S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిసి, ఇబిసి వర్గాలకూ కల్యాణలక్ష్మి

హైదరాబాద్, మే 13: నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల వివాహాలకు ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం అందించడానికి ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ పథకాన్ని ఇక నుంచి వెనుకబడిన (బిసి), ఆర్థికంగా వెనుకబడిన (ఇబిసి) వర్గాలకు వర్తిం ప చేస్తున్నట్టు తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ మంత్రి జోగురామన్న ప్రకటించారు.

బిజెపికి పెద్దల సభ అనుకూలం?

న్యూఢిల్లీ, మే 13: వచ్చే నెల రాజ్యసభలోని 57 స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల తర్వాత ప్రస్తుతం ప్రభుత్వానికి సంఖ్యాబలం లేని పెద్దల సభలో పరిస్థితి కొంత అనుకూలంగా మారనుంది. అయితే కీలకమైన వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)బిల్లును ఆమోదింప జేసుకునేందుకు ఇది ఎంతమాత్రం సరిపోదు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు రాజ్యసభలో సంఖ్యాపరమైన మార్పులు వచ్చినప్పటికీ సభలో కాంగ్రెసే అతి పెద్ద పార్టీగా ఉండబోతోంది.

పిటిఓ ఎస్‌ఐ పరీక్షలో అర్హత సాధించిన 388 అభ్యర్థులు

హైదరాబాద్, మే 13: పోలీసుశాఖలోని ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్ (పిటి వో) విభాగంలో ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 6న నోటిఫికేషన్ జారీ చేసి, ఏప్రిల్ 25న పరీక్ష నిర్వహించిన బోర్డు శుక్రవారం రాత పరీక్షలో అర్హులైన వారి వివరాలను బోర్డు చైర్మన్ డాక్టర్ జె.పూర్ణచంద్రరావు వెల్లడించారు. ఈ పరీక్షకు మొత్తం 1498 మంది అభ్యర్థులు హాజరు కాగా వారిలో 388 మంది అర్హత సాధించినట్లు తెలిపారు. అంటే ఉత్తీర్ణత శాతం 25.9గా వెల్లడించారు.

మోదీ సంభాషణను ఇటలీ బయటపెట్టొచ్చు!

న్యూఢిల్లీ, మే 13: భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ దేశ ప్రధానమంత్రి మటెయో రెంజితో జరిపిన ప్రైవేటు సంభాషణను ఇటలీ బహిర్గతం చేసే అవకాశం ఉందని అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల ఒప్పందంలో మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్ మిచెల్ తెలిపారు. ఇద్దరు మత్స్యకారులను హత్యచేసిన కేసులో తన నిర్బంధంలో ఉన్న ఇటలీ నావికుడు సాల్వటోర్ గిరోనేను భారత్ విడుదల చేయకుంటే ఇటలీ ఇద్దరు ప్రధానుల మధ్య జరిగిన ప్రైవేటు సంభాషణను బహిర్గతం చేస్తుందని మిచెల్ ఎన్‌డిటివి న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఐక్యరాజ్య సమితి సమావేశాల సందర్భంగా ఇటలీ ప్రధానితో విడిగా భేటీ అయిన మోదీ..

హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు అతిపెద్ద కార్గో విమానం

హైదరాబాద్, మే 13: ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ఉక్రెయిన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎఎన్-225 మైరియా ఆంటోనోవాకు జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం స్వాగతం పలికింది. ఈ భారీ కార్గో విమానం శుక్రవారం తెల్లవారు జామున అంతర్జాతీయ వినాశ్రయానికి చేరుకోగా, కోడ్ ఎఫ్ కార్గో యాప్రాన్‌లో నిలిపినట్లు జిఎంఆర్ తెలిపింది. ఎఎన్-225 కార్గో విమానంలో ఆరు సూపర్ చార్జ్‌డ్ టర్బో ఫ్యాన్ ఇంజిన్లు, ఆరుగురు సిబ్బంది ఉండగా, 640 మెట్రిక్ టన్నుల బరువును ఎత్తుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ విమానం పొడవు 84 మీటర్లు, వింగ్స్‌స్పాన్ పొడవు 88.4 మీటర్లు.

