S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తులతో ఏడుపాయల కిటకిట

పాపన్నపేట, మే 15: తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ది చెందిన శ్రీ ఏడుపాయల వనదుర్గ్భావాని అమ్మవారి ఆలయానికి ఆదివారం రోజు భక్తజనం వెల్లువెత్తింది. ఆలయ ప్రాంగణంలోని షవర్ బాత్‌లు, చెక్ డ్యామ్‌లో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని ఆలయ పూజారులు పట్టువస్త్రంలో అత్యంత సుందరంగా వివిధ రకాల పూలతో అలంకరించారు. ఆలయ గర్భాలయంలో అమ్మవారు కోటి సూర్యప్రభ కాంతులతో దగదగలాడుతూ భక్తులకు దర్శనమిచ్చింది. చెట్లు, రాళ్లగుట్టలతో ఉండే అటవి ప్రాంతమంతా జనసంద్రమైంది. డప్పు వాయిద్యాల మోతలు...బోనాల ఉరేగింపులు...శివసత్తుల శిగాలు...పోతరాజుల నృత్యాలతో ఏడుపాయల ప్రాంగణమంతా హోరెత్తింది.

అపార్ట్‌మెంట్‌లో మూడు ఇళ్లలో చోరీ

సంగారెడ్డి టౌన్, మే 15: పట్టణంలోని మంజీరనగర్ సాయినిధి అపార్ట్‌మెంట్‌లో గుర్తు తెలియని వ్యక్తులు మూడు ఇళ్ల తాళాలు పగలగొట్టి బంగారు నగలు, నగదును అపహరించుకుపోయిన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం పక్కింటి వారు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రూరల్ సిఐ శ్యామల వెంకటేశం, టౌన్ ఎస్‌ఐ రమేష్‌లు సంఘటన స్థలాలను పరిశీలించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. వేసవి సెలవులు కావడంతో ఈ మూడు ఇళ్లకు చెందిన వారు తాళాలు వేసి బంధువుల వద్దకు వెళ్లారు. అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి జనార్ధన్ ఇంట్లో మూడున్నర తులాల బంగారం, 2లక్షల 27వేల రూపాయల నగదును అపహరించారు.

ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి

సంగారెడ్డి టౌన్, మే 15: విద్యార్థి సమస్యలతో పాటు ప్రజా సమస్యలపై ఉద్యమించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి ఎన్‌ఎస్‌యుఐ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని రెడ్‌లాస్ హోటల్ ఎన్‌ఎస్‌యుఐ చేపట్టిన బదులావ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు లెక్కకు మంచి హామిలిచ్చి గద్దెనెక్కిన కెసిఆర్ అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్న అమలు నోచుకోవడం లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి ఏమో కాని ఆ కుటుంబం మాత్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని ఎద్దేవా చేశారు.

సివిల్స్ విజేతకు ఎమ్మెల్యే సన్మానం

కల్వకుర్తి, మే 15: సివిల్స్‌లో 180 వ ర్యాంక్ సాధించి ఐపిఎస్‌కు ఎంపికైన కల్వకుర్తి పట్టణానికి చెందిన ఎడ్మా రిశాంత్‌రెడ్డిని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి ఆదివారం అభినందించారు. 2016 సివిల్స్‌లో 180వ ర్యాంక్ సాధించిన రిశాంత్‌రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డిని మార్యద పుర్వకంగా కలుసుకున్నారు. కల్వకుర్తి నియోజకవర్గం నుండి సివిల్స్‌కు ఎంపికైన రిశాంత్‌రెడ్డిని ఎమ్మెల్యే రిశాంత్‌రెడ్డిని అభినందించి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు ఉత్తమ సేవలు అందించి నియోజకవర్గానికి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

చెరువు భూముల ఆక్రమణ

నాగర్‌కర్నూల్, మే 15: నాగర్‌కర్నూల్ పట్టణాన్ని ఆనుకొని ఉన్న కేసరి సముద్రం చెరువుతోపాటు నాగనూలు చెరువు శిఖం భూమిని సైతం పట్టా భూమిగా చిత్రీకరిస్తూ ఆక్రమించుకుంటున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదు. సుమారు నెలరోజుల క్రితం ఈ చెరువును పరిశీలించిన రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించి ఎఫ్‌టిఎల్‌ను నిర్ధారించి రాళ్లు పాతాలని జెసి రాంకిషన్ సమక్షంలో నీటిపారుదల, రెవెన్యూ అధికారులకు ఆదేశించినా నేటికి వారిలో చలనంలేదు.

