S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోస్ట్ ప్రొడక్షన్‌లో 4జి

శ్రీ సాయిలక్ష్మీ మూవీస్ పతాకంపై ఉదయ్, చంద్రకళ, సన్ని, సునంద ప్రధాన తారాగణంగా శ్రీనివాస్ కరణం దర్శకత్వంలో కె.వి.వినోద్‌రెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘4జి’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. బెంగుళూరులో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, ప్రేమలో ఉన్న నలుగురు ఆ ప్రేమతో ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నారు? చివరికి ఎటువంటి పరిణామాలకు వారి జీవితం దారితీసింది? అనే కథనంతో ఈ చిత్రం సాగుతుందని తెలిపారు.

మళ్లీ మెరిశారు!

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ తారలో మరోసారి మెరిశారు. ఈనెల 11న ప్రారంభమైన ఈ చిత్రోత్సవంలో ఇప్పటికి మూడుసార్లు రెడ్‌కార్పెట్‌పై ప్రత్యక్షమైన అందాల తార ఐశ్వర్యరాయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మొదట కువైట్ డిజైనర్ అలీ యూనిస్ రూపొందించిన పసిడివర్ణపు దుస్తుల్లో మెరిసిపోయింది. ఆ తరువాత ఎన్‌ఆర్‌ఐ డిజైనర్ నరుూంఖాన్ రూపొందించిన ఎర్రటి దుస్తుల్లో మిలమిల మెరిసింది. ప్రఖ్యాత హాలీవుడ్ సినీ దిగ్గజం స్టీవెన్ స్పీల్‌బర్గ్ రూపొందించిన ‘ది బిఎఫ్‌జి’ చిత్రాన్ని కేన్స్‌లో ప్రదర్శించిన సందర్భంగా రెడ్‌కార్పెట్‌పై ఐష్ మరోసారి దర్శనమిచ్చింది.

ఇది అనుబంధాల బ్రెహ్మోత్సవం

కుటుంబంలో పెద్దవారికి గౌరవం ఇవ్వడం మన సంప్రదాయం. అటువంటి మంచి కథనంతో సందేశాత్మకంగా బ్రహ్మోత్సవం చిత్రం రూపొందిందని కథానాయకుడు మహేశ్‌బాబు చెబుతున్నారు. పివిపి పతాకంపై మహేశ్‌బాబు, కాజల్, ప్రణీత, సమంత ప్రధాన తారాగణంగా శ్రీకాంత అడ్డాల దర్శకత్వంలో రూపొందించిన బ్రహ్మోత్సవం ఈనెల 20న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హీరో మహేశ్‌బాబు చెప్పిన విశేషాలు...

-శ్రీ

సెట్స్‌పైకి రామ్ చిత్రం

రామ్, సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. కథానాయకుడి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్‌సుంకర తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జూన్ 3నుంచి రామ్ కొత్త చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ని ప్రారంభించనున్నామని, నాన్‌స్టాప్‌గా షూటింగ్ చేసి దసరా కానుకగా సెప్టెంబర్ 30న గానీ, అక్టోబర్ 7న గానీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నామని తెలిపారు. తమ సంస్థలో మరో సూపర్‌హిట్ చిత్రంగా ఈ సినిమా నిలుస్తుందని వారన్నారు.

మెగా సినిమా కోసం మ్యూజిక్ సిట్టింగ్స్

చిరంజీవి నటించబోయే 150వ చిత్రం సెట్స్‌పైకి వెళ్ళేందుకు రంగం సిద్ధవౌతోంది. మెగా అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు వి.వి.వినాయక్ రచయితల బృందం ఇప్పటికే స్క్రిప్ట్‌ను పూర్తిచేయగా, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ కూడా మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టారు. ఇతరత్రా కార్యక్రమాలన్నీ పూర్తిచేసి, త్వరలో సెట్స్‌పైకి తీసుకువెళ్ళేలా సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తోంది. తమిళంలో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ‘కత్తి’కి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంకోసం చిరంజీవి ఇమేజ్‌కి సరిపడేలా కథలో మార్పులు చేర్పులు చేశారు.

