S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్మరించినంతనే కరుణించే నారసింహుడు

శ్రీ మహావిష్ణువు భక్తజనోద్ధరణార్థం భూలోకంలో రకరకాల రూపాలతో అవతరించాడు. ఈ అవతారాలు ఇరవై ఒకటైనా ముఖ్యమైన దశావతారాల్లో కొన్ని అంశావతారాలు. కొన్ని ఆవేశ అవతారాలు. కొన్ని పరిపూర్ణ అవతారాలుగా మహర్షులు అభివర్ణించారు. అన్నింటి కన్నా నాల్గవదైన ఆవేశ అవతారమైన నృసింహావతారం విశిష్టమైంది. విశేషమైం దీ. అదే ‘నర-సింహ’ రూపాల కలయిక.
‘మృగాలలో సింహాన్ని నేను’ అని భగవద్గీతలో కృష్ణ్భగవానుడు చెప్పాడు. కేవలం దుష్టశిక్షణ, శిష్ట రక్షణల కోసమే కాకుండా తన సర్వాంతర్యామిత్వాన్ని చాటిచెప్పే నృసింహావతారం ఎంతో విఖ్యాత మైన విభవాతారం. ఇది విష్ణువు యొక్క సర్వజ్ఞత, సర్వవ్యాపకత్వాలకు నిదర్శన రూపమైన పూర్ణావతారం.

- చోడిశెట్టి శ్రీనివాసరావు

అద్వైతామృతాన్ని పంచిన శంకరులు

‘‘్ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠితః’’ జగత్తును నడిపేది ధర్మం. ‘్భక్తి’్భవం అనేకత్వంలోంచి ఏకత్వం, ఏకత్వంలో అనేకత్వాన్ని దర్శింపచేసే వెలుగును, చైతన్యాన్నిస్తుంది. ఇదిగో ఈ భిన్నంలో అభిన్నాన్ని దర్శించటానే్న ‘అద్వైత’ మన్నారు. దీన్ని బోధించిన జగద్గురువు- శంకరాచార్యులు. మానవ జాతి బహుజన్మల నోము ఫలం- జగద్గురు శ్రీమచ్ఛంకర భగవత్పాదుల అవతారం. అద్వైతామృతాన్ని అందరికీ ఆమోదయోగ్యమైన పద్ధతిలో అందించి, పరిపూర్ణ మానవత్వాన్ని ఆవిష్కరించిన మహోన్నతుడు శ్రీ శంకరులు. ఆదిశంకరులు గొప్ప దార్శనికులు, మేధావి, కరుణామూర్తి, సామాజిక సంస్కర్త, ఉత్తమ సహనశీలి.

- పసుమర్తి కామేశ్వర శర్మ

maatata

నేర్చుకుందాం

తే. ‘సకల ధర్మవిదుండవు సర్వలోక
వర్తనము లెఱింగిన పుణ్యకర్త, నీవు
నెయ్యమొనరంగ నెఱిఁగింపుమయ్య మాకు
వెలయఁ బుణ్యలోకంబులు గలవె’ యనిన

యమహాపురి- 43

కానీ బాధ్యత మనదౌతుంది. తెలివిని ఇతరులకమ్మితే- మనకి సంపాదన తక్కువుండొచ్చు కానీ బాధ్యత ఉండదు. బాధ్యతలు లేని సంపాదన మనిషికి ఎదుగుదలకంటే ఎక్కువ సంతోషాన్నిస్తుంది. జీవితంలో సంతోషానికి ప్రాధాన్యం ఇవ్వడమే అసలైన తెలివి’’ అంటాడు సందరం తండ్రి. ఆయన్ని అనుసరిస్తూ ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు.
సుందరం కానిస్టేబుల్‌గా ఉన్నా తన తెలివితో పై అధికారులకు సాయపడతాడు. హోదాకి మించిన బాధ్యతలు స్వీకరించాడని వారతణ్ణి గౌరవిస్తారు. అదే అతడికి తృప్తి!
‘‘సరేలే కానీ- ఈ ఫొటోలో ఉన్నవాళ్ల ఆచూకీ నాకెప్పుడిస్తావ్?’’ అన్నాడు శ్రీకర్.

