S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తప్పిన పెను ముప్పు

చింతూరు, మే 13: పోలీసు బలగాలను మట్టుబెట్టడానికి మావోయిస్టులు పన్నిన వ్యూహాన్ని ఆంధ్రా పోలీసులు, సిఆర్పీఎఫ్ సిబ్బంది భగ్నంచేశారు. తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలంలోని ఏడుగుర్రాలపల్లి గ్రామ సమీపంలో మావోయిస్టులు అమర్చిన రెండు మందుపాతరలను పోలీసులు శుక్రవారం గుర్తించారు. అలాగే మరో ప్రదేశంలో మరో మూడు మందుపాతరలు అన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి శుక్రవారం ఏడుగుర్రాలపల్లి గ్రామంలో వారపు సంత జరుగుతుంది. దండకారణ్య సమీపంలో ఈ గ్రామం ఉండటంతో పోలీసులు ఏడుగుర్రాలపల్లి సరిహద్దు ప్రాంతాన్ని చుట్టుముట్టి వారి అధీనంలోకి తీసుకుంటారు.

ముంబయి ఇండియన్స్‌కు షాక్

విశాఖపట్నం, మే 13: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తొమ్మిదో ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నీ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి నాకౌట్ దశకు చేరుకునే అవకాశాలను ఇప్పటికే దాదాపు కోల్పోయిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్‌కు షాక్ ఇచ్చింది. విశాఖపట్నంలోని ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అలరించిన కింగ్స్ ఎలెవెన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి ముంబయి ఇండియన్స్ అవకాశాలకు గండి కొట్టింది.

ఐసిసి క్రికెట్ కమిటీ చైర్మన్ పగ్గాలు మళ్లీ కుంబ్లేకే

దుబాయ్, మే 13: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) క్రికెట్ కమిటీ చైర్మన్‌గా టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే తిరిగి నియమితుడయ్యాడు. శుక్రవారం అతడిని రెండోసారి ఈ పదవిలో నియమించారు. అలాగే కుంబ్లే సహచరుడు, భారత జట్టు మాజీ కెప్టెన్, బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్‌ను ఈ కమిటీలో సభ్యుడిగా నియమించారు. అంతర్జాతీయ మ్యాచ్‌లలో అత్యధిక వికెట్లు తీసుకున్న భారత బౌలర్‌గా చరిత్రకెక్కిన కుంబ్లే 2012లో తొలిసారి ఐసిసి క్రికెట్ కమిటీ చైర్మన్‌గా నియమితుడైన విషయం తెలిసిందే. ప్రస్తుతం కుంబ్లేని మరోసారి ఈ పదవిలో నియమించడంతో మరో మూడేళ్ల పాటు (2018 వరకు) అతను కొనసాగనున్నాడు.

థామస్ కప్ టోర్నీకి సాత్విక్ ఎంపిక

అమలాపురం, మే 13: ప్రతిష్ఠాత్మకమైన థామస్ కప్ బాడ్మింటన్ టోర్నీకి తూర్పు గోదావరి జిల్లా అమలాపురం క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ ఎంపికయ్యాడు. రాష్ట్ర విభజన అనంతరం అంతర్జాతీయ బాడ్మింటన్ పోటీలకు రాష్ట్రం నుండి ఎంపికైన మొట్టమొదటి క్రీడాకారుడుగా సాత్విక్ రికార్డులకెక్కాడు. సాత్విక్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని గోపీచంద్ బాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఈ నెల 15 నుండి 22వ తేదీ వరకు చైనాలోని జియాంగ్‌షూ నగరం కున్‌షాన్ స్పోర్ట్స్ సెంటర్‌లో ఈ పోటీలు జరగనున్నాయి. సాత్విక్ ప్రస్తుతం అమలాపురం జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

బంధన్ బ్యాంకు శాఖను ప్రారంభిస్తున్న గంగూలీ

ముంబయి, మే 13: ప్రో కబాడీ లీగ్ రాబోయే సీజన్‌కోసం శుక్రవారం జరిగిన ఆటగాళ్ల వేలంలో వాయువ్య రైల్వేలో క్లర్క్‌గా పని చేస్తున్న డిఫెండర్ మోహిత్ షిల్లర్‌ను బెంగళూర్ బుల్స్ జట్టు 53 లక్షల రూపాయల అత్యధిక మొత్తానికి దక్కించుకుంది. రెండో సీజన్ విజేత అయిన యుముంబా జట్టునుంచి చిల్లర్‌ను అత్యధిక మొత్తానికి బెంగళూరు జట్టు దక్కించుకోవడమే ఈ రోజు వేలంలో హైలైట్. వేలంలో పాల్గొన్న టోర్నమెంట్‌లోని ఎనిమిది జట్లూ మూడో సీజన్‌లో జట్టులో ఉండిన ఇద్దరు ఆటగాళ్లను కొనసాగించడానికి అనుమతించారు. 2014లో జరిగిన ప్రోకబాడీ టోర్నమెంట్ తొలి సీజన్‌కు ముందు జరిగిన ఆటగాళ్ల తొలి వేలంలో షిల్లర్‌కు పలికిన ధర రూ.5.75 లక్షలే.

