S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవంతంగా కొనసాగుతున్న తెలంగాణ కళారాధనోత్సవాలు

హైదరాబాద్, మే 14: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ కళారాధనోత్సవాలు నగరంలో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలు ఎంతగానో అకట్టుకుంటున్నాయి. ఆదివారం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో వివిధ బృందాలు నిర్వహించిన తెలంగాణ జానపద గేయాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పలు కార్యక్రమాలు చూపరులను ఎంతాగానో అకట్టుకున్నాయి.

ఉత్కంఠ రేపుతున్న కంటోనె్మంట్ రోడ్ల మూసివేత

అల్వాల్, మే 15: కంటోనె్మంట్ నుంచి మల్కాజిగిరి - కాప్రా ప్రాంతాలకు వెళ్లే మార్గాలను మిలటరీ అధికారులు మూసి వేయటానికి గడువు దగ్గర పడుతున్నా కొద్ది ఉత్కంఠ పెరుగుతోంది. ప్రభుత్వం ఎరకమైన నిర్ణయం తీసుకుంటుందని ప్రజలు ఆందోళనకు గురగుతున్నారు. టిఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యుల బృందం కేంద్ర రక్షణ శాఖ మంత్రిని కలిసి యథాస్థితిని కొనసాగించాలని విఙ్ఞప్తిచేశారు. మరోవైపు రాష్ట్ర మంత్రి కెటి రామరావు, కేంద్ర మంత్రికి ఈ అంశంపైన జోక్యం చేసుకోవాలని, ప్రత్యమ్నాయ రోడ్లకు దారి చూపి పనులు పూర్తి అయ్యే వరకు రోడ్లను యథాస్థితి కొనసాగించాలని కోరారు.

చినుకు పడితే అన్నీ చిక్కులే!

హైదరాబాద్, మే 15: పేరుకే మహానగరం..చినుకు పడితే చాలు అన్నీ చిక్కులే. చిన్నపాటి వర్షానికి సైతం రహదార్లు గోదార్లుగా మారుతున్నాయి. గంటల తరబడి వాహనాలు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. ఇందుకు శనివారం రాత్రి కురిసిన ఓ మోస్తరు వర్షంతో తలెత్తిన కష్టాలే నిదర్శనం. విపత్తుల నివారణకు పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నామంటూ అధికారులు చేస్తున్న ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. రాత్రిపూట చిన్నపాటి వర్షం పడినా, రోడ్లపై ఎక్కువ మోతాదులో నీళ్లు ఆగినా కనీస సహాయక చర్యలు పత్తాలేకుండా పోయాయి. అర్థరాత్రి ఏ విపత్తు జరిగినా, అత్యవసరంగా చేపట్టాల్సిన సహాయక చర్యలు పత్తాలేకుండా పోయాయి.

వర్షంతో నేలకొరిగిన 210 చెట్లు

హైదరాబాద్, మే 15: నగరంలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి 210 చెట్లు నేలకొరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆదివారం తెల్లవారుఝామున కమిషనర్ బి.జనార్దన్ రెడ్డి సెంట్రల్ ఎమర్జెన్సీ బృందాలతో కలిసి పలు ప్రాంతాలను సందర్శించారు. అంతేగాక, వాటర్ వర్క్స్, విద్యుత్, జిహెచ్‌ఎంసి, ఫైర్ సర్వీసులు, ట్రాఫిక్ ఇతర శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి కూలిన చెట్లను తొలగించటం, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించటం, నిలిచిన నీటిని తోడివేయటం వంటి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

టాస్క్ఫోర్స్ పోలీసుల ఆకస్మిక తనిఖీ

హైదరాబాద్, మే 15: నగరంలో వెస్ట్, నార్త్ టాస్క్ఫోర్స్ పోలీసులు అకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆసిఫ్‌నగర్, లంగర్‌హౌస్, హుమాయూన్ నగర్, గోల్కొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో 150 మంది విదేశీయుల పాస్‌పోర్టులను పరిశీలించారు. వీరిలో గడువు ముగిసిన పది మంది విదేశీయులు అక్రమంగా నగరంలో నివాసముంటున్నట్టు గుర్తించారు. యుఎస్‌ఎకు చెందిన ఒకరు, యెమన్‌కు చెందిన ఇద్దరు, సూడాన్‌కు చెందిన ఐదుగురు కాగా ఒకరు సోమాలియాకు చెందగా మరో ఇద్దరు ద్జిబౌట్‌కు చెందిన వారున్నారు.

షాక్ తప్పదు!?