ప్రశాంతంగా ఎంసెట్

మహబూబ్‌నగర్, మే 15: జిల్లాలో ఎంసెట్ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌లో ఏడు పరీక్ష కేంద్రాల్లో, వనపర్తిలో నాలుగు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఎంసెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం ఇంజనీరింగ్ విభాగంలో 6166 మంది విద్యార్థులకు గాను 5390 మంది హజరయ్యారు. అదేవిధంగా మెడిసిన్ విబాగంలో 6043 మందికిగాను 5602 మంది విద్యార్థులు పరీక్షకు హజరయ్యారు. మహబూబ్‌నగర్ పట్టణంలో జరిగిన ఇంజనీరింగ్ విభాగంలో 4259 మందికిగాను 4043 మంది విద్యార్థులు పరీక్షకు హజరుకాగా 216 మంది గైర్హజరు అయ్యారు.

ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారుల మృతి

కొయిలకొండ, మే 15: మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకోండ మండలం కేశపురంలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు ఈతకు వెళ్లి నీటమునిగి మృత్యువాత పడ్డారు. కేశపురం గ్రామ సమీపంలో గల దశరథ చెరువులోకి గత నాలుగు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి వర్షం నీరు వచ్చిచేరింది. దింతో చెరువులో ఈత కొట్టేందుకు గ్రామానికి చెందిన సతీష్ (11), బాలస్వామి(10) అనే నాలుగవ తరగతి చదువుతున్న తరగతి చదువుతున్న విద్యార్థులు వెళ్లారు. ముందుగా ఇద్దరు చిన్నారులు చెరువుకట్టపై తమ దుస్తువులను ఉంచి చెరువులోకి దిగారు. నీరు పెద్దగా లేదని గమనించి చెరువులోకి నడుచుకుంటూ వెళ్లారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఆర్డీఎస్ సమస్య

మహబూబ్‌నగర్‌టౌన్, మే 15: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలను విస్మరించిందని ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో జలసమస్యలు అధికమవుతున్నాయని అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంలోనే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని అన్నారు. ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో పూర్తాగా నిర్లక్ష్యం వహిస్తుందని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆయన విమర్శించారు.

తండ్రి ఆశయాలకు మచ్చతెచ్చిన రామ్మోహన్‌రెడ్డి

మక్తల్, మే 15: తన తండ్రి చిట్టెం నర్సిరెడ్డి ఆశయాలను నెరవేర్చాలనీ నియోజకవర్గం ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఆయన ఆశయాలను తుంగలో తొక్కి తల్లిలాంటి కాంగ్రేస్ పార్టీని విడిచి టిఆర్‌ఎస్‌లో చేరిన చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తన తండ్రి ఆశయాలకు పెద్ద మచ్చతెచ్చారని టిపిసిసి ఉపాధ్యక్షురాలు గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ ఆరోపించారు.

కరవుతో అల్లాడుతున్నా పట్టించుకోని ప్రభుత్వం

ధన్వాడ, మే 15: పాలమూరు జిల్లా కరవులో అల్లాడుతున్నప్పటికీ ఆధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గద్వాల ఎమ్మెల్యే డి కె అరుణ అన్నారు. అదివారం ధన్వాడ మండలంలోని మరికల్ గ్రామంలోని ఇందిరగాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ జెండాను గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ ఎగరావేశారు. అనంతరం చౌరాస్తాలో కార్యకర్తలను ఉద్ధేశించి ఎమ్మెల్యే డికె అరుణ మాట్లాడుతూ అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హమీలను నిలబెట్టుకోవడంలో ఘోరంగా విఫలమైందన్నారు. పాలమూరు జిల్లా ప్రజలకు ఎన్నికల సమయంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హమీలు నీటిమిది బుడగలుగా మారిపోయ్యాయన్నారు.

Pages