ఉపాసన కూడా!

చిరంజీవి కోడలు రామ్‌చరణ్ భార్య ఉపాసన కామినేని కూడా సెలబ్రిటీగా మారిపోయారు. ఇప్పటివరకూ రామ్‌చరణ్ భార్యగానే తెలిసిన ఆమె టీవిలో యాడ్స్‌లో నటిస్తుండడం విశేషం. అపోలో హాస్పిటల్స్ లైఫ్ విభాగానికి డైరెక్టర్ అయిన ఆమె బి పాజిటివ్ అనే పత్రికను కూడా నడుపుతున్నారు. అపోలో లైఫ్ తయారుచేసే రకరకాల ప్రొడక్ట్‌లకు సంబంధించిన యాడ్ టీవిలో వస్తోంది. యాడ్ పూర్తయ్యాక ఆమె ఫొటోవేసి ఈ ప్రొడక్ట్‌లు వాడండి అంటూ కింద ఆమె సంతకం వేస్తున్నారు. ఈ విధంగా ఉపాసన టీవి యాడ్‌లో కనిపిస్తోంది. టీవిలోకి వచ్చింది అంటే మిగతా అన్ని యాడ్స్‌ల్లో కూడా రానున్నదా అని టాలీవుడ్‌లో గుసగుసలు మొదలయ్యాయి.

జోజో...లాలి...

మనమంతా ఆరోగ్యంగా ఉండాలంటే కావలసినవి రెండే రెండు. ‘కరకర’ ఆకలి వేసి కడుపు నిండా అన్నం తినడమూ, కంటినిండా ఆదమరచి నిద్రపోవడమూను. ఎంతమందికి ఈ రెండూ లభిస్తున్నాయ్? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఉన్నవాడికీ అరగని జబ్బూ, లేనివాడికీ ఆకలి జబ్బూ అన్నాడో సినీ కవి. బాగా కాయకష్టం చేసి - అది మంచి వ్యాయామమైనా సరే - కడుపులో ఆకలి ఆవురావుమంటూంటే తింటున్న ప్రతి మెతుకూ రుచిగా నోటికి హితవై కడుపు నింపుతూంటే వేళపట్టున నిద్రాదేవి ఠపీమని హాజరై మనని ఒడిలోకి తీసుకొని చిచ్చికొట్టదూ! ఆ జీవితం స్వర్గానికి ఓ బెత్తెడు తక్కువేం కాదు మరి!

-కె.అరుణావ్యాస్

టిప్పుసుల్తాన్ వేసవి విడిది

టిప్పు సుల్తాన్ విడిదిగా వాడుకున్న రాజప్రాసాదం బెంగళూరులో ఉంది. 200 ఏళ్ల క్రితం నిర్మితమైనా ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. దీనిని పూర్తిగా టేకు కలపతో నిర్మించారు. ఇది అద్భుతమైన చారిత్రక కట్టడం. చల్లగా ఉండే ఈ రాజప్రాసాదంలో టిప్పుసుల్తాన్ వేసవిలో గడిపేవారు.

-బి.ఎం.ఎన్.

కేంద్రం పథకాలపై ప్రచారం

హైదరాబాద్:కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, పథకాలపై విస్తృత ప్రచారం చేస్తామని, ప్రజల్లోకి తీసుకువెళతామని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు.

జమ్మూకాశ్మీర్‌లో కార్చిచ్చు

శ్రీనగర్:జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా రసాయి అటవీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది. దట్టమైన అడవుల్లో అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. ఉత్తరాఖండ్ దావానలం సంఘటన మరవకముందే ఈ ప్రమాదం జరగడం గమనార్హం.

Pages