చేయాల్సింది చాలా ఉంది

లండన్, మే 13: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్‌గా మరికొంత కాలం కొనసాగాలన్న ఆకాంక్షను రఘురామ్ రాజన్ వ్యక్తం చేశారు. ఆర్‌బిఐ గవర్నర్‌గా ప్రస్తుతం అనుక్షణం ఆనందిస్తున్నానని, తన ప్రతి చర్యపై సంతృప్తిని వెలిబుచ్చారు. అయితే చేయాల్సింది ఇంకా చాలానే మిగిలి పోయిందన్న రాజన్.. ఈ క్రమంలోనే రెండోసారి ఆర్‌బిఐ పగ్గాలు చేపట్టాలన్న కోరికను బయటపెట్టారు. ఆర్‌బిఐ గవర్నర్‌గా ఈ ఏడాది సెప్టెంబర్‌తో రఘురామ్ రాజన్ మూడేళ్ల పదవీకాలం ముగియనుంది. దీంతో ఆయన్ను మళ్లీ ఆ పదవిలో కొనసాగించవద్దని అధికార బిజెపి నుంచి వ్యతిరేకత కనిపిస్తోంది.

ద్రవ్యోల్బణం 5 శాతానికి తగ్గుతుంది

న్యూఢిల్లీ, మే 13: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) ద్వితీయార్ధం (అక్టోబర్-మార్చి)లో ద్రవ్యోల్బణం దిగి వస్తుందని, వచ్చే ఏడాది మార్చికల్లా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) లక్ష్యానికి అనుగుణంగా 5 శాతానికి చేరువవుతుందని ఓ రిసెర్చ్ నివేదికలో కొటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ అభిప్రాయపడింది. గత నెల ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.39 శాతంగా నమోదైనది తెలిసిందే. అధిక ఆహార ధరలే దీనికి కారణం. ఈ క్రమంలో ఈసారి వర్షాలు ఆశించిన స్థాయిలో పడతాయన్న అంచనాలు నిజమైతే ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని కొటక్ పేర్కొంది. గత రెండేళ్లు వర్షాలు సాధారణం కంటే తక్కువగా పడినది తెలిసిందే.

సౌర విద్యుదుత్పత్తికి కాలుష్య నియంత్రణ, అగ్నిమాపక అనుమతులు అక్కర్లేదు

హైదరాబాద్, మే 13: తెలంగాణ రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పే పారిశ్రామికవేత్తలు కాలుష్య నియంత్రణ మండలి, అగ్నిమాపక శాఖ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన సౌర విద్యుత్ డెవలపర్ల సమావేశంలో మాట్లాడుతూ, నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం సౌర విద్యుదుత్పత్తికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. అయతే ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని కోరారు. భూమి కొనుగోలులో కూడా ప్రభుత్వ జోక్యం ఉండదన్నారు. కాగా, టిఎస్ ఐపాస్, నిబంధనల కింద సౌర విద్యుత్ పారిశ్రామికవేత్తలు అనుమతులకు దరఖాస్తు చేయాలని సూచించారు.

మొండి బకాయిలు ప్రమాదకర స్థాయిలో లేవు!

న్యూఢిల్లీ, మే 13: మొండి బకాయిలు ప్రమాదకర స్థాయిలో ఏమీ లేవని, ఈ సమస్యను బ్యాంకులు పరిష్కరించుకోగలవని బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో (బిబిబి) చీఫ్ వినోద్ రాయ్ అన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు (మొండి బకాయిలు) ఆందోళనకర స్థాయిలో ఉన్నాయంటూ ఇటు బ్యాంకులు, అటు కేంద్ర ప్రభుత్వం కలవరపడుతున్న నేపథ్యంలో బిబిబి చీఫ్ రాయ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. శుక్రవారం ఇక్కడ ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతో జరిపిన సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ ‘మొండి బకాయిల సమస్య బ్యాంకులను వేధిస్తోంది. అయితే దాన్ని ఎదుర్కొనేందుకు ప్రతీ బ్యాంకు వద్ద ఓ వ్యూహం ఉంది. అన్ని బ్యాంకుల వద్ద వేర్వేరు వ్యూహాలున్నాయి.

బ్యాంకర్ల చేతికి కింగ్‌ఫిషర్ విల్లా

పనాజి, మే 13: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఆస్తులను, దానికి రుణాలిచ్చిన బ్యాంకర్లు స్వాధీనం చేసుకునే పనిలోపడ్డారు. గోవాలోని కింగ్‌ఫిషర్ విల్లాను శుక్రవారం బ్యాంకులు స్వాధీనం చేసుకునేందుకు ముందుకెళ్ళాయి. ఉత్తర గోవాలోని కండోలిమ్ వద్దనున్న ఈ విల్లా విలువ 90 కోట్ల రూపాయలుగా ఉండగా, దీన్ని స్వాధీన పరచుకునేందుకు బ్యాంకులు దరఖాస్తు చేసుకున్న రెండేళ్ల తర్వాత తాజాగా ఉత్తర గోవా జిల్లా కలెక్టర్ నీలా మోహనన్ అనుమతినిచ్చారు. దీంతో ఎస్‌బిఐ క్యాప్ ట్రస్టీ.. విల్లాకు ఓ నోటీసును అంటించింది.

Pages