్ గ్రామంలోని రూ.22.36లక్షలతో కొత్తకుంట చెరువు, ఇదే గ్రామంలో రూ.33.20లక్షలతో ఊరకుంట చెరువు పనులను ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు.

కొలిక్కి వచ్చిన కొత్త జిల్లాల ముసాయిదా...?

మహబూబ్‌నగర్, మే 15: కొత్త జిల్లాల పంచాయతీ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. జిల్లాల ఏర్పాటు ముసాయిదా దాదాపు పూర్తి అయినట్లు సమాచారం. మరో ఒకటి రెండు రోజుల్లో కొత్త జిల్లాల ఏర్పాటు కమిటీ సభ్యులు జిల్లాలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. ఒక్కో జిల్లాలో 12 లక్షల నుండి 15 లక్షల జనాభా ఉండేటట్లు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. నాగర్‌కర్నూల్, వనపర్తి కొత్త జిల్లాలకు దాదాపు గ్రీన్‌సిగ్నల్ లభించినట్లే కనబడుతుంది. కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించడంతో జిల్లాలో ఒక్కసారిగా కొత్త జిల్లాలపై రగడ మొదలైంది.

పదబంధాలతో తెలుగు వెలిగేనా?!

........................
ధ్వనికి తగిన లిపి సంకేతాలను సంస్కరించి ఏర్పరచుకొన్న భాష తెలుగు.
అనవసర లిపి సంకేతాలు లేవు. లిపి సంకేతాలను ఎన్నిసార్లు వాడగలమన్న దానికన్నా ఎంత స్పష్టంగా ఉచ్చరించగలుగుతున్నామన్న అంశానికే ప్రాధాన్యత.
.........................

- ఆయి కమలమ్మ

చోదక శక్తి

ప్రేమికుల భాష
చిరుగాలిలా ఉంటుంది
సంభాషణా సంద్రంపై సాగే అలల్లా...

కురుస్తున్న ప్రేమ వెనె్నల్లో
అస్తిత్వంలోనే దేహాలు
ఆత్మలు ముడిపడే ఉంటాయ
పూల పరిమళం
ఉంటుందేమో వారి మాటల్లో...
ఎవరికి తెలియని మార్దవం కూడా...

స్పందన ప్రతిస్పందన ఒకే శ్వాసలో...
ఉరుకుల పరుగుల బతుకుల్లో
ప్రేమ చోదక శక్తి...
మనిషిని బతికించేదీ...

- తంగెళ్లపల్లి కనకాచారి 8790874028

నీటి ఊట

ఒక్క జల బిందువు
వేనవేల ‘హైడ్రోజన్ మోనాక్సైడ్’ల
సంలీనమే కాదు
ఒక్క నీటి బొట్టు
కోటాను కోట్ల ప్రాణుల
ప్రాణ సమం
భూ పొరల్ని
తడమాల్సిన తడి
కనురెప్పలకీ పహరా కాస్తోంది
బోరుబావుల టార్చులైట్లు
వేసి వెతికినా
జలం జాడ దొరకడం లేదు
అంతరంగానికి ముసుగేస్తే
ముఖాన చిర్నవ్వు పువ్వు
పూస్తుందేమో గానీ-
గుండెని ఛిద్రం చేస్తూ
నేల తల్లికి కాంక్రీటద్దుతుంటే
నీటి ఊటలెక్కడ మొలుస్తాయ్?

- ఎనుగంటి అంజలి, 9440236055

వ్యాపించు

నువ్వు నువ్వులా కాకుండా
గాల్లోంచి ఎగిరొచ్చిన పరిమళంలా
మీట నొక్కగానే వెలుగు పరుచుకునే
విద్యుత్ దీపంలా
వ్యాపించు... వ్యాపించు...
ఆవృతాల్ని పెనవేసుకుంటూ.
లోలోపలి సమస్త కల్మషాల్ని కడిగేసుకుని
కొత్త చూపుల్ని ఆవిష్కరించుకున్న
స్వచ్ఛ మానవుడిలా
మరో లోకాన్ని సృష్టించుకున్నట్లుగా
వ్యాపించు... వ్యాపించు
నిలువెల్లా నూతన చర్మం తొడుక్కుంటూ.
కనిపించని దారుల్లోంచి
పారదర్శకంగా చొచ్చుకుంటున్న శబ్దతరంగాల్లా
నదీతీరాన అంతులేని అలల పరుగుల్లా
వ్యాపించు... వ్యాపించు...
సాకారమయ్యే ఆలోచనల్ని మొలిపించుకుంటూ.