‘ఆ అర్హతలు నాకు లేవు’

కోల్‌కతా, మే 13: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు కావలసిన అర్హతా ప్రమాణాలు తనకు లేవని టీమిండియా మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (సిఎబి) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శుక్రవారం స్పష్టం చేశాడు. మంగళవారం బిసిసిఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన శశాంక్ మనోహర్ గురువారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే. దీంతో బిసిసిఐ అధ్యక్ష పదవిని భర్తీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ పదవికి పోటీచేసే అభ్యర్థులు కనీసం మూడుసార్లు బిసిసిఐ వార్షిక సర్వసభ్య సమావేశాలకు హాజరై ఉండాలన్న నిబంధన ఉంది.

లైంగికంగా వేధించేవారు

న్యూఢిల్లీ, మే 13: భారత మహిళా ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సోనా చౌదరి తన కాలంలో మహిళా ఆటగాళ్లను అధికారులు ఎలా లైంగిక వేధింపులకు గురి చేసే వారో తన తాజా పుస్తకంలో కళ్లకు కట్టినట్లు వివరించారు. సోనా చౌదరి 1995నుంచి 1998 మధ్య కాలంలో భారత మహిళా ఫుట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ‘గేమ్ ఇన్ గేమ్’ పేరుతో హిందీలో రాసిన పుస్తకంలో ఆమె ఈ ఆరోపణలు చేశారు. తనకు ఎప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురు కానప్పటికీ చాలా మంది వేధింపులకు గురి కావడాన్ని తాను ప్రత్యక్షంగా చూసినట్లు ఆమె చెప్పుకొన్నారు.

ఐదు పదుల వయసు దాటినా.. మళ్లీ ఒలింపిక్ బరిలోకి!

బెంగళూరు, మే 13: లాంగ్ జంప్‌లో పాతికేళ్ల క్రితం ప్రపంచ రికార్డు సృష్టించిన అమెరికా మేటి అథ్లెట్ మైక్ పావెల్ (52) ఇప్పటికీ తన శక్తిసామర్ధ్యాలపై ధీమాతో ఉన్నాడు. ఐదు పదుల వయసు దాటినప్పటికీ తనలో చేవ తగ్గలేదని అతను స్పష్టం చేశాడు. అంతేకాకుండా ఈ ఏడాది బ్రెజిల్‌లోని రియో డీ జెనిరోలో జరిగే ఒపింపిక్స్‌కు అర్హత సాధించేందుకు ప్రయత్నిస్తానని పావెల్ సంచలన ప్రకటన చేశాడు. ‘ప్రస్తుతం లాంగ్ జంప్ పరిస్థితి ఎందో దయనీయంగా ఉంది. ప్రపంచంలో మరే క్రీడలోనూ లేనంతగా లాంగ్ జంప్ వెనుకబడింది. గత కొంత కాలం నుంచి ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో యువ లాంగ్ జంపర్లు కనబరుస్తున్న పేలవ ప్రదర్శనను గమనిస్తున్నా.

‘ఉపాధి’ నిధులు విడుదల చేయండి

న్యూఢిల్లీ, మే 13: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఇజిఏ) కింద రాష్ట్రాలకు బకా యి ఉన్న నిధులను, అవసరమైన ని ధులను తక్షణం విడుదల చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఏంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు, కరవు పీడిత రాష్ట్రాల్లో రైతులు జరిగిన పంట నష్టానికి పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించింది. నిధులు లేవన్న కారణం చూపించి ప్రభుత్వం తన బాధ్యతనుంచి తప్పించుకోజాలదని కోర్టు స్పష్టం చేసింది.

పార్లమెంట్ అధికారాలు కాపాడుకుందాం

న్యూఢిల్లీ, మే 13: పార్లమెంటు హక్కులను, అధికారాలను న్యాయ వ్యవస్థ ఆక్రమిస్తోందంటూ శుక్రవారం రాజ్యసభలో సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పదవీవిరమణ పొందిన 53 మంది సభ్యులకు వీడ్కోలు పలికేందుకు శుక్రవారం సమావేశమైన రాజ్యసభలో సభా నాయకుడు, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ చట్టాలు, బడ్జెట్లను తయారు చేయడంలో పార్లమెంటు ఆధిపత్యాన్ని పరిరక్షించుకోవలసిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

Pages