S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలేరులో తెరాస అధికార దుర్వినియోగం!

ఖమ్మం: పాలేరు ఉప ఎన్నికలో గెలుపుకోసం అధికార తెరాస పార్టీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని సిపిఐ నాయకులు తమ్మినేని వీరభద్రం, పువ్వాడ నాగేశ్వరరావు ఆరోపించారు. ఎన్నికల సంఘానికి బదులు తెరాస పార్టీయే ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్టు అనిపిస్తోందని వారన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాసే పార్టీలకు ప్రజలే గుణపాఠం చెప్పాలన్నారు.

బెజవాడలో పోలీసుల తనిఖీలు: 15 మంది అరెస్టు

విజయవాడ: నగరంలోని పాయకాపురం, వాంబే కాలనీ తదితర ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజామున పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న 15 మందిని అరెస్టు చేసి, సరైన పత్రాలు లేని 35 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

అర్ధరాత్రి వేళ పబ్‌ల్లో తనిఖీలు

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో పలు పబ్‌ల్లో పోలీసులు తనిఖీలు చేశారు. డ్రగ్స్ వినియోగం గురించి ఆరా తీసి, డాగ్ స్క్వాడ్‌తో సోదాలు చేపట్టారు.

ఫాంహౌస్‌లో బాలికపై అత్యాచారం

హైదరాబాద్: గండిపేటలోని ఓ ఫాంహౌస్‌లో శుక్రవారం రాత్రి దుండగులు ఓ బాలికపై అత్యాచారం చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. బీభత్సం సృష్టించిన ఆగంతకులు రెండు ల్యాప్‌ట్యాప్‌లను చోరీ చేసినట్లు సమాచారం. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రెండు ప్రాజెక్టులకు జగన్ అడ్డుపుల్ల!

కడప: వైకాపా అధినేత జగన్ సొంత జిల్లా కడపకు నీళ్లు ఇచ్చినా ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టించడం విడ్డూరంగా ఉందని ఎపి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ శనివారం ఇక్కడ విలేఖరులతో అన్నారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులు పూర్తి కావడం జగన్‌కు ఇష్టం లేదని ఆయన వ్యాఖ్యానించారు. పట్టిసీమ ద్వారా 40 టిఎంసిల నీటిని ఆదా చేసి దాదాపు 4లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తయితే టిడిపికి జనంలో బలం పెరుగుతుందనే ఆందోళన జగన్‌లో నెలకొందన్నారు.

పెండింగ్ పిటిషన్లను వెంటనే పరిష్కరించండి

హైదరాబాద్, మే 13: సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను వెంటనే పరిష్కరించాలని ఎపి శాసనమండలి (కౌన్సిల్) చైర్మన్ డాక్టర్ ఎ.చక్రపాణి కౌన్సిల్ పిటిషన్స్ కమిటీకి సూచించారు. ఎపి కౌన్సిల్ పిటిషన్స్ కమిటీ చైర్మన్‌గా ఎపి కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్ రెడ్డి ఇటీవల నియమితులయ్యారు. ఈ కమిటీ తొలి సమావేశాన్ని కౌన్సిల్ చైర్మన్ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలకు సకాలంలో పరిష్కారం కావాలన్న ఉద్దేశంతో సభ్యులు పిటిషన్లు ఇస్తుంటారని తెలిపారు. అటువంటి పిటీషన్లను పిటీషన్స్ కమిటీ పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని ఆయన సూచించారు.

పిఎస్‌సికి బ్రోకర్ల బెడద

హైదరాబాద్, మే 13: దేశంలోనే అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా రిక్రూట్‌మెంట్‌లు నిర్వహించే కమిషన్‌గా ఖ్యాతి గడించిన తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు బ్రోకర్ల బెడద పట్టుకుంది. తమకు ఎవరూ తెలియకున్నా, ఫలానా మెంబర్ తమకు తెలుసు, ఉద్యోగాలు ఇప్పిస్తాం, చైర్మన్ తెలుసు మీకు ఇంటర్వ్యూలో మార్కులు ఇప్పిస్తాం అంటూ బ్రోకర్ల దందా మొదలైంది.

వంద శాతం గృహ విద్యుదీకరణ

హైదరాబాద్, మే 13: ఈ నెలాఖరులోపల ఆంధ్ర రాష్ట్రంలో వంద శాతం నివాస గృహాల విద్యుద్ధీకరణ పూర్తవుతుందని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ ప్రకటించారు. వచ్చే నెల 8వ తేదీన వంద శాతం గృహవిద్యుద్దీకరణను పూర్తి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాతికి అంకితం చేస్తారు. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన ఈదురుగాలులు, వర్షాలకు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. విద్యుత్ వ్యవస్ధను పునరుద్ధరించామని ఆయన చెప్పారు. మే నెల నుంచి నవంబర్ వరకు ఆంధ్ర రాష్ట్రంలో తుపానులు వచ్చే ప్రమాదం ఉంది.

నెల వయసు ఆవుదూడ పొదుగు నుండి పాలు!

రావులపాలెం, మే 13: ఇంకా తల్లిపాలు తాగుతున్న ఆ ఆవుదూడ పాలిస్తూ అందరినీ అబ్బురపరుస్తోంది. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం రావులపాడు గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ వింత వెలుగుచూసింది. పెచ్చెట్టి సత్యనారాయణ సుమారు అయిదేళ్ల వయసున్న జెర్సీ ఆవును పెంచుతున్నారు. ఈ ఆవు గతంలో రెండు దూడలకు జన్మనివ్వగా, సుమారు 40 రోజుల క్రితం మరో పెయ్యి దూడకు జన్మనిచ్చింది. 40 రోజులు వయసున్న ఈ ఆవు దూడకు పొదుగు పెరిగి, పిండగా చిత్రంగా పావులీటరు వరకు పాలొచ్చాయి. సాధారణంగా ఆవులు ఏడాదిన్నర వయస్సులో ఎదకు వచ్చి రెండున్నరేళ్లకు దూడ జన్మించాక పాలిస్తుంటాయి.

కల్యాణలక్ష్మిలో అవినీతికి పాల్పడిన ఆరుగురి అరెస్ట్

వినాయక్‌నగర్, మే 13: పెళ్లీడుకు వచ్చిన ఎస్సీ, ఎస్టీలకు చెందిన ఆడపడుచుల తల్లిదండ్రులకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకంలో నకిలీ పత్రాలతో అవినీతికి పాల్పడిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పీ ఆనంద్‌కుమార్ నిందితుల వివరాలను వెల్లడించారు.

Pages