- దాట్ల దేవదానం రాజు, 99440105987

కవిత్వోదయం

సూర్యుడు ఉదయించే ఉంటడు
జగతిలో ఎప్పుడూ
రవికిరణాల్ని, కవి భావనల్ని ఎవరాపుతారు?
ఎవరి పేరును ఎవరు రాస్తరు,
ఎవరు తొలగిస్తరు నిజంగా?
కవి రవిలా వెలుగాలి గాని,
చీకట్లో మినుగురుల్ల ఉండి
సూర్యతేజానే్న కాదంటే ఎట్ల?
రవి కిరణానికి,
కవి భావానికి భేదభావాలేముంటయి?
నిత్యం వెలుగును ప్రసరిస్తూనే ఉన్నడు సూర్యుడు
ఎవరి తేజం వారిదే సహజంగా
బహుశా ఎవరి పేరును వారే
లిప్యంతరంగావించాలి
సూర్యుడిలా ప్రజ్వలించి ప్రకాశించాలె
ఎంత అల్పుడు మనిషి, కవి!
సత్యాన్ని బహిర్గతం చేసే శక్తి లేనప్పుడు

- సబ్బని లక్ష్మీనారాయణ 8985251271

మాయామోహనం

దుఃఖం నిండిన బ్రతుకులోంచి
హృదయాన్ని దూరంగా విసరడం
ఇప్పటికీ సాధ్యపడలేదు
వర్ణాలు విరిగిపోయిన స్వప్నంలోంచి
కలల్ని కంటిరెప్పల మీద గుచ్చుకుని
నిర్భయంగా తిరగడం కుదరడం లేదు

ఒక పూర్ణ చిత్ర సంభాషణ తెగాక
రహస్య నిద్రని గిరాటు వేశాక
పోరాడి అలసిపోయిన హృదయ ఓదార్పుకి
జీవశిల్పపు ప్రాణతంత్రిని చుట్టి
కాపాడుకోవడమెలాగో నేర్చుకోనూ లేదు

- ఖాదర్ షరీఫ్ 9441938140

‘ఆహా...’ హూహూ!

‘‘ఒక రోజున ఉదయం లండనులో ‘ట్రైఫాల్గర్ స్క్వేర్’వద్ద జనం గుంపులు గుంపులుగా మూగి యున్నారు. వారొక విచిత్ర జంతువు వంక చూస్తున్నారు. ఆ జంతువు వారిని అన్ని విధాల ఆకర్షించింది. తల, జూలు, నిక్కిన చెవులు, సగము కనబడుతున్న తిరగలి రాళ్ళల్లే పళ్ళ జంట. మొగాన మాత్రం బొట్టు ఉన్నది. అది నిలువుబొట్టు. ఆ జంతువుకు తక్కిన అవయవాలన్నీ మనుష్యులవే. రెండు చేతులు, రెండు కాళ్ళు, కాళ్ళకి కడియాలున్నవి. అవి బంగారపువో ఇత్తడివో తెలియదు గాని రంగు మాత్రము పసుపు పచ్చన. వాటిని కడియాలనటంకన్నా అందెలనవచ్చు. కాళ్ళ వ్రేళ్ళకు పది రత్నపుటుంగరాలున్నవి. దండలయందు ‘బాజుబందులు’, బుజముల మీద ‘్భజకీర్తులు’ ఉన్నవి. శిరసున కిరీటముంది.

- నాగసూరి వేణుగోపాల్, 944073239

ఇప్పటికీ అది ఆనంద నిలయం

ఓ రెండు మూడు రోజులక్రితం మరోమారు తిరుమల వెళ్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని వచ్చాం. భగవంతుడి దయవల్ల ఈసారి కూడా వసతి, అతి చేరువనుంచి స్వామివారి దర్శనం చక్కగ జరిగాయి. అలమేలు మంగాపురంలో అమ్మవారి దర్శనం కూడా బాగానే జరిగింది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో చేరడానికి రెండేళ్ల క్రితం ఒకసారి చేరిన తరువాత ఏడాది క్రితం మరోసారి దర్శనం చేసుకున్నాం. అవీ బాగానే జరిగాయి. ఆ మాటకొస్తే ‘దర్శనం స్వామి ఇస్తేనే దొరికేది’..అంతేకాని ఎవరూ ఇచ్చేది కాదు. అదో నమ్మకం.

- వనం జ్వాలా నరసింహారావు

Pages