హరివంశం 134

మాయావతి ప్రద్యుమ్నుడి చూసి తన వలపు వ్యక్తంచేసింది. ‘నను పెంచి పెద్దజేసిన నీకు ఈ పాపపు తలపేమిటి?’ అని ప్రద్యుమ్నుడామెను ప్రశ్నించాడు. అప్పుడామె మహామాయావి అయిన శంబరాసురుణ్ణే తాను మాయలో పడవేశాననీ, అది తనకు అనివార్యమనీ, మదనుడికోసమే తాను మళ్లీ జన్మ ఎత్తి ఈ పన్నాగం పన్నానీ, లోకంలో ఎవరూ ఛేదించలేని, భేదించలేని ఎనిమిది మాయలున్నాయనీ, ఈ మాయలు తాను ప్రద్యుమ్నుడికీ బోధిస్తాననీ, శంబరాసురుణ్ణి మాయా ప్రయోగంతోనే చంపివేయాల్సిందనీ, తరువాత తాము ద్వారకకు వెళ్ళవచ్చుననీ మాయావతి చెప్పింది ప్రద్యుమ్నుడికి.

ఉత్తమ శ్రోత

మాట్లాడే వ్యక్తి వక్త, ఆలకించే వ్యక్తి శ్రోత. ఆలకించడం అందరికీ సులభమే కానీ శ్రవణం కొంతమందికే సాధ్యమగుతుంది. సృష్టిలో చెవులున్న ప్రతి పాణి వినగలుగుతుంది. కాని మనసున్నవారికే శ్రవణం సాధ్యమగుతుంది. శ్రవణం కల్పిత భావాలను దూరం చేయాలి. చెముడు లేని ప్రతి వ్యక్తి ఇంతో అంతో వినగలుగుతాడు. వినడమేమో కర్మ, ఇక శ్రవణమేమో కళ.

-పెండెం శ్రీ్ధర్

సోనమ్... ఆల్ ది బెస్ట్

ఫ్రాన్స్‌కు చెందిన ప్రఖ్యాత కాస్మొటిక్ ఉత్పత్తుల సంస్థ లారియల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న బాలీవుడ్ తార సోనమ్‌కపూర్ ఈసారి కేన్స్‌లో అంతా కలసివస్తుందంటున్నాడు ఆమె తండ్రి, బాలీవుడ్ అలనాటి నటుడు అనిల్‌కపూర్. ఇప్పటికే కేన్స్ చేరుకున్న సోనమ్‌కు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు చెప్పాడు. ‘కేన్స్-2016 నీకు ఎంతో బాగుంటుంది’ అని ట్వీట్ చేశాడు. లారియల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఇప్పటివరకు ఐదుసార్లు కేన్స్‌కు హాజరైన సోనమ్ ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఓ ఇమేజ్‌ను సాధించింది. ఇప్పుడు ఆరోసారి కేన్స్‌కు హాజరైన ఆమె సోమ, మంగళవారాల్లో రెడ్‌కార్పెట్‌పై సందడి చేయనుంది.

హద్దులు చెరిగిపోయాయ్!

2001లో ‘ఇష్టం’ సినిమాతో సినీ రంగం ప్రవేశం చేసిన ఢిల్లీ భామ శ్రీయకు సంతోషం సినిమా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత తెలుగు తమిళ భాషల్లో దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించి, మెప్పించింది. స్వతహాగా డాన్సర్ అయిన ఆమె తాజాగా ‘ఊపిరి’లో నాగ్‌కు జోడిగా నటించారు. ఇటీవల అవకాశాలు బాగా తగ్గినప్పటికీ టైమ్స్‌మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్ట్‌లో ఈ ఏడాది శ్రీయ ఆరో స్థానంలో నిలవడం విశేషం. హీరోయిన్‌గా దాదాపు 15 సంవత్సరాల లాంగ్ ఇన్నింగ్స్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? అన్న ప్రశ్నకు శ్రీయ సమాధానం ఇస్తూ ‘మల్టీఫ్లెక్స్ ఆడియన్స్ పెరిగాక ఆర్ట్ సినిమాకు, కమర్షియల్ చిత్రానికి మధ్య ఉన్న అంతరం బాగా తగ్గిపోయింది.

Pages