కష్టాల్లో పడిన విద్యుత్ సంస్థలను ఆదుకోవడానికి వినియోగదారులపై వెయ్య కోట్ల భారం మోపేందుకు రంగం సిద్ధమవుతోంది. పాలేరు ఉప ఎన్నిక ముందు టారిఫ్ ఆర్డర్‌ను ప్రకటించడం ఎందుకులే అని ఆగిన ప్రభుత్వం, నేటితో ఉప ఎన్నిక ముగుస్తుండటంతో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు అధికార వర్గాల సమాచారం. అయతే విద్యుత్ విషయంలో ఇప్పటికే జనామోదం పొందిన ప్రభుత్వం, అపవాదు రాకుండా కార్యం పూర్తి చేయాలన్న తలంపుతో కనిపిస్తోంది.

పాలమూరుకు కృష్ణా జలాలు

హైదరాబాద్, మే 15: నారాయణపూర్ డ్యామ్ నుంచి ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు కృష్ణా జలాలను కర్నాటక విడుదల చేసింది. కర్నాటక నీటి విడుదల గురించి నారాయణపూర్ సిఇ మహబూబ్‌నగర్ సిఇ ఖగేందర్‌రావుకు అధికారికంగా సమాచారం పంపించారు. మంగళవారం నాటికి నారాయణపూర్ డ్యామ్ నుంచి ఒక టిఎంసి కృష్ణా జలాలు మహబూబ్‌నగర్ జిల్లాకు చేరుకుంటాయి. పది రోజుల క్రితమే నీటిని విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ కాంగ్రెస్ చేసిన రాజకీయం కారణంగా ఆలస్యమైందని ఇరిగేషన్ వర్గాలు చెబుతున్నాయి. నీటి విడుదల కోసం మంత్రి తన్నీరు హరీశ్‌రావు కర్నాటక వెళ్లి ప్రభుత్వంతో చర్చించిన తరువాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెళ్లి ఆ రాష్ట్ర సిఎంను కలిశారు.

27నే ర్యాంకులు

హైదరాబాద్, మే 15: ఎమ్సెట్ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. ఇంజనీరింగ్ విభాగంలో 92.34 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మెడిసిన్ విభాగంలో 88.02 శాతం విద్యార్థులు హాజరయ్యారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని ముందుగానే ప్రకటించడం వల్ల విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. అక్కడక్కడ ఒకరిద్దరు విద్యార్థులు ఆలస్యంగా హాజరైతే అనుమతించలేదు. ఇదిలావుంటే, ఎంసెట్ కీని ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. కీపై అభ్యంతరాలుంటే 18న సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరించనున్నట్టు కన్వీనర్ రమణారావు తెలిపారు. ఈనెల 27న ఎంసెట్ ర్యాంకులు ప్రకటిస్తారు. తొలిసారిగా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేశారు.

మనకా సత్తా ఉంది!

హైదరాబాద్, మే 15: మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశానికి సుప్రీంకోర్టు ‘నీట్’ తప్పనిసరి చేయడంతో తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు అప్పుడే ‘నీట్’ ప్యాటర్న్‌కు సిద్ధమయ్యారు. చివరి నిమిషంలో సుప్రీంకోర్టు తీర్పు రావడంతో షాక్‌కు గురైన విద్యార్థులు, వారం రోజుల్లోనే తేరుకుని నీట్‌కు సన్నద్ధమయ్యారు. వాస్తవానికి రెండు రాష్ట్రాల్లో కార్పొరేట్ విద్యా సౌకర్యాలరీత్యా ఎప్పటి నుంచో జిప్‌మర్, ఎయిమ్స్, ఎఎఫ్‌ఎంసి, సిఎంసి వంటి జాతీయస్థాయి మెడికల్ పరీక్షలకు హైస్కూల్ నుంచే శిక్షణ అందుతోంది. నీట్ పేరిట ఇపుడు జరుగుతున్న ఎఐపిఎంటి గత పదేళ్లు నుంచీ జరుగుతూనే ఉంది.

ఎమ్సెట్‌కు నీట్ భిన్నం!

హైదరాబాద్, మే 15: మెడికల్, డెంటల్ అడ్మిషన్లకు అఖిల భారత స్థాయిలో నిర్వహిస్తున్న నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రన్స్ టెస్టు (నీట్) రాష్టస్థ్రాయిలో నిర్వహిస్తున్న ఎమ్సెట్‌కు కొద్దిగా భిన్నం. ఎమ్సెట్ పరీక్ష 160 మార్కులకు జరుగుతుంది.

Pages